Jaitra Movie
-
ఓ రైతు కథ
సన్నీ నవీన్ , రోహిణీ రేచల్ జంటగా తోట మల్లికార్జున దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అనంతరం తోట మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘మట్టితో చుట్టరికం చేసే ఓ రైతు కథే ఈ చిత్రం. రాయలసీమ యాస, నేపథ్యంతో తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ అనుకుంటారు. కానీ, ఇందుకు విభిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ, కథనాలతో ‘జైత్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అన్నారు సన్నీ నవీన్. ‘‘ఓ రైతు కథతో చాలా సహజంగా మంచి రాయలసీమ స్లాంగ్‌తో ఈ సినిమా రాబోతోంది’’ అన్నారు అల్లం సుభాష్. -
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది: వేణు ఉడుగుల
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'జైత్ర'. తోట మల్లికార్జున ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతుండగా.. అల్లం సుభాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ స్లాంగ్‌తో ఒక రైతు కథ ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాలోని 'సందమామయ్యాలో' ఓ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. (చదవండి: ఆ పొలిటికల్ డైలాగ్పై స్పందించిన మెగాస్టార్.. అలా అవుతుందని ఊహించలేదు) ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ... 'జైత్ర సినిమా ఒక రైతు కథతో తెరకెక్కించారు. చాలా సహజంగా మంచి స్లాంగ్‌తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నా. ' అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’
‘‘ఇంజనీరో, డాక్టరో అవుతామని పిల్లలు చెప్పిన మాటలను వారి తల్లిదండ్రులు నమ్ముతారు. అలాగే యాక్టరో, ఫిల్మ్ మేకరో అవుతామని చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ మేకింగ్ కూడా బాధ్యతతో, గౌరవంతో కూడిన ఉద్యోగం’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘నా ‘ఛలో’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన మల్లి సినిమాకు నేను అతిథిగా రావడం హ్యాపీగా ఉంది. మల్లి చాలా నిజాయితీగా ఈ సినిమా తీసి ఉంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’’ అన్నారు మల్లికార్జున్. ‘‘ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా... ఇలా 15 సినిమాలను రిలీజ్ చేశాను. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకువచ్చే మరో సినిమా ‘జైత్ర’ సుభాష్ గారి ద్వారా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. ‘‘రాయలసీమ యాసతో కూడిన మట్టిమనుషుల కథే ఈ చిత్రం’’ అన్నారు సుభాష్.