
రోహిణీ రేచల్, సన్నీ నవీన్
సన్నీ నవీన్ , రోహిణీ రేచల్ జంటగా తోట మల్లికార్జున దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అనంతరం తోట మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘మట్టితో చుట్టరికం చేసే ఓ రైతు కథే ఈ చిత్రం.
రాయలసీమ యాస, నేపథ్యంతో తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ అనుకుంటారు. కానీ, ఇందుకు విభిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ, కథనాలతో ‘జైత్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అన్నారు సన్నీ నవీన్. ‘‘ఓ రైతు కథతో చాలా సహజంగా మంచి రాయలసీమ స్లాంగ్‌తో ఈ సినిమా రాబోతోంది’’ అన్నారు అల్లం సుభాష్.
Comments
Please login to add a commentAdd a comment