Allari Naresh
-
'పొలిమేర' దర్శకుడి మరో దెయ్యం సినిమా.. టీజర్ రిలీజ్
'పొలిమేర' రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. తొలిభాగం ఓటీటీలో రిలీజై హిట్ కాగా.. తొలుత థియేటర్లలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్.. మరో దెయ్యం మూవీతో వచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)కాకపోతే ఈసారి అనిల్ విశ్వనాథ్.. దర్శకుడి బాధ్యతలు తీసుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూనే షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా '12 ఏ రైల్వే కాలనీ' టైటిల్ పెట్టినట్లు టీజర్ రిలీజ్ చేశారు. 'ఈ స్పిరిట్స్, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయ్?' అనే డైలాగ్ ఆకట్టుకుంది.టీజర్ బట్టి చూస్తే ఇందులో దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తిగా అల్లరి నరేశ్ కనిపించనున్నాడు. 'పొలిమేర' హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులోనూ సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో విడుదల ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?) -
రెడ్ డ్రెస్‌లో రెచ్చగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఏయే సినిమాలు చేసిందో తెలుసా?
-
ఓటీటీకి వచ్చేసిన బచ్చలమల్లి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన సినిమా 'బచ్చల మల్లి'(Bachalamalli Movie). గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా మెప్పించింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో(OTT) సందడి చేస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో(Amazon Prime Video) అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని థియేటర్లలో చూడడం మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. బచ్చలమల్లి అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు.నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ
టైటిల్: బచ్చల మల్లినటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులునిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్టదర్శకత్వం: సుబ్బు మంగాదేవిసంగీతం: విశాల్ చంద్రశేఖర్సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్విడుదల తేది: డిసెంబర్ 20, 2024కథేంటంటే.. ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ బ్యాగ్రౌండ్, హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్‌గా టచ్ చేయవు. ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి. హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్ కూడా రొటీన్ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. బచ్చల మల్లి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్ ఫేం అమృతా అయ్యర్, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు. హరితేజ, ప్రవీణ్, రావు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు పర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ
గత కొన్నాళ్లుగా రూట్ మార్చిన అల్లరి నరేశ్.. సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. ఈ వారం థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదొక్కటే. సుబ్బ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. దీంతో మూవీ టాక్ బయటకొచ్చింది. ట్విటర్లో సినిమా రివ్యూ పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్.. 'ఇక మీరెందుకు పాకులాడటం?')బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. అల్లరి నరేశ్ పక్కన 'హనుమాన్' ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా చేసింది. టాక్ విషయానికొస్తే.. మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'బచ్చలమల్లి' సినిమా అని అంటున్నారు. అలాన ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడని కూడా చెబుతున్నారు.డైలాగ్స్, జాతర ఫైట్ సీన్, చివరి 20 నిమిషాలతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ బాగుందని అంటున్నారు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కేర్ తీసుకోవాల్సిందని చెబుతున్నారు. ఓవరాల్‌గా చూసేటప్పుడు డెప్త్ తగ్గినట్లు అనిపించిందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అల్లరి నరేశ్ బాగానే కష్టపడ్డాడని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది)Super #BachhalaMalliAsl start to interval varaku asl bore ledu songs @allarinaresh Anna Main ga @Actor_Amritha chala beautiful ga undi Love track chala Baga ochindi Interval block adirindi Fights too good 1st half highlight camera work and music champesaru@subbucinema 🔥👌 pic.twitter.com/1yZNKrHCwz— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024#BachhalaMalli is a rustic drama that has a very honest point at its core, but the routine/bland screenplay dilutes the soul of the film and makes it less effective. The film follows many tropes and scenes that are seen in typical rural dramas. While there are a few promising…— Venky Reviews (@venkyreviews) December 19, 2024#BachhalaMalli Although the movie has a very truthful premise, the absence of excitement in the screenplay lessens its depth and affects its overall impact. #AllariNaresh tried his best, but his efforts went in vain. #AmritaAiyer was fine. Plus:👉Allari Naresh's Performance… pic.twitter.com/ZDVBM5JUtL— Review Rowdies (@review_rowdies) December 19, 2024మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది.Watchable Film @allarinaresh Characterization Was Good Dialogue 's & Jathara Fight, Last 20 MinsHero Realisation Scene 👌👌Congratulations @subbucinema & Team.#Bachhalamalli pic.twitter.com/o9u9qXBryp— Praveen (@AlwaysPraveen7) December 19, 2024#AllariNaresh #BachhalaMalli#MaheshBabu #PrabhasBachhalaMalli Review=-Mass Parts💥OverAll=2.75/5Story=2.65/5🎶/BGM=3/5♥️Emotion=3.25/5🥹Love=2.75/5Action=2.9/5🥵1stHalf=2.8/5Interval=3/5🔥2ndHlf=2.75/5Acting=4/5-Naresh🔥Climax=2.9/5-Last 15M pic.twitter.com/iZPKEFZ0ga— Reviewer_Boss^ (@ReviewerBossu) December 19, 2024ST : #BachhalaMalli pic.twitter.com/tUPtHZvdOB— sunny 𝕏🗿 (@itssunny4545) December 19, 2024#Review మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ #Bachhalamalli సినిమా @allarinaresh Acting Peaks 💥💥Director @subbucinema 👏👏👏Heroine @Actor_Amritha Settled Performance 👌👌@Composer_Vishal Good Music Good Movie... pic.twitter.com/T4JdTR72UR— Nine Tv Entertainment (@ChitramReviews) December 19, 2024Just finished movie #BachhalaMalli 🔥@allarinaresh ee malli gadu gurtundi pothad anna ❤️@Actor_Amritha I need a girl like #Kaveri you are so good I like you so much 💞 Spcl @_amAryan so good ❤️@subbucinema you made me emotional 🥺 What a writing so depth 🔥👌Songs 👌3.5/5 pic.twitter.com/1qZvfKv4aq— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024 -
ఈ క్రిస్మస్ మనదే: ‘అల్లరి’ నరేశ్
‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్‌గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు. -
పదేళ్లు గుర్తుండిపోతుంది: ‘అల్లరి’ నరేశ్
‘‘హీరో క్యారెక్టరైజేషన్ పాజిటివా? నెగటివా? అనే విషయాలను పక్కనపెట్టి, హీరో తాలూకు కొత్త రకం ఎమోషన్స్‌ను ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరహా ఎమోషన్స్ బచ్చల మల్లి క్యారెక్టర్లో ఉంటాయి. చెప్పాలంటే... ప్రతి మనిషిలోనూ కొంత గ్రే షేడ్ ఉంటుంది. ఈ ప్రకారం ప్రతి మనిషిలోనూ బచ్చల మల్లి ఉంటాడు. ‘అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, పుష్ప’ తరహా సినిమాలను చూసి, ఆడియన్స్ ఏం మారలేదు.‘పుష్ప’ సినిమా చూసి, ఎవరూ చందనం కొట్టడానికి అడివికి వెళ్లలేదు. అలాగే ‘బచ్చల మల్లి’ క్యారెక్టర్‌ను కూడా ఎవరూ బ్యాడ్‌గా తీసుకోరని అనుకుంటున్నా. ఒకవేళ మంచి తీసుకోవాలనుకుంటే మద్యం సేవించకూడదని ఈ సినిమాలో చెప్పాం. ఈ సందేశాన్ని తీసుకోవచ్చు’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయిక. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.⇒ ‘బచ్చల మల్లి’ కథ 1990, 2005.. ఇలా రెండు కాలమానాల్లో జరుగుతుంది. ఓ ఊర్లో ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తి బచ్చల మల్లి (అల్లరి నరేశ్ పాత్ర పేరు). తనను ఎవరైనా వద్దనుకుంటే ఇక తన జీవితంలో వాళ్లు ఉండాలని కోరుకోడు. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్ పాత్ర పేరు) వచ్చిన తర్వాత అతని జీవితమే మారిపోతుంది.చెడు అలవాట్లకు దూరంగా ఉంటుంటాడు. కానీ గతంలో బచ్చల మల్లి చేసిన తప్పులు అతన్ని వెంటాడుతుంటాయి? అప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్లో హ్యుమర్ చాలా తక్కువ. మిగిలిన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బచ్చల మల్లి ఏడిపిస్తాడు... నవ్విస్తాడు. ‘గమ్యం’లో నేను చేసిన గాలి శీను పాత్రలా బచ్చల మల్లి పాత్ర కూడా పదేళ్ల పాటు ఆడియన్స్‌కి గుర్తుండిపోతుంది. ⇒ బచ్చల మల్లి ఎవరిదో ఆటోబయోగ్రఫీ అని అంటున్నారు. కానీ కాదు. దర్శకుడు సుబ్బు ఊర్లో బచ్చల మల్లి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలను తీసుకుని కథను రెడీ చేశారు. నిజమైన బచ్చల మల్లిని నేను సెట్స్‌లో కూడా కలిశాను. ఈ క్యారెక్టరైజేషన్ తాలూకు బాడీ లాంగ్వేజ్ చాలెంజింగ్‌గా అనిపించింది. నా నడకలో మూర్ఖత్వం ఉండాలని అడిగేవాడు సుబ్బు. అలాగే కొత్తగా ఏడ్వమన్నాడు. అంటే నా పాత సినిమాల ప్రభావం ఈ సినిమాపై రాకుండా సుబ్బు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే బచ్చల మల్లి వరల్డ్‌లోకి ఆడియన్స్ వెళ్తారు. తెరపై ‘అల్లరి’ నరేశ్ కనిపించడు. బచ్చల మల్లి మాత్రమే కనిపిస్తాడు. ⇒ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ దగ్గర్నుంచి నిర్మాత రాజేశ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఆయన ‘బచ్చలమల్లి’ కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యారు. ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, నటుడిగా అంత మంచి పేరు నాకు ఈ సినిమాతో వస్తుందని నిర్మాత అన్నారంటే ఆయన సినిమాకు అంత కనెక్ట్ అయ్యారు. ‘రంగస్థలం’ సినిమాకు ఓ నటుడిగా రామ్‌చరణ్‌గారికి వచ్చిన పేరులో నాకు సగం గుర్తింపు వచ్చినా చాలు. ⇒ కామెడీ నా హోమ్‌గ్రౌండ్. సీరియస్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలు చేస్తుంటాను. అయితే ఆర్గానిక్ కామెడీ రాసే రైటర్స్ తక్కువైపోయారు. కొంతమంది రైటర్స్ దర్శకులుగా బిజీ అవుతున్నారు. ‘సుడిగాడు 2’ సినిమా కోసం కథ రాస్తున్నాను. ఇందులో పాన్ ఇండియా సినిమాలపై స్పూఫ్స్ చేస్తాను. నార్త్ ఇండియా సినిమాల ప్రస్తావన కూడా ఉంటుంది. ‘జెండా’ అనే కథ ఉంది. నా ప్రస్తుత కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ కథతో సినిమా ్రపారంభిస్తాను. -
అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మూవీ HD స్టిల్స్
-
బచ్చలమల్లి హిట్ అవుతుంది: నాని
‘‘బచ్చలమల్లి’ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాని అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిచన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగాపాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసి, నరేశ్‌కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి, నాకు నేనుగా ఈ ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్లోనే సుబ్బు కథ చె΄్పాలనుకున్నాడంటే, సినిమాలో ఇంకా నిజాయతీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే’’ అన్నారు. ‘‘నాని మా ఫ్యామిలీ మెంబర్. 16 ఏళ్ల నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు నాకు కొంత టెన్షన్ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘మజ్ను’ టైమ్ నుంచి నానిగారు నాకు తెలుసు.ఆయన ఈవెంట్‌కి రావడమే ఓ బ్లాక్‌బస్టర్ కొట్టేశామనే ఫీలింగ్ కలుగుతోంది. నేను రాసిన దాన్ని నరేశ్‌గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి. ‘‘ఈ క్రిస్మస్కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. సినిమా విజయం పట్ల టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు రాజేష్ దండా. -
Bachhala Malli trailer: అల్లరి నరేశ్ ఊరమాస్ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్‌తోనే ప్రేక్షకులను మెప్పించిన నరేశ్ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత ఆసక్తి పెంచాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. -
డైరెక్టర్ ఏమీ చెప్పొద్దన్నారు
‘‘నటిగా నాకు అన్ని రకాలపాత్రలు చేయాలని ఉంది. అవకాశం వస్తే యాక్షన్ ఫిల్మ్ కూడా చేయాలని ఉంది. అయితే ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక ప్రిన్సెస్ రోల్ చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది’’ అని అన్నారు హీరోయిన్ అమృతా అయ్యర్. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ఓ మనిషికి కోపం వస్తే, ఆ కో΄ాన్ని అతను కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా ప్రభావితమవుతుంది? అన్నదే ‘బచ్చల మల్లి’ కథ. మంచి ఎమోషనల్ డ్రామా. ‘హను–మాన్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా కథ విని, ఓకే చేశాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇందులో సిటీ కల్చర్‌ని ఇష్టపడే టౌన్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అమ్మాయి. నరేష్‌గారు ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలరు. ఈ సినిమాలో స్క్రీన్‌పై ఆయన క్యారెక్టర్ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్‌లో ఆయన సాఫ్ట్. సుబ్బుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా తీశారు. రాజేష్గారితో గతంలోనే ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. ‘బచ్చల మల్లి’తో కుదిరింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ‘హను–మాన్’ సీక్వెల్లో నా రోల్ గురించి దర్శకుడు ఏమీ చెప్పొపద్దని చెప్పారు. నాపాత్ర ఉంటుందా? లేదా అనే విషయమూ చెప్పొపద్దన్నారు’’ అని తెలిపారు. -
అలాంటి పాత్రలు చేయాలని ఉంది: అమృత అయ్యర్
డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ లాంటి పాత్రలు వస్తే చేయాలని ఉంది అంటోంది ‘హను-మాన్’ ఫైం అమృత అయ్యర్. అల్లరి నరేశ్, అమృత జంటగా నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అమృత అయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ హనుమాన్ షూట్ చేస్తున్నపుడు బచ్చల మల్లి కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.→ 80లలో జరిగిఏ కథ ఇది. నాది సిటీ కల్చర్ ఉన్న టౌన్ అమ్మాయి పాత్ర. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.→ నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.→ మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది. → సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.→ ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను. -
ఆ విషయాన్ని నిజాయతీగా చెప్పాను: సుబ్బు మంగాదేవి
‘బచ్చల మల్లి’ మూవీ క్యారెక్టర్ బేస్డ్ కథ. ఇందులో తండ్రికి సంబంధించిన భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి. కరోనా టైమ్‌లో నా తల్లిని కోల్పోయాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. జీవితంలో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయొద్దనే విషయాన్ని చాలా నిజాయతీగా చెప్పాను’’ అని డైరెక్టర్ సుబ్బు మంగాదేవి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా సుబ్బు మంగాదేవి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రాజేష్ దండాగారికి నేను చెప్పిన ‘బచ్చల మల్లి’ కథ నచ్చడంతో, నరేశ్‌గారికి చెప్పమన్నారు. కథ విన్న నరేశ్‌గారు వెంటనే సినిమా చేద్దామన్నారు. ‘పుష్ప 1’లో అల్లు అర్జున్‌గారిది కూలీ పాత్ర. ఇందులో బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్‌గా చేశారు నరేశ్‌గారు.అలా ఆయన గెటప్ విషయంలో ΄ోలిక తప్ప కథ విషయంలో కాదు. ‘బచ్చల మల్లి’ కథని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నాం. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. నేను 1990లలో ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారో నాకు తెలుసు. అందుకే 1990 నేపథ్యంలో ఈ కథ చెప్పాలనుకున్నాను. బచ్చల మల్లి పాత్రకి నరేశ్‌గారు పూర్తి న్యాయం చేశారు. నా తర్వాతిప్రాజెక్ట్స్ కోసం కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి. ‘బచ్చల మల్లి’ రిలీజ్ తర్వాత వాటిపై దృష్టి పెడతాను’’ అన్నారు. -
అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.‘బచ్చల మల్లి’ సినిమాలో అల్లరి నరేశ్ లుక్ చాలా రగ్గడ్‌గా ఉంది. ఈ మూవీ టీజర్ గమనిస్తే ఆయన పాత్ర చాలా మాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. 'మందుతో పాటు అప్పడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉంది' అంటూ అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్స్ యూత్‌ను ఆకట్టుకునేలా టీజర్లో ఉన్నాయి. డిసెబర్ 20న ఈ మూవీ విడుదల కానుంది. -
అల్లరి నరేశ్ బచ్చలమల్లి.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తోన్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు.తాజాగా ఈ మూవీ నుంచి అదేనేను.. అసలు నేను అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.Good luck team ❤️#AdeNenuAsaluLenu from #BachhalaMalli beautifully captures the feeling TholiPrema. So happy to launch this soulful composition 🤗I am sure you all will like this one.▶️ https://t.co/NLtZcIlq8gA wonderful melody by @Composer_Vishal and brilliantly sung by…— thaman S (@MusicThaman) November 22, 2024 -
మీకు తెలిసినోడి కథ
‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. ‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎమ్. నాథన్. -
‘కాళీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సరికొత్తగా...
‘అల్లరి’ నరేశ్ కొత్త చిత్రానికి శ్రీకారం జరిగింది. ‘అల్లరి’ నరేశ్ హీరోగా రచయిత–దర్శకుడు మెహర్ తేజ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రుహానీ శర్మ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ఆరంభమైంది. మరో వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించ నున్నారు. ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొం దించనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, సహ–నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి. -
కాటుక కళ్లతో సైగే చేసే చిన్నది
‘మా ఊరి జాతరలో కాటుక కళ్లతో చాటుగా రమ్మని సైగే చేసే చిన్నది...’ అంటూ మొదలయ్యే ఫోక్ మెలోడీ సాంగ్ ‘బచ్చల మల్లి’ సినిమాలోనిది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘మా ఊరి జాతరలో..’ పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ మంగళవారం విడుదల చేసింది. ‘రాములోరు పేర్చిన రాళ్లు ఏరి తీయనా... ఏటి నీటి పైనే నీకు కోటే కట్టెయ్యనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. సింధూరీ విశాల్‌తో కలిసి ‘హను–మాన్’ ఫేమ్ కంపోజర్ గౌరా హరి ఈ పాటను పాడారు. ‘‘హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటారో తెలియజేసే పాట ఇది. హీరో తన భార్యకు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తానంటుండగా, అవేవీ వద్దు తనతో ఉంటే చాలు అన్నట్లుగా హీరోయిన్ చెప్పే క్రమంలో ఈ పాట వస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
డబ్బింగ్ ఆరంభం
‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ డబ్బింగ్ పనులు ఆరంభమయ్యాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై ‘సామజవరగమన, ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ‘బచ్చల మల్లి’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ మూవీలో గతంలో ఎన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నరేష్‌ని చూపించనున్నారు డైరెక్టర్ సుబ్బు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్. -
వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేశ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
బచ్చలమల్లి గ్లింప్స్: ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?
అల్లరి నరేశ్ ఇటీవల 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్టవుతుందని ఆశించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ హీరో మాస్ లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ బచ్చల మల్లి. ఇందులో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక.నేడు (జూన్ 30) అల్లరి నరేశ్ బర్త్‌డే సందర్భంగా బచ్చల మల్లి సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో.. తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేశాడు. తర్వాత ఓ సీన్లో ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? అంటూ మందు తాగి తన చుట్టూ ఉన్నవారిని చితబాదాడు. ఈ గ్లింప్స్‌లో మల్లి గడ్డం, జుట్టుపెంచుకుని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె! -
సస్పెన్స్ థ్రిల్లర్
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘రా.. రాజా’. బి. శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రా..రాజా’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.ఈ సినిమాలో నటించిన 24మంది పాత్రల ముఖాలు కనిపించవు. కృత్రిమ మేథస్సును వినియోగిస్తున్న ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి చిత్రం చేయడం ఓ కొత్త ప్రయోగమే. ఈ సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్. -
ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని చూస్తుంటాం. అయితే ఈ వారం థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయువేగం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం మరి అంత కాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు అయితే వచ్చేశాయి. వీటిలో కొన్ని ముందే ప్రకటించారు. ఓ తెలుగు మూవీ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు.(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విట్టర్ రివ్యూ)అల్లరి నరేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొన్నేళ్ల నుంచి సీరియస్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన బలమైన కామెడీ కథతో తీసిన మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కానీ కుర్రాడిగా అల్లరి నరేశ్ నటించాడు. మే 3న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మరీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ ఓ మాదిరి వసూళ్లు సాధించింది.ఇప్పుడు నెల కూడా తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా 'ఆ ఒక్కటి అడక్కు' స్ట్రీమింగ్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు. టైమ్ చూసుకుని 'ఆ ఒక్కటి అడక్కు' చూసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!) -
Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్ భార్యను చూశారా? (ఫోటోలు)
-
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్‌గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్‌గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)Silencing the hot summer with a COOL TREAT ❤️🔥#AaOkkatiAdakku collects 3.34CR Worldwide Gross in 2 days 🤘🏻And it’s DAY 2 >>> Day 1 of Laughter madness ❤️🔥https://t.co/zbg0yxIPZx#SummerFunBlockbusterAOA@allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/0wx0dSmR1C— Ramesh Bala (@rameshlaus) May 5, 2024 -
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేశ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అల్లరి నరేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్లీ కామెడీ వైపు మళ్లడంపై ఆయన స్పందించారు. నరేశ్ మాట్లాడుతూ..'అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే ఉన్నా. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించా. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి ఇలాంటి కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంటుంది' అన్నారు. చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడంపై మాట్లాడుతూ..' కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. మళ్లీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. కామెడీకి ఆదరణ ఇంకా పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా దృష్టి నటనపైనే. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుడిగాడు- 2 కోసం అడుగుతున్నారు. మనం అన్ని రకాల సినిమాలు చేయాలి. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే 'పుష్పక విమానం' లాంటి సినిమా చేయాలని ఉంది. వెంకటేశ్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేమిద్దరం కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది' అని తెలిపారు. కాగా.. ఆ ఒక్కటీ అడక్కు మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్‌కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏ క్వశ్చన్ మిమల్ని అడిగితే మీకు చీరెత్తుకొస్తుంది
-
ఈ అమ్మాయి నా మీద వేసిన జోక్ అర్థం అవ్వటానికి మూడు రోజులు పట్టింది
-
ఈ అమ్మాయి మిమిక్రితో సుమతోనే కేరింతలు కొట్టించింది
-
నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం మరి ఆయనతో పెళ్ళంటే..!
-
మేలో ఆ ఒక్కటీ అడక్కు
మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు ‘అల్లరి’ నరేశ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ పొందింది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాను: రాజేష్ దండా
‘‘మా హాస్య మూవీస్‌లో ‘ఇట్లు మారేడుమిల్లి, ఊరిపేరు భైరవకోన, సామజవరగమన’ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాను. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాను. నాకు కాంబినేషన్ కాదు.. కథే ముఖ్యం. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. సోమవారం రాజేశ్ దండా విలేకరులతో మాట్లాడుతూ–‘‘స్వామి రారా’ చిత్రంతో పంపిణీదారునిగా నా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 82 సినిమాలు రిలీజ్ చేశాను. అనిల్ సుంకరగారితో కలిసి ‘సామజవరగమన, ఊరిపేరు భైరవకోన’ వంటి చిత్రాలు నిర్మించా. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌తో తీస్తున్న ‘బచ్చలమల్లి’ 50 శాతం పూర్తయింది. అలాగే సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా ఉంది. చిరంజీవిగారి కోసం ప్రసన్నకుమార్ బెజవాడ రెడీ చేసిన కథతోనే సందీప్ కిషన్ మూవీ తీస్తున్నాం అనడంలో వాస్తవం లేదు. ఇక ఓ స్టార్ హీరోతో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నా. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. -
మళ్లీ కామెడీ వైపు అల్లరి నరేష్ చూపు.. ఆ ఒక్కటి అడక్కు
-
మరింత నవ్వించాలనే ఈ సినిమా చేశాను
‘‘నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, మా ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునే హీరో కథ నాన్నగారి సినిమాలో ఉంటుంది. మా మూవీలో జీవితంలో స్థిరపడినా పెళ్లి కాని హీరో కథ. నా బలం వినోదం. ఈసారి మరింత నవ్వించాలని ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేశాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. మల్లి అంకం దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఆరోగ్యకరమైన కామెడీ ఉన్న ఎంటర్టైనర్ ఇది. మల్లిగారు క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశారు. రాజీవ్‌గారు ΄్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘నిర్మాత కావాలన్న నా ఇరవై ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు రాజీవ్ చిలక. ‘‘ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఒక కిక్ వచ్చింది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. -
Aa Okkati Adakku Teaser Launch Event: 'ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
ఆ సినిమాతో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రానికి సంబంధం లేదు: అల్లరి నరేశ్
హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. టైటిల్ గ్లింప్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతని కంపెనీని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా చెప్పేస్తుంది. ప్లాట్‌లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు. సూర్య క్యాప్చర్ చేసిన విజువల్స్ బ్రైట్, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదాన్ని పెంచింది. చిలక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి సరిగ్గా సరిపోతుంది. నవ్వించే ఈ టీజర్ నిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ముందుగా 'ఆ ఒక్కటీ అడక్కు' గురించి ఓ వివరణ ఇవ్వాలి. నాన్నగారి 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలాంటి సీక్వెల్ కాదు. నాన్నగారి సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్ గా సినిమాని చేశాం. వింటేజ్ నరేష్ రావాలని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు చేయాలని కోరారు. చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. మంచి కంటెంట్ ఉన్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది’ అన్నారు. -
'అమ్మాయిని వదిలేసి ఆంటీ వెనక పడ్డావా?'.. ఆసక్తిగా టీజర్!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మాస్ సినిమాలు చేసిన మళ్లీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రలో నరేశ్ కనిపించనున్నారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని.. లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. దీంతో నీ పెళ్లెప్పుడు అంటూ అల్లరి నరేశ్‌ను అందరూ ఆట పట్టిస్తుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు. పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కామెడీ అందించేందుకు నరేశ్ రెడీ అయిపోయారు. టీజర్ చూస్తే నరేశ్ మరోసారి తన మార్క్ కామెడీని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. -
Theppa Samudram: మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవడు?
బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా, కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివరాత్రి సందర్భంగా తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ చూస్తే అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. చూస్తుంటే 2015 లో తెలంగాణాలో హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది. మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అయిందాక వెయిట్ చేయాల్సిందే. అల్లరి నరేష్ మాట్లాడుతూ..‘ తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
ఓహ్... మేడమ్...
నచ్చిన అమ్మాయి మనసు దోచేయడానికి ‘ఓహ్... మేడమ్...’ అంటూ పాట అందుకున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం కోసమే ఈ పాట. ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నరేశ్–ఫరియాపై చిత్రీకరించిన తొలి పాట ‘ఓహ్.. మేడమ్’ను సంగీతదర్శకుడు ఎస్ఎస్ తమన్ విడుదల చేశారు. గోపీచందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హీరోయిన్ పట్ల హీరో వ్యక్తపరిచే భావోద్వేగాల నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
Allari Naresh: రూటు మార్చిన అల్లరి నరేశ్.. అలాంటి టైటిల్‌తో మళ్లీ..!
-
పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మూవీ!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. గతేడాది ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం లాంటి మాస్ సినిమాలతో అలరించిన నరేశ్.. మళ్లీ ట్రాక్ మార్చేశాడు. ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన కామెడీ ఓరియంటెడ్ చిత్రంతో అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిలక ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆ ఒక్కటీ అడక్కు అనే టైటిల్ ఖరారు చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దోడా బయట వాళ్లందరికీ ఏం చెబుతావురా అనే డైలాగ్‌లో గ్లింప్స్ మొదలైంది. అందరూ నీ పెళ్లి ఎప్పుడని అల్లరి నరేశ్‌ను అడగడం చూస్తే.. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. గతంలో 'ఆ ఒక్కటీ అడక్కు’… అనే టైటిల్‌తో రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమా వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. 1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన మూవీ సెటైరికల్ కామెడీగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు అదే టైటిల్‌తో అల్లరి నరేశ్ రాబోతున్నారు. -
ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్ ప్రకటన
'నా సామిరంగ' అంటూ సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్ కొట్టారు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి నాగ్ కెరియర్లో మరో హిట్‌ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 -
అల్లరి నరేష్ పంచులకు నవ్వులతో దద్దరిల్లిన ఆడిటోరియం
-
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్‌తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్‌గారు డైరెక్టర్‌గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
వారి ఆనందం చూస్తుంటే తృప్తిగా ఉంది
‘‘నా సామిరంగ’ సినిమాని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, నా అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది’’ అని హీరో నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నా సామిరంగ’ థ్యాంక్స్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ–‘‘మా చిత్రం సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పం, ప్రేమతో యూనిట్ అంతా పని చేశారు.. అందుకే ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. విజయ్ బిన్నీకి గొప్ప భవిష్యత్ ఉంటుంది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్‌లు గొప్ప ప్రోత్సాహం అందించారు. ఆషికా రంగనాథ్‌కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన నటుడు నాగార్జునగారితో నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రని ఇచ్చిన శ్రీనివాసా చిట్టూరి, పవన్‌గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఈ సినిమాలో వింటేజ్ నాగార్జునగారిని చూపిస్తానని మాటిచ్చాను.. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్ బిన్నీ అన్నారు. ఆషికా రంగనాథ్, కెమెరామేన్ దాశరధి శివేంద్ర మాట్లాడారు. -
Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ
టైటిల్: నా సామిరంగ నటీనటులు: నాగార్జున అక్కినేని,అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి దర్శకత్వం: విజయ్ బిన్ని కథ: ప్రసన్నకుమార్ బెజవాడ సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి ఎడిటర్: చోటా కె. ప్రసాద్ విడుదల తేది: జనవరి 14, 2024 ‘నా సామిరంగ’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1963-88 మధ్య కాలంలో జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేళ్ల కిందట(1978) జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్)తో పెళ్లి జరిగి, పాప కూడా పుడుతుంది. ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్(రాజ్ తరుణ్)..పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురు(రుక్సార్)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు. కట్ చేస్తే..దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్ రోజ్) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్ కూడా చేతులు కలుపుతాడు.అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురితో భాస్కర్ పెళ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథ పాతదైన.. తెరపై చూస్తే బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా.. అది తెరపై కనిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమానే నా సామిరంగ. కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని కమర్శియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమాగా తీర్చిదిద్డాడు దర్శకుడు విజయ్ బిన్నీ. (చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) వాస్తవానికి ఇది పొరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్. ఆ సినిమా చూసిన వారికి తప్పా.. మిగతావారందరికి ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది. ఎక్కడ పాట పెడితే ఊపొస్తుంది.. ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి.. ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పూస్తాయి? ఇలాంటి కమర్షియల్ కొలతలు అన్ని వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఒది గొప్ప కథ.. అద్భుతంగా తీర్చి దిద్దారని చెప్పలేం కానీ.. సంక్రాంతి పండక్కి కావాల్సిన సినిమా అని చెప్పొచు. కిష్టయ్య, అంజిల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ వెంటనే పాతికేళ్ల ముందు అంటే 1963 నుంచి 1988కి వెళ్తుంది. భారీ ఫైట్ సీన్‌తో నాగార్జున ఎంట్రీ.. తర్వాత భాస్కర్ (రాజ్ తరుణ్) లవ్‌స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది. ఇక కిష్టయ్య, వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక.. ప్రేక్షకుడు కథలో లీనమై పోతాడు. వరాలు, కిష్టయ్య మధ్య జరిగే సంభాషణలు , ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ.. కథనాన్ని నడిపించారు. ఒక ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది. (చదవండి: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వరాలు, అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఊహకందేలా, సింపుల్‌గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమానే అయినా.. సంకాంత్రి వేళ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. కిష్టయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు. రొటీన్ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్ యాక్టింగ్‌తో బోర్ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్ది. అంజి పాత్రలో నరేశ్ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్, మిర్నా, రుక్సర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. (చదవండి: హను-మాన్ రివ్యూ) సాంకేతిక విషయాలకొస్తే.. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అలా అనుకుని ఉంటే శివ.. అన్నమయ్య వచ్చేవి కావు
‘‘నా సామిరంగ’ సినిమా కథలోని ప్రేమ, స్నేహం, త్యాగం, ద్వేషం వంటి నాలుగు అంశాలు నాకు బాగా నచ్చాయి. కథలో ఇవే మూల స్తంభాలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రధారులు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. ► ‘నా సామిరంగ’ సినిమా షూటింగ్ 72 రోజులు జరిగితే నా భాగం 60 రోజుల్లో పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులకు 5 నెలలు పట్టింది. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువ అవుతాయి. ప్రీప్రోడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే ఎవరికైనా ఇంత వేగంగా పూర్తి చేయడం సాధ్యపడుతుంది. పైగా కీరవాణిగారు షూటింగ్‌కి ముందే మూడు పాటలు, ఫైట్ సీక్వెన్స్‌కి నేపథ్య సంగీతం చేశారు. ఇంత వేగంగా, భారీ బడ్జెట్లో సినిమా చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం. ఇందులోని ఏడు పాటలూ అద్భుతంగా ఉంటాయి. ► మనకి సంక్రాంతి పెద్ద పండగ. పైగా ఇది 1980 నేపథ్యంలో జరిగే కథ. తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకొస్తున్నాం. ఇది పేరుకే మలయాళ రీమేక్. తెలుగు ప్రేక్షకులకు తగినట్లు కథలో మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రెడిట్ దర్శకుడు విజయ్ బిన్నీకి, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకి దక్కుతుంది. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. పాటలోనే కథని చెప్పే నేర్పు తనలో ఉంది. స్పష్టత ఉన్న దర్శకుడు.. చెప్పింది చెప్పినట్టు తీశాడు. ► ఈ సినిమాలో నా ఊతపదం నా సామిరంగ. సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు వచ్చింది. అందులో 15 నిమిషాలు కట్ చేయడానికి కష్టపడ్డాం.. ఎందుకంటే ప్రతి సీన్ ముఖ్యమైనదిగానే కనిపించింది. నా ప్రతి సినిమానీ ఎడిటింగ్ జరిగాక చూస్తా. అవసరం అనుకుంటే సలహా ఇస్తాను.. కావాలని మార్పులు చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని తక్కువ చేసినట్లవుతుంది. కథకు అవసరం కాబట్టి ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మాస్ లుక్‌లో కనిపించాను. ► ఈ చిత్రంలో కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నాకు, ఆషికాకి మధ్య 12 ఏళ్ల నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. చాలా వైవిధ్యమైన ప్రేమకథ ఇది. ఈ మూవీలో సోదర భావం ఉన్న పాత్రకు ‘అల్లరి’ నరేశ్ సరిపోతాడనిపించి తీసుకున్నాం. రాజ్ తరుణ్‌ది కీలకమైన పాత్రే. అలాగే మిర్నా, రుక్సార్ల పాత్రలూ బాగుంటాయి. ► సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో మేం అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ అప్పుడూ ఇదే సమస్య. ఆ సినిమాను 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా 300 థియేటర్లలో విడుదలవుతోంది. ► నా నూరవ సినిమా స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్‌గా చేయాలనే ఆలోచన లేదు. కెరీర్‌లోని మైలురాయి సినిమాలు స్టార్ హీరోలతో కలిసి చేయాలనుకుని ఉంటే నా నుంచి ‘శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు వచ్చేవి కావు. వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చేయడం లేదు. నాగచైతన్యకి వచ్చిన ‘దూత’ లాంటి కథ కుదిరితే చేస్తాను. నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నేను, మహేశ్‌బాబు కలసి నటించి, నాగేశ్వరరావు–కృష్ణగార్ల వారసత్వాన్ని కొనసాగించాలని గతంలో ట్వీట్ చేశాను. రాజమౌళిగారి సినిమాని మహేశ్ పూర్తి చేశాక దాని గురించి ఆలోచించాలి (నవ్వుతూ) ∙నా తర్వాతి సినిమా శేఖర్ కమ్ములగారి దర్శకత్వంలో ఉంటుంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఓ సినిమా ఉంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ‘బ్రహ్మస్త్ర 2’ మొదలు పెట్టే చాన్స్ ఉంది. -
Naa Saami Ranga Pre-Release Event: 'నా సామి రంగ' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Naa Saami Ranga Movie: ఈ స్టిల్స్ చూస్తే 'నా సామి రంగ' అనాల్సిందే (ఫొటోలు)
-
సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి
‘‘ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తే ఓ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేయవచ్చో ఈ చిత్రంతో నేర్చుకున్నాను. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్గార్లు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్‌కు రెడీ చేశాం’’ అన్నారు విజయ్ బిన్నీ. నాగార్జున హీరోగా ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా మీనన్ ఇతర కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో విజయ్ బిన్నీ పంచుకున్న విశేషాలు. ► స్నేహం ప్రధానంగా సాగే చిత్రం ‘నా సామిరంగ’. 1980–1990 నేపథ్యంలో కథ సాగుతుంది. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్గార్ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. రాజ్ తరుణ్‌ది ఓ కీలక పాత్ర. అయితే ఈ ముగ్గురి కనెక్టింగ్ పాయింట్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్గార్ల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాను. సో.. నాకు వారితో కంఫర్ట్నెస్ ఉంది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘΄పోరింజు మరియం జోస్’ సోల్‌ను మాత్రమే ‘నా సామిరంగ’ సినిమాకు తీసుకోవడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేశాం. నాగార్జునగారు ఆయన అనుభవంతో కొన్ని సలహాలు చెప్పారు. నాగార్జునగారితో ఓ కొత్త దర్శకుడికి సినిమా అంటే అదృష్టమే. అందుకే ఈ సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ► దర్శకుణ్ణి కావాలనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. కొరియోగ్రాఫర్‌గా అయితే అన్ని క్రాఫ్ట్స్‌పై గ్రిప్ ఉండే చాన్స్ ఉందని భావించి, కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాను. నేను ఓ కథతో నాగార్జునగారి దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన ‘నా సామిరంగ’ కథ చేయమని చెప్పారు.ఈ కథను ఓన్ చేసుకుని దర్శకత్వం వహించాను. కమర్షియల్ పంథాలో నా శైలిలో ఈ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించాను. సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ► నేను కొరియోగ్రాఫర్‌ని కాబట్టి నాకు మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. కీరవాణిగారిని ఏం అడిగినా, ఏదో ఒక సెన్స్‌తో అడుగుతున్నానని భావించి, సపోర్ట్ చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు. ఓ కొరియోగ్రాఫర్‌గా విభిన్న రకాల పాటలు ఎలా చేశానో, అలానే దర్శకుడిగా విభిన్న రకాల సినిమాలు చేయాలని ఉంది. -
కిష్టయ్య.. అంజి.. ఓ మంచి స్నేహం
‘‘దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం. అంజిది.. కిష్టయ్యది... వీడదీయని ఒక బంధం.. చిరునవ్వులు పూసే స్నేహం.. చిరుగాలికి ఈలల పాఠం’’ అంటూ సాగుతుంది ‘నా సామిరంగ’ సినిమాలోని ‘విజిల్ థీమ్ సాంగ్’. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాలో కిష్టయ్య పాత్రలో నాగార్జున, అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్, కుమారి పాత్రలో రుక్సార్, మంగ పాత్రలో మిర్నా మీనన్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘విజిల్ థీమ్ సాంగ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాటకు ఈ చిత్రసంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సాహిత్యం అందించగా, శాండిల్య పిసాపాటి పాడారు. -
చైనా గోడ దూకినా తప్పు లేదు...
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
కింగ్ నాగార్జున 'నా సామి రంగ ' అదిరిపోయే మూవీ స్టిల్స్
-
మా జోలికొస్తే నా సామిరంగ!
‘‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా ఉండదు.. నా సామిరంగ..’ అంటూ పాడేస్తున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలకానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘నా సామిరంగ..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ‘మా జోలికొస్తే మాకడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగ.., ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ..’ అంటూ ఫుల్ జోష్‌లో సాగే ఈ పాటలో నాగార్జునతో కలిసి ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కూడా చిందేశారు. ‘‘మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నా సామిరంగ’ రూపొందింది. ప్రధాన తారాగణంతో పాటు 300 మంది డ్యాన్సర్స్‌తో లావిష్‌గా చిత్రీకరించిన ‘నా సామిరంగ..’ పాటకు దినేష్ మాస్టర్ అందించిన నృత్యాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి. -
సెట్స్‌లో నా సామిరంగ
నా సామిరంగ... డ్యాన్స్ అంటూ సెట్స్‌లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ సెట్లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్‌లతో పాటు 300మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా, టైటిల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
ఊతకొట్టుడు కొట్టేశాడు!
‘ఏం చేస్తాన్నాడెంటి.. మీవోడు.. ’ (ఆషికా రంగనాథ్), ‘నిన్నే మావిడితోటలో ఇరవైమందిని ఊతకొట్టుడు కొట్టేశాడు (‘అల్లరి’ నరేశ్)’, ‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా..కొంచెం తగ్గమను (ఆషికా)’...అన్న డైలాగ్స్‌తో విడుదలైంది ‘నా సామిరంగ’ సినిమా టీజర్. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ‘ఏం అడగాలో దానికి తెలియదు. ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏం చేయాలో నాకు తెలియదు’ (నాగార్జున) అన్న డైలాగ్స్‌తో ఈ టీజర్ సాగుతుంది. ‘‘సినిమాలో నాగార్జునగారి గోదావరి యాస చాలా బాగుంటుంది. రొమాన్స్, స్నేహం, యాక్షన్ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి. -
బచ్చల మల్లి షురూ
‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘బచ్చల మల్లి’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమృతా అయ్యర్ కథానాయిక. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్ ఇవ్వగా, విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు మారుతి, బుచ్చిబాబు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా యునిక్ కథతో ‘బచ్చల మల్లి’ రూపొందుతోంది. 1990 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ ఇంటెన్స్ రోల్ చేస్తున్నారు. ఆయన కెరీర్లో 63వ చిత్రమిది. పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు నరేశ్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. కోట జయరామ్, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్. -
Allari Naresh: అల్లరి నరేశ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
అల్లరి నరేష్ 63వ చిత్రం 'బచ్చల మల్లి' మూవీ గ్రాండ్ ఓపెనింగ్
-
మైసూర్లో నా సామిరంగ
హీరో నాగార్జున కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైందని సమాచారం. నాగార్జున, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. -
ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా చేసిన కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ మూడోసారి లాఠీ పట్టి చేసిన ఉగ్రం మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది. నాంది తర్వాత విజయ్ కనకమేడల- నరేశ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఉగ్రం. మిర్నా మీనన్ హీరోయిన్గా నటించింది. హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. మనకు సమస్య వస్తే పోలీస్ దగ్గరకు వెళ్తాం.. అదే పోలీస్‌కు సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా పరిష్కరిస్తాడు? అనేదే కథ. అల్లరి నరేశ్ కెరీర్లో 60వ చిత్రంగా తెరకెక్కిన ఉగ్రం మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీలో రాబోతోంది. జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే అల్లరి నరేశ్ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లాతో ఓ మూవీ, సుబ్బు దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. అలాగే విజయ్ కనకమేడల డైరెక్షన్‌లోనూ మరోసారి నటించే ఆస్కారం ఉంది. చదవండి: మూడోసారి సహజీవనం.. 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు -
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న 'ఉగ్రం' టీం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఉగ్రం చిత్ర బృందం మంగళవారం దర్శించుకుంది. సినీ నటుడు అల్లరి నరేష్, నటి మీర్జామీనన్తో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. చదవండి: రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్ ఆలయ పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు అల్లరి నరేష్‌కు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఉగ్రం చిత్రం విజయవంతం కావడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు హీరో అల్లరి నరేష్ తెలిపారు. -
అల్లరి నరేష్ 3 రోజుల్లో 400 సిగరెట్లు తాగి..
-
ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేయడానికి కారణం ఏంటంటే...
-
ఇండస్ట్రీలో ఉండాలా.. వద్దా.. అని తేల్చుకొని సినిమా చేశాను
-
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి..? హిట్ అవ్వకపోతే మాత్రం
-
ఆడియన్స్ పెట్టిన కామెంట్స్ విని ఎమోషనల్ అయినా అల్లరి నరేష్
-
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
సినిమా నచ్చకపోతే డైరెక్టర్ గా తిడుతున్నారు..
-
Ugram Movie : 'ఉగ్రం' చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
డైరెక్టర్ విజయ్ కనకమేడల అతని సినిమా పై కాంఫిడెన్స్
-
నా భార్య నా బీభత్సాన్ని ఇంట్లో చాలా సార్లు చూసింది
-
అల్లరి నరేశ్ 'ఉగ్రం' ట్విటర్ రివ్యూ
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఉగ్రం కథేంటి? ఎలా ఉంది? అల్లరి నరేశ్ యాక్షన్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్లో పంచుకుంటున్నారు. నాంది తర్వాత యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. (ఇది చదవండి: సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేదు: త్రిష) ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ విశ్వరూపం చూపించాడని ట్విటర్ వేదికగా స్పందిస్తున్నారు. మరికొందరు అల్లరి నరేష్ ముఖ్యంగా క్లైమాక్స్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల అతని డైలాగ్ డెలివరీ కొన్ని మాస్ సీన్స్‌లో సింక్ కాలేదని అంటున్నారు. బీజీఎం కొన్ని సీన్స్‌లో డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందనగా.. సెకండాఫ్‌లో గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఉగ్రం అల్లరి నరేశ్ యాక్షన్ వేరే లెవెల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Ugram is pure goosebumps stuff. what a perfomence anna @allarinaresh 🔥🔥🔥. Second half 🔥🔥🔥 Fights especially climax and hizra flight 🔥🔥🔥 Cinematography 🔥🔥🔥 Bgm,🔥🔥@sahugarapati7 good production. Overall: 3.5/5 Perfect mystery drama Ugram is 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/lAovtf3tf1 — praveen Chowdary kasindala (@PKasindala) May 4, 2023 #Ugram movie review - POSITIVES: 1)@allarinaresh acting 👌👌 2) BGM 🥵🥵 3) intermission (rain fight)👍👍 4)climax🥵🥵🔥 Negatives: 1)so many drag scenes 2) love track Overall only for allari naresh performance Rating-2.5/5 Average movie pic.twitter.com/okE13flcMZ — movie_2updates (@Movie_updates2) May 4, 2023 Allan Naresh gave a good performance especially in the climax portions but for some reason his dialogue delivery is non-sync in a few mass scenes. BGM is decent in parts. Film could use some editing especially with random song placements that ruin the flow #Ugram — Venky Reviews (@venkyreviews) May 5, 2023 Vereyyyyy... Vereeyyyyy LEVEL ACTING OF ALLARI NARESH 🥵🥵🥵🥵🥵🥵🥵🥵💥🥵🥵💥🥵🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥@tollymasti #tollymasti . .#Ugram #UgramUsa #UgramReview #Allari #Ugramm @Shine_Screens #UgramOnMAY5th@allarinaresh @DirVijayK @harish_peddi @SricharanPakala @Shine_Screens — Tollymasti (@tollymasti) May 4, 2023 -
ఉగ్రం నా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది
‘‘నేను పోలీసాఫీసర్‌గా చేసిన ‘కత్తి కాంతారావు’, ‘బ్లేడ్ బాజ్జీ’ చిత్రాలు విజయాలు సాధించాయి. అయితే ఇవి కామెడీ చిత్రాలు. కాగా నేను సీరియస్ పోలీస్ పాత్ర చేసిన ‘ఉగ్రం’ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ఉగ్రం’ నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను చేసిన ఫైట్స్ నవ్వించడం కోసం... ఈ సినిమాలో ఎమోషన్ కోసం యాక్షన్ సీన్స్ చేశాను’’ అన్నారు. ‘‘నాంది’ సినిమాకు మూడురెట్ల వసూళ్లు ‘ఉగ్రం’ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది’’ ఉన్నారు విజయ్ కనకమేడల. ‘‘భారతదేశ వ్యాప్తంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ మిస్సింగ్స్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పక్కా ఆధారాలతో వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ‘ఉగ్రం’ కథ రెడీ చేశాం’’ అన్నారు రచయిత వెంకట్. కామెడీ సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. నా తర్వాతి సినిమా కామెడీ జానర్లోనే ఉంటుంది. అయితే కొందరు నాకు కామెడీ కథలు చెప్పేటప్పుడు వాళ్లకు వాళ్లే ఎగ్జయిట్ అయ్యి, నవ్వేసుకుంటున్నారు. నాకు నవ్వు రావడం లేదు. ఆడియన్స్ ఆర్గానిక్ కామెడీని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ‘కితకితలు’ సినిమా చేస్తే బాడీ షేమింగ్ అని తిడతారు. కుటుంబసమేతంగా చూసే కామెడీ సినిమాలు తీయాలన్నప్పుడు అందులో అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకూడదు. చెప్పాలంటే కామెడీ సినిమాల రైటర్స్ తగ్గిపోయారు. – ‘అల్లరి’ నరేశ్ -
అల్లరి నరేష్ తన భార్య కూతురు గురించి పొగడ్తలు
-
మహర్షితో ఆ ధైర్యం వచ్చింది
‘‘అల్లరి’తో మొదలైన నా కెరీర్లో ‘ఉగ్రం’ 60వ చిత్రం. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాను. 60 సినిమాలు చేయడం అంత సులభం కాదు.. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ ప్రయాణంలో బాపుగారు, కె. విశ్వనాథ్‌గారు వంటి లెజెండరీ దర్శకులతో పాటు, వంశీగారు, కృష్ణవంశీగార్లతో పని చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ పంచుకున్న విశేషాలు. ► మహేశ్‌బాబుగారి ‘మహర్షి’ సినిమాకి ముందు నేను చేసిన పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయి. ‘మహర్షి’లో నా పాత్ర సీరియస్‌గా, సింపతీగా ఉన్నా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఇలాంటి పాత్రల్లోనూ ఆడియన్స్ ఆదరిస్తారనే ధైర్యం నాకు కలిగింది. రచయితలకు కూడా నమ్మకం కలగడంతో నా కోసం కామెడీ కాకుండా సీరియస్‌గా ఉండే కొత్త కథలు రాయడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ‘నాంది’ హిట్ అయింది. ఇప్పుడు ‘ఉగ్రం’ తర్వాత మరిన్ని కొత్త కథలు నా కోసం రాస్తారనే నమ్మకం ఉంది. ► కామెడీ పాత్రలు చేయడం సులభం అనుకుంటారందరూ. కానీ చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏ పాత్రయినా చేయగలరు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందంగారు, ‘విడుదల’ చిత్రంలో సూరి అద్భుతంగా చేశారు. ‘ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా నాకు చెప్పడంతో జాగ్రత్తలు తీసుకొని ‘ఉగ్రం’ చేశాను. మనల్ని దర్శకుడు నమ్మితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. నన్ను క్రిష్‌గారు నమ్మడంతో ‘గమ్యం’, సముద్రఖనిగారు నమ్మడంతో ‘శంభో శివ శంభో’ వచ్చాయి. ఇప్పుడు విజయ్‌కి నాపై ఉన్న నమ్మకంతో ‘నాంది, ఉగ్రం’ వచ్చాయి. ► ‘ఉగ్రం’ ఐదేళ్ల టైమ్ లిమిట్లో జరుగుతుంది. ఎస్ఐ శిక్షణలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి, ఒక కూతురు.. ఇలా మూడు వేరియేషన్స్‌లో ఉండే శివకుమార్ పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ సీన్స్‌ని డూప్ లేకుండా చేశాను. ► మనకి సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం. అదే పోలీస్‌కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్ చేస్తాడనేది ‘ఉగ్రం’లో ఉంటుంది. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► కామెడీ, సీరియస్.. ఏదీ సేఫ్ జోనర్ కాదు. ‘సుడిగాడు, బెండు అప్పారావు, కితకితలు’ వంటి హిట్ సినిమాలు చూసినప్పుడు ‘నరేశ్ సినిమా బావుంది అన్నారు కానీ నరేశ్ కామెడీ బాగా చేశాడనలేదు’. కానీ ‘గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ చూశాక ‘నరేశ్ బాగా నటించాడు’ అన్నారు. కామెడీ చేసేవాళ్లంటే ఇండస్ట్రీలో, ఆడియన్స్‌లో ఎక్కడో చిన్న చూపు ఉంది. ఈ విషయంలో నాకెక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది. ► ‘వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు’ అని మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు చెప్పారు. నాన్నగారు చెప్పినట్లు నాకు పని తప్ప మరో ఆలోచన లేదు. ఈవీవీగారి బ్యానర్లో నాన్నగారి మార్క్ సినిమాలు చేయాలి. సరైన కథ కుదిరితే నిర్మిస్తాను. నా సోదరుడు ఆర్యన్ రాజేశ్ తనని తాను నిరూపించుకునేందుకు సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు దర్శకత్వం ఆలోచన ఉంది కానీ అందుకు టైమ్ పడుతుంది.. అయితే నేను దర్శకత్వం వహించే మూవీలో నేను నటించను. ► నా సినిమాల్లో ‘సుడిగాడు’కి సీక్వెల్ తీయొచ్చు. ఆ మూవీకి పని చేసిన అనిల్ రావిపూడి మొన్న కలసినప్పుడు ‘సుడిగాడు 2’ చేద్దామా? అన్నాడు. ‘నేను రూటు మార్చితే మళ్లీ కామెడీవైపు తీసుకెళ్తారా?’ అని సరదాగా అన్నాను. నాన్నగారి చివరి రోజుల్లో ‘అలీబాబా అరడజను దొంగలు’ మూవీకి సీక్వెల్‌గా ‘అలీబాబా డజను దొంగలు’ సినిమా చేద్దామనుకున్నాం.. కానీ, కుదరలేదు. ప్రస్తుతం నేను, ఫరియా అబ్దుల్లా ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బుగారి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. ‘జెండా’ అనే కథని కొన్నాను.. నేనే నిర్మిస్తా. అలాగే విజయ్‌తో మరో సినిమా ఉంటుంది. -
Ugram Pre Release: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే
టాలీవుడ్‌కి ఏప్రిల్ నెల అంతగా కలిసి రాలేదు. ఆ నెలలలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఒక్క విరూపాక్ష మినహా మిగతావేవి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్ చిత్రాలైతే భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక మే నెలలో అయినా సాలిడ్ హిట్ కొట్టాలని టాలీవుడ్ వేచి చూస్తుంది. ఈ నెలలో వరుస చిత్రాలు విడుదల కాబోతుంది. మరి తొలివారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేయండి. రామబాణం గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి నరేశ్ సీరియస్ ప్రయోగం ‘ఉగ్రం’ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. నరేశ్ కెరీర్లో 60వ సినిమా ఇది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సీరియస్‌గా సాగే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో మే 5న తెలుస్తుంది. ‘అరంగేట్రం’ రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది. యాద్గిరి అండ్ సన్స్ అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ‘ది కేరళ స్టోరీ’అనే సినిమా మలయాళం, హిందీలో మే 5న విడుదల కాబోతుంది. అదా శర్మ, సిద్ది ఇదాని మెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక తమిళ్లో కులసామి అనే చిన్న సినిమా మే 5న విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు\వెబ్ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ మీటర్ మూవీ (తెలుగు)- మే 5 తూ ఝూటీ మే మక్కర్ (హిందీ)- మే5 ది టేర్(ఇంగ్లీష్)- మే2 శాంక్చురీ- మే 4 యోగి(తెలుగు) మే 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కరోనా పేపర్స్(మలయాళ చిత్రం)- మే5 సాస్ బహూ ఔర్ ప్లమింగో(హిందీ)- మే 5 ఆహా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్- మే5 ఇవి కూడా చదవండి: నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్‌పై పోసాని ఫైర్ నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య -
Ugram Pre Release: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు) -
ఉగ్రం సినిమా చూసి నా కూతురు అన్న మాటకి...
-
చావో రేవో తేల్చుకుందాం అని సినిమా చేశాను.. యాక్షన్ సీన్స్ లో నరేష్ ఇరగదీశాడు
-
నా ఉగ్రరూపం చూస్తారు.. రోజూ 18గంటలు కష్టపడ్డాము: అల్లరి నరేష్
‘‘ఇప్పటి వరకూ మిమ్మల్ని (ప్రేక్షకుల్ని) కితకితలు పెట్టించాను.. మరికొన్ని సినిమాల్లో కన్నీళ్లు పెట్టించాను. కానీ, ‘ఉగ్రం’ త్రంలో నా ఉగ్రరూపం చూస్తారు. ‘నాంది’ సినిమాని ఎంత ఆదరించారో అంతకుమించి పదిరెట్లు ‘ఉగ్రం’ ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా నటింన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఉగ్రం’ నా కెరీర్లో 60వ సినిమా. ‘అల్లరి’ నుంచి ‘ఉగ్రం’ వరకూ నా జర్నీలో ఉన్న దర్శకులు, నిర్మాతలకు థ్యాంక్స్. చదవండి: నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం.. చైతన్య తల్లి ఎమోషనల్ నేను, విజయ్ ‘నాంది’ చేస్తున్నప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ, ‘ఉగ్రం’ మూవీకి అంచనాలు పెరుగుతాయి.. వాటిని కచ్చితంగా చేరుకోవాలని యూనిట్ అంతా కష్టపడ్డాం. నాకు, విజయ్‌కి సింక్ బాగా కుదిరింది. మా కమిట్మెంట్స్ అయిపోయాక మూడో సినిమా కలిసి చేస్తాం. బడ్జెట్ ఎక్కువ అవుతున్నా మా నిర్మాతలు ఎప్పుడూ చర్చ పెట్టలేదు. సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ కోసం కూడా బాగా ఖర్చు చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ మూవీ కోసం ప్రతిరోజూ దాదాపు 16 నుంచి 18 గంటలు పనిచేశాం’’అన్నారు. సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఇప్పటి వరకూ చేయని పాత్రని ‘ఉగ్రం’ సినిమాలో చేశారు. మేమంతా ఎంత థ్రిల్ అయ్యామో సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అంతే థ్రిల్ అవుతారు. ఆయన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు. హరీష్ పెద్ది మాట్లాడుతూ–‘‘విజయ్‌గారు అనుకున్నది సాధించుకునే వరకూ నిద్రపోడు.. ఎవర్నీ నిద్రపోనివ్వడు. ఆయనపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ–‘‘శ్రీచరణ్ పాకాల ఇప్పటి వరకూ కొంచెం క్లాస్ టచ్‌లో ఉన్న స్పై, థ్రిల్లర్ సినిమాలు చేశాడు. ‘ఉగ్రం’ తర్వాత ‘మనకి పోటీగా ఇంకొకడు వచ్చాడ్రా’ అంటూ మాస్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కొంచెం భయం మొదలవుతుంది.. ఇది నిజం. చదవండి: పూజాహెగ్డేకు బ్యాడ్‌టైం.. ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ ‘ఉగ్రం’ బడ్జెట్ ఎక్కువ అయినా నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం రాత్రిపూట వానలో తీసిన ఓ ఫైట్ కోసం నరేశ్‌గారు ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ఉగ్రం’ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరోలు అడివి శేష్, నిఖిల్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, దర్శకులు హరీష్ శంకర్, శివ నిర్వాణ, వశిష్ట, అనిల్ రావిపూడి, వీఐ ఆనంద్ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ సి«ద్, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, కథ, మాటల రచయితలు తూము వెంకట్, అబ్బూరి రవి పాల్గొన్నారు. -
నా కెరీర్లో మైలురాయిగా ‘ఉగ్రం’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘ఉగ్రం’ తన సినీ కెరీర్లో ఓ హైలెట్ చిత్రంగా నిలిచి పోతుందని ఆ చిత్ర హీరో అల్లరి నరేష్ స్పష్టం చేశారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఆదివారం చిత్ర యూనిట్ సందడి చేసింది. నాంది చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన చిత్రమే ఉగ్రం. అల్లరి నరేష్‌కు జతగా మిర్నా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ తన 60వ చిత్రం ఉగ్రంతో మీ ముందుకు వస్తున్నానన్నారు. నాంది సినిమాకు మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా సాగుతుందన్నారు. (చదవండి: అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్) కోవిడ్ లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసిందేనని, వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదంటూ రూపొందించిందే ఉగ్రం చిత్రమని పేర్కొన్నారు. ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నరేష్ తెలిపారు. మిస్సింగ్ కేసులు పరిష్కరించే పోలీస్ పాత్రలో నటించానని, ఇప్పటి వరకు ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. హీరోయిన్ మిర్నా మీనన్ మాట్లాడుతూ తెలుగులో ఇది తనకు రెండో చిత్రమన్నారు. అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, కెమెరామన్‌గా సిద్ వ్యవహరించారన్నారు. -
4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్.. క్షీణించిన ఆరోగ్యం
-
అప్పుడు ఉగ్రం ఆలోచన వచ్చింది
‘‘హీరోల క్యారెక్టరైజేషన్ చుట్టూ కథలు అల్లడంపై ప్రస్తుతం నాకు ఆసక్తి లేదు. నేను రాసే కథలు హీరో సెంట్రిక్‌గా ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో పెద్ద హీరోలు అవకాశం ఇస్తే అప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తానేమో. ఇప్పుడైతే ఓ అంశంతో కథను అల్లుకుని పాత్రలను సృష్టించుకుంటున్నాను. సామాజిక అంశాలకు వాణిజ్యపరమైన హంగులు జోడించి కథలు చెప్పడం నాకు ఆసక్తి’’ అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉగ్రం’. ఇందులో మీర్నా మీనన్ హీరోయిన్. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ కనకమేడల చెప్పిన విశేషాలు. ► ‘నాంది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత లాక్డౌన్ వల్ల కొంత సమయం దొరికింది. అప్పుడు ‘ఉగ్రం’ కథ రాసుకున్నాను. ప్రతిరోజూ మిస్సింగ్ వార్తలను గమనిస్తూనే ఉన్నాం. తెలంగాణ హైకోర్టు మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందనే అంశంపై కథ చేస్తే బావుంటుందనిపించి, ‘ఉగ్రం’ కధ రెడీ చేశాం. తూము వెంకట్ నా ఫ్రెండ్. కథల గురించి మేం ఇద్దరం ఆలోచిస్తూనే ఉంటాం. మా కో–ఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఐడియాల షేరింగ్ ఎలా ఉన్నా తనది కథ, నాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ క్రెడిట్ అనుకున్నాం. అలా కొనసాగుతున్నాం. ► ‘ఉగ్రం’ స్క్రిప్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. కథలో క్యారెక్టరైజేషన్ ప్రకారమే యాక్షన్ సీక్వెన్స్‌లు వస్తాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించడానికి ముందు కొంత రిహార్సల్స్ చేశాం. వీటి వల్ల నరేశ్‌గారి బాడీ లాంగ్వేజ్, ఫిట్‌గా ఉండటం వంటి అంశాలు మరింత మెరుగుపడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. మిర్నా చేసిన గత సినిమాలు చూశాను. ఆడిషన్స్‌కు పిలిచి ఆమెను ఎంపిక చేసుకున్నాం. బాగా యాక్ట్ చేశారు. ► నరేశ్‌గారు ఆల్ రౌండర్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. నా దృష్టిలో ఆయన కామెడీ హీరో కాదు. హీరోగా ఎక్కువగా కామెడీ చిత్రాలు చేశారంతే. ‘ఉగ్రం’లో ఇంటెన్స్, ఎమోషన్స్ ఉన్న పోలీసాఫీసర్‌గా ఆయన బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్, ఫ్యామిలీ, టైటిల్ ట్రాక్స్ ఉన్నాయి. అయితే ఈ పాటలు కథను డిస్ట్రబ్ చేయవు. ఈ పాటల్లో కూడా కథ కొనసాగుతుంటుంది. -
అప్పుడు భయం వేసింది
‘‘నా చిన్నతనం నుంచే నేను యాక్టర్‌ని కావాలనుకున్నాను. యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. అయితే కెరీర్‌ను స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి సూపర్ స్టార్స్‌తో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ మిర్నా మీనన్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూ΄÷ందిన చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్గా నటించారు. సాహు గార΄ాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మిర్నా మీనన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీఫెలో’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. రజనీకాంత్‌గారి ‘జైలర్’ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను. సెట్స్‌లో రజనీగారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆ మాట, నడక అన్నింటిలో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్‌తోనే పుట్టి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే నాకు ‘ఉగ్రం’కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కాలేజీ అమ్మాయిలా, గృహిణిలా, ఓ బిడ్డకు తల్లిలా పలు షేడ్స్‌లో కనిపిస్తాను. ఒకే సినిమాలో విభిన్న రకాల లుక్స్‌తో కనిపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌కు ఓ మీనింగ్ ఉంటుంది. ‘ఉగ్రం’ కోసం దాదాపు 70 రోజులు వర్క్ చేశాను. ఇందులో 55 రోజులు నైట్ షూట్ చేశాం. కంటిన్యూస్‌గా 15 రోజులు నైట్‌షూట్‌లో ΄ాల్గొన్నాను. ఓసారి బ్రేక్ లేకుండా 48 గంటలు వర్క్ చేశాను. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్లో చూసిన కారు యాక్సిడెంట్ సీన్ మేం రియల్‌గానే చేశాం. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నరేశ్‌గారికి చిన్న΄ాటి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అమీర్‌గారి డైరెక్షన్లో ఓ తమిళ సినిమా చేస్తున్నాను. మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యాను’’ అన్నారు. -
నాలుగు రోజుల్లో 500కు పైగా సిగరెట్లు తాగాను: అల్లరి నరేశ్
నాంది హిట్ తర్వాత అల్లరి నరేశ్- విజయ్ కనకమేడల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. అల్లరి నరేశ్ కెరీర్లో ఇది 60వ సినిమా. ఈ చిత్రంలో మీర్నామీనన్ కథానాయికగా నటిస్తోంది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. 'అడవిలో ఓ ఫైట్ సీన్లో స్మోక్ మిషన్లు పెట్టారు. ఒకవైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్లు పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్ తాగుతూ రమ్మంటారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్లు తాగాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది' అని చెప్పుకొచ్చాడు. కాగా వరుసగా కామెడీ సినిమాలు చేసిన నరేశ్ కొంతకాలంగా తన పంథా మార్చుకున్నాడు. కామెడీకి చెక్ పెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అందుకు నాంది చిత్రాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల ఇప్పుడు మరోసారి ఉగ్రంతో సీరియస్ సినిమా చేశాడు. మరి ఈ సినిమా నాందిని మించిన హిట్ అవుతుందేమో చూడాలి! చదవండి: నా కూతురి విషయంలో రణ్‌బీర్ భయం అదే: ఆలియా -
అల్లరి నరేశ్ కూతురిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో?
తెరపై నవ్వులు పూయించే హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేశ్. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం వెండితెరపై డిఫరెంట్ రోల్స్‌తో అలరిస్తున్నారు. హాస్య చిత్రాలతో అలరించే నరేశ్.. ప్రస్తుతం తన ఉగ్రరూపం చూపిస్తున్నారు. నాంది సినిమాతో యాక్షన్ సీక్వెన్స్‌కు నాంది పలికిన నరేశ్.. ఇప్పుడు ఉగ్రం సినిమాతో మరోసారి మాస్ లుక్ చూపించబోతున్నారు. నరేశ్ సీరియస్ రోల్లో తాజాగా నటించిన చిత్రం ఉగ్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో నరేశ్ కూతురు కూడా నటించడం విశేషం. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నరేశ్ కూతురు తన స్పీచ్‌తో అదరగొట్టింది. 'ఈ సినిమాలో చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాను. మీరు కచ్చితంగా సినిమా చూడాలి. ఐ లవ్ యూ డాడీ. నాకు అవకాశమిచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్స్.' అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది. చివర్లో నువ్వు ఏమవుతావు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. నేను పెద్దయ్యాక సమంత అవుతానంటూ క్యూట్‌గా ఆన్సరిచ్చింది. అంతే కాకుండా స్టేజ్‌పైనే ఓ పాట కూడా పాడి అందరినీ అలరించింది'. అల్లరి నరేశ్ కూతురు మాటలకు వేదికపై ఉన్నవారంతా ఫిదా అయ్యారు. -
Ugram Movie: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
Ugram Movie: అల్లరి నరేశ్ ‘ఉగ్రం’మూవీ స్టిల్స్ (ఫొటోలు) -
మీరు ఎంత ఊహించుకున్నా దానికి 10 రెట్లు ఉంటుంది ఉగ్రం
-
‘మిస్సయిన 1.5 లక్షలమంది ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు’
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మీర్నామీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఖమ్మంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీసు పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో అలరించనున్నారు. ట్రైలర్ చివర్లో 'ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.' డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్‌కి, దేవరి అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సిద్.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించారు. (ఇది చదవండి: రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!) ఈవెంట్లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్లో 60వ సినిమా. మహర్షిలో నేను పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్లో ఓ సినిమా చేద్దామన్నారు దర్శకుడు విజయ్. అలానే నాందిని తెరకెక్కించాం. మంచి విజయం సాధించింది. మళ్లీ ఉగ్రం సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రం నాందికి మించి ఉంటుంది. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా తీస్తున్నప్పుడు లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసింది. వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు.' అంటూ ఎమోషనలయ్యారు. -
ఆర్టీఏలో అల్లరి నరేష్
హైదరాబాద్: సినీ నటుడు అల్లరి నరేష్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ మోటారు వాహన నిబంధనల మేరకు వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అల్లరి నరేష్ తన ఖరీదైన కొత్త కియా ఈవీ–6 బ్యాటరీ కారు కోసం ప్రత్యేక నంబర్‌ను సొంతం చేసుకున్నారు. టీఎస్ 09 జీబీ 2799 నంబర్ కోసం ఆయన ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.94,899 చెల్లించి నంబర్ దక్కించుకున్నారు. -
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
యాంకర్ సుమ అరెస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్‌లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట. CI Shiva Kumar on duty! Your favourite anchor is in my control. The #Ugram begins. Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN — Allari Naresh (@allarinaresh) April 12, 2023 -
ఉగ్రం.. అల్బెలా అల్బెలా సాంగ్ విన్నారా?
హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబోలో రెండోసారి రూపొందిన మూవీ ‘ఉగ్రం’. ఇందులో మీర్నా మీనన్ హీరోయిన్గా నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అల్బెలా అల్బెలా..’ అనే పాట వీడియో సాంగ్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. ‘అల్బెలా అల్బెలా బిలా హల్చల్ చేద్దాం క్రేజీగా... టెన్షన్‌కు బ్రేక్ ఇద్దాం పదా..’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా, రేవంత్, శ్రావణ భార్గవి పాడారు. ఈ సినిమాకు సిద్ కెమెరామన్‌గా వ్యవహరించాడు. Our @allarinaresh coming back with #Naandi combination again. Happy to launch this lovely song from #Ugram! 🤗🤍#AlbelaAlbela out now! - https://t.co/xHTV3TX1x8@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/O9bEiIDElC — Nani (@NameisNani) April 9, 2023 -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్‌కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్‌గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్‌గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్‌ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్‌లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్‌తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్‌గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
వేసవిలో వచ్చేస్తున్న అల్లరి నరేష్ 'ఉగ్రం'
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ఉగ్రం. మీర్నామీనన్ హీరోయిన్. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. ఇప్పటికీ రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్‌కి, దేవరి.. అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల I have won your hearts over many summers, but this summer you will witness my UGRA ROOPAM ❤️🔥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/KwciqBmgkW — Allari Naresh (@allarinaresh) April 3, 2023 -
Allari Naresh: అల్లరి నరేశ్ 61వ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం ( ఫొటోలు)
-
నాందిలా ఉగ్రంని హిట్ చేయాలి
‘‘ఉగ్రం’ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సాహు, హరీష్గార్లకు థ్యాంక్స్. నా కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. వేసవిలో మీ ముందుకు వస్తోంది. విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాంది’ మూవీని హిట్ చేసినట్టు ‘ఉగ్రం’ని కూడా పెద్ద హిట్ చేయాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేష్ అన్నారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్, మీర్నా మీనన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దేవేరి..’ అంటూ సాగే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘నరేష్‌గారి కెరీర్లో ‘ఉగ్రం’ మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో మీర్నా మీనన్, శ్రీచరణ్ పాకాల, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్. -
నాగార్జున, అల్లరి నరేష్ మల్టీస్టారర్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్
-
ఉగ్రం టీజర్ అదిరిపోయింది
‘‘ఉగ్రం’ సినిమా టీజర్ అదిరిపోయింది.. నెక్ట్స్ లెవల్లో ఉందనిపించింది. ‘నాంది’ తర్వాత నరేష్ మళ్లీ అలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో నాగచైతన్య అన్నారు. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ‘అల్లరి’ నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని నాగచైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నరేష్ , విజయ్ కాంబినేషన్ ఒక బ్రాండ్లా ఉంది. సాహు, హరీష్ అద్భుతమైన నిర్మాతలు. నా కెరీర్లో ‘మజిలీ’ వంటి మంచి సినిమా ఇచ్చారు వారు. ఆ సినిమాలా ‘ఉగ్రం’ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. నరేష్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుణ్ణి దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు (ఈవీవీ సత్యనారాయణ) నన్ను నమ్మినప్పుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్‌గారు నన్ను నమ్మినప్పుడు ‘గమ్యం’, సముద్రఖని నమ్మినప్పుడు ‘శంభో శివ శంభో’ వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత ‘నాంది’తో విజయ్ నాకు కొత్త రూటు చూపించారు’’ అన్నారు. ‘‘నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘నాంది’ విజయం చూపించింది.. ‘ఉగ్రం’ కూడా అంతే నిజాయితీగా ఉంటుంది’’ అన్నారు విజయ్ కనకమేడల. -
అల్లరి నరేశ్ 'ఉగ్రం' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ
టైటిల్: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నటీనటులు: ‘అల్లరి’ నరేశ్, ఆనంది, వెన్నెల కిశోర్, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండు సమర్పణ: జీ స్టూడియోస్ దర్శకుడు: ఏఆర్ మోహన్ సంగీతం: సాయి చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్ ఎడిటర్: రామ్ రెడ్డి విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేంటంటే.. శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా అభివృద్దికి నోచుకొని తండా అది. అక్కడ చదువుకోవడానికి బడి లేదు. అనారోగ్యం పాలైతే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. పట్టణం వెళ్లడానికి సరైన దారి లేదు. పాఠశాల, ఆస్పత్రితో పాటు నదిపై వంతెన కట్టించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే వాళ్లు ఓటేయడానికి నిరాకరిస్తారు. కానీ శ్రీనివాస్ చేసిన ఓ పనికి మెచ్చి అతని కోసం ఓట్లు వేస్తారు. వందశాతం పోలింగ్ జరుగుతుంది. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పట్టణాలకు దూరంగా నివసించే తండా వాసుల కష్టాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. వాళ్లకు సరైన సదుపాయాలు ఉండవు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా ఉండవు. తమ సమస్యలను తీరుస్తేనే ఓటు వేస్తామంటూ ధర్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటలనే కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఏఆర్ మోహన్. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగడం కాస్త మైనస్. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎన్నికల చుట్టే కథ సాగుతుంది. తండావాసులు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయానికి శ్రినివాస్ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకొని చలించిపోవడం.. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్‌ల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం తండావాసుల దగ్గర బంధీలుగా ఉన్న అధికారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కథనం రోటీన్‌గా సాగినా.. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' లాంటి అద్భుతమైన సంభాషణలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. నరేశ్ చేసిన మరో మంచి అటెంప్ట్‌గా మాత్రం నిలుస్తుంది. ఎవరెలా చేశారంటే.. కామెడీనే కాదు సీరియస్ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించే నటుల్లో నరేశ్ ఒకరు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో నరేశ్ది పూర్తి సిరియస్ రోల్. తెలుగు భాషా ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఇలాంటి పాత్ర కొత్తేమి కాదు. ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబుల కామెడీ బాగా పండింది. తండా వాసి కండాగా శ్రీతేజ్, ఊరి పెద్దమనిషి ‘పెద్ద’ కుమనన్ సేతురామన్‌లతో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రల పరిధిమేర నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చోటా కె. ప్రసాద్ కెమెరా పనితీరు బాగుంది. అడవి అందాలను అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నమ్మకం ఉంది
‘‘మన చుట్టుపక్కల జరిగే కథే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఓ నిజాయితీ సినిమా. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు కొత్త ప్రయత్నంగా మేం చేసిన ‘మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘నాంది’ సినిమాతో నిర్మాత సతీష్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ‘ఇట్లు మారేడు...’తో రాజేష్‌గారికి అంత మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన తర్వాత మాటల రచయిత అబ్బూరి రవి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. చివరి 20 నిమిషాలు సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘వినోదం, హాస్యం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ఏఆర్ మోహన్. ‘‘స్వామి రారా’తో డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 75 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం అయినప్పటికీ ఒత్తిడి అనిపించలేదు’’ అన్నారు రాజేష్. ‘‘ఈ సినిమాలో నేను రాసినవి మాటలు కాదు.. ఆ పాత్రల తాలూకు భావాలు. అలాగే ఈ సినిమాకు ఓ లిరిసిస్ట్‌లా ఓ పాట రాసి, సింగర్‌గా పాడటం సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. ఓ బాధ్యతగల పౌరుడిగా ఎన్నికలప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. సకాలంలో పన్నులు చెల్లిస్తున్నాను. ఇక రాజకీయలపై నాకు అంతగా ఆసక్తిలేదు. నాది చాలా సున్నితమైన మనసు. నాలాంటి వారు రాజకీయాలకు పనికి రారు. భవిష్యత్‌లో దర్శకుడిని అవుతాను కానీ పొలిటీషియన్ని కాను. – ‘అల్లరి’ నరేశ్ -
రాజకీయాల్లోకి అల్లరి నరేశ్? క్లారిటీ ఇచ్చిన హీరో
అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా తర్వాత అల్లరి నరేశ్ నుంచి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ చిత్రమిది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఇక రేపు(నవంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇల్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ టీం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ రాజకియాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అల్లరి నరేశ్ స్పందిస్తూ.. ‘రాజకీయాలు నాకు తెలియవు. అసలు నాకు ఇంట్రస్ట్ లేని సబ్జెక్టు అది. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోగా సక్సెస్ అయితే చాలు అనుకున్న. నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు రాజకీయాలు పనికి రావు. అయితే దర్శకుడు అవుతాను. కానీ, రాజకీయ నాయకుడ్ని మాత్రం అవ్వను’ అంటూ తెల్చిచెప్పాడు. చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి -
అలాంటి టైంలో కూడా ఆనంది షూటింగ్ చేసింది : అల్లరి నరేష్
అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు తనని బాగా నటించావ్ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అందంగా ఉన్నావ్ అని అంటుంటే సిగ్గేస్తుంది. నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి థాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. ఇక ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా చేసింది. షూటింగ్ సమయానికి ఆమె బేబీకి బర్త్ ఇచ్చిన మూడో నెల. అయినా సరే కష్టపడి సినిమాను చేశారు.ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమాని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్.ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. -
పాఠం చెబుతాం.. దారిలో పెడతాం...
చదువుకోవడానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్లే క్లాస్‌లో డిఫరెంట్ మైండ్‌సెట్‌తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ పాఠాలు చెప్పడంతో పాటు దారిలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లదే. ఇలా స్టూడెంట్స్‌ను దారిలో పెట్టేందుకు కొందరు స్టార్స్ కాలేజీలకు వెళ్తున్నారు. మరి.. ఈ లెక్చరర్లు ఏ విధంగా పాఠాలు చెప్పారనేది మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించేందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓ మాస్టారు. ఈ మాస్టారు ఎవరో కాదు.. ధనుశ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుశ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ (తమిళంలో ‘వాతి’) అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విద్యావ్యవస్థలోని లోపాలను సరి చేయాలనుకునే మాస్టారుగా కనిపిస్తారు ధనుశ్. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక మారేడుమిల్లి ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు మాస్టారుగా నడుం బిగించారు ‘అల్లరి’ నరేశ్. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇందులో ఆనంది హీరోయిన్. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ టీచర్‌గా కనిపించనున్నారు. ఓ ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లి, అక్కడి ప్రజల ఇక్కట్లను పరిష్కరించి, వారు ఎన్నికల్లో పాల్గొనే విధంగా కష్టపడే టీచర్‌గా ‘అల్లరి’ నరేశ్ పాత్ర ఉంటుందని తెలిసింది. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతున్నారు. ఇది ‘విడుదలై’ సినిమా కోసం. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సూరి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు విజయ్ సేతుపతి. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఉపాధ్యాయులందరూ బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతుంటే ఉపాధ్యాయురాలు మాత్రం గ్రౌండ్లో క్లాసులు తీసుకుంటున్నారు. అమలా పాల్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘ది టీచర్’. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పాత్రలో కనిపించనున్నారు అమలా పాల్. ఈ సినిమాను డిసెంబరు 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక మ్యూజిక్ స్కూల్లో టీచర్స్‌గా చేరారు శ్రియ, శర్మాన్ జోషి. ఈ ఇద్దరూ ప్రధాన తారలుగా పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. విద్యా వ్యవస్థలో చదువుతో పాటు స్పోర్ట్స్, సంగీతం వంటివి కూడా ముఖ్యమని చెప్పే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో టీచర్ మేరి పాత్రను శ్రియ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే హిందీలో పాఠాలు చెబుతున్నారు హీరోయిన్లు రాధికా మదన్, నిమ్రత్ కౌర్. హిందీ చిత్రం ‘హ్యాపీ టీచర్స్ డే’లో ఈ ఇద్దరు టీచర్లుగా నటిస్తున్నారు. మిఖిల్ ముసలే ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే ఏడాది టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇద్దరు హీరోయిన్లు నన్ను అవమానించారు: గీతా సింగ్
కితకితలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది గీతా సింగ్. లావుగా ఉన్నా కూడా హీరోయిన్గా చేయొచ్చని నిరూపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ఆమెను కితకితలు గీతాసింగ్‌గానే గుర్తు చేసుకుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేదు అనుభవాలను పంచుకుంది. ఓ ఇద్దరు హీరోయిన్స్ తనను అందరిముందు అవమానించారని తెలిపింది. 'అల్లరి నరేశ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాను. షూటింగ్ గ్యాప్‌లో క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వారు నన్ను చూసి ఏంటి? ఈమె క్యారవాన్ ఎక్కింది, జూనియర్ ఆర్టిస్ట్ అని చులకనగా మాట్లాడారు. అప్పుడు మిగతా నటులు నిన్ను ఇలా అంటున్నారేంటి అని అడిగారు. వారికేదో తెలియక అలా అంటున్నారులే అని క్యారవాన్ దిగి లొకేషన్లో ఓ చోటున కూర్చున్నా. ఈ విషయం తెలిసి అల్లరి నరేశ్.. నన్ను హీరోయిన్స్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈమె నా ఫస్ట్ హీరోయిన్, తన నుంచే నాకు బ్రేక్ వచ్చింది అని చెప్పాడు. దీంతో ఆ హీరోయిన్స్ అప్పటినుంచి నన్ను మేడమ్ అని పిలవడం ప్రారంభించారు. నరేశ్‌కు తన గురించి బాంబే హీరోయిన్స్ దగ్గర చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పారు. అదే ఆయనకు ఉన్న గొప్ప లక్షణం' అని చెప్పుకొచ్చింది గీతా సింగ్. చదవండి: తండ్రిని ఇష్టపడని టబు, ఎందుకంటే? -
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈనెల 11న ఈ సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అల్లరి నరేష్ షేర్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. వెన్నల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. A New GO has been passed! 📜 The Elections will be held at your Nearest Theatres on NOV 25th! 💥 - #ItluMaredumilliPrajaneekam#IMP #IMPonNov25th ✅@allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/5KvEOknyTW — Allari Naresh (@allarinaresh) November 5, 2022 -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన నితిన్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అనే సాంగ్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. -
అల్లరి నరేశ్ మూవీ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఆరోజే..!
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని 'లచ్చిమి' అనే సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. -
హీరోలకి బ్లాక్ కలర్ పులుముతున్న డైరెక్టర్స్!
క్యారెక్టర్ కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు కొందరు హీరోలు ‘నల్ల’గా మారిపోయారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు బ్లాక్ మేకప్‌తో కనిపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ లుక్ అంటూ విడుదలైన ఆ పోస్టర్లను చూసి, అభిమానులు ‘బ్లాక్.. కిర్రాక్’ అంటున్నారు. డిఫరెంట్ మేకప్‌తో కొందరు హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ కటౌట్‌కి ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బ్లాక్ కలర్ పులిమారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ సినిమా కోసమే ప్రభాస్ బ్లాక్ మేకప్ వేసుకున్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. రెండు పోస్టర్స్‌లో బ్లాక్ కలర్ నిండుగా ఉంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘సలార్’ సినిమా షూటింగ్ జరిగింది. సో.. ప్రభాస్ బ్లాక్ లుక్స్‌కు కథే కారణమని ఊహించ వచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ► ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లో నల్లని మేకప్‌లో ఎన్టీఆర్ ఫెరోషియస్‌గా కనిపించారు. ఇక హీరోగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమా ఆరంభమవుతుంది. ► హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో నాని ఫుల్ బ్లాక్ లుక్‌లో కనిపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సో.. ‘దసరా’ ఫస్ట్ లుక్ అలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ► కామెడీ హీరోగా, వీలైనప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ‘అల్లరి’ నరేశ్. కాగా 2021లో ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్ కనకమేడల మరో ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో ఫుల్‌గా మసి పూసుకుని ఉన్నారు నరేశ్. -
‘అల్లరి’ నరేశ్.. ఉగ్రం ఆరంభం
‘నాంది’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమా ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తూము వెంకట్ కథ అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతదర్శకత్వం వహిస్తుండగా, సిధ్ కెమెరామేన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ హీరోయిన్ను పరిచయం చేసిన మూవీ టీం
హిట్ ఫిల్మ్ ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఇందులో మిర్నా మీనన్ కథానాయికగా నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తూము వెంకట్ కథను అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిద్. -
అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రారంభం
హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో వచ్చిన ‘నాంది’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో తాజాగా ‘ఉగ్రం’ సినిమా షురూ అయింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ‘‘న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిధ్. -
అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ ప్రారంభం (ఫొటోలు)
-
‘బుజ్జి ఇలా రా’ ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లరి నరేశ్
సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా చాందినీ అయ్యంగార్ హీరోయిన్గా నటింన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందింన ఈ త్రానికి ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. రపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వర రెడ్డిగారు నాకు ‘సీమశాస్త్రి, సీమటపాకాయ్’ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. అంజి కెమెరామేన్ అవ్వకముందే నాకు తెలుసు. అంతమంచి టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందిం, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖ్చతంగా ఈ సినివ టెక్నీషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అందించి, దర్శకత్వంలో సహాయంగా ఉండటం ఖచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనడానికి నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది సీరియస్ రోల్’’ అన్నారు ధన్‌రాజ్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది’’ అన్నారు ‘గరుడవేగ’ అంజి. ‘‘ఈ సినిమా ఆడకపోతే నా స్నేహితులు నాగిరెడ్డి, జగదీశ్, సంజీవ్ రెడ్డి నష్టపోతారు.. కాబట్టి ఆదరించండి’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘మా సినిమాని థియేటర్లోనే చూడాలి’’ అన్నారు నాగిరెడ్డి, సంజీవరెడ్డి. -
ముంచంగిపుట్టులో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ టీం సందడి
సాక్షి, ముంచంగిపుట్టు: మండలంలో సుజనకోట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డ ఒడ్డున ఆదివారం సినిమా షూటింగ్ సందడి వాతావరణం నెలకొంది. జీ స్టూడియో సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లుగా అల్లరి నరేశ్, జాంబిరెడ్డి ఫేమ్ హీరోయిన్ ఆనంది, కమెడియన్లుగా వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్‌రాజ్ నటిస్తున్నారు. ఇక్కడ మత్స్యగెడ్డ ఒడ్డున వీరి మధ్య ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ఈ షూటింగ్ విషయం తెలుసుకున్న ముంచంగిపుట్టు మండలంలో పలు గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో లకేయిపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతం జన సందడి నెలకొంది. షూటింగ్ దగ్గరకు వీరిని రానివ్వకుండా అక్కడ సిబ్బంది నిలువరించారు. రెండు రోజులపాటు మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తామని డెరెక్టర్ తెలిపారు. చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి! రజినీకాంత్‌కు ఆదాయ పన్నుశాఖ అవార్డు -
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. టీజర్ చూశారా?
నాంది సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు అల్లరి నరేశ్. ప్రస్తుతం అతడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్నాడు. నరేశ్‌కు ఇది 59వ చిత్రం. ఈ మూవీలో ఆనంది హీరోయిన్. గురువారం (జూన్ 30న) అల్లరి నరేశ్ బర్త్‌డేను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా నటించాడు హీరో. సాయం సేత్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు, మీరు మనుషులైతే సాయం సేయండి అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు వారికున్న సమస్య ఏంటి? ఏ సమస్య గురించి నరేశ్ పోరాడుతున్నాడు? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. On my special day,a special something for all of you 😊https://t.co/gbt9OqkSKd#ItluMaredumilliPrajaneekam #IMP @kayal_anandhi @zeestudiosofficial @hasyamovies @lemonsprasad @rajdanda @vennelakish @balajigutta @abburiravi @sricharanpakala @raam_dop @chotakprasad @brahmakadali — Allari Naresh (@allarinaresh) June 30, 2022 చదవండి: ప్రస్తుతం నేను ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా పృథ్వీరాజ్ సినిమాకు కోట్లల్లో ఓటీటీ డీల్.. -
నాంది డైరెక్టర్‌తో వన్స్‌మోర్ అంటున్న అల్లరి నరేశ్
నాంది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో అల్లరి నరేశ్. తాజాగా అతడు 60వ సినిమా మొదలుపెట్టాడు. తనకు భారీ విజయం అందించిన నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలకే మరోసారి అవకాశం ఇచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. నరేశ్- విజయ్‌ల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఇందులో సంకెళ్లు ఉన్న రెండు చేతులు గోడపై స్వేచ్ఛను కోరుతున్న పక్షిలా కనిపించేలా డిజైన్ చేశారు. షాడో ఆఫ్ హోప్ (ఆశ యొక్క నీడ) అంటూ దీన్ని అల్లరి నరేశ్ ట్వీట్ చేశాడు. ఇకపోతే అల్లరి నరేశ్ ప్రస్తుతం మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! My 60th and our 2nd together…#ShadowOfHope @vijaykkrishna @sahugarapati7 @harish_peddi @Shine_Screens #NareshVijay2 pic.twitter.com/9eZ6RtBgPS — Allari Naresh (@allarinaresh) June 27, 2022 Wait for it…. @12.07pm today. @vijaykkrishna @sahugarapati7 @Shine_Screens pic.twitter.com/tw4Aio3bVC — Allari Naresh (@allarinaresh) June 27, 2022 చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్ -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
అడవిలో వేటకు దిగారు హీరోలు.. ఒకరి వేట అక్రమార్కులను అంతం చేయడం కోసం.. ఒకరి వేట స్మగ్లింగ్ చేయడం కోసం.. ఎవరి వేట ఏదైనా అంతిమంగా బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసమే. కొందరు తెలుగు హీరోలు, దర్శకులు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంలో కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య ‘అడవి’ సినిమాలు కొన్ని వచ్చాయి. ఇక రానున్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్– దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ ఫుల్ మాస్ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ రెచ్చిపోయి నటించారు. ‘పుష్ప: ది రైజ్’ ఇచ్చిన విజయంతో మరింత జోష్‌తో ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్’పై ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్, సుకుమార్. ‘పుష్ప: ది రైజ్’ అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగినట్లే ‘పుష్ప: ది రూల్’ కూడా అడవి బ్యాక్‌డ్రాపే. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ‘విరాటపర్వం’ కోసం వెండితెర విప్లవకారుడు రవన్న అవతారం ఎత్తారు హీరో రానా. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవలి కాలంలో మారేడుమిల్లి ఫారెస్ట్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారట ‘అల్లరి’ నరేశ్. ఎందుకంటే... ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కోసం. అడవిలో నివాసం ఉండే ఓ ఆదివాసీ తెగ సమస్యలను పరిష్కరించే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమా కథనం కూడా అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘సింబా’ చిత్రం కోసం ఫారెస్ట్మేన్గా మారిపోయారు జగపతిబాబు. దర్శకుడు సంపత్ నంది కథ అందిచడంతో పాటు ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తారు జగపతిబాబు. పర్యావరణ అంశాల నేపథ్యంలో సినిమా కాబట్టి ‘సింబా’ మేజర్ షూటింగ్ అడవి బ్యాక్ డ్రాప్లో ఉంటుందనుకోవచ్చు. అలాగే దివంగత నటుడు హరనాథ్ మనవడు విరాట్‌రాజ్ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, చిత్రాలు కూడా అడవి నేపథ్యంతో కూడుకున్నవే. రాబోయే రోజుల్లో మరికొన్ని అడవి కథలు వెండితెర పైకి రానున్నాయి. అడవి బాటలోనే మహేశ్-రాజమౌళి సినిమా కూడా: హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కథ అందిస్తున్న రచయిత విజయేంద్రప్రసాద్ సైతం మహేశ్ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. -
ఇట్లు... ప్రజానీకం
అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెండితెరపై పోరాడుతున్నారు ‘అల్లరి’ నరేశ్. అది ఏ సమస్య? ఆ సమస్యకు ఎలా పరిష్కారం లభించింది? అనే విషయాలను సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘నాంది’ తర్వాత ‘అల్లరి’ నరేశ్ హీరోగా చేస్తోన్న మరో చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. రాజేష్ దండు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకుడు. మంగళవారం (మే 10) ‘అల్లరి’ నరేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్ కామెడీని పక్కనపెట్టి తొలిసారి సీరియస్ రోల్ పోషించారాయన. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో మరో సీరియస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’అనే సినిమాను చేస్తున్నారు. అల్లరి నరేష్ సినీ కెరీర్‌ను ప్రారంభించి 20ఏళ్లు పూర్తయిన సంర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఏఆర్ రాజమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హర్ష మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. #Naresh59 #ItluMaredumilliPrajaneekam #IMP @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/oIPsid6p6H — Allari Naresh (@allarinaresh) May 10, 2022 -
ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు
‘‘హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నరేశ్ హీరోగా పరిచయమైన ‘అల్లరి’ రిలీజ్ అయి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. నటుడిగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ సినిమా షూటింగ్ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్ చేసి, ఫోటోషూట్ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్ అన్నారు. ‘నరేశ్ కొత్తవాడు, దర్శకుడిగా నువ్వు కొత్తవాడివే. ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోతో వెళితే బెటర్ ఏమో’ అన్నట్లుగా నాన్నగారు (ప్రముఖ దర్శక– నిర్మాత ఈవీవీ సత్యానారాయణ) కూడా చెప్పారు. కానీ రవిగారు నాపై నమ్మకంతో సినిమాను స్టార్ట్ చేశారు. అలా అక్కడి నుంచి ఈదర పోయి అల్లరి స్టార్ట్ అయ్యింది. నా 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. ► కెరీర్ మధ్యలో ‘నేను’, ‘ప్రాణం’ వంటి సీరియస్ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ‘నేను’ చూసి, దర్శకుడు క్రిష్ ‘గమ్యం’లోని గాలి శీను క్యారెక్టర్‌కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు ‘శంభో శివ శంభో’ సినిమా చేసే అవకాశం వచ్చింది. గమ్యం, శంభో శివ శంభోలో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల ‘మహర్షి’లో చేసే చాన్స్ వచ్చింది. ► నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వస్తున్నాయని చాలా మంది అన్నారు. నిజానికి ‘గమ్యం’ సినిమా నేను ఒప్పుకున్నదే. నాన్నగారు ఈ సినిమా చూశాక ‘‘కథగా చెప్పి ఉంటే ఈ సినిమా చేయవద్దనేవాడిని. బాగా చేశావ్. నీకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్లో ఫ్లాప్స్ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్స్ కాలేదని అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను చేసిన ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్ సాధించాయి. అయితే గత కొంతకాలంగా నాకు సరైన హిట్ రాలేదు. నాన్నగారిని ఓ దర్శకుడిగా కన్నా కూడా నేను ఓ ఫాదర్‌గా బాగా మిస్ అయ్యాను. ‘నాంది’(2021) సినిమా హిట్ సాధించినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ► ‘మహర్షి’ తర్వాత ‘ఇక నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు’ అని ఓ ప్రొడ్యూసర్ అన్నారు. ‘నాంది’ హిట్ తర్వాత ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్‌ని ఎవరూ డిసైడ్ చేయలేరు. ► ప్రస్తుతం ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాను. మరో మూడు కథలను ఓకే చేశాను. నాకు ‘నాంది’తో హిట్ ఇచ్చిన విజయ్‌తో మరో సినిమా చేస్తాను. -
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్‌కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో అల్లరి నరేష్ కొత్త సినిమా..
'నాంది' సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న “సభకు నమస్కారం” చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక రీసెంట్గా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నరేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం క్రేజీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమా ఇది. దీనికి “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నరేష్‌కి జోడీగా శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది నటిస్తుంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రలు పోషించనున్నారు. On this auspicious Sri Rama Navami, blessed to share with you the title of my next #ItluMaredumilliPrajaneekam #Naresh59 #IMP @raajmohan73 🎬@anandhiactress @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @vennelakishore @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/Pu1uHvA2FL — Allari Naresh (@allarinaresh) April 10, 2022 -
అల్లరి 59 షురూ
ఓ వైపు వినోదం.. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షురూ అయింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నరేశ్ నటిస్తున్న 59వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ గుత్త. -
సినీ గోయర్స్ అవార్డుల ప్రదానం
మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సినీ గోయర్స్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ రంగంపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. సినీ రంగం ద్వారా మంచి విషయాలను సమాజానికి త్వరితగతిన తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌ను ఇచ్చారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, నటులు అల్లరి నరేశ్, నాని, ప్రకాశ్‌రాజ్, జయప్రద, ఫైట్ మాస్టర్ రామ్‌లక్ష్మణ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘సభకు నమస్కారం’
‘అల్లరి’ నరేశ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఇవి సినిమా పాలిటిక్స్. రాజకీయాల నేపథ్యంలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సభకు నమస్కారం’ గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్ మల్లంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘అల్లరి’ నరేశ్ కుమార్తె బేబీ అయాన క్లాప్ ఇచ్చింది. ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ కలసి స్క్రిప్ట్‌ను చిత్రదర్శకుడు సతీశ్ మల్లంపాటికి అందించారు. ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 58వ చిత్రం ఇది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇలాంటి జోనర్లో నరేశ్ సినిమా చేయడం ఇదే తొలిసారి’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
దుర్గమ్మ సన్నిధిలో అల్లరి నరేశ్ దంపతులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు అల్లరి నరేష్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు. -
'సభకు నమస్కారం' అంటోన్న అల్లరి నరేశ్!
Sabhaku Namaskaram: హీరో నరేశ్.. తనను కెరీర్‌పరంగా ఓ మెట్టు ఎక్కించిన అల్లరి సినిమాను తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అలా అప్పటి నుంచి ఏళ్ల తరబడి ప్రేక్షకులతో అల్లరి నరేశ్ అనే పిలిపించుకుంటున్నాడు. నేడు(జూన్ 30) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా అప్డేట్తో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. తను హీరోగా చేస్తున్న 58వ చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. #Naresh58 is #SabhakuNamaskaram .. a hilarious entertainer with a difference starring @allarinaresh and directed by @MallampatiSate1. Produced by Mahesh S Koneru on @EastCoastPrdns with dialogues by @abburiravi . Shoot begins soon #HBDAllariNaresh pic.twitter.com/JDNFiVMv8C — BARaju's Team (@baraju_SuperHit) June 30, 2021 ఈమేరకు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్లో కూడా సభకు నమస్కారం చేస్తుండటం ప్రత్యేకతను కనబరుస్తోంది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సభకు నమస్కారం చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! చదవండి: హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా? -
బాగా నవ్వాలి – అల్లరి నరేష్
గోవింద్ రాజ్, సంతోష్, సీహెచ్ సిద్ధేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సర్వం సిద్ధం’. (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్ విడుదల చేసి, ఈ సినిమా ట్యాగ్ లైన్ సినిమాలో ఉండబోయే కామెడీని సూచిస్తోందని, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలని అన్నారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. -
ఓటీటీలో భారీ ధర పలికిన ‘నాంది’.. రిలీజ్ ఎప్పుడంటే?
అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సతీష్ వేగేశ్న నిర్మాణ సారథ్యం వహించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, హరిష్ ఉతమన్, వినయ్వర్మా, ప్రవీణ్ తదితరులు నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్ళనే రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆహా సంస్థ రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో మార్చి 12న ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతనెల ఫిబ్రవరి 19న రిలీజైన ‘నాంది’ రూ. 6.4 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇదిలా వుంటే నరేష్‌కు తెలుగులో తొలి సినిమా అల్లరి. అయితే, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి విజయాలను సొంతం చేసుకున్న నరేష్, కొన్నేళ్లుగా హిట్లు లేక తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. తాజాగా నాంది రూపంలో అతనిలోని ‘సీరియస్’ నటుడు బయటికొచ్చాడు. అతని నటనపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 55 సినిమాల్లో నటించిన నరేష్.. గమ్యం సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్‌కు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నాడు. చదవండి: కోట్లు డిమాండ్ చేస్తున్న నాని -
అల్లరి గతం.. పేరు మార్చేయ్...!
సాక్షి,హైదరాబాద్ : నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో అల్లరి నరేష్‌ని టాలీవుడ్ నేచురల్ స్టార్ నానీ పొగడ్తల్లో ముంచెత్తారు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ.. ”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను..” అని నాని పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. (ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్) కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. Finally got to watch #Naandhi రేయ్ రేయ్ రేయ్..@Allarinaresh పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది Super happy for you ra .. hope to see you exploring the artist in you more and more here after 🤗 — Nani (@NameisNani) February 28, 2021 -
నా కోరిక అదే: నటి వరలక్ష్మి
పటమట(విజయవాడ తూర్పు): నాంది చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. సినిమా విజయోత్సవంలో భాగంగా నగరానికి విచ్చేసిన వారు ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో నరేష్ మాట్లాడుతూ అల్లరి చిత్రంతో తనకు కామెడీ హీరోగా గుర్తింపు వచ్చిందని.. అయితే నరేష్ కామెడీనే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తాడనే నమ్మకం “నాంది’తో ప్రేక్షుకులకు వచ్చిందన్నారు. నాంది చిత్రంలో కంటెంట్ ఉన్న కారణంగానే హిట్ అయ్యిందన్నారు. ఇకపై కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తానని తెలిపారు. సందేశాత్మక చిత్రాలలో నటించాలని ఉందని చెప్పారు. అనంతరం నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ నాంది చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు సక్సెస్ యాత్ర చేపట్టామని వివరించారు. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలనేది తన కోరికగా పేర్కొన్నారు. దర్శకుడు కనకమేడల విజయ్, నిర్మాత సతీష్ వేగేశ్న నాంది చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో హాస్య నటుడు ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సిద్ధు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా! ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి! -
‘నాంది’ థ్యాంక్స్ మీట్
-
ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు
‘‘దాదాపు ఎనిమిదేళ్లుగా నన్ను హిట్స్ పలకరించడం మానేశాయి. ప్రతి ఏడాదీ హిట్ కోసం ఎదురు చూసేవాడిని. 2021లో ‘నాంది’తో హిట్ వచ్చింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా సతీష్ వేగేశ్న నిర్మించిన సినిమా ‘నాంది’. ఈ నెల 19న విడుదలైన సందర్భంగా ‘థ్యాంక్స్ మీట్’లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ – ‘‘మహరి’్ష తర్వాత ఏదైనా కంటెంట్ ఉన్న సినిమా చేద్దామని అనుకున్నాను. విజయ్ వచ్చి ‘నాంది’ కథ చెప్పినప్పుడు ‘ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటి’ అని అతన్నిఎవరో అడిగారట. కథలో కంటెంట్ ఉండి... హీరోలో ప్రతిభ ఉంటే సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో పని లేదని విజయ్ అన్నాడట. కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ రెండేళ్లు కోలుకోదని అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా మంచి కథలను ఎంచుకుంటాను’’ అన్నారు. ‘‘నాంది’ మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్‌గానే ఉన్నాయి. టాక్ బాగుంది కానీ కలెక్షన్స్ లేవని వేరే నిర్మాతలు చెప్పారు. వారే నైట్ షోకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయని చెప్పడంతో సంతోషపడ్డాం’’ అన్నారు నిర్మాత సతీష్. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్