అల్లరి నరేశ్ మూవీ అప్‌డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఆరోజే..! | Allari Naresh Latest Movie Itlu Maredumilli Prajaneekam Update | Sakshi
Sakshi News home page

Itlu Maredumilli Prajaneekam: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఫస్ట్ సాంగ్ విడుదలకు రెడీ

Published Sun, Oct 2 2022 9:03 PM | Last Updated on Sun, Oct 2 2022 9:04 PM

Allari Naresh Latest Movie Itlu Maredumilli Prajaneekam Update - Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలోని 'లచ్చిమి' అనే సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement