
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా ఈ సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. రగ్డ్ హెయిర్, బ్లాక్ కోట్‌తో బ్రిటిష్ పాత్రలో శ్రీకాంత్ లుక్ వినూత్నంగా ఉంది. ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment