rohini
-
బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?
బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్‌తో కలిసి ఎంటర్టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!) -
గౌతమ్‌కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్‌ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్‌మేట్స్‌కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్‌పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్‌లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్‌తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్‌ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్‌పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్ నిఖిల్‌ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్‌కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్‌లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్‌కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్‌తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్‌ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్‌బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్‌గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్‌ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్‌లో సంచాలక్‌గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్‌కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్‌లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్‌బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్‌పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్‌గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్‌గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్‌బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్‌ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్ ఈజ్ బ్యాక్ అనేలా విజృంభించిన అశ్వత్థామ
గౌతమ్ కృష్ణ.. తిట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమవదు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గౌతమ్ తొలినాళ్లలో గేమ్‌తో హడలెత్తించాడు. కానీ రానురానూ డల్ అయ్యాడు. గెలుపును అందుకోవడంలో తడబడ్డాడు. ఇంకేముంది, సరిగ్గా టాస్కులు ఆడట్లేదు, గెలవట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.ఫ్లాగ్ టాస్క్‌లో విజృంభించిన గౌతమ్అయితే ఈ రోజు గౌతమ్.. తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించనున్నాడు. పవర్ ఫ్లాగ్ అనే గేమ్‌లో విజృంభించి ఆడాడు. వరుసగా మూడుసార్లు తనే జెండా అందుకుని ప్రేరణ, నబీల్, నిఖిల్‌ను గేమ్ నుంచి తొలగించాడు. కానీ తర్వాత రోహిణి చేతికి జెండా రావడంతో ఆమె గౌతమ్‌ను సైడ్ చేసింది. చివర్లో అవినాష్, రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.బంపర్ ఆఫర్లు ఇకపోతే బిగ్‌బాస్ ఈ సీజన్లో హౌస్‌మేట్స్‌కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్న చెఫ్ సంజయ్‌తో కడుపునిండా భోజనం పెట్టించగా నేడు సంగీత కచేరి ఏర్పాటు చేశాడు. టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బ్యాండ్ జామర్స్‌ను ఇంట్లోకి పంపాడు. వీరు తమ పాటలతో అందరినీ మరో లోకానికి తీసుకెళ్లారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమపై విష్ణుప్రియ క్లారిటీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి!
బిగ్‌బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్‌లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్‌బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్‌లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్‌ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!) -
శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్‌బాస్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే జరగబోతుంది. దీంతో ఎవరెవరు ఫైనల్లో ఉండాలనేది ఇప్పటి నుంచే పోటీలు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలా గేమ్స్ పెడితే కిక్ ఏముంటుందా అని గతంలోని కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి మరీ కొత్త వాళ్లతో పోటీలు పెడుతున్నారు. అలా ఈ రోజు అఖిల్, హారిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.'టికెట్ టూ ఫినాలే'లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీదారుల్ని ఎంపిక చేయాలని హౌస్‌లోకి వచ్చిన అఖిల్, హారికకు బిగ్‌బాస్ చెప్పగా.. తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియని ఎంపిక చేశారు. దీంతో వీళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లోని కలర్ బాక్సులని తీసుకొచ్చి, రెయిన్ బో ఆకారం వచ్చేలా చేయాలి. తొలుత రోహిణి సరిగా పేర్చింది కానీ అవి పడిపోయాయి. ఆ తర్వాత తేజ కూడా పెట్టాడు కానీ అవి నిలబడలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)రోహిణి అన్ని సరిగా పేర్చి త్వరగా వెళ్లి గంట కొట్టింది. దీంతో తెగ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి.. టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అని అంటున్నారు. కానీ బిగ్ బాస్.. మళ్లీ పోటీలు పెడతాడా? లేదంటే రోహిణిని ఫైనలిస్ట్‌గా ఫిక్స్ చేస్తాడా అనేది చూడాలి?కొన్నిరోజుల ముందు వరకు ఎంటర్టైనర్గా అదరగొట్టిన రోహిణి.. గతవారం కుండని బ్యాలెన్స్ చేసే టాస్కులో మాత్రం చివరివరకు నిలబడి గెలిచింది. కాలునొప్పి బాధిస్తున్నా సరే విజేతగా నిలిచి మెగాచీఫ్ అయింది. ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకుంది. ఒకవేళ ఈమె గనక తొలి ఫైనలిస్టు అయితే మాత్రం మంచిదే!(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత) -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ... 'బోల్డ్ వీక్'
తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్‌బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్‌తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్‌తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్‌గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.విష్ణు ఓపెన్‌గా రోహిణి క్యారెక్టర్‌పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు. ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్‌కు తెలిసినా తెలియకపోయినా బిగ్‌బాస్‌కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్‌బాస్‌కు లాభదాయకం కాబట్టి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్‌ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌బాస్‌పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్‌బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!-ఇంటూరు హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్‌పై రాయాలన్నాడు బిగ్‌బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్‌కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.నీ క్యారెక్టర్ కనిపిస్తోందిదీంతో నాగ్.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్‌కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.తప్పు ఒప్పుకోని విష్ణుప్లాన్ అనడం రోహిణిదే తప్పని అవినాష్ అనగా.. ప్లాన్ కంటే క్యారెక్టర్ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్ తనను సైలెంట్ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది. -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్‌బాస్ పలుమార్లు కిచెన్‌లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్‌నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్‌ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్‌లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్‌కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్‌లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్‌బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్‌బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్‌లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్‌బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్‌లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్‌బాస్ తాజాగా హౌస్‌లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్‌గా రోహిణి!బిగ్‌బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్‌ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్‌లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్‌లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్‌లో నిలిచారు.ఇవాల్టి ఎపిసోడ్లో హౌస్‌ను కాస్తా ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత కంటస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించారు. రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్‌లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు. 💖 An Adorable Surprise for Rohini! 💖Bigg Boss house fills with warmth as Rohini receives an unforgettable, adorable surprise! Watch her heart-melting reaction to this sweet moment! ❤️#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ay1nLZdkdA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 12, 2024 -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి