![Minister Talasani Srinivas Yadav Release Harikatha First Look - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/7/harikatha.jpg.webp?itok=SN1UFWsT)
డైరెక్టర్ అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం హరికథ. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తిలు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రం బృందం.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదు ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment