ఫస్ట్ లుక్ తోనే షాకిచ్చిన 'పూర్ణ చంద్రరావు' | Poorna Chandar Rao Telugu Movie First Look Poster Released Goes Viral | Sakshi
Sakshi News home page

Poorna Chandar Rao Movie: ఫస్ట్ లుక్ తోనే షాకిచ్చిన 'పూర్ణ చంద్రరావు'

Published Sun, Mar 23 2025 2:41 PM | Last Updated on Sun, Mar 23 2025 3:06 PM

Poorna Chandar Rao Movie First Look Telugu

తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా పో*ర్న్ అడిక్షన్ కథతో తీసిన మూవీ 'పూర్ణ చంద్రరావు'. తారక రామ దర్శకుడు. విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. 

(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)

సోఫాలో అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో.. వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు – ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నాయి. టెక్నాలజీ, పో*ర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది. 

మామూలుగా మనం మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ గురించి సినిమాలు చూస్తాం. కానీ పోర్న్ అడిక్షన్ గురించి ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇదే మొదటిసారి. ఒక పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ 'పూర్ణ చంద్రరావు' ముందు ముందు ఇంకేం చేస్తాడో చూడాలి.

(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement