అల్లరి నరేశ్, నాగార్జున,రాజ్ తరుణ్
‘‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా ఉండదు.. నా సామిరంగ..’ అంటూ పాడేస్తున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలకానుంది.
ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘నా సామిరంగ..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘మా జోలికొస్తే మాకడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగ.., ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ..’ అంటూ ఫుల్ జోష్‌లో సాగే ఈ పాటలో నాగార్జునతో కలిసి ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కూడా చిందేశారు. ‘‘మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘నా సామిరంగ’ రూపొందింది. ప్రధాన తారాగణంతో పాటు 300 మంది డ్యాన్సర్స్‌తో లావిష్‌గా చిత్రీకరించిన ‘నా సామిరంగ..’ పాటకు దినేష్ మాస్టర్ అందించిన నృత్యాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి.
Comments
Please login to add a commentAdd a comment