అందరివాడు మన సూర్యకుమార్‌ | Upendra first look released From Ram Pothineni Andhra King Taluka | Sakshi
Sakshi News home page

అందరివాడు మన సూర్యకుమార్‌

May 13 2025 12:08 AM | Updated on May 13 2025 12:08 AM

Upendra first look released From Ram Pothineni Andhra King Taluka

‘అందనివాడు.. అందరివాడు.. మన సూర్యకుమార్‌’ అంటున్నారు హీరో రామ్‌. ఈ సూర్యకుమార్‌ ఎవరో కాదు.. కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర. రామ్‌ హీరోగా     పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో సూర్యకుమార్‌పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారని వెల్లడించి, ‘అందనివాడు.. అందరివాడు... మన సూర్యకుమార్‌’ అంటూ ఉపేంద్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. కాగా ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని, సూపర్‌స్టార్‌ సూర్యకుమార్‌పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు వివేక్‌– మెర్విన్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement