మా ఆయన కోసం సినిమా చూడండి: టాలీవుడ్ హీరోయిన్ క్యూట్ రిక్వెస్ట్ | Tollywood Heroine Rahasya Ghorak Comments On Husband Latest Movie | Sakshi
Sakshi News home page

Rahasya Ghorak: పెళ్లి రోజు తప్ప సినిమా కోసమే పనిచేశారు: రహస్య గోరఖ్

Published Tue, Oct 29 2024 9:10 PM | Last Updated on Tue, Oct 29 2024 9:12 PM

Tollywood Heroine Rahasya Ghorak Comments On Husband Latest Movie

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమైపోయాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సుజిత్, సందీప్‌ దర్శకత్వం వహించారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ ఈనెల 31న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

అయితే ఇటీవల కిరణ్‌ను పెళ్లాడిన హీరోయిన్‌ రహస్య గోరఖ్ సైతం తన భర్త ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా రహస్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు ఏడాదిన్నర్రగా ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. మా పెళ్లి రోజు మినహాయిస్తే మిగతా రోజులన్నీ సినిమాతోనే బిజీగా ఉన్నారని తెలిపింది. మీ కోసం, మా టీమ్ కోసం.. అలాగే మా ఆయన కోసం ఈ సినిమా చూడండి అంటూ చాలా క్యూట్‌గా మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఏడాదిలోనే కిరణ్- రహస్య వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

'క' కథేంటంటే..

'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‪‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement