సీరియస్‌ లుక్‌లో కమెడియన్స్‌.. భువన విజయమ్‌ ఫస్ట్‌ లుక్‌ | Venu Udugula Launched Bhuvana Vijayam First Look | Sakshi
Sakshi News home page

Bhuvana Vijayam: భువన విజయమ్‌ ఫస్ట్‌ లుక్‌ చూశారా?

Published Sun, Feb 26 2023 9:20 PM | Last Updated on Sun, Feb 26 2023 9:20 PM

Venu Udugula Launched Bhuvana Vijayam First Look - Sakshi

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ డ్రామా భువన విజయమ్‌. యలమంద చరణ్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ వేణు ఉడుగుల లాంచ్‌ చేశారు.

వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్‌లో కనిపించారు. శ్రీమతి లక్ష్మీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement