Allari Naresh hero
-
అల్లరి నరేశ్ కూతురిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో?
తెరపై నవ్వులు పూయించే హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేశ్. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం వెండితెరపై డిఫరెంట్ రోల్స్‌తో అలరిస్తున్నారు. హాస్య చిత్రాలతో అలరించే నరేశ్.. ప్రస్తుతం తన ఉగ్రరూపం చూపిస్తున్నారు. నాంది సినిమాతో యాక్షన్ సీక్వెన్స్‌కు నాంది పలికిన నరేశ్.. ఇప్పుడు ఉగ్రం సినిమాతో మరోసారి మాస్ లుక్ చూపించబోతున్నారు. నరేశ్ సీరియస్ రోల్లో తాజాగా నటించిన చిత్రం ఉగ్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో నరేశ్ కూతురు కూడా నటించడం విశేషం. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నరేశ్ కూతురు తన స్పీచ్‌తో అదరగొట్టింది. 'ఈ సినిమాలో చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాను. మీరు కచ్చితంగా సినిమా చూడాలి. ఐ లవ్ యూ డాడీ. నాకు అవకాశమిచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్స్.' అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది. చివర్లో నువ్వు ఏమవుతావు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. నేను పెద్దయ్యాక సమంత అవుతానంటూ క్యూట్‌గా ఆన్సరిచ్చింది. అంతే కాకుండా స్టేజ్‌పైనే ఓ పాట కూడా పాడి అందరినీ అలరించింది'. అల్లరి నరేశ్ కూతురు మాటలకు వేదికపై ఉన్నవారంతా ఫిదా అయ్యారు. -
ఓటీటీకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహింటారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Itlu Maredumilli Prajaneekam: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ) ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్ లు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే. అసలు కథేంటంటే..: శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. అయితే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్(సంపత్ రాజ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్ ఏ మేరకు సక్సెస్ సాధించాడు? అనేదే మిగతా కథ. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
'ప్రతి అధికారి సమాధానం చెప్పాలి'.. ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. (చదవండి: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది) ట్రైలర్ విషయానికొస్తే.. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఫ్య్సాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!
ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. ‘సాక్షి’తో సంపూర్ణేశ్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... ‘‘నరేశ్ పక్కన అదీ ఈవీవీ గారి సంస్థలో నటించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ‘బందిపోటు’లో నటించడం ఓ గొప్ప అనుభవం. సెట్లో గడిపిన ప్రతీ క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఈ సినిమా వల్ల ‘అల్లరి’ నరేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే తదితర గొప్ప నటులతో కలిసి తెరను పంచుకొనే అవకాశం కలిగింది. వీళ్లందరితో కలిసి నటించాలని తెలిసి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ సెట్లోకి అడుగుపెట్టగానే వాతావారణం అంతా మారి పోయింది. అందరూ చాలా సరదాగా... ఆద్యంతం నవ్వుతూ, నవ్విస్తూ నన్ను కలుపుకొన్నారు. ఆర్యన్ రాజేశ్ గారికి, ‘అల్లరి’ నరేశ్ గారికి నేనంటే చాలా ఇష్టం. వాళ్లు నన్నెంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను. ఆర్యన్ రాజేశ్ గారి ప్రత్యేకమైన ఆసక్తి వల్లే నేను ఈ సినిమాలో నటించాను.’’ టైమింగ్ తెలిసింది! ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు తెల్లబ్బాయ్. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఎదుటివారి ఎత్తుల్ని, పైఎత్తుల్ని, లాజిక్కుల్ని పసిగట్టలేక పోతుంటాను. అందుకే ‘నీ తెల్లటి మనసుకు తెలియలేదురా తెల్లబ్బాయ్’ అని డైలాగ్ చెబుతాడు అల్లరి నరేశ్. ఆయనకి స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తాను. నరేశ్‌తో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం నా జీవితాంతం గుర్తుండి పోతుంది. కామెడీ టైమింగ్ అంటే ఏంటో ఆయన నుంచి బాగా తెలుసుకున్నాను. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.’’ ఇంట్రడక్షన్ మిస్ కావద్దు! ‘‘సినిమాలో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే... నా ఇంట్రడక్షన్ మరో ఎత్తు. గురువుగారు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో నన్ను తెరపై చూపించారు. అందుకే ఆ సన్నివేశాలను అస్సలు మిస్ కావద్దని చెబుతున్నా. సడన్ స్టార్, బర్నింగ్ స్టార్ కలిస్తే థియేటర్ నవ్వులతో మార్మోగిపోవాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది.’’ రాజమౌళి గారిని అడుగుతా..! ‘‘ ‘బందిపోటు’ ఆడియో వేడుకలో రాజమౌళి గారిని కలిశాను. ‘బాహుబలి’ విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిసి.. ‘తదుపరి మీరు చేయ బోయే సినిమాలో కనీసం రెండు నిమిషాలైనా కనిపించాలనుంది’ అని అడుగుతా. ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం 123’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నా. వాటితో పాటు ఇంకో మూడు చిత్రాల్లోనూ సోలోగా నటించడానికి ఒప్పుకొన్నా.’’