
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహింటారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
(ఇది చదవండి: Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ)
ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్ లు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే.
అసలు కథేంటంటే..: శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment