సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'జైత్ర'. తోట మల్లికార్జున ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతుండగా.. అల్లం సుభాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ స్లాంగ్‌తో ఒక రైతు కథ ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాలోని 'సందమామయ్యాలో' ఓ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.
(చదవండి: ఆ పొలిటికల్ డైలాగ్‌పై స్పందించిన మెగాస్టార్.. అలా అవుతుందని ఊహించలేదు)
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ... 'జైత్ర సినిమా ఒక రైతు కథతో తెరకెక్కించారు. చాలా సహజంగా మంచి స్లాంగ్‌తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నా. ' అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment