‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్‌గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment