First Look released
-
యాక్షన్... థ్రిల్
జెడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించారు. ‘తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి’ చిత్రాల్లో నటించిన ప్రీతీ జంగియాని ‘జాతస్య మరణం ధ్రువం’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేశారు.‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘జాతస్య మరణం ధ్రువం’ అన్నది ఒక సంస్కృత పద బంధం. ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ, కెమెరా: అర్జున్ రాజా. -
వాకిలి పద్మ
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్, ఉదయ భాను నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్ప్రోడక్ట్ సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌పై విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి యాంకర్, నటి ఉదయ భాను పోషించిన వాకిలి పద్మ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.‘భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) పాత్రను ఆధారంగా తీసుకుని ‘త్రిబాణధారి బార్బరిక్’ రూపొందించాం. చాలా ఏళ్ల తర్వాత వాకిలి పద్మ అనే మంచి పాత్రలో ఉదయ భాను నటించారు. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్. -
విభిన్నంగా శ్రీకాంత్ లుక్
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీకాంత్ లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు సాయి దుర్గా తేజ్. అలాగే శ్రీకాంత్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్. -
మర్డర్ మిస్టరీ
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గగన మార్గన్’ టైటిల్ ఖరారైంది. ‘అట్టకత్తి, సూదు కవ్వుం, ఏ1, మాయవన్’ వంటి తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.‘‘గగన మార్గన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో చిత్రీకరించిన అండర్ వాటర్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నాలుగు దశాబ్దాలు వెనక్కి...
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘రామ్ భజరంగ్’. సిమ్రత్ కౌర్, సత్నా టైటస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. దసరా నవరాత్రుల సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రాజ్ తరుణ్, సందీప్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం సాగే కథలో ఇద్దరూ నటిస్తున్నారు. ‘‘1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్, రాజా రవీంద్ర, రవిశంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, ‘సత్యం’ రాజేశ్, ధనరాజ్, ‘రచ్చ’ రవి, ఐశ్వర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: అజయ్ విన్సెంట్. -
వింటేజ్ యాక్షన్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లు. కరుణకుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డా. విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఇరవైనాలుగేళ్ల టైమ్‌లైన్‌తో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సిగార్ తాగుతూ కనిపిస్తున్న వరుణ్ తేజ్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్లో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, పి. రవిశంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఉగాదికి వస్తున్నా
ఉగాదికి థియేటర్స్‌లో కలుద్దాం అంటున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, మూవీని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదలను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే టైటిల్‌ను, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారనీ టాక్. ఈ సినిమాకు కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి. జాన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
ఓం భీమ్ బుష్!
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమాకి ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగామి దుస్తులు ధరించి, తమ చేతుల్లో కరపత్రాలతో నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్ లుక్ ఆసక్తిగా ఉంది. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూ΄÷ందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. మార్చి 22న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్. -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
కామెడీ స్పై
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓ కన్ ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. -
సరికొత్త ప్రేమ కథ
కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘అలనాటి రామచంద్రుడు’ సరికొత్త ప్రేమ కథా చిత్రం. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు అందుకున్న ఆకాష్ రెడ్డి తొలిసారి దర్శకునిగా అడుగుపెడుతున్నాడు’’ అన్నారు హైమావతి, శ్రీరామ్ జడపోలు. ‘‘మా సినిమా చిరుజల్లుల్లా హాయిగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్ రెడ్డి. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత: విక్రమ్ జమ్ముల, కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ సామల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గద్దల అన్వేష్. -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
పెళ్లికూతురి గెటప్‌లో కీర్తి సురేష్.. పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. నేడు(సోమవారం)కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల పాత్రలో నటిస్తుంది. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్లో కీర్తి పెళ్లికూతురు గెటప్‌లో మాస్ లుక్‌తో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సముద్ర ఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉంది. Introducing @KeerthyOfficial as 'Vennala' from #Dasara ❤️🔥 Wishing the super talented and National Award winning actress a very Happy Birthday ❤️ Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/RyNCbXioXl — SLV Cinemas (@SLVCinemasOffl) October 17, 2022 -
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా హరికథ ఫస్ట్‌లుక్
డైరెక్టర్ అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం హరికథ. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తిలు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రం బృందం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదు ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
హాలీవుడ్ మూవీలో ధనుష్ ఫస్ట్ లుక్ ఇదే.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?
Dhanush The Gray Man Release Date Announced With First Look Poster: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్' సినిమాతో అలరించిన ధనుష్.. తన అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ధనుష్ హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ పంచుకున్నాడు. ది గ్రే మ్యాన్ మూవీలోని తన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ 'ది గ్రే మ్యాన్.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో' అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టర్లో కారు పైకప్పుపై నుదిటిపై రక్తంతో సీరియస్ లుక్‌లో ఆకట్టుకున్నాడు ధనుష్. బాక్సాఫీసును షేక్ చేసిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ‘ది గ్రే మ్యాన్’కు దర్శకులు. ఇంగ్లీష్ యాక్టర్స్ ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్లతో కలిసి ధనుష్ ఈ చిత్రంలో నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ధనుష్ పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. 'ది గ్రే మ్యాన్' మూవీ ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న స్ట్రీమింగ్ కానుంది. కాగా 'ది గ్రే మ్యాన్' సినిమా ధనుష్ రెండో హాలీవుడ్ మూవీ. 2018లో వచ్చిన 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' చిత్రంతో ధనుష్ హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) చదవండి: అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..! మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_911254541.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుహాసిని ‘ఫోకస్’ ఫస్ట్‌లుక్
విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్’. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, వేలంటైన్స్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్‌ను సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై `ఫోకస్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడే టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `ఫోకస్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్‌ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ ..
Naveen Polishetty Confirms New Film With Anushka Shetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నవీన్- అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే అనుష్క ఈ చిత్రంలో నవీన్‌కి జోడీగా కనిపించనుంది. నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయితో ఎలా ప్రేమలో పడుతుంది? ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా కథ. పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) -
PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్
Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh First Look: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి నుంచే అప్డేట్ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అంటూ క్యాప్షన్‌ను జోడించారు. పోస్ట్‌ర్ లుక్‌లో పవన్ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్-హరీశ్ శంకర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. We all need your … Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9 — Harish Shankar .S (@harish2you) September 9, 2021 చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్ -
ఆకట్టుకుంటున్న ‘గ్యాంగ్‌స్టర్ గంగారాజు’ ఫస్ట్‌లుక్ పోస్టర్
వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ. డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటూ యువ దర్శకుటను పోత్సహిస్తున్న కథానయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వలయం వంటి థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ యంగ్ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. తొలి చిత్రం తర్వాత ఏదో సినిమా చేసేయాలనే ఆలోచనతో కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని తనదైన పంథాలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముద్దుకు వస్తున్నాడు లక్ష్. చదవండి: ఉపాసన రామ్‌చరణ్‌ని 'మిస్టర్ సి' అని ఎందుకు పిలుస్తుందంటే.. ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే కథాంశాన్ని యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ మంగళవారం విడుదలైంది. ఈ ఫస్ట్‌లుక్‌లో చూట్టు పహిల్వాన్స్ సీరియస్‌గా చూస్తుంటే వారి మధ్యలో లక్ష్ కూల్‌గా కొబ్బరి బొండాం తాగుతున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్‌ను ఈ మూవీకి కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో వేదిక దత్ హీరోయిన్గా నటిస్తుంది. అతి త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. చదవండి: ఆగస్ట్ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే -
ఏదో జరిగింది.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్ లుక్
కళ్లు కన బడవు.. స్టిక్ సాయంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. అది ఓకే.. కానీ అక్కడే ఉన్న పియానో మీద రక్తపు మరకలు ఈ వ్యక్తి ఏదో హత్య చేశాడనే అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి. లేక వేరే ఎవరైనా హత్య చూసి, ఇతనిపై పడేయాలని ప్లాన్ చేశారా? అసలు విషయం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ . సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ఇది. నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు. అలాగే ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రధానపాత్ర చేస్తున్నారు. జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మహతీ స్వరసాగర్, కెమెరా: జె. యువరాజ్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల. చదవండి: లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ 'పదహారువందల మందిని ప్రేమించా' -
నవమికి రాముడు?
‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్ , రావణుడి ప్రాతలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ఏప్రిల్ రెండోవారం వరకు జరగుతుందని సమాచారం. -
కేస్ 99 పెద్ద విజయం సాధించాలి
‘‘ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవ సంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రం ‘కేస్ 99’. ఈ చిత్రంతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రియదర్శిని రామ్‌గారు ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ప్రియదర్శిని రామ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్ 99’. మెలోడ్రామా కంపెనీపై చిలుకూరి కీర్తి, గౌతమ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని రామ్ మాట్లాడుతూ– ‘‘మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజా¯Œ లాంటి ఓటీటీలో విడుదలవుతున్న వాటిలో పదికి ఏడు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్లే ఉంటున్నాయి. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటినీ నేను పరిష్కరించలేను కానీ నా వంతుగా చక్కని సినిమా తీయాలనిపించింది. కొత్త రక్తంతో వస్తున్న యువ నిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లకు చాలా మంచి సినిమా తీశానని నేను మాట ఇస్తున్నా’’ అన్నారు. తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: ఆషిక్ అరుణ్. -
నిధి కోసం వేట
‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అంటూ చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జె. మంగళవారం తన రెండో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘క్షణం’, ‘ఘాజీ’, ‘గగనం’ చిత్రాలను అందించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించనున్నారు. తిరుపతికి సమీపంలోని ఓ గ్రామంలో నిధి గురించి జరిగే కథే ఈ సినిమా అంటున్నారు స్వరూప్. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖం సరిగా కనిపించకుండా ఉన్న వ్యక్తి ఫోటో కింద ‘వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్’ అని ఉంది. ‘‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించుకుంటుంది’’ అన్నారు నిర్మాతలు. -
వెరైటీ లుక్
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందిన క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’. అభిషేక్ బచ్చన్, ఇలియానా జంటగా కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కళ్ల జోడు, టైట్‌గా ముడివేసిన జుట్టుతో ఇలియానా లుక్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఇలియానా. 1980, 1990లలో ముంబైలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, పలు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించి కథ ఇదని సమాచారం