Watch: Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie Teaser Out Now - Sakshi
Sakshi News home page

Itlu Maredumilli Prajaneekam Teaser: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్‌ వచ్చేసింది!

Published Thu, Jun 30 2022 2:27 PM | Last Updated on Thu, Jun 30 2022 3:22 PM

Allari Naresh Movie Itlu Maredumilli Prajaneekam Teaser Out Now - Sakshi

నాంది సినిమా సక్సెస్‌తో జోష్‌ మీదున్నాడు అల్లరి నరేశ్‌. ప్రస్తుతం అతడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్నాడు. నరేశ్‌కు ఇది 59వ చిత్రం. ఈ మూవీలో ఆనంది హీరోయిన్‌. గురువారం (జూన్‌ 30న) అల్లరి నరేశ్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా నటించాడు హీరో.

సాయం సేత్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు, మీరు మనుషులైతే సాయం సేయండి అన్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అసలు వారికున్న సమస్య ఏంటి? ఏ సమస్య గురించి నరేశ్‌ పోరాడుతున్నాడు? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండ నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

చదవండి: ప్రస్తుతం నేను ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా
పృథ్వీరాజ్‌ సినిమాకు కోట్లల్లో ఓటీటీ డీల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement