Raj Tarun
-
మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్,సాక్షి,: లావణ్య, రాజ్ తరుణ్‌ల వివాదం తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, మస్తాన్ సాయి (Mastan Sai Case) నిందితుడిగా ఉన్న ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది. మస్తాన్ సాయి కేసు విషయమై లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్‌బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. దర్గా ప్రతిష్టతకు భంగం..ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో తెలిపారు. అందుకే, మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్ బాబు వెల్లడించారు. -
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి -
మస్తాన్ సాయి చుట్టూ పోలీస్ ఉచ్చు
-
హార్డ్ డిస్క్ లో 300ల వీడియోలు.. లావణ్యపై శేఖర్ బాషా కుట్ర
-
నేరాలను ఒప్పు కున్న మస్తాన్ సాయి
-
మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
-
రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసిన మాస్తాన్ సాయికి ఉచ్చు బిగ్గుస్తోంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పీఎస్‌కి లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేం ఆర్జే శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య అంటోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది.మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందజేసింది. తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించే ప్లాన్ చేశారని లావణ్య అంటోంది. 150 గ్రాముల ఎండీఎంఏ తెస్తానని శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చెప్పాడు. ‘‘లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్యను, మరో యువతిని ఇరికిద్దామని మస్తాన్ సాయి, శేఖర్ బాషా సంభాషణల’’ ఆడియో క్లిప్‌ను పోలీసులకు లావణ్య అందజేసింది.కాగా, సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్‌పై కేసు నమోదైంది.ఆడవాళ్ల జీవితాలతో...ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్‌డిస్క్‌లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్‌డిస్క్‌ను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్‌డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మరో ప్రముఖ హీరో పేరు..సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్‌టాప్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. మస్తాన్‌సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్రయత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు.సోమవారం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్‌సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్‌సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
రాజ్‌తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం
మణికొండ: సినీ హీరో రాజ్ తరుణ్ భార్య లావణ్యపై హత్యాయత్నం జరిగింది. గతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న, గుంటూరులో నమోదైన ఆ కేసులో నిందితుడిగా ఉన్న రావి బావాజీ మస్తాన్ సాయి ఈ దారుణానికి తెగపడ్డాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన గుంటూరు వాసి షేక్ ఖాజా మొయినుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం... లావణ్యకు మస్తాన్ సాయితో 2022లో పరిచయమైంది.ఆమెతో పలు సందర్భాల్లో వీడియో కాల్స్ మాట్లాడిన మస్తాన్ దాదాపు 40 కాల్స్ రికార్డు చేశాడు. 2023లో గుంటూరులో జరిగిన మస్తాన్ సోదరి వివాహానికి అతడు ఆహ్వానించడంతో లావణ్య వెళ్లింది. ఆ సందర్భంలో ఆమె తన వీడియోల విషయం ప్రశ్నించగా... తీవ్రంగా దాడి చేసిన మస్తాన్ ఆమెపై లైంగిక దాడికీ పాల్పడ్డాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌కు ఫోన్ ద్వారా చెప్పారు. తాను హీరోగా ఉన్నానని, తన పేరు బయటకు రాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు అనడంతో లావణ్య అక్కడి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్‌పై కేసు నమోదైంది. హార్డ్‌డిస్క్ లో నగ్నవీడియోలు, కాల్ రికార్డింగ్‌లు.. ఇదిలా ఉండగా... మస్తాన్ సాయి అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని, స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వారికి వల వేస్తున్నాడని లావణ్యకు తెలిసింది. మరికొందరి ఫోన్లు హ్యాక్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినట్లు ఆమె దృష్టికి వచ్చింది. అలా సంగ్రహించిన, రికార్డు చేసిన వందలాది నగ్న వీడియోలు, కాల్ రికార్డులను 4 టీబీ సామర్థ్యం కలిగిన హార్డ్‌డిస్క్‌లో మస్తాన్ దాచినట్లు గమనించింది. ఇటీవల మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ హార్డ్డిస్్కను తన అధీనంలోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆ హార్డ్‌డిస్క్ కోసం మస్తాన్ అనేక రకాలుగా లావణ్యపై ఒత్తిడి చేస్తున్నాడు. గత నెల 31న మరికొందరితో కలిసి లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెపై దాడికి యత్నించాడు.టీవీ, సీసీ కెమెరాలు సహా అనేక వస్తువులు ధ్వంసం చేశాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ రోజు తన స్నేహితురాలి దగ్గర ఆశ్రయం పొంది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై ఆదివారం రాత్రి మరోసారి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వచ్చిన మస్తాన్ ఆమెతో పాటు ఆమె సోదరుడినీ నిర్బంధించాడు. లావణ్య గొంతు నులిమి హత్యాయత్నం చేసి, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్ తదితరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆ సమయంలో అతడి వెంట ఖాజా, మరొకరు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్, ఖాజా సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం మస్తాన్‌ను అరెస్టు చేసి జ్యుడీషి యల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు ఖాజాకు నోటీసులు జారీ చేశారు. మస్తాన్ వద్ద ఉన్న బ్యాగ్ నుంచి హార్డ్డిస్్క, ల్యాప్‌టాప్ తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషి ంచిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నార్సింగి పోలీసులకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మరో ప్రముఖ హీరో పేరునూ ప్రస్తావించారు. నాకు ప్రాణహాని ఉంది: లావణ్య మస్తాన్‌సాయి ఇంట్లో నుంచి తెచ్చిన హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్ర యత్నించారని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య అన్నారు. సోమవారం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మస్తాన్‌సాయితో పాటు అతని తండ్రి తనను చంపేందుకు చూస్తున్నారని, ఇప్పటికే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ని రోజులు తన వద్ద సరైన సాక్ష్యాధారాలు లేక మిన్నకున్నానని, ఇప్పుడు పూర్తి వివరాలతో మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పుడు కూడా కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మస్తాన్‌సాయిపై ఆదివారం ఇచ్చిన ఫిర్యాదుపై స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారని, వారు అడిగిన వివరాలను ఇచ్చానని ఆమె వివరించారు. -
మస్తాన్ సాయి అరెస్ట్.. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు!
రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదులో సంచలన విషయాలు..మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.హార్డ్ డిస్క్‌లో 300 వీడియోలు..పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.ఆధారాలతో వచ్చా- లావణ్యమస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రాణహాని ఉంది..లావణ్యమస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది. -
'రాజ్ తరుణ్‌తో విడిపోవడానికి అతనే కారణం'.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య!
లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు..పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)అసలేం జరిగిందంటే..టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం గతేడాది సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని గతంలో లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది. -
రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్
గతేడాది వరుస సినిమాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్. తిరగబడరా స్వామీ, భలే ఉన్నాడే లాంటి చిత్రాలతో అలరించారు. కొత్త ఏడాదిలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో. తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేశారు.ఈ చిత్రానికి పాంచ్ మినార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ కడుముల దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ చిత్రంలో అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.వివాదంలో రాజ్ తరుణ్..అయితే సినిమాలతో పాటు అలరించిన రాజ్.. గతేడాదిలో ఓ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ వివాదం నడుస్తుండగానే తిరగబడరాసామీ మూవీ విడుదలైంది. ఈ వ్యవహారంలో మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరును కూడా లావణ్య ప్రస్తావించింది. తన వల్లే రాజ్ తరుణ్ దూరమయ్యాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 🎉 Happy New Year 2025 🎉This New Year, the craziness knows no limits with Extra Minar🔥Here’s the fascinating first-look motion poster of #PaanchMinar 🤩-- https://t.co/VbfZtKmgf0Gear up for the kickass crime comedy entertainer in theatres soon⌛️@RashiReal_ pic.twitter.com/ci2ehyUYSW— Raj Tarun (@itsRajTarun) January 1, 2025 -
నాలుగు దశాబ్దాలు వెనక్కి...
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘రామ్ భజరంగ్’. సిమ్రత్ కౌర్, సత్నా టైటస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. దసరా నవరాత్రుల సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రాజ్ తరుణ్, సందీప్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం సాగే కథలో ఇద్దరూ నటిస్తున్నారు. ‘‘1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్, రాజా రవీంద్ర, రవిశంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, ‘సత్యం’ రాజేశ్, ధనరాజ్, ‘రచ్చ’ రవి, ఐశ్వర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: అజయ్ విన్సెంట్. -
నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా
న్యాయం గెలిచిందంటూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరో రాజ్‌తరుణ్ నటించిన 'తిరగబడర సామీ' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం వివాదంలో చిక్కుకోవడంతో ఇక్కడ బాగా పాపులర్ అయింది. అయితే, సుమారు నాలుగేళ్ల క్రితం తనపై జరిగిన ఒక దాడి కేసులో తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. మాల్వీ మల్హోత్రాకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.2020లో పెళ్లికి నిరాకరించిందని నటి మాల్వీ మల్హోత్రపై నిర్మాత యోగేష్ సింగ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయమైనట్లు అప్పటి నివేదికలు చెబుతున్నాయి. ఒకరోజు రాత్రి ముంబైలో మాల్వీని కేఫ్ సమీపంలో యోగేష్ సింగ్ అడ్డగించాడు. తనను దూరం పెట్టడమే కాకుండా.. ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆమె పొట్ట భాగంలో కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆపై అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి మాల్వీ మల్హోత్రా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆమె న్యాయం జరిగింది.మాల్వీ మల్హోత్రా అందించిన ఆధారాలను పరిశీలించిన ముంబై న్యాయస్థానం దాడి చేసిన యోగేష్ సింగ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆపై అతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెళ్లడించింది. ఈ తీర్పుతో తాను ఎంతగానో ఉపశమనం పొందానని మీడియాతో ఆమె తెలిపారు. నటి మాట్లాడుతూ, 'చివరికి నాకు ఉపశమనం కలిగింది. నేను గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్నాను. చాలా ఒత్తిడితో పాటు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ, ఎట్టకేలకు నిజం బయటపడింది.' అని ఆమె పేర్కొంది.కేసు తీర్పు వచ్చిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమె ఒక పోస్ట్ కూడా చేశారు. " నవరాత్రులు అనేవి న్యాయం, సత్యం తాలూక విజయానికి ప్రతీక. జీవితంలో ఎల్లప్పుడూ సరైన మార్గంలో ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం అందేవరకు పోరాడే శక్తిని ఇచ్చిన ఆమ్మవారికి ధన్యవాదాలు.' అని షేర్ చేసింది.'నాపై దాడి జరిగిన నాటి నుంచి భయంతో బతుకుతున్నాను. నేను చాలా మానసిక గాయాలు అనుభవించాను. శారీరక మచ్చల కంటే మానసిక వేదన నాపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆ దాడి జరిగిన సమయం నుంచి ఇప్పటికీ ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే, నా తండ్రి నిరంతరం నాకు ధైర్యాన్ని నింపారు. ఆయన మద్దతు కారణంగా ఎలాంటి థెరపీ తీసుకోకుండానే మళ్లీ కోలుకున్నాను. అని పేర్కొంది.తనను ప్రేమించి, మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్ సమయం నుంచి రాజ్ తరుణ్‌తో మాల్వీ ప్రేమలో ఉన్నట్లు ఆమె ఆరోపించింది. -
ఓటీటీలో 'తిరగబడరసామీ' స్ట్రీమింగ్పై ప్రకటన
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిరగబడరసామీ'. ఆగష్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోలే మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ప్రేమలో పడ్డారని లావణ్య అరోపించింది. తనను ప్రేమించిన రాజ్ మాల్వీ పరిచయంతో మోసం చేశాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే.(ఇదీ చదవండి: సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?)'తిరగబడరా సామీ' ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. మిక్స్డ్ టాక్ రావడతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో రాజ్ తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా,ప్రగతి, రఘుబాబు,తాగుబోతు రమేశ్ వంటి స్టార్స్ నటించారు.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఫుట్ఫాత్ పై 11 రోజులపాటు పడుకున్నాను.
-
అద్దె కట్టడానికి డబ్బు లేక 11 రోజులు ఫుట్‌పాత్‌పై నిద్ర
ఒకప్పుడు రాజ్‌తరుణ్ క్రేజీ హీరో.. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హిట్లు అందుకుని సెన్సేషన్ అయ్యాడు. కానీ తర్వాతే ట్రాక్ తప్పి ఫ్లాపులబారిన పడ్డాడు. ఈ మధ్య పురుషోత్తముడు, తిరగబడర సామీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మళ్లీ అపజయాలే అందుకున్నాడు. తాజాగా అతడు ప్రధాన పాత్రలో నటించిన భలే ఉన్నాడే సినిమా రిలీజైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా..ఈ మూవీ ప్రమోషన్స్‌లో రాజ్ తరుణ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చాడు. 'నన్ను ఎవరైనా గుర్తించి ఇండస్ట్రీకి పిలవాలని ఎదురుచూశాను. దాదాపు 52 షార్ట్ ఫిలింస్ చేశాక రామ్మోహన్‌గారు చూసి పిలిచారు. యాక్టింగ్ చేస్తావా? డైరెక్షన్ చేస్తావా? అని అడిగారు. నాకు డైరెక్షనే ఇష్టమని చెప్పాను. అలా ఆయన దగ్గర రూ.3000కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను.వెళ్లిపోమన్నారుఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క సీన్ గురించి చర్చించేవాళ్లం. అప్పుడు నేను పర్వాలేదు.. కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని దీర్ఘాలు తీశాను. నెల రోజులు ఓపిక పట్టాడు. తర్వాత ఆయనకు కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్ ముందుకు సాగదు, వెళ్లిపో అన్నారు. ఏం చేయాలో తోచలేదు.నీళ్లు తాగి కడుపు నింపుకున్నాబీటెక్ మధ్యలో ఆపేసి వచ్చాను. అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో ఫుట్‌ఫాత్‌పై 11 రోజులపాటు పడుకున్నాను. నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ రామ్మోహన్ గారే పిలిపించారు. అప్పుడు నాకు 20 ఏళ్లు! ఆ వయసులో ఒక ఫైర్ ఉంటుంది. ఏదైనా సాధించే తిరిగి వెళ్లాలనుకున్నాను. నా టాలెంట్‌ను నమ్ముకున్నాను. రైటర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత హీరోనయ్యాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్ -
భలే ఉన్నాడే నిరుత్సాహపరచదు: మారుతి
‘‘భలే ఉన్నాడే’ సినిమాలో కథ, మాటలు, పాటలు, భావోద్వేగాలన్నీ పక్కాగా కుదిరాయి. మంచి సందేశం కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు సాయి. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా, అభిరామి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘భలే ఉన్నాడే’. జె. శివసాయి వర్ధన్ దర్శకుడు. మారుతీ సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు కిరణ్ కుమార్. ‘‘నా 15 ఏళ్ల కల ‘భలే ఉన్నాడే’. ఆ కలని నిజం చేసిన మారుతీగారికి ధన్యవాదాలు. సినిమా చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని జె. శివసాయి వర్ధన్ తెలిపారు. -
హీరోయిన్‌కు సారీ చెప్పిన రాజ్ తరుణ్.. చాలా బాధగా ఉందంటూ..!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఒకవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తోన్న రాజ్ తరుణ్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ముంబయిలోని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటి వద్దకు వెళ్లిన లావణ్య హల్చల్ చేసింది. అయితే అక్కడే రాజ్ తరుణ్ ఉన్న సమయంలో ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలైంది.(ఇది చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)తాజాగా ఈ సంఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబయిలో జరిగిన సంఘటనను తలచుకుంటే చాలా బాధగా ఉంది.. అవమానంగా అనిపించిందని ట్వీట్ చేశారు. ఇలా మీ నివాసం వద్ద జరిగినందుకు క్షమించాలంటూ మాల్వీమల్హోత్రాను ట్విటర్ ద్వారా కోరారు. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి వినాయక చవితి పండుగను ఆస్వాదించానని.. అలాగే ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని రాజ్ తరుణ్ రాసుకొచ్చారు. అంతేకాకుండా గణేశునితో దిగిన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. I feel so sad and humiliated for the recent events happened in mumbai . I’m very sorry @MalviMalhotra that it happened at your place . However, I had a great time experiencing Vinayak Chavithi with u nd ur friends. May Ganesha bless u nd all of us with peace and endless success. pic.twitter.com/AZZEBTUOwf— Raj Tarun (@itsRajTarun) September 12, 2024 -
రాజ్‌తరుణ్..'భలే ఉన్నాడే' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో మార్పు వచ్చింది – అభిరామి
‘దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ఓ హీరోయిన్‌కు 35 ఏళ్లు దాటాయంటే పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. సీనియర్ హీరోయిన్స్ కోసం రచయితలు, దర్శకులు మంచి ΄ాత్రలు రాస్తున్నారు. ఓటీటీ వంటి ΄్లాట్ఫామ్స్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి’’ అని నటి అభిరామి అన్నారు. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘భలే ఉన్నాడే!’. దర్శకుడు మారుతి సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీలక ΄ాత్రలో నటించిన అభిరామి మాట్లాడుతూ–‘‘దర్శకుడు మారుతిగారు ఫోన్ చేసి, ‘భలే ఉన్నాడే’ గురించి చె΄్పారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమాలో గౌరి అనే బ్యాంకు ఉద్యోగినిగా నటించాను. మా అమ్మానాన్నలు కూడా బ్యాంకు ఉద్యోగులే కావడంతో గౌరి ΄ాత్ర నాకు వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యింది. శివసాయి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. రాజ్‌తరుణ్ మంచి నటుడు.. బాగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో ‘చెప్పవే చిరుగాలి’ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రం ‘భలే ఉన్నాడే’. కానీ ‘సరి΄ోదా శనివారం’ సినిమా ముందుగా విడుదల అయింది. కమల్‌హాసన్–మణిరత్నంగార్ల ‘థగ్‌లైఫ్’లో నటించాను. అలాగే రెండు తమిళ సినిమాలతో ΄ాటు ఓ ఆంథాలజీ చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాల చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలి΄ారు. -
'నా నగలు ఎత్తుకెెళ్లారు'.. లావణ్య సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ రాజ్‌తరుణ్-లావణ్య కేసు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్య పాటు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రూ.12 లక్షల విలువైన బంగారం దొంగిలించారని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నగలకు సంబంధించిన బిల్లులతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. నా బంగారు గాజులు, పుస్తెల తాడు, బ్రేస్ లెట్ , చైన్ మాల్వీనే దొంగిలించారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. మా ఇంటికి మాల్వి మూడు సార్లు వచ్చిందని.. నగలు దాచిన బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది.నా రాజ్‌ను పంపించు...హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన రాజ్‌ను తిరిగి పంపించు.. నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా రాజ్ తరుణ్‌ను మాల్వీ తన గ్రిప్‌లో పెట్టేసుకుందని.. నేను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు రాజ్ ఇచ్చాడని లావణ్య తెలిపింది.నిందితుడిగా రాజ్ తరుణ్ పేరు..అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో పోలీసులు ఇటీవలే నేర అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో హీరో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో సహజీవనం చేసింది వాస్తవమేనని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారింది. కాగా.. మరోవైపు ఈ వారంలో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
భలే ఉన్నాడే మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్ లావణ్య ఫస్ట్ రియాక్షన్
-
రాజ్‌తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు. లావణ్య- రాజ్‌తరుణ్ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అందుకు సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. పిర్యాదులో పేర్కొన్నట్లుగా ఆమె పలు ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉంది. -
'భలే ఉన్నాడే' సినిమా.. ఆ కోరిక ఇప్పుడు తీరింది: రాజ్ తరుణ్
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ 'భలే ఉన్నాడే!'. మారుతి టీమ్ సమర్పణలో జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించగా.. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించారు. సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరగ్గా.. రాజ్ తరుణ్ బోలెడన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.'కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే సినిమా ‘భలే ఉన్నాడే!’. ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. శివసాయితో కలిసి పనిచేసిన తర్వాత దర్శకత్వం విషయంలో నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉందనిపించింది. మారుతిగారితో ఓ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. నిర్మాత కిరణ్ బాగా సపోర్ట్ చేశారు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబమంతా కలిసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్‌లో సినిమా చూడండి' అని రాజ్ తరుణ్ అన్నారు.దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ''భలే ఉన్నాడే' నా తొలి మూవీ. చాలా బావుటుంది. నాకు అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ ఈ టైటిల్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు. ఇందులో తను శారీ డ్రాపర్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఓ కంఫర్టబుల్ లెవల్ ఉండాలి. దాని ప్రకారం ఈ క్యారెక్టర్ లుక్ ని డిజైన్ చేశాం. తను ఎందుకు ఇలా వున్నాడనేది సెప్టెంబర్ 7న తెలుస్తుంది. వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ఈవింగ్, నైట్ షో కి వెళితే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా హెల్దీ కామెడీ వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని చెప్పుకొచ్చారు. -
బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ
తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్.. ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తారనేది.. షో స్టార్ట్ కావడానికి కొన్నిరోజుల ముందు నుంచే గాసిప్స్ వస్తాయి. అలా ఈసారి రాజ్ తరుణ్ వెళ్తాడని ఒకటే మాట్లాడుకున్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయిపోయాయని అన్నారు. కానీ ఇందులో నిజం లేదని తేలిపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సీజన్-8 ప్రసార తేదీని ప్రకటించిన స్టార్ మా)రీసెంట్ టైంలో లావణ్య అనే అమ్మాయి వ్యవహారంలో వివాదంలో చిక్కుకున్న రాజ్ తరుణ్.. నెల క్రితం 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామీ' సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే మూవీతో సెప్టెంబరు 7న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ఇందులోనే రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.ఈ ప్రశ్నని దర్శకుడు శివ సాయి వర్ధన్‌ని అడగ్గా.. రాజ్ తరుణ్ ఒక్క చోట కుదురుగా ఉండే వ్యక్తి కాదని, కాబట్టి ఆయనకు బిగ్ బాస్ షో అసలు సెట్ కాదు. అలానే ఆయన ఎప్పటికీ బిగ్ బాస్ హౌసులోకి వెళ్లడు అని అన్నాడు. దీనిబట్టి చూస్తే అసలు బిగ్ బాస్ షో అంటేనే రాజ్ తరుణ్‌కి ఇంట్రెస్ట్ లేనట్లు ఉంది. కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?) -
వినాయక చవితికి భలే ఉన్నాడే!
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఈ చిత్రంలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: నగేశ్ బానెల్లా. -
డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని సోమవారం తెలంగాణా ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లింది. గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు రావి రామ్మోహనరావు కుమారుడే ఈ మస్తాన్ సాయి. గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచి్చంది. మస్తాన్ దర్గాకు దర్శనం కోసం వచి్చన సమయంలో తనతో మస్తాన్‌సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇతను దర్గాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నార్సింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత గుంటూరులోని మస్తాన్ దర్గాలోనే ఉంటున్నప్పటికీ గుంటూరు పోలీసులతో కుమ్మక్కు కావడంతో వారు అతడి జోలికి వెళ్లలేదని సమాచారం. -
రాజ్‌తరుణ్-లావణ్య వివాదం.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. రాజ్ తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి, ఇప్పుడు వేరే హీరోయిన్ మోజులో పడి వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అంతేకాదు తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, గర్భం చేసి అబార్షన్ చేయించాడని పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మీడియా రెండు-మూడు రోజులు పలు కథనాలు ప్రసారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటి వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. అటు లావణ్య..ఇటు శేఖర్ బాషా నిత్యం ఏదో ఒక యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడం..అవి కాస్త వైరల్ కావడం..దీనిపై కొంతమంది విశ్లేషణలు పెట్టడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా రాజ్‌తరుణ్-లావణ్య వివాదంపై తన విశ్లేషణ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజ్-లావణ్య వివాదం మీడియా సర్కస్‌గా మారిందని, సోషల్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్‌గా దీన్ని ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా లావణ్య వ్యవహారమే తేడాగా ఉందంటూ.. రాజ్ తరుణ్‌కి మద్దతుగా మాట్లాడాడు ఆర్జీవీ.‘రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేశాడని.. అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే..అది చాక్లెట్ కాదు కదా? పెళ్లి చేసుకొని,20-30 ఏళ్లు కలిసి కాపురం చేసిన వాళ్లే విడిపోతున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అసలు పాయింట్ కాదు’ అని ఆర్జీవీ అన్నారు.ఇక లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డు చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్ మైండ్ సెట్ వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉండడం అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతుంది..కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనే నాకు అనిపిస్తుంది’ అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024 -
రాజ్ తరుణ్‌పై లావణ్య కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
టాలీవుడ్లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. -
హీరో రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Raj Tarun - Lavanya Case: వేధిస్తోందంటూ లావణ్యపై ఫిర్యాదు
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్ఐ సుఖేందర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు. -
రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. లాయర్ సంచలన కామెంట్స్..
-
'తిరగబడర సామీ' సినిమా రివ్యూ
లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి, తనని మోసం చేశాడని ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. అదే మాల్వి మాల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా కలిసి నటించిన 'తిరగబడర సామీ' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చల్లో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?లావణ్య అనే అమ్మాయి వల్ల రాజ్ తరుణ్‌తో పాటు 'తిరగబడర సామీ' సినిమా కూడా వార్తల్లో నిలిచింది. కానీ అనుకున్నంతగా ఇందులో ఏం లేదు. టాలీవుడ్లో చాలాసార్లు చూసేసిన కథతోనే సినిమా తీశారు. పోనీ ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. మొదలైన దగ్గర చివరివరకు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో సాధారణ ప్రేక్షకుడు సులభంగా ఊహించేస్తాడు. అంత నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించారు.తప్పిపోయిన, కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని.. ఆయా వ్యక్తుల కుటుంబీకులకు అప్పగించే కుర్రాడిగా రాజ్ తరుణ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పాటలు ఇలా చప్పగా సాగుతూ ఉంటుంది. అసలు తనని పెళ్లి చేసుకున్న శైలజ ఎవరో తెలిసే విషయంతో ఇంటర్వెల్ పడుతుంది. అయితే అనవసరమైన సీన్లతో సెకండాఫ్ ఇంకా భారంగా సాగుతుంది. ఫైట్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.గంట 55 నిమిషాల నిడివితో తీసినప్పటికీ.. ఏదో మూడు గంటల సినిమా చూస్తున్నామా అనేంత భారమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడెప్పుడో 90ల్లో రాసుకున్న కథని ఇప్పుడెందుకు తీశారు? అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు చేశాడా అని సందేహాలు వస్తాయి. ఇందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెబుతారు. కానీ ఒక్కచోట కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్లు చూపించారు. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడు ఉంటాయి.ఎవరెలా చేశారు?రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కాకపోతే ఇందులో అతడి యాక్టింగ్ స్టామినాని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదో అలా చేశాడంతే! హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పర్లేదు. విలన్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే పాత్ర, బిహేవ్ చేసే విధానం మరీ సిల్లీగా ఉంటుంది. గ్లామర్ షో చేసేందుకే మన్నారా చోప్రా పాత్ర ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే! టెక్నికల్ విషయాలకొస్తే.. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాలు తీసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. మరీ ఇలా అయిపోయారేంటి అనిపిస్తుంది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ లౌడ్‌గా ఉండి తెగ ఇబ్బంది పెట్టింది. సినిమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు ఓకే ఓకే. ఓవరాల్‌గా చెప్పుకొంటే రాజ్ తరుణ్-లావణ్య గొడవ వల్ల కాస్త హైలైట్ అయిన ఈ సినిమా.. కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది! -
కోపాన్ని అణచుకుంటూ మీడియా తో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా
-
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ సినిమా ప్రమోషన్ (ఫొటోలు)
-
'పదేళ్లు కలిసి ఉన్నాం.. రాజ్ తరుణ్ సమాధానం చెప్పాలి': లావణ్య కామెంట్స్
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్‌ను కలిసేందుకు వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసాద్ ల్యాబ్‌లో తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా లావణ్య అక్కడికి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్యను వెళ్లకుండా నిలువరించారు. దీంతో నా భర్త రాజ్ తరుణ్‌తో నన్ను మాట్లాడనివ్వండి అంటూ పోలీసులను కోరింది. నా భర్తతో మాల్వీ ఎందుకు వచ్చిందని లావణ్య ప్రశ్నించింది. భర్తతో సంసారం చేసినట్లుగా మాల్వీ ఎందుకు కలిసి ఉంటోందని మాట్లాడింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని లావణ్య కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నన్ను ఎందుకు రాజ్ తరుణ్‌ను కలవకుండా చేస్తున్నారు. నాకు రాజ్ సమాధానం కావాలి. నా భర్త నాకు కావాలి. నా నుంచి ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాది లవ్ మ్యారేజ్. పెళ్లి ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టుకు అన్ని ఆధారాలు ఇచ్చాను. నాతో పదేళ్లు కలిసి ఉన్నాడు. నాకు అబార్షన్ రెండుసార్లు చేయించాడు. నా ఇంటి నుంచి అతనే పారిపోయాడు. నేను ఒక సాధారణ అమ్మాయిని. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాట్లేదో మీకే తెలియాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ' అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ టాలీవుడ్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. తాను రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు కామెంట్స్ చేసింది. -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
తెగబడవేమీ...
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడరసామీ’. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘కత్తులు దిగనీ నెత్తురుతోని తడపర భూమి తెగబడవేమీ...’ అంటూ సాగే ఈ పాటకి జేబీ సంగీతం అందించారు.సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి పాడారు. ‘‘యూత్‌ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటి మెంట్, మాస్‌ని అలరించే హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ‘తిరగబడర సామీ’ రూపొందింది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రాజ్‌తరుణ్ ‘పురుషోత్తముడు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Audio Call: రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. లావణ్య-శేఖర్ బాషా ఆడియో లీక్!
-
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. మరో సంచలన ఆడియో లీక్!
హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో కాల్లో లావణ్య.. ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. -
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపెట్టిన లావణ్య..
-
విచారణకు రాలేనంటూ పోలీసులకు లేఖ రాసిన రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చిత్రసీమలో ఈ వార్త వైరల్ అయింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. తనకు అబార్షన్ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కి నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. అయితే, రాజ్ తరుణ్ పలు కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాలేకపోయారు.పోలీసుల విచారణకు రాలేనంటూ రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీసులకు తెలిపారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాసి తన లాయర్ ద్వారా నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కొద్దిరోజుల్లో తను నటించిన సినిమా విడుదల కానున్నడంతో ఇప్పట్లో విచారణకు రాలేనని లేఖ ద్వారా ఆయన పేర్కొన్నారు. మరో రోజు విచారణకు తప్పకుండా వస్తానని ఆయన తెలిపారు.చట్టానికి లోబడే పోలీసులు ఈ లేఖను ఆమోదించారు. ఈ క్రమంలో మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులు పంపనున్నారు. రెండోసారి నోటీసులు జారీ చేశాక రాజ్ తరుణ్ స్పందించకపోతే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పురుషోత్తముడిగా రాజ్‌తరుణ్.. ట్రైలర్ విడుదల
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు.ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు ఇప్పుడు పురుషోత్తముడు చిత్రాన్ని భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా జులై 26న రిలీజ్ కానుంది.కొద్దిరోజులుగా రాజ్ తరుణ్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. 'తిరగబడరసామీ' సినిమా సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారని ఆమె తెలుపుతుంది. ఈ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. -
రాజ్ తరుణ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు..! నార్సింగి పోలీసుల నోటీసులు
-
రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఏముంది
-
హీరో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపిన పోలీసులు
పోలీస్ కేసులతో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల ముందు మీడియా ముందుకొచ్చిన లావణ్య అనే అమ్మాయి.. ఈ కుర్ర హీరోపై హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఇతడికి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. నటి మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక తనని పట్టించుకోవడం మానేశాడని, దీని గురించి అడిగితే నోటికొచ్చినట్లు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనని బెదిరించారని లావణ్య చెప్పుకొచ్చింది.లావణ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాల్వీ, ఈమె సోదరుడు మయాంక్‌పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా రాజ్ తరుణ్ తనకు దూరమైపోతాడేమో అనే బాధతో లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ మేరకు పోలీసులు ఈమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి
హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు ఈ గొడవలో ఉన్నవాళ్లలో ఎవరిది తప్పో అర్థం కాక జుట్టు పీక్కుకుంటుంటే.. ఇందులో భాగమైన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా గురించి షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అసలేమైంది?మాల్వీ మల్హోత్రా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్, ఆల్బమ్ సాంగ్, ఓటీటీల్లో పలు ప్రాజెక్టులు చేసింది. 'తిరగబడరా సామీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. రిలీజ్ కొద్దిరోజుల ఉందనగా.. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ ప్రేయసి అంటూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. తన ప్రియుడు రాజ్ తరుణ్‌ని మాల్వీ మాయలో పడి తనని పట్టించుకోవట్లేదని, ఇదే విషయమై అడిగితే ఏకంగా మాల్వీ, ఆమె సోదరుడు తనని బెదిరిస్తున్నారని చెప్పి లావణ్య చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)మరోవైపు నాలుగేళ్ల క్రితం మాల్వీపై యోగేశ్ అనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన మాల్వీ అప్పట్లో ఆస్పత్రిలో చేరింది. తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని, లేదని చెప్పేసరికి ఇలా దాడి చేశాడని మాల్వీ చెప్పుకొచ్చింది. ఇది ఈమె వెర్షన్. తాజాగా రాజ్ తరుణ్ కేసు వల్ల సదరు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మీడియా ముందుకొచ్చింది. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని, ఆస్తులు లాక్కొని తమని రోడ్డున పడేసిందని ఈమె చెప్పుకొచ్చారు. ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని ఫిర్యాదు చేసి, తన కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిందని కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే యోగేశ్-మాల్వీ వాట్సాప్ చాట్, విమాన టికెట్స్‌ని బయటపెట్టారు. తన కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని చెబుతూ రోదించింది.ఇలా ఏదో ప్రేమ కోసం గొడవ అనుకున్న కేసు కాస్త ట్విస్టులు, టర్న్స్ తీసుకుని థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. మరి ఈ మొత్తంలో తప్పు ఎవరదన్నా సరే చెప్పడం కష్టం. మరి ఈ గొడవలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో ఏంటో?(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మంచు విష్ణుపై పెరుగుతున్న ఒత్తిడి!
ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, ట్విస్టులతో మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ అంశంలో రాజ్ తరుణ్‌పై మా అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై షోకాజ్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మా సభ్యులతో మంచు విష్ణు చర్చించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అతన్ని మా నుంచి సస్పెండ్ చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.హేమ, ప్రణీత్ హనుమంతు విషయంలో వేగంగా స్పందించిన మంచు విష్ణు.. రాజ్ తరుణ్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి కొంత మంది మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈడో రకం.. ఆడో రకం సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించారు. -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు!
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులతో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో కేసులు కూడా నమోదయ్యాయి. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఇటీవల లావణ్య సూసైడ్ చేసుకుంటున్నానంటూ పోలీసులను పరుగులు పెట్టించించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా ఎపిసోడ్‌పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమ పేరుతో తమ ఆస్తులని లాక్కుందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడంటూ తమ కుమారున్ని జైలుకు పంపించిందని వెల్లడించింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఫ్లైట్ టికెట్స్, మెసేజెస్ వీడియో కాల్స్, కాల్ లిస్ట్‌ను ఆమె బయటపెట్టింది. తన కొడుకు యోగేశ్‌ను ట్రాప్ చేసి జైలుకు పంపించిందని మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. తాజా ట్విస్ట్‌తో రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా- లావణ్య టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది. -
రాజ్ తరుణ్ ప్రేయసితో గొడవ.. మరోవైపు మాల్వీ ఆల్బమ్ సాంగ్ రిలీజ్
యువ హీరో రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి వల్ల ఎంతలా రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాయి. తనని మోసం చేసిన రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వలలో పడ్డాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ కేసుల వేస్తోంది. ప్రతిగా మాల్వీ కూడా లావణ్యపై కేసు పెట్టింది. గత కొన్నిరోజుల నుంచి ఈ తతంగం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఇలా ఉండగానే తాను నటించిన ఆల్బమ్ సాంగ్‌ని మాల్వీ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)'షాబానో' అంటూ సాగే ఈ పాటని ఇప్పుడు రిలీజ్ చేయడం ఓ విధంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అయితే ఈ పాటని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడిలా రాజ్ తరుణ్-లావణ్య-మాల్వీ మల్హోత్రా మధ్య నడుస్తున్న వివాదం వల్ల ఈ పాటకు కాస్త క్రేజ్ ఏర్పడింది. ఆ పాట ఏంటనేది మీరు చూసేయండి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!) -
రాజ్ తరుణ్ కోసం నిరాహార దీక్ష
-
రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
తాను చనిపోతానంటూ లాయర్ కు లావణ్య మెసేజ్
-
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వకేట్‌తో లావణ్య చాటింగ్
టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం రోజుకొక మలుపు తీసుకుంటుంది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది.రాజ్ తరుణ్- లావణ్య వివాదంలో పోలీసుల ద్వారా విచారణ జరుగుతున్న తరుణంలో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య తన అడ్వకేట్‌తో వాట్సప్ చాటింగ్ చేసింది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయనకు మెసేజ్ పెట్టింది. దీంతో సదరు అడ్వకేట్ వెంటనే ఆ విషయాన్ని నార్సింగ్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు లావణ్య ఫోన్ చేసింది. తాను చనిపోతున్నట్లు వారితో తెలిపింది. తన చావుకు హీరోయిన్ మాల్వీ మల్హౌత్రాతో పాటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే కారణమని లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఆమె నంబర్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్ తరుణ్‌ని ఏ1, మాల్వీ మల్హోత్రా ఏ2, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా ఏ3గా పోలీసులు చేర్చారు. వీరిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిస్తోంది. -
రాజ్ తరుణ్ 'తిరగబడరసామీ' విడుదల ఎప్పుడంటే..?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'తిరగబడరసామీ'. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది.'తిరగబడరసామీ' సినిమాను ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే రాజ్ తరుణ్‌కు మాల్వీ మల్హోత్రా దగ్గరైందని లావణ్య ఆరోపించింది. దీంతో ఈ చిత్రానికి సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రారంభం నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న మన్నారా చోప్రా పట్ల డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి అసభ్యంగా ప్రవర్తించారంటూ నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. అది షూటింగ్ సమయంలో ఫోటోలు దిగుతున్నప్పుడు జరిగిందని అందులో డైరెక్టర్‌ది ఎలాంటి తప్పులేదని ఆమె ఒక వివరణ కూడా ఇచ్చింది. ఇలా తిరగబడరసామీ సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఆగష్టు 2న మూవీ టాక్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. -
'రాజ్ తరుణ్ ఫోన్ నుంచే కాల్ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్‌కు ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
నాకు దూరం చేస్తా అని ఛాలెంజ్ చేసింది..
-
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌ను ఏ1గా, మాల్వీని ఏ2గా, మయాంక్‌ని ఏ3గా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినుట్ల పోలీసులు తెలిపారు.లావణ్యకు అబార్షన్ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి జులై 5న నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగి పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్ని పోలీసులు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్‌తరుణ్‌తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం అదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని.. రాజ్‌తరుణే అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.డ్రగ్స్ కేసులో ఇరికించారురాజ్తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. ‘జనవరిలో నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైలులో ఉన్నాను. రాజ్‌తరుణ్, మాల్వి కలిసే ఇదంతా ప్లాన్ చేశారు. బయటకు వచ్చాక ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు’ అని లావణ్య ఆరోపించింది. -
రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. మరోసారి లావణ్య ఫిర్యాదు..
మణికొండ/బంజారాహిల్స్: ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర కేసుల తరుణంలో సినీహీరో రాజ్‌తరుణ్ వ్యవహారం సినిమా స్టైల్లో అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిచి నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రాజ్తరుణతో 11 ఏళ్ల లివింగ్ రిలేషన్లో ఉన్నానని, ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తన వద్దకు రావటంలేదని, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ తనను చంపుతానని బెదిరించాడని ఇదివరకే ఫిర్యాదు చేసిన లావణ్య మంగళవారంరాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేసింది. ముందుగా చేసిన ఫిర్యాదుకు ఆధారాలను చూపాలని పోలీసులు ఆమెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన న్యాయవాదితో కలిసి ఆధారాలను, 175 ఫొటోలు, స్క్రీన్చాట్లు, వీడియోలు, కాల్ రికార్డ్‌లు అందజేసినట్టు తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో తనక 10 ఏళ్ల క్రితమే గచ్చబౌలిలోని ఎల్లమ్మగుడిలో వివాహమైందని, తనకు గర్భం రావటంతో ఓ ఆస్పత్రిలో అబార్షన్ కూడా చేయించారని తెలిపింది. రాజ్‌తరుణ్‌కు గతంలోనూ మరికొంత మంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తాను అని్వక పేరుతో పాస్‌పోర్టు పొందానని, తామిద్దరం కలిసి ఇదివరకు విదేశాలకు కూడా వెళ్లామని తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఆధారాలను పరిశీలించి రాజ్‌తరుణపై కేసులు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. త్వరలోనే రాజ్‌తరుణ్‌ను విచారించి అసలు నిజాలను వెలుగులోకి తెస్తామని పేర్కొన్నారు. లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు లావణ్య అనవసరంగా వివాదంలోకి లాగి తన పరువుకు భంగం కలిగిస్తోందని, తన సోదరుడికి ఇష్టారాజ్యంగా మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తోందని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనది హిమాచల్‌ప్రదేశ్ అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని, తాను మాత్రం ముంబైలో ఉంటానని, ‘తిరగబడరా స్వామీ’సినిమాలో నటించానని, ఈ సినిమా నిమిత్తమే హైదరాబాద్‌కు వచ్చి స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నానని వెల్లడించారు. ఫిర్యాదుపై పో లీసులు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
బీరు బాటిళ్లతో దారుణంగా.. రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్
-
సినిమా రేంజ్ ట్విస్ట్ స్క్రీన్ షార్ట్స్ బయటపెట్టిన లావణ్య
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలనం
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు: లావణ్య
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులని ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడితో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై మళ్లీ కేసు పెట్టింది. తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని మాల్వీ.. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్య ఇప్పుడు మరో కేసు పెట్టింది. దీనితో పాటు స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆధారాలని ఫిర్యాదుతో పాటు సమర్పించింది. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్‌తో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్)గత పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పి షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, వివరాలు సమర్పించింది. అయితే లావణ్య అని కాకుండా అన్విక పేరుతో తామిద్దరం కలిసున్నామనే చెప్పుకొచ్చింది. ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లొచ్చామని రివీల్ చేసింది. అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్) -
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-అతడి మాజీ ప్రియురాలు లావణ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా నిలిచిన నటి మాల్వి మల్హోత్రా.. లావణ్యపై మరో ఫిర్యాదు చేసింది. తనని, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జోరీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని ఫిలిం నగర్ స్టేషన్‌కి పోలీసులు బదిలీ చేశారు. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని మాల్వీ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)ఈ కేసు పూర్వాపరాలకు వస్తే.. రాజ్ తరుణ్ తను కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నామని, కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడని చెబుతూ లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చింది. మాల్వి, ఆమె తమ్ముడు కలిసి తనని బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా రాజ్ తరుణ్ లావణ్యపై కేసు పెట్టాడు. గతంలో ఈమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని, కానీ ఇప్పుడు మస్తాన్ అనే వేరే వ్యక్తితో ఈమె రిలేషన్లో ఉందని అన్నాడు.మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందని చెప్పి నటి మాల్వి మల్హోత్రా పోలీస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది. తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. మరి రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్) -
కీలక ఆధారాలతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ లవర్
-
రాజ్ తరుణ్ తో ఉన్న సంబంధం ఇదే...
-
రాజ్‌తరుణ్‌పై ఆధారాలతో మరో ఫిర్యాదు చేస్తా
మణికొండ: సినీ హీరో రాజ్‌తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్‌తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది. -
లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: రాజ్ తరుణ్ హీరోయిన్
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలపై తిరగబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని మాల్వీ కొట్టిపారేసింది. నా కుటుంబం గురించి ఆమె చేసిన కామెంట్స్ నిజం కాదని తెలిపింది. ఆమెపై తప్పకుండా ఫిర్యాదు చేస్తానని.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించింది. మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ..'ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ తీసుకుంది. అవీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సేకరించిందో తెలియాలి. లావణ్యను నేను ఇప్పటివరకు కలవలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే కాదు.. తన గురించి నాకేలాంటి వివరాలు తెలియదు. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాజ్ తరుణ్‌తో మాట్లాడతా. సెప్టెంబర్ నుంచి నాకు, రాజ్ తరుణ్‌కు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాపై లావణ్య చేస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. దీనివల్ల నా రిప్యూటేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా ఆమెపై పరువునష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు. కాగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తున్నారు. -
'రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
రాజ్ తరుణ్- లావణ్య టాపిక్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్ తరుణ్‌కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్‌వల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
-
ఆమె అలవాట్లు చూసి భయపడ్డా.. అందుకే నా ఇంటి నుంచి బయటికి వచ్చేశా: రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నారని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణల పై హీరో రాజ్ తరుణ్స్పందించాడు. తన రిప్యూటేషన్ ఎక్కడా దెబ్బతింటుందో అని ఇన్నాళ్లు బయటికి చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేనని తెలిపారు.నా ఇంటి నుంచే బయటికి వచ్చేశా..తాను గుంటూరులో నా ఇంటిలోనే ఉండేదని రాజ్ తరుణ్ వెల్లడించారు. నా సొంతింట్లినే లావణ్య పైన ఉండేదని.. అక్కడ మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి ఉన్నారని తెలిపారు. తనకు మందు, సిగరెట్ అలవాటు ఉందని.. డ్రగ్స్ నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదని అన్నారు. మస్తాన్ సాయి.. ఆమెను విపరీతంగా కొట్టేవాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయన్నారు. అతనిపై కేసు పెట్టి కూడా.. నా ఇంట్లోనే మళ్లీ అతనితోనే ఉంటోందని అన్నారు. ఆమె అలవాట్లు నచ్చక నేను ఇంటి నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. ఒక అమ్మాయికి చెందిన అశ్లీల ఫోటోలు, వీడియోలు పెట్టుకుని వాళ్ల ఫాదర్‌ను బ్లాక్మెయిల్ చేసిందని రాజ్ తరుణ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కేవలం నా ఇమేజ్ దెబ్బతింటుందని పోలీసులకు చెప్పేందుకే బయపడ్డానని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా.. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. లావణ్యకు కూడా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నా ఇంటి కోసమే ఈ రచ్చ అంతా చేస్తోందని ఆయన ఆరోపించారు.ఆమెపై కృతజ్ఞత ఉంది.. కానీ..ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. కానీ అది కేవలం 2014 నుంచి 2017 వరకు మాత్రమేనని రాజ్ తరుణ్ అన్నారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వివరించారు. డ్రగ్స్ తీసుకోవద్దని తనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ఆమెతో ఏడేళ్లుగా దూరంగానే ఉంటున్నానని.. ఇప్పటికీ ఆమెపై తనకు కృతజ్ఞత ఉందని.. అందుకే నా ఇంటి నుంచి నేనే బయటికి వచ్చేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు. నాపైనే కాదు... మస్తాన్ సాయిపైనా కేసు పెట్టింది ఇప్పుడు కూడా అతనితోనే...Raj Tarun Reveled Shocking Facts, Lavanya Relationship With Mastan Sai#rajtarun #rajtaruncase #rajtarunloverlavanya #latestnews #sakshiNews pic.twitter.com/OSEgrah0Ae— Sakshi TV Official (@sakshitvdigital) July 5, 2024 -
లావణ్యకు వేరే వ్యక్తితో ఎఫైర్..
-
రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆడియో
-
మూడేళ్లు కలిసున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకోలేదు: రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్‌ను బుట్టలో వేసుకుందని, తన ప్రియుడిని తనకు కాకుండా చేసిందని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.డ్రగ్స్ అలవాటు'లావణ్య.. మొదట్లో నాతో కలిసున్న మాట వాస్తవమే! నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్ చేసింది. మేము రెండుమూడేళ్లు కలిసున్నాం. అయితే తనకు డ్రగ్స్ అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్లిపోయాను. తనను అసలు పెళ్లే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసుంది.మరొకరితో రిలేషన్ప్రస్తుతం అతడితోనే రిలేషన్లో ఉంది. కానీ డబ్బు కోసం నాతో పని చేసేవారందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. అలా మాల్వీ మల్హోత్రాకు ఫోన్ చేసి బెదిరించింది, బూతులు మాట్లాడింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడమేంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చాడు.చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు -
రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
-
హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై పోలీసు కేసు నమోదైంది. తనను నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. మూడు నెలల క్రితమే..హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమంది. రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. డ్రగ్స్ కేసులోఅంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించడంతో మూడు నెలలపాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతడు తిరిగి తన దగ్గరకు వచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా తిరగబడరా సామీ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. -
రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల: హీరోయిన్
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. స్టడీస్ కోసం ముంబై వెళ్లి, థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. తెలుగులో నేను నటించిన తొలి సినిమా ‘తిరగబడర సామీ’. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని నా క్యారెక్టర్ చెబుతుంది. నేను రియల్ లైఫ్‌లో ఎమ్ఎమ్ఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేర్చుకున్నాను. అందుకే ఈ సినిమాలో నా పాత్రకు ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ని ఈజీగా చేశాను. రాజ్ తరుణ్గారి పాత్ర సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారుతుంది. ఎందుకు అనేది సినిమాలో చూడాలి. లవ్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్... ఇలా అన్ని అంశాలు మిళితమైన ‘తిరగబడరా సామీ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశాను. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగు పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. రాజమౌళిగారి సినిమాలో నటించాలన్నది నా కల. అలాగే మణిరత్నంగారన్నా చాలా అభిమానం. హీరోల్లో మహేశ్‌బాబు, నాని, అడివి శేష్గార్లంటే ఇష్టం. నా తర్వాతి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
'తిరగబడరసామీ' అంటోన్న యంగ్ హీరో.. ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం తిరగబడరసామీ. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ- యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్స్ ఫైట్స్, సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రాజ్ తరుణ్ మరో వైవిధ్యభరితమైన కథతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
‘భలే ఉన్నాడే!’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఆ సీన్ నా కళ్లముందే కనిపిస్తోంది: రాజ్ తరుణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన చిత్రం పోకిరి. 2006లో రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో ఓ సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ మూవీ విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని సినీ ప్రియులు, మహేశ్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలోని 'ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు' అనే పవర్ఫుల్ డైలాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.రాజ్ తరుణ్ తన ట్విటర్లో రాస్తూ..' గోపాలపట్నంలోని శంకర థియేటర్లో చూసిన పోకిరి సినిమా ఇప్పటికీ గుర్తుంది. కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్నివేశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పటికీ నా కళ్ల ముందే కనిపించినట్లు ఉంది. దిమ్మ తిరిగి బాక్సాఫీస్ బ్లాక్ అయిపోయింది... ఇండియా మొత్తం షేక్ అయిపోయింది ' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. పూరి, మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన బిజినెస్మెన్ సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. The streets will never forget the BULLET-FIRING performance of our Superstar @urstrulyMahesh in Indian Cinema History!!! 🤗🤗🔥🔥#18YearsOfSouthIndustryHitPokiri #Pokiri— Raj Tarun (@itsRajTarun) April 28, 2024 -
రాజ్ తరుణ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు హిట్టు పడక చాన్నాళ్లే అయింది. ఈ మధ్య నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ అంతా పెద్ద హీరో అయిన నాగార్జున ఖాతాలోనే పడింది. సోలోగా హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. ఈ తరుణంలో మరో కొత్త సినిమా మొదలుపెట్టాడీ హీరో. రమేశ్ కడుముల దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాశీసింగ్ హీరోయిన్. గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి, కేఐటీఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి దర్శకులు ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మారుతి క్లాప్ ఇచ్చారు. నక్కిన త్రినాథరావు తొలి సీన్‌కి దర్శకత్వం వహించారు. ‘‘క్రైమ్ కామెడీగా ఈ మూవీ రూపొందనుంది. అక్టోబరులో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రమేశ్ కడుముల, కేఐటీఎన్ శ్రీనివాస్. ఇది చాలా మంచి కథ అని, దీన్ని తప్పకుండా జనాలు ఆదరిస్తాడని ధీమాగా ఉన్నాడు రాజ్ తరుణ్. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాడి, సంగీతం: శేఖర్ చంద్ర. చదవండి: హీరోయిన్ దివ్య భారతి మరణం ఇప్పటికీ సస్పెన్సే! -
డ్రగ్స్‌తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి!
రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్‌తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది. ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయసి గుర్తించారు. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ ఆ యంగ్ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ విధింపు సదరు యువతి మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
వారి ఆనందం చూస్తుంటే తృప్తిగా ఉంది
‘‘నా సామిరంగ’ సినిమాని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, నా అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది’’ అని హీరో నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నా సామిరంగ’ థ్యాంక్స్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ–‘‘మా చిత్రం సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పం, ప్రేమతో యూనిట్ అంతా పని చేశారు.. అందుకే ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. విజయ్ బిన్నీకి గొప్ప భవిష్యత్ ఉంటుంది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్‌లు గొప్ప ప్రోత్సాహం అందించారు. ఆషికా రంగనాథ్‌కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన నటుడు నాగార్జునగారితో నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఈ సినిమాలో వింటేజ్ నాగార్జునగారిని చూపిస్తానని మాటిచ్చాను.. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్ బిన్నీ అన్నారు. ఆషికా రంగనాథ్, కెమెరామేన్ దాశరధి శివేంద్ర మాట్లాడారు. -
అలా అనుకుని ఉంటే శివ.. అన్నమయ్య వచ్చేవి కావు
‘‘నా సామిరంగ’ సినిమా కథలోని ప్రేమ, స్నేహం, త్యాగం, ద్వేషం వంటి నాలుగు అంశాలు నాకు బాగా నచ్చాయి. కథలో ఇవే మూల స్తంభాలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రధారులు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. ► ‘నా సామిరంగ’ సినిమా షూటింగ్ 72 రోజులు జరిగితే నా భాగం 60 రోజుల్లో పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులకు 5 నెలలు పట్టింది. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువ అవుతాయి. ప్రీప్రోడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే ఎవరికైనా ఇంత వేగంగా పూర్తి చేయడం సాధ్యపడుతుంది. పైగా కీరవాణిగారు షూటింగ్‌కి ముందే మూడు పాటలు, ఫైట్ సీక్వెన్స్‌కి నేపథ్య సంగీతం చేశారు. ఇంత వేగంగా, భారీ బడ్జెట్లో సినిమా చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం. ఇందులోని ఏడు పాటలూ అద్భుతంగా ఉంటాయి. ► మనకి సంక్రాంతి పెద్ద పండగ. పైగా ఇది 1980 నేపథ్యంలో జరిగే కథ. తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకొస్తున్నాం. ఇది పేరుకే మలయాళ రీమేక్. తెలుగు ప్రేక్షకులకు తగినట్లు కథలో మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రెడిట్ దర్శకుడు విజయ్ బిన్నీకి, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకి దక్కుతుంది. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. పాటలోనే కథని చెప్పే నేర్పు తనలో ఉంది. స్పష్టత ఉన్న దర్శకుడు.. చెప్పింది చెప్పినట్టు తీశాడు. ► ఈ సినిమాలో నా ఊతపదం నా సామిరంగ. సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు వచ్చింది. అందులో 15 నిమిషాలు కట్ చేయడానికి కష్టపడ్డాం.. ఎందుకంటే ప్రతి సీన్ ముఖ్యమైనదిగానే కనిపించింది. నా ప్రతి సినిమానీ ఎడిటింగ్ జరిగాక చూస్తా. అవసరం అనుకుంటే సలహా ఇస్తాను.. కావాలని మార్పులు చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని తక్కువ చేసినట్లవుతుంది. కథకు అవసరం కాబట్టి ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మాస్ లుక్‌లో కనిపించాను. ► ఈ చిత్రంలో కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నాకు, ఆషికాకి మధ్య 12 ఏళ్ల నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. చాలా వైవిధ్యమైన ప్రేమకథ ఇది. ఈ మూవీలో సోదర భావం ఉన్న పాత్రకు ‘అల్లరి’ నరేశ్ సరిపోతాడనిపించి తీసుకున్నాం. రాజ్ తరుణ్‌ది కీలకమైన పాత్రే. అలాగే మిర్నా, రుక్సార్ల పాత్రలూ బాగుంటాయి. ► సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో మేం అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ అప్పుడూ ఇదే సమస్య. ఆ సినిమాను 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా 300 థియేటర్లలో విడుదలవుతోంది. ► నా నూరవ సినిమా స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్‌గా చేయాలనే ఆలోచన లేదు. కెరీర్‌లోని మైలురాయి సినిమాలు స్టార్ హీరోలతో కలిసి చేయాలనుకుని ఉంటే నా నుంచి ‘శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు వచ్చేవి కావు. వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చేయడం లేదు. నాగచైతన్యకి వచ్చిన ‘దూత’ లాంటి కథ కుదిరితే చేస్తాను. నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నేను, మహేశ్‌బాబు కలసి నటించి, నాగేశ్వరరావు–కృష్ణగార్ల వారసత్వాన్ని కొనసాగించాలని గతంలో ట్వీట్ చేశాను. రాజమౌళిగారి సినిమాని మహేశ్ పూర్తి చేశాక దాని గురించి ఆలోచించాలి (నవ్వుతూ) ∙నా తర్వాతి సినిమా శేఖర్ కమ్ములగారి దర్శకత్వంలో ఉంటుంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఓ సినిమా ఉంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ‘బ్రహ్మస్త్ర 2’ మొదలు పెట్టే చాన్స్ ఉంది. -
Naa Saami Ranga Pre-Release Event: 'నా సామి రంగ' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Naa Saami Ranga Movie: ఈ స్టిల్స్ చూస్తే 'నా సామి రంగ' అనాల్సిందే (ఫొటోలు)
-
సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి
‘‘ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తే ఓ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేయవచ్చో ఈ చిత్రంతో నేర్చుకున్నాను. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్గార్లు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్‌కు రెడీ చేశాం’’ అన్నారు విజయ్ బిన్నీ. నాగార్జున హీరోగా ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా మీనన్ ఇతర కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో విజయ్ బిన్నీ పంచుకున్న విశేషాలు. ► స్నేహం ప్రధానంగా సాగే చిత్రం ‘నా సామిరంగ’. 1980–1990 నేపథ్యంలో కథ సాగుతుంది. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్గార్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. రాజ్ తరుణ్‌ది ఓ కీలక పాత్ర. అయితే ఈ ముగ్గురి కనెక్టింగ్ పాయింట్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్గార్ల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాను. సో.. నాకు వారితో కంఫర్ట్నెస్ ఉంది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘΄పోరింజు మరియం జోస్’ సోల్‌ను మాత్రమే ‘నా సామిరంగ’ సినిమాకు తీసుకోవడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేశాం. నాగార్జునగారు ఆయన అనుభవంతో కొన్ని సలహాలు చెప్పారు. నాగార్జునగారితో ఓ కొత్త దర్శకుడికి సినిమా అంటే అదృష్టమే. అందుకే ఈ సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ► దర్శకుణ్ణి కావాలనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. కొరియోగ్రాఫర్‌గా అయితే అన్ని క్రాఫ్ట్స్‌పై గ్రిప్ ఉండే చాన్స్ ఉందని భావించి, కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాను. నేను ఓ కథతో నాగార్జునగారి దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన ‘నా సామిరంగ’ కథ చేయమని చెప్పారు.ఈ కథను ఓన్ చేసుకుని దర్శకత్వం వహించాను. కమర్షియల్ పంథాలో నా శైలిలో ఈ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించాను. సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ► నేను కొరియోగ్రాఫర్‌ని కాబట్టి నాకు మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. కీరవాణిగారిని ఏం అడిగినా, ఏదో ఒక సెన్స్‌తో అడుగుతున్నానని భావించి, సపోర్ట్ చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు. ఓ కొరియోగ్రాఫర్‌గా విభిన్న రకాల పాటలు ఎలా చేశానో, అలానే దర్శకుడిగా విభిన్న రకాల సినిమాలు చేయాలని ఉంది. -
కిష్టయ్య.. అంజి.. ఓ మంచి స్నేహం
‘‘దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం. అంజిది.. కిష్టయ్యది... వీడదీయని ఒక బంధం.. చిరునవ్వులు పూసే స్నేహం.. చిరుగాలికి ఈలల పాఠం’’ అంటూ సాగుతుంది ‘నా సామిరంగ’ సినిమాలోని ‘విజిల్ థీమ్ సాంగ్’. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాలో కిష్టయ్య పాత్రలో నాగార్జున, అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్, కుమారి పాత్రలో రుక్సార్, మంగ పాత్రలో మిర్నా మీనన్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘విజిల్ థీమ్ సాంగ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాటకు ఈ చిత్రసంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సాహిత్యం అందించగా, శాండిల్య పిసాపాటి పాడారు. -
చైనా గోడ దూకినా తప్పు లేదు...
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
కింగ్ నాగార్జున 'నా సామి రంగ ' అదిరిపోయే మూవీ స్టిల్స్
-
మా జోలికొస్తే నా సామిరంగ!
‘‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా ఉండదు.. నా సామిరంగ..’ అంటూ పాడేస్తున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలకానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘నా సామిరంగ..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘మా జోలికొస్తే మాకడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగ.., ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ..’ అంటూ ఫుల్ జోష్‌లో సాగే ఈ పాటలో నాగార్జునతో కలిసి ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కూడా చిందేశారు. ‘‘మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నా సామిరంగ’ రూపొందింది. ప్రధాన తారాగణంతో పాటు 300 మంది డ్యాన్సర్స్‌తో లావిష్‌గా చిత్రీకరించిన ‘నా సామిరంగ..’ పాటకు దినేష్ మాస్టర్ అందించిన నృత్యాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి. -
సెట్స్‌లో నా సామిరంగ
నా సామిరంగ... డ్యాన్స్ అంటూ సెట్స్‌లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ సెట్లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్‌లతో పాటు 300మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా, టైటిల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
ఊతకొట్టుడు కొట్టేశాడు!
‘ఏం చేస్తాన్నాడెంటి.. మీవోడు.. ’ (ఆషికా రంగనాథ్), ‘నిన్నే మావిడితోటలో ఇరవైమందిని ఊతకొట్టుడు కొట్టేశాడు (‘అల్లరి’ నరేశ్)’, ‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా..కొంచెం తగ్గమను (ఆషికా)’...అన్న డైలాగ్స్‌తో విడుదలైంది ‘నా సామిరంగ’ సినిమా టీజర్. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ‘ఏం అడగాలో దానికి తెలియదు. ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏం చేయాలో నాకు తెలియదు’ (నాగార్జున) అన్న డైలాగ్స్‌తో ఈ టీజర్ సాగుతుంది. ‘‘సినిమాలో నాగార్జునగారి గోదావరి యాస చాలా బాగుంటుంది. రొమాన్స్, స్నేహం, యాక్షన్ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి. -
చాలా బాగుందే...
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చాలా బాగుందే...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, చైతు సత్సంగి, లిప్సిక పాడారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘తిరగబడర సామీ’. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలపై వచ్చే ‘చాలా బాగుందే..’ పాట మనసుని హత్తుకునే అద్భుతమైన మెలోడీగా సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి యంఎన్. -
కామెడీ అనుకున్నా.. మాస్‌లా ఉంది
‘‘తిరగబడర సామీ’ కామెడీ సినిమా అనుకున్నా. కానీ, టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా ఉంది. రాజ్ తరుణ్ యాక్షన్ ఇరగదీసినట్లు కనిపిస్తోంది. రాజ్ తరుణ్, రవి కుమార్‌కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘రవికుమార్ చౌదరిగారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం (యాక్షన్) చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో నాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చిన శివకుమార్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏఎస్ రవికుమార్ చౌదరి. ‘‘త్వరలో రిలీజ్ కానున్న మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్. నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు సముద్ర, నటుడు తాగుబోతు రమేష్ తదితరులు మాట్లాడారు. -
యాక్షన్.. కామెడీ.. ఎక్కడా తగ్గవు
‘‘తిరగబడర సామీ’ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. రవికుమార్‌గారి గత సినిమాల్లానే ఈ మూవీలోనూ యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని రాజ్ తరుణ్ అన్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చో్ప్రాహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తిరగ బడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లొకేషన్లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఎలాగైనా మళ్లీ హిట్టు కొట్టాలని కొంత విరామం తీసుకొని కసితో చేసిన సినిమా ‘తిరగబడర సామీ’. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం ప్రేమికులు, భార్యా భర్తలు ఎంతవరకూ వెళ్తారు? అనేది వినోదాత్మకంగా చూపించాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
పురుషోత్తముడు షురూ
రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ చిత్రం షురూ అయింది. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాసినీ సుధీర్ కథానాయిక. రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘ఆకతాయి’ చిత్రం తర్వాత నేను చేస్తున్న సినిమా ‘పురుషోత్తముడు’. హైదరాబాద్, రాజమండ్రి, కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్ అయ్యాం. రామ్‌గారు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్. సినిమాటో గ్రాఫర్ పీజీ విందా, సంగీత దర్శకుడు గోపీసుందర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు దామోదర్ ప్రసాద్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: వెంగళరావు. -
'యజ్ఞం' డైరెక్టర్‌తో రాజ్‌తరుణ్ కొత్త సినిమా ఆరంభం
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి హిట్ చిత్రాల ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరా సామి’ అనే సినిమా ఆరంభమైంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్‌్టను ఏఎస్ రవికుమార్కి అందించారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకులు వీరశంకర్, రాజా వన్నెం రెడ్డి, నిర్మాతలు టి.ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, డీయస్ రావు, నటి–నిర్మాత జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: జేబీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత. బెక్కెం రవీందర్. తిరగబడరా సామి! -
మండపంలో పెళ్లికూతురు మిస్సింగ్.. ఊహించని రెస్పాన్స్
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'అహ నా పెళ్లంట'. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అదరగొడుతోంది. నవంబర్ 17న జీ5లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను చేరుకుంది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అసలు కథేంటంటే..: ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూసేలా ఉందని అందరూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలకుంటే వెంటనే అహ నా పెళ్లంట చూసేయండి. -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్‌కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్‌కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్‌సిరీస్‌లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్‌ను నాకు తగిలేసి శివానీ బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్‌ఫ్రెండ్‌తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్‌కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్‌తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్‌తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్
సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఓటీటీకి ‘ఊ’ చెప్పిన తారల గురించి తెలుసుకుందాం. బాబాయ్-అబ్బాయ్‌ల ‘రానా నాయుడు’ హీరోలు వెంకటేశ్, రానా కలిసి తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇటీవల పూర్తయింది. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ ఆధారంగా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. బాబాయ్ వెంకీ – అబ్బాయ్ రానా నటించిన ఈ సిరీస్‌ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ‘దూత’తో వస్తున్న నాగ చైతన్య మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. సుశాంత్ నీళ్ల ట్యాంక్ హీరో సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘లీడర్’ చిత్రంతో తెలుగుకి పరిచయమైన ప్రియా ఆనంద్ ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత ‘మా నీళ్ల ట్యాంక్’తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథాంశంతో రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. రాజ్ తరుణ్ పెళ్లంట యువ హీరో రాజ్ తరుణ్ తొలిసారి ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ‘ఏబీసీడీ’ చిత్ర దర్శకుడు సంజీవరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే పెళ్లి కుమారుడి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వారిద్దరిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది. తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. పులి మేక ఆడుతున్న ఆది ఆది సాయికుమార్ ‘పులి-మేక’ ఆటకు సిద్ధమయ్యారు. తొలిసారి ఆయన ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. గోపీచంద్ ‘పంతం’ మూవీ ఫేమ్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదికి జోడీగా లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. జీ5, కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందుతోంది. పోలీస్ అధికారులను టార్గెట్ చేసి చంపుతున్న సీరియల్ కిల్లర్ నేపథ్యంలో కథ ఉంటుందట. -
Raj Tarun: రాజ్‌తరుణ్ ‘అహ నా పెళ్లంట’.. ఆ విశేషాలు ఏమిటంటే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్)/తూర్పుగోదావరి: తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి దర్వకత్వంలో రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గరిమెళ్ల సత్యనారాయణ ట్రైనింగ్ కళాశాలలో షూటింగ్ మొదలైంది. చదవండి: చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే రాజ్‌తరుణ్, కమెడియన్ హర్షవర్థన్‌పై ఎంపీ భరత్ రామ్ క్లాప్ కొట్టగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లకు రాజమహేంద్రవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సినిమా షూటింగ్‌లు, స్టూడియోల ఏర్పాటుకు విశాఖలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తర్వాత రాజమహేంద్రవరంలోని పిచ్చుకలంకను తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం జంధ్యాల తీసిన అహ నా పెళ్లంట సినిమాలాగా ఈ వెబ్ సిరీస్ విజయవంతం అవుతుందన్నారు. దర్శకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సిరీస్‌లో ఆమని, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తారన్నారు. -
ఓటీటీలోకి స్టాండప్ రాహుల్, ఎప్పుడు? ఎక్కడంటే?
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. స్టాండప్ కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్‌తో సాగుతుందీ మూవీ. మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టాండప్ రాహుల్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఏప్రిల్ 8 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 'స్టాండప్ అనే పదం కఠినమైన పీటీ టీచర్‌లాగా అనిపించినా మూవీ మాత్రం ఫన్ ఉంటది. స్టాండప్ రాహుల్ ఆహాలో ఏప్రిల్ 8 నుంచి ప్రసారం కానుంది. వీక్షించేయండి' అని ట్విటర్లో రాసుకొచ్చింది ఆహా. #StandUp ane word strict PT teacher laga anipichina, movie matram fun untadi😉#StandUpRahulOnAHA premieres April 8, sit and watch it 😎@itsRajTarun @VarshaBollamma @standupsanto @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 @sonymusicsouth pic.twitter.com/fTN3MqvXg6 — ahavideoin (@ahavideoIN) March 29, 2022 చదవండి: రిపోర్టర్లపై స్టార్ హీరో ఘాటు వ్యాఖ్యలు.. -
స్టాండప్ రాహుల్ సినిమా రివ్యూ
టైటిల్: స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు నటీనటులు: రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీశర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకుడు: శాంటో మోహన్ వీరంకి నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంగీతం: స్వీకర్ అగస్తి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవిచంద్రన్ రిలీజ్ డేట్: 18 మార్చి 2022 డిఫరెంట్ కాన్సెప్టులతో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్నాడు రాజ్‌తరుణ్. రానురానూ కథలపై పట్టు కోల్పోయిన అతడికి సక్సెస్ అందుకోవడం అందని ద్రాక్షే అయింది. తాజాగా స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు. మరి నిజంగానే హీరో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకుడిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? వరుస అపజయాలతో కూలబడిపోయిన రాజ్‌తరుణ్ ఈ సినిమాతోనైనా లేచి నిలబడ్డాడా? లేదా? అనేది రివ్యూలో చూసేయండి.. కథ స్టాండప్ కామెడీ అనగానే చాలామందికి ఆమధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే పాత్ర గుర్తుకు రావడం ఖాయం. స్టాండప్ కమెడియన్ అంటే గుండెలో కొండంత శోకాన్ని దాచుకుని ఆ విషాదాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా నాలుగు జోకులు చెప్తూ ఎదుటివారిని నవ్విస్తారని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. స్టాండప్ రాహుల్‌లో రాజ్‌తరుణ్ పోషించిన పాత్ర కూడా సేమ్ టు సేమ్. రాహుల్(రాజ్ తరుణ్)కు స్టాండప్ కామెడీ అంటే ప్యాషన్. తండ్రి ప్రకాశ్(మురళీ శర్మ) మనసుకు నచ్చింది చేయమంటాడు. తల్లి ఇందు(ఇంద్రజ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలంటుంది. వీళ్లిద్దరూ హీరో చిన్నతనంలోనే విడిపోతారు. ఇక రాహుల్ తనకిష్టమైన స్టాండప్ కామెడీతో పాటు ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే ఆఫీసులో పనిచేసే శ్రేయారావు(వర్ష బొల్లమ్మ)తో అతడు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లంటే గిట్టని రాహుల్ సహజీవనం చేద్దామంటాడు. అతడి ప్రేమను గెలవడం కోసం ఇష్టం లేకపోయినా లివ్ ఇన్ రిలేషన్‌కు సరేనంటుంది శ్రేయ. హీరో పెళ్లి మీద నమ్మకం కోల్పోవడానికి కారణం తన తల్లిదండ్రులే. ఇంతకీ రాహుల్ తల్లిదండ్రుల కథేంటి? వాళ్లెందుకు విడిపోయారు? హీరో ఎందుకు పెళ్లికి నిరాకరిస్తాడు? అసలు వీరి సహజీవనం పెళ్లి దాకా వెళ్లిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని లోతుగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించడంలో కొంత తడబడ్డాడనే చెప్పాలి. కొన్నిచోట్ల భావోద్వేగాలను మరింత పండించగలిగే అవకాశం ఉన్నా ఎందుకో దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపించింది. కథానేపథ్యం, అందుకు తగ్గట్టుగా పాత్రల్ని సృష్టించడంలో అతడి నైపుణ్యం బాగుంది. హీరో ప్యాషన్ స్టాండప్ కామెడీ అయినప్పటికీ పెద్దగా హాస్యాన్ని పండించకపోవడం గమనార్హం. మురళీ శర్మ వంటి పెద్ద నటుడిని తీసుకున్నారు కానీ ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాత్రల మధ్య సంఘర్షణని రేకెత్తించకపోవడం మరో మైనస్ అనే చెప్పుకోవాలి. ఉద్యోగం కోసం హీరో హైదరాబాద్‌కు చేరుకున్నాకే అసలు కథ మొదలువుతుంది. అతడి కుటుంబ నేపథ్యం పరిచయమయ్యాక ప్రేక్షకుడికి కథాగమనం తెలిసిపోతుంది. తర్వాత ఏం జరగబోతుందనేది ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేలా సన్నివేశాలు ఉండటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. దర్శకుడు శాంటో మోహన్ ఎమోషన్స్ మీద కూడా ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా మరో రేంజ్లో ఉండేదేమో! చదవండి: రాజ్ తరుణ్, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం: వరుణ్ తేజ్ నటీనటులు కొత్తదనాన్ని కోరుకునే రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్ రాహుల్ పాత్రను అవలీలగా చేసేశాడు. లుక్స్ పరంగానే కాదు, పాత్రకు తగ్గట్టుగా ఎమోషన్స్‌లో వేరియన్స్ చూపించాడు. వర్ష బొల్లమ్మ తన క్యూట్‌నెస్‌తోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటులు ఇంద్రజ, మురళీశర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కోసమే ఆ పాత్రలు డిజైన్ చేసినట్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సాంకేతికంగా సినిమా మెప్పించింది. శ్రీరాజ్ రవిచంద్రన్ కెమెరాతో జిమ్మిక్కులు చేశాడు. స్వీకర్ అగస్త్య మంచి సంగీతం అందించాడు. డైరెక్టర్ శాంటోకి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవమున్నవాడిలా తెరకెక్కించాడు. కాకపోతే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టిన అతడు సంఘర్షణ, భావోద్వేగాల మీద ఫోకస్ చేయలేకపోయాడు. ప్లస్ ► రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ ► సంగీతం ► సినిమాటోగ్రఫీ మైనస్‌లు ► బలమైన ఎమోషన్స్ లేకపోవవడం ► బలహీనమైన పాత్రలు కొసమెరుపు: స్టాండప్ రాహుల్.. కూర్చున్నా, లేచినా పెద్ద తేడా లేదు! -
‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రాజ్ తరుణ్, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం: వరుణ్
‘‘యూకే నుంచి వచ్చిన శాంటో ‘స్టాండప్ రాహుల్’ కథ చెప్పాడు.. నాకు చాలా బాగా నచ్చిందని సిద్ధు (‘గని’ చిత్రనిర్మాత) అన్నాడు. ఈరోజు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తుంటే శాంటో తన విజన్‌ని అద్భుతంగా తెరపై చూపించాడని అర్థమవుతోంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు. చదవండి: బాలకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్ ‘‘రాజ్ తరుణ్, నేను ఇండస్ట్రీకి ఒకే సమయంలో వచ్చాం.. తను చాలా మంచి సినిమాలు చేశాడు. వర్ష మంచి నటి. రాజ్ తరుణ్, వర్ష తమ పాత్రలకు చక్కగా సరిపోయారు. ఈ సినిమాలో శ్రీరాజ్ విజువల్స్, స్వీకర్ సంగీతం చాలా బాగున్నాయి. నంద, భరత్‌లకు డబ్బులు బాగా రావాలి. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ మీరు మరెన్నో సినిమాలు చేయాలి. ఈ టీమ్ అందరూ ప్యాషన్, హార్డ్‌వర్క్‌తో పని చేశారు.. ఈ సినిమాని అందరూ ఆదరించాలి’’ అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘స్టాండప్ రాహుల్’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. నవ్వడం ఈజీ. కానీ నవి్వంచడం చాలా కష్టం. ఈ చిత్రంలో కామెడీ ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాలున్నాయి’’ అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘‘మాకు బాగా సపోర్ట్ చేసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. స్వీకర్ సంగీతం, శ్రీరాజ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకి నన్ను ఎంచుకున్నందుకు శాంటోకి థ్యాంక్స్. ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సిద్ధు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. మా సినిమాని అందరూ చూసి ఆశీర్వదించండి’’ అన్నారు నందకుమార్ అబ్బినేని. ‘‘మా సినిమాని అందరూ థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భరత్ మాగులూరి. శాంటో మోహన్ మాట్లాడుతూ– ‘‘రెండు గంటలు కామెడీ చేద్దామనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు.. ఇందులో చాలా భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. ఈ వేడుకలో స్వీకర్ అగస్తి, శ్రీరాజ్ రవీంద్రన్, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర (‘భీమ్లా నాయక్’), కిరణ్ కొర్రపాటి (‘గని’), వినోద్ (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’) నిర్మాత సిద్ధు (‘గని’) తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రశాంత్ కిషోర్‌తో తమిళ స్టార్ హీరో భేటీ.. పోలిటికల్ ఎంట్రీకీ సంకేతమా? -
వాళ్లకు హైదరాబాద్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం..
Raj Tarun Starrer Stand Up Rahul Movie Press Meet In Hyderabad: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి 'కూర్చుంది చాలు' అనేది క్యాప్షన్. ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. 'మా రెండేళ్ల ప్రయాణం ఈ చిత్రం. ఇందులో చక్కటి వినోదంతోపాటు మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. నాకు రోల్‌కు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేదే ఈ సినిమా కథ.' అని హీరో రాజ్ తరుణ్ తెలిపాడు. అలాగే దర్శకుడు శాంటో మోహన్ వీరంకి మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సినిమా వాళ్లకు, బ్యాచిలర్స్‌కు హైదరాబాద్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఇవి మూవీలో హీరో పాత్రతో చెప్పించాను. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరాయి.' అని అన్నారు. స్టాండప్ రాహుల్ చిత్రం తనకే కాదు, తన టీమ్ మొత్తానికి మంచి గుర్తింపు తెస్తుందని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. థియేటర్లలో సినిమా చూసి ఆడియెన్స్ నవ్వులతో బయటకొస్తారని నమ్మకముందని పేర్కొంది. -
పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ క్లారిటీ
Varsha Bollamma Clarifies Marriage And Pregnent Rumours: పెళ్లీ, ప్రెగ్నెన్సీ వార్తలపై హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. రాజ్ తరుణ్ హీరోగా సాంటో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వర్ష, హీరో రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్, వర్షలకు సంబంధించిన ఓ ఇంటర్య్వూ వైరల్‌గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, వర్షను ఇంటర్య్వూలో చేస్తూ ఆటపట్టించాడు. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల ప్రశ్నల వర్షం కురిపించాడు. చదవండి: ఆ స్టార్ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్ షాకింగ్ కామెంట్స్ ఇలా ఇంటర్య్వూ మొత్తం వీరిద్దరి ఫన్నీ కన్వర్జేషన్తో సాగుతూ ఆసక్తిని సంతరించుకుంది. ఈ సందర్భంగా వర్ష గురించిన పలు ఆసక్తికర విషయాలపై రాజ్ తరుణ్ ప్రశ్నించాడు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై రాజ్ తరుణ్, వర్షను ప్రశించాడు. అన్ని ప్రశ్నలకు వర్ష తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై వర్ష అసహనం వ్యక్తం చేసింది. నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది. చదవండి: అందుకే సమంత, వరుణ్ ధావన్ కలుసుకున్నారు.. ఇక ప్రెగ్నెంట్ విషయంపై స్పందిస్తూ.. ఇదంతా తన బుగ్గల వల్లే వచ్చిందని, చీక్స్ కాస్తా లావుగా ఉంటే ప్రగ్నెంట్ అని డిసైడ్ అవుతారా? అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తన వయసు 25 అని, తను 1996లో పుట్టానని చెప్పింది. తన ఎత్తుపై అడిగిన ప్రశ్నకు.. హిల్స్ వేస్తే 6'1, లేకపోతే 5'11 అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. మొత్తానికి తన ఎత్తు 5'3, 5'4 అంటూ రాజ్ తరుణ్ రివీల్ చేశాడు. ఇలా రాజ్ తరుణ్, వర్షల మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇంటర్య్వూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్లో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. -
అంత బలుపెందుకు? అంటూ హీరోను తిట్టేసిన అరియానా
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన షోలో ఇప్పటికే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా తాజాగా మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడే సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో లీకువీరులు శ్రీరాపాక ఎలిమినేట్ అయిందని దండోరా వేస్తుండగా మరికొందరు మాత్రం మిత్రశర్మ వెళ్లిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రయూనిట్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో ఓ ఆటాడించారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఈ వారం మహేశ్ విట్టా వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్మేట్స్ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్ చేశారు. కాగా రాజ్‌తరుణ్ అనుభవించు రాజా సినిమాలో అరియానా నటించిన విషయం తెలిసిందే! ఇక్కడ ఏర్పడ్డ పరిచయంతో హీరోతో చనువు పెంచుకున్న బోల్డ్ బ్యూటీ తాజాగా ప్రోమోలో రాజ్‌తరుణ్‌పై సీరియస్ అయింది. నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి? అని నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్ సమాధానం చెప్పినప్పటికీ ఆమె శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి అంత సీరియస్ ఏం అయుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ స్టాండప్ రాహుల్ టీమ్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఆటను చూడాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ వీక్షించాల్సిందే! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
వినోదాత్మకంగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ట్రైలర్..
Raj Tarun Starrer Stand Up Rahul Movie Trailer Out: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది క్యాప్షన్. శుక్రవారం మార్చి 4న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్‌ను స్టాండప్ కమెడియన్‌గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి. ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు. -
స్టాండప్ కమెడియన్ ప్రేమలో పడితే..
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ‘పద..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను హీరోయిన్ రష్మికా మందన్న మంగళవారం విడుదల చేశారు. నలుగురు స్నేహితుల రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. స్వీకర్ అగస్తి ట్యూన్ అందించగా, యాజిన్ నిజర్ పాడారు. రెహమాన్ సాహిత్యం అందించారు. ‘‘జీవితంలో ఏ విషయానికి కూడా స్థిరంగా నిలబడడానికి ఇష్టపడని వ్యక్తి స్టాండప్ కమెడియన్‌గా మారతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురయినప్పుడు ఎలా కష్టపడాల్సి వస్తుంది? అన్నదే చిత్రకథ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద. -
ఓటీటీలోకి అనుభవించు రాజా, ఎప్పుడు రిలీజంటే?
Anubhavinchu Raja On OTT: రాజ్ తరుణ్, కశీష్ ఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. నవంబర్ 26న రిలీజైన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఆహాలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. థియేటర్లో రిలీజై నెల రోజులైనా కాకముందే ఆహాలో ప్రసారం కానుంది. డిసెంబర్ 17 నుంచి అనుభవించు రాజా చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఊర్లో ఆవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేసేవాడిగా రెండు వేరియేషన్స్ చూపించాడు రాజ్‌తరుణ్. తనదైన కామెడీతోనూ నవ్వించాడు. ఈ సినిమా ఇప్పటివరకు చూడనివాళ్లు మరో వారం రోజుల్లో ఆహాలో ఎంచక్కా వీక్షించొచ్చు. ఇదివరకే చూసినవాళ్లు మరోసారి అనుభవించు రాజా చూసి సరదాగా నవ్వుకోవచ్చు! -
రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్
Ariyana Glory Shocking Comments On Raj Tarun: యంగ్ హీరో రాజ్‌తరుణ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదంటూ అందరినికి షాక్ గురి చేసింది. రాజ్ తరుణ్ తాజాగా నటించిన అనుభవించు రాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరియానా ఓ పాత్ర పోషించింది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియాన సరదాగా హీరో, దర్శకుడిని ఆటపట్టించింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే! ఈ మేరకు అరియాన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదు. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎందుకని అంత అసహ్యమని మిగతా సినిమా క్రూడ్ అడగ్గా.. ‘ఇలాగే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు చాలా సేపు వేయిట్ చేయించాడు. నా ముందే కారులో వెళుతుంటే హీరో ఏంటి వెళ్లిపోతున్నాడని అడగ్గా డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళుతున్నాడు’ అని చెప్పారు. చదవండి: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? అంతకు ముందు కూడా ఓ చానల్లో చేసేటప్పుడు రాజ్‌ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. వాళ్ల సినిమా చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఇక హీరోతో ఇంటర్వ్యూ అని చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాను. చూస్తున్నా, చూస్తున్నా ఆయన ఎంతకు రావడం లేదు. మూడు గంటలు వేయిట్ చేశాను. చివరకు ఆయన సినిమా హిట్ అయ్యిందని, సార్ పటా వెళ్లిపోయారని చెప్పారు. ఇలా రెండుసార్లు రాజ్ వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే కారులో వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి కాలో, చెయ్యో విరగాలి అనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే తన ఫస్ట్ మూవీ రాజ్‌తో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఇక సినిమా సెట్‌కు రాగానే రాజ్ ఎదురవ్వడంతో ఈయన ఎందుకు వచ్చాడా? అని అనుకున్నానని పేర్కొంది. చదవండి: సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్.. ఇక రాజ్ తరణ్ తన పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే ‘ఇతనేందుకు నాతో మాట్లాడుతున్నాడు’ అని అనుకునేదాన్ని అంంటూ దర్శకుడు గవిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌తో మాట్టాడటం నచ్చక మధ్య మధ్యలో గవిరెడ్డి గారిని చూస్తూ ఈయనేవరో తెలియదు, సినిమా ఎందుకు ఒప్పుకున్నానో ఏంటో అంటూ మనసులో తిట్టుకున్నట్టు చెప్పింది. అంతేగాక రాజ్‌తో సీన్స్ చేస్తున్నప్పుడు దర్శకుడు గవిరెడ్డిని చూస్తు ఈయన నా ముందు ఉంటే బాగుండు, ఈ సీన్లో ఆయన ఉంటే బాగుండు అనుకునేదాన్నంటూ అరియాన కామెంట్స్ చేసింది. అంతేగాక ఓ రోజు కావాలనే సెట్లో రాజ్ తరుణ్‌ను 8 గంటలు వేయిట్ చేయించాను అనగానే డైరెక్టర్ అరియానను ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో అనుభవించు రాజా మూవీ హీరోయిన్, దర్శకుడు గవిరెడ్డి, బిగ్‌బాస్ ఫేం రవి కృష్ణ కూడా పాల్గొన్నారు. -
సిరి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం: రాజ్ తరుణ్
Bigg Boss Telugu 5, Anubhavinchu Raja Team Visits Bigg Boss House: బిగ్‌బాస్ షోలో అనుభవించు రాజా చిత్రయూనిట్ సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. రాజ్ తరుణ్‌ను చూడగానే సిరి ఎగిరి గంతేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని రాజ్ తరుణ్ చెప్పడంతో సిరి తెగ సిగ్గుపడిపోగా వెంటనే.. నీక్కాదులే అంటూ కౌంటరిచ్చాడు. తర్వాత ఇంటిసభ్యులకు డ్రాయింగ్ గేమ్‌తో కంటెస్టెంట్లను గుర్తించమని టాస్క్ ఆడించారు. ఇందులో ప్రియాంక పిచ్చిగీతలు ఒక్క మానస్‌కు మాత్రమే అర్థమయ్యాయి. ఆమె గీసిన గీతలను బట్టి అది శ్రీరామ్ అని మానస్ ఆన్సరివ్వడంతో అందరూ ఆశ్యర్యానికి లోనయ్యారు. నామినేషన్స్ నుంచి అందరూ సేవ్ అవగా చివర్లో ప్రియాంక, యానీ ఇద్దరు మాత్రమే మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరిలో యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి అదెంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
భీమవరంలో ‘అనుభవించు రాజా’ టీం సందడి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈ నెల 26న విడుదలవుతున్న ‘అనుభవించు రాజా’ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లో చూసి ఆదరించాలని సినిమా హీరో రాజ్ తరుణ్ కోరాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్ భీమవరం వచ్చింది. ముందుగా ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం క్లాస్మో క్లబ్ లో జరిగిన సమావేశంలో హీరో మాట్లాడుతూ అనుభవించు రాజా సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచుతుందన్నారు. సినిమా చిత్రీకరణ కూడా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా సన్నీనే ఎలిమినేట్ అవుతాడు! -
Anubhavinchu Raja: బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉంటే..
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఆ లుక్‌లో జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ని వదలింది చిత్రం బృందం. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇదని టీజర్ చూస్తే అర్థమవుతంది. కోడి పందాలు ఆడే వ్యక్తిగా హీరో కనించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైందని సినీ వర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త మూవీ టైటిల్ ఇదే..
యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ బయటకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ను ‘అనుభవించు రాజా’గా ఖరారు చేశారు చిత్ర బృందం. తాజాగా నాగార్జున ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజ్ తరుణ్ కోడిపుంజుతో పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. చూస్తుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్: ఇద్దరికి కరోనా పాజిటివ్.. తెరపైకి కొత్త పేర్లు, లిస్ట్ ఇదే! ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మోడల్ కాషిశ్ ఖాన్ నటించింది. ఈ చిత్రంలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎలాంటి హాడావుడి లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాజ్ తరుణ్‌కు ఇది మూడో సినిమా కాగా, దర్శకుడుకు శ్రీనివాస్‌తో అతడికి రెండవ చిత్రం కావడం విశేషం. Happy to show you the first Look of our next !! @itsRajTarun#AnubhavinchuRaja @AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @GavireddySreenu @adityamusic pic.twitter.com/RVOgI4aBRq — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 28, 2021 -
రాజ్‌తరుణ్ కుళ్లు జోకు, ఓ లుక్కిచ్చిన వర్ష
నవ్వడం ఈజీ కావచ్చు, కానీ నవ్వించడం అంత ఈజీ కాదు, అందులోనూ స్టాండప్ కామెడీ అంటే మరీ కష్టం. అయినా సరే వచ్చీరాని జోకులతో నవ్వించడానికి రాహుల్‌గా మన ముందుకు వచ్చాడు రాజ్‌తరుణ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "స్టాండప్ రాహుల్". శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశాడు. స్టాండప్ కామెడీకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఒరిజినాలిటీ అంటూ టీజర్ మొదలైంది. ఆ వెంటనే హీరో తన టాలెంట్‌కు పదును పెడుతూ కుళ్లు జోకుతో జనాలను నవ్వించే ప్రయత్నం చేశాడు. 'ఒక మొఘల్ రాజు యుద్ధానికి వెళ్లినప్పుడు కత్తి కనబడలేదు, ఎందుకంటే అది ఔరంగ'జేబు'లో ఉండిపోయింది' అని పకపకా నవ్వాడు. దీంతో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇప్పుడది జోక్, దానికి మళ్లీ నవ్వడం ఒకటా? అని ఓ లుక్కిచ్చుకుంది. ఈ సినిమాలో శ్రేయారావుగా అలరించనున్న వర్ష కూడా స్టాండప్ కమెడియనే కావడం విశేషం. టీజర్ మధ్యలో వచ్చే.. నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి అన్న డైలాగ్ బాగుంది. ఇక రాజ్ తరుణ్ అమ్మాయిల కోసం అబ్బాయిలు ఉద్యమాలు చేస్తున్నారంటూ స్పీచ్ ఇచ్చాడు. "మాకు పిల్లల్ని కనడానికి తప్ప మగాడు అవసరం లేదని ప్రియాంక చోప్రా అంటే ఈలలు వేశారు, అదే మన చలపతిరావు అంటే గోలగోల చేశారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే అబ్బాయి సింగిల్‌గా ఉంటే పులవుతాడు, అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు" అని సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చాడు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ప్రణీత్ హనుమంతు టీజర్ ఎడిటింగ్ ఓ రేంజ్లో చేశాడని కామెంట్లు పెడుతున్నారు. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు. -
స్టాండప్ కమెడియన్‌గా వర్ష బొల్లమ్మ
శ్రేయా రావు స్టాండప్ కమెడియన్. వీక్షకులను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు రాహుల్. అతను కూడా స్టాండప్ కమెడియనే. ఈ ఇద్దరి కథ ఏంటి? అనేది ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో తెలుస్తుంది. రాహుల్‌గా రాజ్ తరుణ్, శ్రేయా రావు పాత్రను వర్ష బొల్లమ్మ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ లుక్ విడుదలైంది. తాజాగా వర్ష లుక్‌ని విడుదల చేశారు. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తి, కెమెరా: శ్రీరాజ్ రవీంద్రన్. చదవండి: Raj Tarun: రాహుల్.. కూర్చుంది చాలు! -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యంగ్ హీరో!
యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిలింలో నటించి.. దర్శకుల దృష్టిని ఆకర్షించిన అతడు ‘ఉయ్యాల జంపాల’ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21F’తో వరుస హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో అదే జోరును కొనసాగించలేకపోయాడు. క్రమంగా సినిమాలు తగ్గించి ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావించి ‘పవర్ ప్లే’, ‘ఓరేయ్ బుజ్జి’ సినిమాలు చేశాడు. పవర్ ప్లే మూవీ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలైన ఓరేయ్ బుజ్జి కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్య యువ హీరోలంతా వరుసగా పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వారందరి బాటలో తాజాగా రాజ్ తరుణ్ కూడా అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల హైదరాబాద్‌లో సొంత ఇంటిని కొనుగొలు చేసిన రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. దానికి తగ్గట్లు అతడు త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో రాజ్ తరుణ్ విజయవాడకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో ఈ కుర్ర హీరో ఏడడుగులు వేయనున్నాడేమోనని అందరు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇందులో ఎంతవరకు నిజమో తెలియాలంటే అతడు స్పందించే వరకు వేచి చూడాల్సింది. కాగా గతంలో కూడా రాజ్ తరుణ్ ఓ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఈ యంగ్ హీరో కొట్టిపారేశాడు. చదవండి: NTR 30: మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్! సమంత గుడ్‌న్యూస్ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం! -
ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్!
'ఉయ్యాల జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. తర్వాత చేసిన రెండు వరుస చిత్రాలు సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ సూపర్ హిట్ అవడంతో రాజ్ తరుణ్‌కు తిరుగు లేదనుకున్నారంతా. కానీ కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయడంతో అంతే వేగంగా ఫ్లాప్‌లు నెత్తి మీద పడ్డాయి. దీంతో ఈసారి రూటు మార్చి లవర్ బాయ్‌గా కాకుండా ఓ సస్పెన్స్ కథ పవర్ ప్లే ద్వారా ప్రేక్షకుడి ముందుకు వచ్చాడు. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈసారి మరో వైవిధ్య కథను ఎంచుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా వుంటే అతడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు పలు ప్రశ్నలను సంధించగా వాటన్నింటికీ ఓపికగా సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో క్రష్ ఎవరన్నదానికి తడుముకోకుండా సమంత అని టపీమని చెప్పాడు. అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పిన యంగ్ హీరో తను మాత్రం మహేశ్‌బాబు ఫ్యాన్ అని అభిమానులను తికమక పెట్టాడు. పనిలో పనిగా ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుగా అని అడిగాడు. అతగాడి కోరిక మేరకు 9848022338 అని నెంబర్ లీక్ చేశాడు. దీంతో కొందరు ఫ్యాన్స్ ఓవైపు షాకవుతూనే మరోవైపు ఆ నెంబర్‌కు దానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. అయితే అది స్విచ్చాఫ్ రావడంతో నువ్వు మమ్మల్ని మోసం చేశావని హీరోను నిందించారు. దీంతో అతడు తాపీగా అది తన నెంబర్ కాదని, శివమణి ఫోన్ నెంబర్ అని అసలు విషయం చెప్పాడు. ఇక త్వరలోనే అవికా గోర్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. తను 16 కుక్కపిల్లలను పెంచుకుంటున్నట్లు చెప్పాడు. తను వర్జినా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు అంత ఆత్రం పనికి రాదని బదులిచ్చాడు. పెళ్లెప్పుడు అన్నదానికి కూడా తన దగ్గర సమాధానం లేదని తెలిపాడు. చదవండి: చేసిన తప్పులు చేయకూడదు: రాజ్ తరుణ్ ‘సర్కారు వారి పాట’కు కరోనా దెబ్బ -
రాజ్‌తరుణ్.. కూర్చుంది చాలులే : సమంత
గత కొంత కాలంగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఫ్లాప్‌లతో సతమతమౌతున్నాడు. “ఒరేయ్ బుజ్జిగా” ఓటిటిలో మంచి హిట్ కావడంతో ట్రాక్ లో పడ్డాడని అనుకుంటే మళ్లీ “పవర్ ప్లే” సినిమాతో వెనకబడ్డాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి కంబ్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం “స్టాండప్ రాహుల్” అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ‘మెక్ టెస్టింగ్ 1..2..3, చెక్ చెక్.. రాజ్‌తరుణ్ కూర్చుంది చాలు’అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా, ఈ మూవీతో మోహన్ వీరంకి అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు . ఇందులో రాజ్ తరుణ్ సరసన యంగ్ హీరోయిన్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేం వర్ష బొల్లమ నటిస్తుంది. రొమాంటిక్ డ్రామాగా సాగే ఈ చిత్రం జీవితంలో దేని గురించి ఆలోచించని ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించారు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి. Mic testing 1..2..3... Check check.. @itsrajtarun Kurchundi Chalu!!! Presenting the Title & First Look of #StandUpRahul🎙️ Wishing outSTANDing success to this team! 🙂 @VarshaBollamma @mohan_veeranki @SweekarAgasthi @SreerajRavee @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 pic.twitter.com/Z3gQKceQ3p — Samantha Akkineni (@Samanthaprabhu2) March 24, 2021 -
చేసిన తప్పులు చేయకూడదు
‘‘సినిమా హిట్ కావాలనే స్టార్ట్ చేస్తాం. అయితే ఆ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ కావచ్చు. కాకపోవచ్చు. సినిమాను కొత్త జానర్లో ప్రయత్నించినప్పుడు మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం ఉండదు. కానీ చేసిన తప్పులు మాత్రం మళ్లీ చేయకూడదు’’ అన్నారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో మహీధర్, దేవేష్ నిర్మించిన చిత్రం ‘పవర్ ప్లే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ చెప్పిన విశేషాలు... ► అమాయకుడైన ఓ వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తుల వేసిన ఎత్తుగడలో చిక్కుకుంటాడు. ఈ కష్టాల నుంచి అతను ఎలా బయటకు వచ్చాడు? తన కష్టాలకు కారకులైనవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ► ప్రతి సినిమాకూ వందశాతం కష్టపడతాను. సినిమా పూర్తికాగానే డిస్కనెక్ట్ అవుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఏ ప్లాట్ఫామ్లో అయినా చూస్తారు. అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ► విజయ్‌గారితో కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టే ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. హిందీ సినిమా ‘డ్రీమ్‌గర్ల్’ రీమేక్‌ను విజయ్‌గారి డైరెక్షన్ లో చేస్తున్నాను. విరించి వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 60∙శాతం పూర్తయింది. శ్రీనివాస్ గవిరెడ్డితో నేను చేస్తున్న సినిమా దాదాపు పూర్తయింది. -
కొత్త యాంగిల్ చూస్తారు
‘‘పవర్ ప్లే’ ట్రైలర్ చూశాక కొండా విజయ్‌కుమార్ ఆలోచనలు మారిపోయాయనిపించింది. రాజ్ తరుణ్‌తో ఇలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో మహిధర్, దేవేష్ నిర్మించిన ‘పవర్ ప్లే’ ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నిర్మాతలు కేస్ రామారావు, కేకే రాధామోహన్ ‘పవర్ ప్లే’ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్ నటించిన ‘ఉయ్యాల జంపాల’ చూసి అతనికి మంచి భవిష్యత్ ఉందనుకున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రోమోస్, ట్రైలర్స్ చూస్తుంటే రాజ్‌తరుణ్ రఫ్ అయ్యాడనిపిస్తోంది. సినిమా హిట్ అయి, మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు నిర్మాత రాధామోహన్ . ‘‘పవర్ ప్లే’ సినిమా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘నేను, రాజ్ ఇప్పటివరకు చేయని కొత్త జానర్ సినిమా ఇది. ఫస్ట్ టైమ్ తనలో మరో యాంగిల్ చూస్తారు’’ అన్నారు విజయ్‌కుమార్. ‘‘ట్రైలర్ బాగుంది. సినిమా బంపర్ హిట్ అవుతుంది’’ అన్నారు తాండూరి ఎమ్ఎల్ఏ రోహిత్ రెడ్డి. హీరోయిన్ పూర్ణ, సినిమాటోగ్రఫర్ ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాలపర్తి ఆనంత్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
నేనూ విజయ్ మరో సర్ప్రైజ్ ఇస్తాం
‘‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి ఎంటర్టైనర్ తర్వాత మా టీమ్ అంతా కలిసి సరికొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ ‘పవర్ ప్లే’. విజయ్‌గారు, నంద్యాల రవిగారు, మధునందన్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. నేను, విజయ్‌గారు త్వరలో మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ‘పవర్ ప్లే’. హేమల్ ఇంగ్లే కథానాయిక. పూర్ణ, మధు నందన్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. పద్మ సమర్పణలో మహిధర్, దేవేష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘పవర్ ప్లే’ ట్రైలర్‌ను మీడియా తరఫున సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత బి.ఎ.రాజు విడుదలచేశారు. విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్లో ఈ సినిమా చేశాడు. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు దేవేష్. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలపర్తి అనంత్ సాయి. ‘‘ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హేమల్. ‘‘ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు పూర్ణ. ‘‘ఈ సినిమాకి కథ, మాటలు రాశాను’’ అన్నారు నంద్యాల రవి. -
'పవర్ ప్లే' మూవీ ట్రైలర్ లాంచ్ ఫోటోలు..
-
నెత్తురోడిన రోడ్లు, హీరోయిన్‌తో లిప్‌లాక్‌లు
లవ్, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్ ప్లే"తో థ్రిల్లర్ మూవీ ట్రాక్ ఎక్కాడు హీరో రాజ్ తరుణ్. తన గత చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పవర్ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా సాగిపోయిన ఈ ట్రైలర్లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. (చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..) ఇదిలా వుంటే రాజ్ తరుణ్ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్ తరుణ్ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే! ఇక ఈ పవర్ ప్లేలో హేమల్ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా పూర్ణ, మధునందన్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్, దేవేష్ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: పుష్ప’టీమ్‌కు షాక్.. రెండు సీన్లు లీక్) -
గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..
బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన అరియానా గ్లోరీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్ ఇప్పుడు హీరోయిన్గా మారనుందని తెలుస్తోంది. యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ షోలో అరియానా టాప్ 4లో ఉండడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడుఈ అమ్మడుకి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది. యువ నటుడు రాజ్ తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్‌బాస్ తర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్‌తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్నపూర్ణ బ్యానర్‌ని హ్యాష్ ట్యాగ్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు అర్దమవుతుంది. పూజా కార్యక్రమం కూడా పూర్తయినట్టు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: వైరల్: ఈ బిగ్‌బాస్ హీరోను గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
నవ్వులతో స్వాగతం
రాజ్ తరుణ్ హీరోగా, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాని నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2021కి స్వాగతం పలుకుతూ మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ. -
'ఒరేయ్ బుజ్జిగా’ మూవీ స్టిల్స్
-
ఒకరోజు ముందే ‘ఒరేయ్ బుజ్జిగా’ ..
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా.'. విజయకుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధమోహన్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూత పడటంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. థియేటర్లు ఓపెన్ చేశాక రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే పెద్ద సినిమాలే ఓటీటీ బాట పట్టిన తరుణంలో ఒరేయ్ బుజ్జిగా కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించింది. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ) కానీ అదే రోజు అగ్రతార అనుష్క నటించిన "నిశ్శబ్ధం" సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఒకరోజు ముందుగానే రిలీజ్ చేయాలన్న ప్రేక్షకుల కోరిక మేరకు 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు రాజ్ తరుణ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బహిరంగంగా ప్రకటించేంతవరకు నిర్మాతకు కూడా తెలియకపోవడం గమనార్హం. అనంతరం ఇదే విషయాన్ని అభిమానులకు తెలుపుతూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. సర్ప్రైజ్.. రేపు సాయంత్రం ఆరు గంటలకే సినిమా చూసేయండని చెప్పుకొచ్చారు. రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు అని హామీ ఇస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. (చదవండి: హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్) Surprise surprise!!! 🤗😀 pic.twitter.com/KhQNRQcKe2 — Raj Tarun (@itsRajTarun) September 29, 2020 -
‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ వేడుక
-
‘సరిగమ’ అంటున్న రాజ్, హెబ్బా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సరిగమ’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. వనమాలి సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాడాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (నగ్నంగా నరేశ్.. 30న ఎఫ్ఐఆర్) ఈ పాటలో రాజ్ తరుణ్ డ్యాన్స్, హెబ్బా పటేల్ అందాలు హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే కుమారి 21ఎఫ్, అంధగాడు, ఆడోరకం ఈడోరకం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడిని ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుండటంతో ఈ చిత్రంలోనూ వీరిని రీపీట్ చేశామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేటర్లోనే విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) -
నిర్మాతగా నాగచైతన్య?
మహేశ్‌బాబు, రామ్‌చరణ్, నాని, సందీష్ కిషన్ తదితర హీరోలు నిర్మాతలుగా మారారు. తాజాగా హీరో నాగచైతన్య నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భవిష్యత్తులో నిర్మాతను అవుతా’ అని పలు సందర్భాల్లో చైతన్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం తర్వాత హీరో రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్ గావిరెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట నాగచైతన్య. -
నెట్టింట కాదు థియేటర్లోనే విడుదల
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడింది. వైరస్ వ్యాప్తి నివారణ నియంత్రణలో భాగంగా ప్రపంచంతో పాటు భారత్ లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా అనేక సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు నెట్టింట్లో విడుదల చేశారు. డిజిటల్ ఫ్లాట్‌ఫాం వేదికగా రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో పలు చిన్న సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. అయితే యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్రం కూడా నెట్టింట విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్ర విడుదలపై నిర్మాత రాధామోహన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఒరేయ్ బుజ్జిగా చిత్ర విడుదల విషయంలో వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. మా చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుంది’అంటూ నిర్మాత ట్వీట్ చేశారు. ఉగాది కారణంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతమందించాడు. Don't believe in rumours about skipping the theatrical release of #OreyBujjiga. We will update about the theatrical release date once normalcy is restored. Until then #StayHomeStaySafe - @KKRadhamohan @SriSathyaSaiArt — Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 9, 2020 చదవండి: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు? కరోనాపై పోరులో చిరంజీవి తల్లి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం
రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ కరీంనగర్లో జరిగిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో సునీల్‌రావు (కరీంనగర్ మేయర్) ముఖ్య అతిథిగా హాజరై ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు. నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా ఇది నా ఎనిమిదో సినిమా. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. టీమ్ అందరి సహకారం వల్ల సినిమా బాగా వచ్చింది. ముందుగా ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 25న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 21వరకు థియేటర్స్ మూసివేస్తున్నారు. తిరిగి సినిమా థియేటర్స్ ఓపెన్ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది క్లీన్ ఎంటర్టైనర్. రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. రాజ్‌తరుణ్ ఫైట్స్, డ్యాన్స్‌లు ఇరగదీశాడు. రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు విజయ్‌కుమార్ కొండా. ‘‘థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ తర్వాత డైరెక్టర్ విజయ్‌కుమార్‌గారితో ఇది నా హ్యాట్రిక్ ఫిల్మ్. రాజ్ తరుణ్ ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. రాజ్ తరుణ్‌తో నాకిది రెండో సినిమా’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. నటుడు మధుసూధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమే‹ష్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నీతోని కష్టమే కృష్ణవేణి!
యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ కృష్ణవేణి ఓ కృష్ణవేణి నీతోని కష్టమే కృష్ణవేణి, కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి’ పాట యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక ఈ సినిమా నుంచి ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున’ అనే పాట ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: ఒరేయ్ బుజ్జిగా.. ఫస్ట్ సాంగ్ రిలీజ్) Here’s the mass song “Krishnaveni” from #Oreybujjiga https://t.co/mNtvpag03i Hope u guys like it :) — Raj Tarun (@itsRajTarun) March 14, 2020 (చదవండి: ఈ సినిమా టైటిల్ బాగా పాపులర్ అయింది) -
రెండున్నర గంటలు నవ్వులే
‘‘ఒరేయ్ బుజ్జిగా’ కంప్లీట్ ఎంటర్టైనర్. థియేటర్లో రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా వచ్చి సంతోషంగా నవ్వుకుని వెళ్లే సినిమా’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా’ చేశా. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే మా సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘యువతకి, కుటుంబ సభ్యులకి నచ్చే అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. ఈ నెల 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకలు చేస్తాం’’ అన్నారు. మాళవికా నాయర్, నటుడు మధునందన్, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, కో– డైరెక్టర్ వేణు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు
యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఈ చిత్రానికి కొండా విజయ్‌కుమార్ దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఒరేయ్ బుజ్జిగా’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. థియేటర్లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఆ సమయానికి విద్యార్థులకు పరీక్షలు ముగిసి సెలవులు వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్, దర్శకుడు విజయ్ కుమార్‌కు ధన్యవాదాలు" తెలిపారు. ప్రమోషన్స్ వినూత్నంగా చేస్తున్నారు హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ.. ‘సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు. విజయ్ కుమార్ సినిమా ఆరంభం నుంచి నాకు గైడింగ్ స్పిరిట్‌గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక హ్యూగ్ ఇన్స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. నిర్మాత రాధామోహన్ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్‌తో నటించారు. ఆండ్రూతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది’ అన్నారు. (ఒరేయ్ బుజ్జిగా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సినిమా ఉగాది షడ్రుచిలా ఉంటుంది దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.."రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. కథకు ఏమి కావాలో అన్నీ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా నటించారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూ, అనూప్ ఇలా అందరు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఏ జోనర్లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ప్రేక్షకులందరూ పడిపడి నవ్వుకునే సినిమా చేయాలని ‘ఒరేయ్ బుజ్జిగా..’ చేశాం. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలు ఉంటాయి' అన్నారు. టైటిల్ బాగా పాపులర్ అయింది చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ - "నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ కథ వినిపించారు. అక్కడ మొదలైన చిత్రం ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన ‘కురిసెన, కురిసెన’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీస్‌కు నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. ఈ సినిమాకు మార్చి 14న కరీంనగర్లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుంచి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌కు మేము అందరం వెళ్లాం' అన్నారు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది నటుడు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘నిర్మాతకు ఇది ఎనిమిదవ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా ఎనిమిది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది" అన్నారు. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘విజయ్ కుమార్‌తో ఇది నా మూడవ సినిమా. ఈ సినిమాకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రి టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’, ‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటి? ఒక ఫ్లిప్‌కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్‌మైషో, ఒక క్రెడిట్ కార్డ్’ అంటూ టీజర్లో వచ్చే డైలాగ్‌లు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’, ‘నీకు తెలిసిన స్టోరీలో తెలియన్ ట్విస్టు ఉంది’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్‌లు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో యూత్‌ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన టీజర్ సినిమాకు మరింత ప్లస్‌గా నిలిచే అవకాశం ఉంది. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. చదవండి: ‘అమృతరామమ్’ ఎప్పుడంటే? యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’ -
యంగ్ హీరో సినిమాకు మెగాప్రిన్స్ బెస్ట్ విషెస్
రాజ్ తరుణ్ హీరో కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై అందరిలోనూ పాజిటీవ్ ఒపీనియన్ కలిగింది. ఇప్పటికే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా సినిమాలో ఫస్ట్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోన తన ట్విటర్లో షేర్ చూస్తూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఈ పాటను అనూప్ రూబెన్స్ స్వరపరచగా.. ఆర్మాన్ మాలిక్, మేఘనలు ఆలపించారు. కె.కె సాహిత్యాన్ని అందించారు. హీరోయిన్‌పై తనకున్న ప్రేమను హీరో తెలియజేస్తూ సాగే ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ను, ప్రేమికులను కట్టిపడేస్తోన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. Hey guys!! Here's the First Single #KurisenaKurisena, a melodious number, from #OreyBujjiga. ▶️ https://t.co/mORWbIsdkV#OreyBujjigaOnMarch25th All the best to the entire team!!!👍🏽@itsRajTarun @MalvikaNairOffl @IamHebahPatel @directorvijays @anuprubens @iandrewdop — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 21, 2020 -
నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్ తరుణ్?
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే అదే రోజు నాని, సుధీర్ బాబుల ‘వి’ చిత్రం కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లాఫ్లతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ తన చిత్రాన్ని అదే తేదీన విడుదల చేస్తాడో లేదో వేచి చూడాలి. ఇక కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ అ తర్వాత వరుస అపజయాలతో వెనకబడ్డాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో పలకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కొండా విజయకుమార్ దర్శకత్వంలో యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని చేస్తున్నారు. మాళవిక నాయర్‌తో పాటు హెబ్బా పటేల్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పాత్ర చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. ఇప్పటివరకు రాజ్ తరుణ్-హెబ్బాల కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో వారిద్దిరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ చిత్రంపై కూడా అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూబ్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. చదవండి: క్యాన్సర్ కదా... అందుకే: నటుడి భావోద్వేగం! ‘అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?’ -
బుజ్జిగాడు వస్తున్నాడు
రాజ్‌తరుణ్, మాళవికా నాయర్ జంటగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. రాజ్ తరుణ్ ఎనర్జీకి తగ్గట్లు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు విజయ్ కుమార్. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మా బ్యానర్లో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు రాధామోహన్. హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. -
‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీ రివ్యూ
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే జానర్: లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు: రాజ్ తరుణ్, షాలినీ పాండే, మాస్టర్ భరత్, నాజర్, సిరివెన్నెల రాజా, సిరి, సంగీతం: మిక్కీ జే మేయర్ దర్శకత్వం: జీఆర్ కృష్ణ(జి. కృష్ణారెడ్డి) నిర్మాత: దిల్ రాజు బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ గత కొంతకాలంగా సక్సెస్ లేక యంగ్ హీరో రాజ్ తరుణ్ వెనకబడిపోయాడు. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ విజయాలు మాత్రం అతడి దరిచేరడంలో లేదు. దీంతో సినిమాలకు చిన్న విరామం తర్వాత ఓ విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో ‘ఆడు మగాడ్రా బుజ్జి’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీఆర్ కృష్ణ డైరెక్షన్లో రాజ్‌తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఎఫ్2, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా బుధవారం ప్రేక్షకుల మది తట్టిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?. ఈ చిత్రంతో దిల్ రాజు ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించాడా? రాజ్ తరుణ్ సక్సెస్ బాట పట్టాడా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: మహి (రాజ్‌తరుణ్) ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. తాతా (నాజర్) కోరిక మేరకు వర్ష (షాలినీ పాండే) సినిమాల్లో హీరోయిన్గా నటించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ దశలో మహితో వర్షకు పరిచయం ఏర్పడుతుంది. అయితే వీరిద్దరి పరిచయం ఇప్పడిది కాదని చిన్ననాటిదని తెలుసుకుంటారు. అంతేకాకుండా మహి ప్రోద్బలంతో వర్ష హీరోయిన్ అవుతుంది. అంతేకాకుండా చిన్నతనం నుంచే ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమలో పడతారు. అయితే అప్పటికే రాహుల్(రాజు సిరివెన్నెల) అనే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిన వర్ష, మహితో ప్రేమపై ఎటూ తెల్చుకోలేకపోతుంది. మరోవైపు మహి తీవ్ర గుండెజబ్బుతో భాదపడుతున్న విషయం కూడా తెలుస్తోంది. చివరకి వర్ష, మహిలు ఒక్కటయ్యారా? చిన్న తనం నుంచి వీరి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటివి? వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనేదే మిగతా కథ. నటీనటులు: యాజ్ యూజ్‌వల్‌గా రాజ్ తరుణ్ తన నటనతో మెప్పించాడు. కథకు అనుగుణంగా సెటిల్డ్ ఫర్ఫామెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అర్జున్ రెడ్డి తర్వాత హీరోయిన్ షాలినీ పాండే సూపర్బ్ నటనతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలరించింది. షాలిని తల్లి పాత్రలో కనిపించిన రోహిణి మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రాజు సిరివెన్నెల, మాస్టర్ భరత్, సిరి, తదితర నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ప్రేమ కథలు ఎప్పుడూ బాగుంటాయి. అయితే ఆ కథలను దృశ్యరూపంలో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడమనేది దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ జీఆర్ కృష్ణ నూటికి నూరు మార్కులు సాధించారు. తను అనుకున్న కథను ఎక్కడా డీవీయేట్ కాకుండా, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా సినిమాను చాల చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా, క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హీరోహీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్ సీన్లతో ప్రేక్షకుల్ని కూడా ఆ కాలంలోకి తీసుకెళతాడు దర్శకుడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఇక సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఊటీ అందచందాలతో పాటు, హీరోహీరోయిన్స్ల మధ్య ఎమోషన్ సీన్స్ తెరపై అందంగా కనిపించేలా చేశారు. అంతేకాకుండా కెమెరామెన్ తన పనితనంతో సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొస్తాడు. ఇక లవ్ స్టోరీలకు ప్రధానంగా కావాల్సింది సంగీతం. ఫ్రెష్ లవ్ సాంగ్స్‌ను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఈ విషయంలో మిక్కీజెమేయర్ కాస్త తడపడినట్లు అనిపిస్తోంది. రోటీన్ పాటలతో కాస్త ఇబ్బంది పెట్టాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత కొత్తగా ఏమనిపించలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉండేది. నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ రాజ్ తరుణ్, షాలినీ పాండేల నటన హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఎడిటింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్ డెస్క్