Venu Udugula
-
జోరు పెంచిన వెంకటేశ్.. మరో మల్టీస్టారర్‌కి రెడీ!
హీరో వెంకటేశ్ మంచి జోరు మీద ఉన్నారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ చేస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణ ప్రారంభమైంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’ ఫేమ్ రైటర్ నందు రెడీ చేసిన ఓ కథలో వెంకటేశ్ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఇలా ఉండగానే... వెంకటేశ్ మరో కథ విన్నారట. ఇటీవల ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ కథను రెడీ చేశారట వేణు ఉడుగుల. ముగ్గురు హీరోలకు స్కోప్ ఉండే ఈ సినిమాలో మెయిన్ హీరోగా వెంకటేశ్ నటించనున్నారట. ఆల్రెడీ వెంకటేశ్ కథ విన్నారని, వేణు ఉడుగులతో ‘విరాటపర్వం’ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ సంగతలా ఉంచితే... రానా–సాయి పల్లవి కాంబినేషన్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ చిత్రానికి తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా (క్రిటిక్స్) సాయి పల్లవి అవార్డు అందుకోనుండగా ఇదే సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డుకి నందితా దాస్ ఎంపికయ్యారు. -
సీరియస్ లుక్‌లో కమెడియన్స్.. భువన విజయమ్ ఫస్ట్ లుక్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా భువన విజయమ్. యలమంద చరణ్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ వేణు ఉడుగుల లాంచ్ చేశారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించారు. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. -
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది: వేణు ఉడుగుల
సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'జైత్ర'. తోట మల్లికార్జున ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతుండగా.. అల్లం సుభాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ స్లాంగ్‌తో ఒక రైతు కథ ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాలోని 'సందమామయ్యాలో' ఓ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. (చదవండి: ఆ పొలిటికల్ డైలాగ్పై స్పందించిన మెగాస్టార్.. అలా అవుతుందని ఊహించలేదు) ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ... 'జైత్ర సినిమా ఒక రైతు కథతో తెరకెక్కించారు. చాలా సహజంగా మంచి స్లాంగ్‌తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నా. ' అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నక్సలిజం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ మూవీ హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు సాధారన ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రంపై సినీ స్టార్స్, దర్శక-నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల రూపొందించాడు. చదవండి: ‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ టీం సరళ కుటుంబాన్ని కలిసిన వీడియోను తాజాగా వేణు ఉడుగుల షేర్ చేశాడు. వరంగల్‌లోని నివసిస్తున్న సరళ కుటుంబాన్ని దర్శకుడు వేణు ఉడుగుల, హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి ఇతర టీం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విరాట పర్వం మూవీ టీంకు సరళ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మూవీ టీం ఆమె కుటుంబంతో ముచ్చటించింది. ఇక చివరకు సరళ కుటుంబ సభ్యులు సాయి పల్లవి చీర బహుకిరంచి బోట్టు పెట్టారు. దర్శకుడు వేణు ఉడుగుల షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? #VirataParvam is inspired by Sarala gaaru, a woman from Warangal. @Sai_Pallavi92 played the character "Vennela" as an ode to the girl who has changed the perception of Love in Revolution. Had the opportunity to met and spend some quality time with her family in Warangal. pic.twitter.com/Z741jArcmP — v e n u u d u g u l a (@venuudugulafilm) June 20, 2022 -
"విరాట పర్వం" తప్పక చూడవలసిన సినిమా: దర్శకుడు కె రాఘవేంద్రరావు
-
'విరాట పర్వం' సినిమాపై రాఘవేంద్ర రావు రివ్యూ..
Director Raghavendra Rao Praises Virata Parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్ 17న విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు 'విరాట పర్వం' సినిమాను కొనియాడారు. 'కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.' అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?
Is Rana Sai Pallavi Virata Parvam OTT Rights Bagged Netflix: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింతగా పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే థియేటర్లో ఎప్పుడు రిలీజవుతుందా అని చూసినట్లే సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ మూవీ సాధారణంగా ఓటీటీలో విడుదలైనట్లు నాలుగు వారాల తర్వాత రీలీజ్ కావట్లేదట. ఇలాంటి మంచి సినిమాను థియేటర్లో చూసే ఫీల్ మిస్ అవుతారని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేయట్లేదట మేకర్స్. కానీ పలు నివేదికల సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న 'విరాట పర్వం' ఓటీటీ రిలీజ్ డేట్‌ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
విరాట పర్వం టైటిల్ పెట్టడానికి కారణం..?
-
బొట్టు పెట్టి..చేతిలో చీరపెట్టారు.. సాయి పల్లవి ఎమోషనల్
‘సరళ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె అమ్మ నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది. నన్ను హగ్ చేసుకొని ఎక్కడున్నావ్ బిడ్డ, ఎప్పుడొస్తావ్, ఎందుకు వెళ్లిపోయావ్ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరను బహుమతిగా ఇచ్చి పంపించారు. వారిని కలిస్తే.. నా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. సరళ ఫ్యామిలీ మా సినిమా చూసి హ్యాపీగా ఫీలైతే చాలు’అని సాయి పల్లవి అన్నారు. సరళ తల్లితో సాయి పల్లవి వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. 1992వ ప్రాంతంలో వరంగల్ సమీపంలో జరిగిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సరళ అనే యువతి ప్రేమ కథ ఇది. ఈ పాత్రని సాయి పల్లవి పోషించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► ‘విరాటపర్వం’ని కథగానే నేను అప్రోచ్ అయ్యాను. నిజ జీవితంలో జరిగిందా లేదా అని నాకు తెలియదు. నేనే వెన్నెల అనుకొని నటించాను. వేణుగారు ఈ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించింది. నేను తమిళనాడులో పెరిగాను. అక్కడ జరిగిన సంఘటనలు వేరు.. కానీ ఇక్కడ(తెలంగాణ)అప్పట్లో ఇలాంటి సంఘటనలు జరిగిందని తెలియదు. దర్శకుడు వేణుగారు నాకు చాలా తెలియని విషయాలను చెబుతూ ఎడ్యుకేట్ చేశాడు. సరళ ఫ్యామిలీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కేవలం అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ► వేణు ఈ సినిమా కథను ముందుగా నాకు చెప్పారు. ఆ తరువాత నిర్మాతలు సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో రానా ఈ కథను చదివి, నచ్చడంతో ఈ సినిమాను చేశారు. అంతకు ముందు వేరే వారికి కూడా వినిపించారు. కానీ వారు అంగీకరించలేదు. రవన్న పాత్రని రానా పోషించడం చాలా హ్యాపీ. ఆయన ప్రాజెక్ట్‌లోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి. గొప్పగా సినిమాను తెరకెక్కించారు ► మనకు తెలియనకుండా ఉన్న ఒక కథలో నటించినప్పుడే మనకు మజా. తెలిసినది మళ్లీ మళ్లీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే ఉంటాను. కొత్త కొత్త పాత్రలని చేస్తేనే యాక్టర్‌గా నేను ఎదిగినట్లు అవుతుంది. ► స్క్రిప్ట్‌లో మన పాత్ర ఎలా ఉంటే అంతవరకే నటించగలమని అనుకుంటాం. మేము అలానే నటిస్తాం. కానీ రానా మాత్రం పేపర్‌పై ఉన్నదానికి కంటే ఎక్కువగా నటిస్తాడు. ఔట్పుట్ మంచిగా రావడం కోసం చాలా కష్టపడతాడు. ఓ పాత్రను పరిమితికి మించి చేయడం.. బౌండరిని ఇంకొంచెం ముందుకు పుష్ చేసి నటించడం అనేది రానా వద్ద నుంచి నేను నేర్చుకున్నాను. ► మమ్మల్ని నమ్ముకొని ఒక సినిమా చేస్తారు. మనం ఆ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి.. మనం ఎందుకు సినిమా చేశామో జనాలకు చెప్పి.. వారిని చూడమని చెబుతాం. మన సినిమాలను మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు. ► ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో.. ఈ చిత్రంలో నేను అలా ఉంటాను. పల్లెటూరి అమ్మాయిలాగే నేను మాట్లాడుతా. ఈ చిత్రంలో నేను ఎలాంటి మేకప్ లేకుండా నటించాను. ► ‘విరాట పర్వం’ చిత్రాన్ని సుకుమార్, త్రివిక్రమ్‌లతో కలిసి రానా చూశాడు. నన్ను మాత్రం రానివ్వలేదు(నవ్వుతూ..). వాళ్లే మాట్లాడుకున్నారు. నా గురించి ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ► లేడి పవర్‌స్టార్, లేడి సూపర్ స్టార్ అనే బిరుదలను అభిమానులు ఏదో ప్రేమతో ఇస్తున్నారు. కానీ నేను దానిని మనసుకు తీసుకోను. కథలను విన్నప్పుడు అవేవి నేను పట్టించుకోను. జనాలకు నచ్చలే మంచి మంచి సినిమాల్లో నటించాలనే నా లక్ష్యం. ► ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్ పేపర్ కు అవే ఆన్సర్లు రాస్తూ వుంటే కిక్ వుండదు కదా. కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి ఉండాలి. ప్రతి పాత్రకి కొంత భాద, ఒత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది. ► నా సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలోనే వస్తున్నాయి. తెలంగాణ అమ్మాయి పాత్రలనే ఎక్కువగా పోషిస్తున్నాను. గత జన్మలో నేను తెలంగాణలో పుట్టానేమో (నవ్వుతూ). ► తక్కువ సినిమాలు చేస్తున్నానా? ఎక్కువ సినిమాలు చేస్తున్నానా? అనేది నేను చూసుకోను. మంచి సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. నేను లేకపోయినా.. అందరికి నా సినిమాలు గుర్తుండాలి. ఆ సినిమా చూసి నన్ను గుర్తు తెచ్చుకోవాలి. ► పాండమిక్ కి ముందు లవ్ స్టొరీ, విరాటపర్వం చేశాను. తర్వాత శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. అయితే నేను గ్యాప్ గురించి ఎక్కువ అలోచించను. నేను కళని ఎక్కవగా నమ్ముతాను. నా కోసం ఒక కథ ఉంటే అది తప్పకుండా నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తుంది. ► మంచి కథలు వస్తే.. వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తా. తెలుగులో సినిమా కోసం స్క్రిప్ట్స్ వింటున్నాను. శివకార్తికేయన్ గారితో తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. -
ఆ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది: వేణు ఊడుగుల
‘‘ఒక నిజాయితీ ఉన్న గొప్ప ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా’’ అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వేణు ఊడుగుల విలేకరులతో పంచుకున్న విశేషాలు.. ‘‘నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేను ఎలాంటి సినిమా తీయాలనే ఒక విజన్‌ని ఇచ్చాయి. 1992లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘విరాటపర్వం’. ఎవరి బయోపిక్ కాదు. ఓ రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా సినిమాలో చూపిస్తున్నాం. మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలను ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. ‘విరాటపర్వం’ నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ. కొత్తగా ఉంటుంది’’ అన్నారు. ‘‘విరాటపర్వం’ కథ సురేష్‌బాబుగారికి నచ్చడంతో రానాగారికి చెప్పమన్నారు. రానాగారికి నచ్చి ఒప్పుకున్నారు. ఈ కథ రాస్తున్నప్పుడే కలలో సాయి పల్లవి హీరోయిన్ పాత్రలో కనిపిస్తుండేది. పది నిమిషాల కథ విని ఆమె ఓకే చెప్పారు. ∙ ‘విరాటపర్వం’ని ఇతర భాషల్లో డబ్ చేసి, రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘ఆహా’ కోసం ‘మైదానం’ సినిమా తీస్తున్నాం. చలంగారు రాసిన నవల మనదైన వ్యాఖ్యానంతో ఉంటుంది. దీనికి షో రన్నర్‌గా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. -
విరాటపర్వం రానా ఎందుకు చేస్తానన్నారో అర్థం కాలేదు: డైరెక్టర్
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి. మీ రెండో సినిమాగా ఇంత బరువైన కథ చేయడానికి కారణం ? నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు నేను ఎలాంటి సినిమా తీయాలనే ఒక విజన్‌ను ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే విరాటపర్వం. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను, చెప్పాను తప్పితే ఇది బరువైనదా? క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు. లెఫ్ట్ నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల సహజంగానే కొంత ప్రోగ్రసివ్ ఐడియాలజీ వుంటుంది. అంతేకానీ లెఫ్ట్ , రైట్ అని కాదు. విరాటపర్వం, వెన్నెల పాత్రలకు ప్రేరణ ఉందా ? వుంది. యదార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం. లెఫ్ట్ ప్రభావం బాగా తగ్గిపోయింది. వాళ్ళ ఐడియాలజీ గురించి ఒక జనరేషన్‌కు సరిగ్గా అవగాహన కూడా లేదు కదా.. ఇలాంటి సందర్భంలో ఈ కథని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెప్పగలని అనుకున్నారు ? లెఫ్ట్, రైటు అనేది అప్రస్తుతం. నేపథ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. విరాటపర్వంలో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. విరాటపర్వం ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది. సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చాయని విన్నాం ? కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు సినిమాని బలంగా నమ్మారు. ఇది భారీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాల్సిన సినిమా. ప్రేమకి నక్సలిజంకి ఎలా ముడిపెట్టారు? విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విసృతతంగా అర్ధం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి, వ్యక్తి మధ్య వుండే ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు ? జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప త్యాగం చేయలేం. ఇది వెన్నెల కథ అని చెబుతున్నారు కదా.. మరి రానా లాంటి హీరోని ఈ కథ కోసం ఎలా ఒప్పించారు? రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి కథ చెప్పాను. సురేష్ బాబు గారు 'రానాకి లైన్ నచ్చింది చెప్తావా' అన్నారు. రానా గారికి చెప్పాను. కథ విన్న తర్వాత రానా గారు చేస్తా అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్ధం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమాని చేశారు. ఈ కథని ఎవరిని దృష్టిలో పెట్టి రాసుకున్నారు ? ట్రైలర్లో సాయి పల్లవి బ్యాగ్ పట్టుకొని జమ్మిగుంట అనే బోర్డ్ కనిపిస్తున్న ఊరు నుంచి నడుస్తూ వస్తుంది. జమ్మిగుంట మా పక్క వూరు. నేను కథ రాస్తున్నపుడు అదే ఇమేజ్‌లో సాయి పల్లవి కలలోకి వస్తుండేది. అప్పటివరకూ సాయి పల్లవిని నేను కలిసింది లేదు. కానీ సాయి పల్లవి ఆ పాత్రలో కనిపిస్తుండేది. ఐతే హీరో ఎవరనేది మొదట అనుకోలేదు. కథ వినగానే సాయి పల్లవి గారి రియాక్షన్ ఏంటి ? సాయి పల్లవి గారికి పది నిమిషాలు కథ చెప్పాను. పది నిమిషాల తర్వాత ఓకే చేశారు. సాయి పల్లవే కాదు సురేష్ బాబు గారు మిగతా అందరూ సింగల్ సిట్టింగ్‌లోనే కథని ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ వుంది. 90లో చిత్రీకరించారు కదా.. షూటింగ్ లో ఎదురైన సవాళ్లు ఏంటి ? విరాటపర్వం షూటింగ్ ఒక సవాలే. సినిమాని సహజంగా తీయాలని రిమోట్ ఏరియాల్లో షాట్ ప్లాన్ చేశాం. కానీ ఎక్కడికి వెళ్ళినా సెల్ టవర్స్, సెల్ ఫోన్ కామన్‌గా కనిపించేది. గ్రాఫిక్స్‌లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఒక రెండు సినిమాలు పడాల్సిన కష్టం ఈ సినిమా కోసం పడ్డారు. ఈ క్రెడిట్ అంతా మా నిర్మాతలకే దక్కుతుంది. విరాటపర్వంలో అన్ని వాస్తవాలు వుంటాయా ? 1992లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వెనుక రాజకీయ కారణాలు వుండటం వల్ల ఈ కథను జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. ఐతే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్షన్ వుంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు. ఈ సినిమా ముగింపు ఎలా వుంటుంది ? ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రం కోసం నందిత దాస్, జారినా వహాబ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చారు కదా .. ఇది ఎవరి ఛాయిస్ ? ఛాయిస్ నాదే. అయితే అంత పెద్ద స్టార్ కాస్ట్ రావడానికి కారణం మాత్రం మా నిర్మాతలే. నిర్మాతల సహకారం వలనే అంత పెద్ద స్టార్ కాస్ట్ తీసుకొచ్చి సినిమాని ఇంత గొప్పగా చేయగలిగాను. సినిమాని అద్భుతంగా తీశానని నమ్మకంగా ఉన్నానంటే కారణం నిర్మాతలే. వారే నా బలం. విరాటపర్వం టైటిల్ ఆలోచన ఎలా వుంది? మహా భారతంలో విరాటపర్వం అనేది అండర్ గ్రౌండ్ స్టొరీ. అందులో వున్న కుట్రలు రాజకీయాలు ఫిలాసఫీ ఈ చిత్రానికి సరిపోతుందని ఆ టైటిల్ పెట్టాం. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ రావడం కాస్త తగ్గించారు కదా.. విరాటపర్వం ప్రేక్షకులని థియేటర్ లోకి తీసుకొస్తుందని భావిస్తున్నారా ? విరాటపర్వం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక నిజాయితీ గల కథ చెబుతున్నాం. ఇది గొప్ప ప్రేమ కథ. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. విక్రమ్, మేజర్ సినిమాలతో వాతావరణం సెటిల్ డౌన్ అయ్యింది. విరాటపర్వంకి ఇది మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా. రానా గారు వుండగా ఇది సాయి పల్లవి సినిమా అని ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి ? ఇది సాయి పల్లవి సినిమా కాబట్టే. ఇది వెన్నెల అనే అమ్మాయి కథ. రానా గారు ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీతో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీగా తీసుకువెళితే ఆదరిస్తారని చెప్పారు. అలాగని మొత్తం వెన్నెల పాత్రే వుండదు. చంద్రుడు లేకుండా వెన్నెల వుండదు కదా.. రానా గారి పాత్ర కూడా చాలా ముఖ్యం. మైదానం ప్రాజెక్ట్ ఎక్కడి వరకూ వచ్చింది ? అది 'ఆహా' కి చేస్తున్నాం. ఇది చలం రాసిన నవలకి మనదైన వ్యాఖ్యానంతో వుంటుంది . దీనికి షో రన్నర్ గా చేస్తున్నా. కవిత్వం అప్పుడప్పుడు రాస్తుంటా. అయితే నా మెయిన్ ఎమోషన్ సినిమానే. చదవండి: ఒక్క టీ షర్ట్‌కు రూ.40 వేలు, నీ టేస్ట్ ఏడ్చినట్లుంది అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు -
గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయటం థ్రిల్లింగ్‌గా ఉంది: సాయిపల్లవి
ప్రజలను అలరించే కథ, కథనంతో విరాట పర్వం సినిమా రూపొందిందని సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. విరాట పర్వం అందమైన ప్రేమ కథా చిత్రమని తెలిపారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సినిమాలో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని చెప్పారు. మంచి కథ ఉంటే మల్టీ స్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనని రానా స్పష్టం చేశారు. తన తాత దగ్గుబాటి రామానాయుడు జన్మదినం రోజున విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పల్లెటూరి యువతిగా నటించానని, గన్‌తో ఫైరింగ్, ఫైట్స్ చేయటం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చుండూరి మాట్లాడుతూ.. 1990లో జరిగిన ఓ యువతి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. – గుణదల (విజయవాడ తూర్పు) చదవండి: (విరాటపర్వం ట్రైలర్: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా) -
Virata Parvam: ఓటీటీలో విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
విలక్షణ నటుడు రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై డైరెక్టర్ వేణు ఊడుగుల స్పందించాడు. విరాటపర్వం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూదపడ్డాయని, పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. -
వెనక్కు తగ్గిన రానా.. విరాటపర్వం వాయిదా
విభిన్నమైన పాత్రలను చేసేందుకు ఏమాత్రం వెనకాడని హీరో రానా దగ్గుబాటి. హిట్టూఫట్టు అని లెక్కలేసుకోకుండా జనాలకు మంచి కథలందించాలని చూసే ఈ హీరో ప్రస్తుతం విరాటపర్వంతో, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. వీటితోపాటు సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కరోనా దెబ్బకు కకావికలమైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ వంటి పలు చిత్రాలు వాయిదా బాట పట్టగా తాజాగా విరాటపర్వం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. ఈ మేరకు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశాడు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: 1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం స్టోరీ టెల్లింగ్ బాగుంది: చిరంజీవి -
హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్ భారతక్క’
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియమణి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గురువారం ప్రియమణి బర్త్ డే సందర్భంగా ‘విరాటపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘కామ్రేడ్ భారతక్క’గా కనిపించనున్న ప్రియమణి.. పాత్రకు తగ్గ దుస్తులు, భుజాన తుపాకీతో పోస్టర్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఏదో సాధించిన విజయం ముఖంపై చిరునవ్వు రూపంలో ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు ప్రియమణిని ఎప్పుడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం’ అంటూ చిత్ర బృందం తెలిపింది. ఇక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, ప్రియమణిలతో పాటు నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac @priyamani6 pic.twitter.com/NXzrXI0s2Z — Suresh Productions (@SureshProdns) June 4, 2020 -
‘తూనీగ’ ప్రోమో సాంగ్ విడుదల
ఒక దైవ రహస్యం వెల్లడి చేస్తామంటూ ఆద్యంతం ఆసక్తి రేపేలా రూపుదిద్దుకుంటున్న సినిమా తూనీగ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రోమో సాంగ్ ను కళింగనగరిలో ఈజిప్టు సుందరి నవలా రచయిత భాను ప్రకాశ్ కెంబూరి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలచేశారు. జాతరమ్మ జాతర కూలిజనం జాతర అనే పల్లవితో సాగే ఈ పాటను రేలా రే రేలా ఫేం జానకీ రావు స్వీయ స్వరకల్పనలో ఆలపించారు. చిత్ర ప్రచార సారథి రత్నకిశోర్ శంభుమహంతి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూ ‘సరికొత్త ఆలోచనలకు ఈ సినిమా నాంది కావాలి.మా శ్రీకాకుళం కుర్రాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే రేపటి వేళ మరికొందరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. శ్రీకాకుళం అంటే వలసలకు నిలయం అని, వెనుకబాటుకు చిరునామా అని ఏవేవో అనుకుంటారు కానీ ఇక్కడి కళలు, ఇక్కడి సాహిత్యం, ఇక్కడి జానపదం ఎంతో గొప్పవి. వీటిని సినీ మాధ్యమం విరివిగా వాడుకుని విజయాలు సాధించింది. కారణాలేమైనప్పటికీ ఇక్కడి జానపదం ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు నోచుకోలేకపోతోందీ వేళ. ఈ నేపథ్యంలో జానకీరాం ఆలపించిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. గతంలో కూడా ఈ ప్రాంత అస్తిత్వ గొంతుకగా, ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా నిలిచిన వారెందరో ఉన్నారు.ఆ కోవలో ఆ తోవలో మిత్రులు, చిత్ర దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిత్రయూనిట్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్రబృందం తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిత్రయూనిట్ సంగీత దర్శకుడు గాయకుడు జానకీ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారబాధ్యతలు నిర్వహిస్తున్న రత్నకిశోర్ శంభుమహంతికి దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విషయమై మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి, మరో రచయిత మరుధూరి రాజాకు, నిర్మాత రాజ్ కందుకూరికి, ప్రముఖ దర్శకులు వేణు ఊడుగులకి, సతీశ్ వేగేశ్నకు, సినివారం ఫేం అక్షర కుమార్ బృందానికి, ప్రముఖ కళా దర్శకులు లక్ష్మణ్ ఏలేకు, ప్రముఖ నఖ చిత్ర కళాకారులు రవి పరసకు, ప్రముఖ చిత్రకారులు బాబు దుండ్రపెల్లికి, గిరిధర్ అరసవల్లికి, ధనుంజయ అండ్లూరికి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శ్రీనివాస ఫణిదర్ కు ధన్యవాదాలు తెలిపారు. -
‘తూనీగ’ డైలాగ్ పోస్టర్ల విడుదల
హైదరాబాద్ : వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన ‘తూనీగ’ చిత్ర డైలాగ్ పోస్టర్లను దర్శకుడు వేణు ఉడుగుల ట్విటర్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త ఆలోచనలతో రూ పొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నూతన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ కష్టం ఫలించి, ఈ చిత్ర రూపకర్తగా ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవాలని కోరుకున్నారు. సృజనకు ఎల్లలు లేవని నిరూపించాలని, ఆ దిశగా వేస్తున్న తొలి అడుగు ఫలప్రదం కావాలని అభిలషించారు. ప్రోమో డైలాగ్ రైటర్ రత్నకిశోర్ శంభుమహంతిని, డైలాగ్ పోస్టర్లను అందంగా రూపొందించిన ప్రముఖ ఆర్టిస్టులు గిరిధర్ అరసవల్లి, బాబు దండ్రుపెల్లి, ధనుంజయ అండ్లూరిని, ఇతర సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరహా వినూత్న ప్రచారం తననెంతో ఆకట్టుకుందని, ముందున్న కాలంలో డిజిటల్ మాధ్యమాలు మరిన్ని కొత్త ఆలోచనలకు నాంది కానున్నాయని, వాటికి సంకేతంగా ఈ పోస్టర్స్ ఉన్నాయని విశ్లేషించారు. డైలాగ్ పోస్టర్ల విడుదల అనంతరం చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది. డైరెక్టర్ వేణు ఉడుగులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని స్వరాలు సమకూరుస్తున్నారు. రిషి ఎదిగ సినిమాటోగ్రఫర్‌గా, ఆర్కే కుమార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రేమ్ పెయింటింగ్స్ పతాకంపై క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్ర ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ స్వస్థలం శ్రీకాకుళంతో సహా విశాఖ, హైద్రాబాద్, బెంగళూరు నగరాల పరిసర ప్రాంతాల్లో ‘తూనీగ’ తెరకెక్కింది. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. -
‘విరాటపర్వం’ మొదలైంది!
‘నీదినాది ఒకే కథ’ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండో సినిమాను ప్రారంభించాడు. మరోసారి ప్రయోగాత్మక శైలినే ఎంచుకున్న వేణు.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్‌ను అందించారు. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకాలపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్, డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, సాయిపల్లవి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, డైరెక్టర్స్ చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. -
విరాటపర్వంలో ప్రియమణి
నీది నాది ఒకే కథ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా విరాటపర్వం 1992. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లి తరువాత సినిమాకు దూరమైన ఈ సినిమా ఇటీవల సిరివెన్నెల సినిమాతో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు రానా సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ప్రియమణి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో టబు నటిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మరి టబు, ప్రియమణి ఇద్దరు ఉన్నారా, లేక టబు ప్లేస్లోనే ప్రియమణిని తీసుకున్నారా అన్న విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
‘పక్కా ప్రామిస్’.. ఈ ఏడాది 2 సినిమాలు
హీరోగా చాలా కాలంగా కొనసాగిస్తున్న టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరటంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్. చివరగా శ్రీనివాస కల్యాణం సినిమాలో కనిపించిన నితిన్ తరువాత మరో సినిమాను ప్రారంభించలేదు. ఛలో ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో భీష్మా సినిమాను ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ విషయంపై అభిమానులు పదే పదే ప్రశ్నిస్తుండటంతో నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ నెలాఖరున తదుపరి చేయబోయే సినిమాలపై ప్రకటన చేస్తాను. పక్కా ప్రామిస్.. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను’ అంటూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు నితిన్. వరుస డిజాస్టర్లతో ఇబ్బందుల్లో పడ్డ నితిన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. For all those asking..wil update about my future projects by the end of this month..PAKKA PROMISE..shoot wil also start soon!!all are in scripting stages..plannin for 2 releases this year..sorry for the delay and thank u for being patient🙏🙏 LOVE YOU ALL😘😘 — nithiin (@actor_nithiin) 6 March 2019 -
నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి!
తన నటనతో, లుక్స్‌తో, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు సాయి పల్లవి. ఏ పాత్ర చేసినా మ్యాజిక్ చేసేసి అభిమానులను సంపాదించుకుంటారు. సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అని అంటే.. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేయబోయే ఓ సినిమా అప్డేట్ ఆసక్తికరంగా మారింది. నీదీ నాదీ ఒకే కథతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి మొదటి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ఈ మూవీ ఎలా తెరకెక్కిస్తాడో వేచి చూడాలి. -
రానా హీరోగా ‘విరాటపర్వం 1992’
హీరో, విలన్, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్ చాయిస్ అవుతున్నాడు. తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం 1992 అనే కథను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపించింది. తరువాత నితిన్, శర్వానంద్ లాంటి హీరోల పేర్లు వినిపించినా రానా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తురన్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.