Itlu Maredumilli Prajaneekam Movie
-
ఓటీటీకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహింటారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ) ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్ లు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే. అసలు కథేంటంటే..: శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ పబ్లిక్ టాక్
-
Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ
టైటిల్: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నటీనటులు: ‘అల్లరి’ నరేశ్, ఆనంది, వెన్నెల కిశోర్, రఘు బాబు, శ్రీతేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండు సమర్పణ: జీ స్టూడియోస్ దర్శకుడు: ఏఆర్ మోహన్ సంగీతం: సాయి చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చోటా కె. ప్రసాద్ ఎడిటర్: రామ్ రెడ్డి విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేంటంటే.. శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా అభివృద్దికి నోచుకొని తండా అది. అక్కడ చదువుకోవడానికి బడి లేదు. అనారోగ్యం పాలైతే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. పట్టణం వెళ్లడానికి సరైన దారి లేదు. పాఠశాల, ఆస్పత్రితో పాటు నదిపై వంతెన కట్టించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే వాళ్లు ఓటేయడానికి నిరాకరిస్తారు. కానీ శ్రీనివాస్ చేసిన ఓ పనికి మెచ్చి అతని కోసం ఓట్లు వేస్తారు. వందశాతం పోలింగ్ జరుగుతుంది. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పట్టణాలకు దూరంగా నివసించే తండా వాసుల కష్టాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. వాళ్లకు సరైన సదుపాయాలు ఉండవు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా ఉండవు. తమ సమస్యలను తీరుస్తేనే ఓటు వేస్తామంటూ ధర్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటలనే కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఏఆర్ మోహన్. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగడం కాస్త మైనస్. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎన్నికల చుట్టే కథ సాగుతుంది. తండావాసులు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయానికి శ్రినివాస్ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకొని చలించిపోవడం.. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్‌ల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం తండావాసుల దగ్గర బంధీలుగా ఉన్న అధికారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కథనం రోటీన్‌గా సాగినా.. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' లాంటి అద్భుతమైన సంభాషణలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. నరేశ్ చేసిన మరో మంచి అటెంప్ట్‌గా మాత్రం నిలుస్తుంది. ఎవరెలా చేశారంటే.. కామెడీనే కాదు సీరియస్ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించే నటుల్లో నరేశ్ ఒకరు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో నరేశ్ది పూర్తి సిరియస్ రోల్. తెలుగు భాషా ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఇలాంటి పాత్ర కొత్తేమి కాదు. ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబుల కామెడీ బాగా పండింది. తండా వాసి కండాగా శ్రీతేజ్, ఊరి పెద్దమనిషి ‘పెద్ద’ కుమనన్ సేతురామన్‌లతో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రల పరిధిమేర నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చోటా కె. ప్రసాద్ కెమెరా పనితీరు బాగుంది. అడవి అందాలను అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నమ్మకం ఉంది
‘‘మన చుట్టుపక్కల జరిగే కథే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఓ నిజాయితీ సినిమా. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు కొత్త ప్రయత్నంగా మేం చేసిన ‘మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘నాంది’ సినిమాతో నిర్మాత సతీష్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ‘ఇట్లు మారేడు...’తో రాజేష్‌గారికి అంత మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన తర్వాత మాటల రచయిత అబ్బూరి రవి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. చివరి 20 నిమిషాలు సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘వినోదం, హాస్యం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ఏఆర్ మోహన్. ‘‘స్వామి రారా’తో డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 75 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం అయినప్పటికీ ఒత్తిడి అనిపించలేదు’’ అన్నారు రాజేష్. ‘‘ఈ సినిమాలో నేను రాసినవి మాటలు కాదు.. ఆ పాత్రల తాలూకు భావాలు. అలాగే ఈ సినిమాకు ఓ లిరిసిస్ట్‌లా ఓ పాట రాసి, సింగర్‌గా పాడటం సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. ఓ బాధ్యతగల పౌరుడిగా ఎన్నికలప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. సకాలంలో పన్నులు చెల్లిస్తున్నాను. ఇక రాజకీయలపై నాకు అంతగా ఆసక్తిలేదు. నాది చాలా సున్నితమైన మనసు. నాలాంటి వారు రాజకీయాలకు పనికి రారు. భవిష్యత్‌లో దర్శకుడిని అవుతాను కానీ పొలిటీషియన్ని కాను. – ‘అల్లరి’ నరేశ్ -
మారేడుమిల్లి టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రాజకీయాల్లోకి అల్లరి నరేశ్? క్లారిటీ ఇచ్చిన హీరో
అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా తర్వాత అల్లరి నరేశ్ నుంచి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ చిత్రమిది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఇక రేపు(నవంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇల్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ టీం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ రాజకియాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అల్లరి నరేశ్ స్పందిస్తూ.. ‘రాజకీయాలు నాకు తెలియవు. అసలు నాకు ఇంట్రస్ట్ లేని సబ్జెక్టు అది. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోగా సక్సెస్ అయితే చాలు అనుకున్న. నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు రాజకీయాలు పనికి రావు. అయితే దర్శకుడు అవుతాను. కానీ, రాజకీయ నాయకుడ్ని మాత్రం అవ్వను’ అంటూ తెల్చిచెప్పాడు. చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి -
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే ..!
కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే అదే ఊపులో ఈవారం కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. మనిషి తోడేలుగా మారితే... వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేదియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో వస్తున్న 'లవ్‌టుడే' తమిళంలో సూపర్ హిట్ మూవీ 'లవ్‌టుడే'. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ టాక్ సాధించింది. నవంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. యాక్షన్ సినిమా 'రణస్థలి' మాటల రచయిత పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ వెన్స్డే (వెబ్‌సిరీస్) నవంబరు 23 ద స్విమ్మర్స్ (హాలీవుడ్) నవంబరు 23 గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్) నవంబరు 23 బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) నవంబరు 23 ద నోయల్ డైరీ (హాలీవుడ్) నవంబరు 25 ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) నవంబరు 25 పడవేట్టు (మలయాళం) నవంబరు 25 అమెజాన్ ప్రైమ్ గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23 జీ5 చుప్ (బాలీవుడ్) నవంబరు 25 డిస్నీ+హాట్‌స్టార్ ప్రిన్స్ (తెలుగు) నవంబరు 25 ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ (హాలీవుడ్) నవంబరు 25 ఆహా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు మూవీ) నవంబరు 25 ఎన్బీకే అన్‌స్టాపబబుల్ (సీజన్-2 ఎపిసోడ్ 4) నవంబరు 25 సోనీ లివ్ గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) నవంబరు 25 మీట్ క్యూట్ (తెలుగు మూవీ) నవంబరు 25 -
అలాంటి టైంలో కూడా ఆనంది షూటింగ్ చేసింది : అల్లరి నరేష్
అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు తనని బాగా నటించావ్ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అందంగా ఉన్నావ్ అని అంటుంటే సిగ్గేస్తుంది. నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి థాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. ఇక ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా చేసింది. షూటింగ్ సమయానికి ఆమె బేబీకి బర్త్ ఇచ్చిన మూడో నెల. అయినా సరే కష్టపడి సినిమాను చేశారు.ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమాని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్.ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. -
'ప్రతి అధికారి సమాధానం చెప్పాలి'.. ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. (చదవండి: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది) ట్రైలర్ విషయానికొస్తే.. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఫ్య్సాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
పాఠం చెబుతాం.. దారిలో పెడతాం...
చదువుకోవడానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్లే క్లాస్‌లో డిఫరెంట్ మైండ్‌సెట్‌తో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. అందరికీ పాఠాలు చెప్పడంతో పాటు దారిలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లదే. ఇలా స్టూడెంట్స్‌ను దారిలో పెట్టేందుకు కొందరు స్టార్స్ కాలేజీలకు వెళ్తున్నారు. మరి.. ఈ లెక్చరర్లు ఏ విధంగా పాఠాలు చెప్పారనేది మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించేందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓ మాస్టారు. ఈ మాస్టారు ఎవరో కాదు.. ధనుశ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుశ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ (తమిళంలో ‘వాతి’) అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విద్యావ్యవస్థలోని లోపాలను సరి చేయాలనుకునే మాస్టారుగా కనిపిస్తారు ధనుశ్. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక మారేడుమిల్లి ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు మాస్టారుగా నడుం బిగించారు ‘అల్లరి’ నరేశ్. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇందులో ఆనంది హీరోయిన్. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ టీచర్‌గా కనిపించనున్నారు. ఓ ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లి, అక్కడి ప్రజల ఇక్కట్లను పరిష్కరించి, వారు ఎన్నికల్లో పాల్గొనే విధంగా కష్టపడే టీచర్‌గా ‘అల్లరి’ నరేశ్ పాత్ర ఉంటుందని తెలిసింది. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతున్నారు. ఇది ‘విడుదలై’ సినిమా కోసం. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సూరి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు విజయ్ సేతుపతి. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఉపాధ్యాయులందరూ బ్లాక్‌బోర్డ్‌పై పాఠాలు చెబుతుంటే ఉపాధ్యాయురాలు మాత్రం గ్రౌండ్లో క్లాసులు తీసుకుంటున్నారు. అమలా పాల్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘ది టీచర్’. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పాత్రలో కనిపించనున్నారు అమలా పాల్. ఈ సినిమాను డిసెంబరు 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక మ్యూజిక్ స్కూల్లో టీచర్స్‌గా చేరారు శ్రియ, శర్మాన్ జోషి. ఈ ఇద్దరూ ప్రధాన తారలుగా పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. విద్యా వ్యవస్థలో చదువుతో పాటు స్పోర్ట్స్, సంగీతం వంటివి కూడా ముఖ్యమని చెప్పే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో టీచర్ మేరి పాత్రను శ్రియ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే హిందీలో పాఠాలు చెబుతున్నారు హీరోయిన్లు రాధికా మదన్, నిమ్రత్ కౌర్. హిందీ చిత్రం ‘హ్యాపీ టీచర్స్ డే’లో ఈ ఇద్దరు టీచర్లుగా నటిస్తున్నారు. మిఖిల్ ముసలే ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే ఏడాది టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈనెల 11న ఈ సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అల్లరి నరేష్ షేర్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. వెన్నల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. A New GO has been passed! 📜 The Elections will be held at your Nearest Theatres on NOV 25th! 💥 - #ItluMaredumilliPrajaneekam#IMP #IMPonNov25th ✅@allarinaresh @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @vennelakishore pic.twitter.com/5KvEOknyTW — Allari Naresh (@allarinaresh) November 5, 2022 -
అల్లరి నరేశ్ మూవీ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఆరోజే..!
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని 'లచ్చిమి' అనే సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది.