బచ్చలమల్లి గ్లింప్స్‌: ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? | Bachhala Malli Movie: Allari Naresh Birthday Glimpse Released | Sakshi
Sakshi News home page

బచ్చలమల్లి గ్లింప్స్‌: ఊర మాస్‌ లుక్‌లో అల్లరి నరేశ్‌

Published Sun, Jun 30 2024 10:26 AM | Last Updated on Sun, Jun 30 2024 10:26 AM

Bachhala Malli Movie: Allari Naresh Birthday Glimpse Released

అల్లరి నరేశ్‌ ఇటీవల 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్టవుతుందని ఆశించిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడీ హీరో మాస్‌ లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్లరి నరేశ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న మూవీ బచ్చల మల్లి. ఇందులో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 

1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్‌ కథానాయిక.

నేడు (జూన్‌ 30) అల్లరి నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా బచ్చల మల్లి సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో.. తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేశాడు. తర్వాత ఓ సీన్‌లో ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? అంటూ మందు తాగి తన చుట్టూ ఉన్నవారిని చితబాదాడు. ఈ గ్లింప్స్‌లో మల్లి గడ్డం, జుట్టుపెంచుకుని ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

 

చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ‘ఐతోలు’ బిడ్డె!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement