నాలుగు దశాబ్దాలు వెనక్కి... | Raj Tarun And Sandeep Madhav Starring Ram Bhajarang Movie First Look Poster Released Goes Viral | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాలు వెనక్కి...

Published Fri, Oct 11 2024 12:05 AM | Last Updated on Fri, Oct 11 2024 1:16 PM

Raj Tarun and Sandeep Madhav Starring Ram Bhajarang First Look Released

రాజ్‌ తరుణ్, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా నటిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘రామ్‌ భజరంగ్‌’.  సిమ్రత్‌ కౌర్, సత్నా టైటస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. దసరా నవరాత్రుల సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్, సందీప్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం సాగే కథలో ఇద్దరూ నటిస్తున్నారు.

 ‘‘1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్, రాజా రవీంద్ర, రవిశంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, ‘సత్యం’ రాజేశ్, ధనరాజ్, ‘రచ్చ’ రవి, ఐశ్వర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: అజయ్‌ విన్సెంట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement