Kiran Abbavaram
-
భార్యకు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. నుదుటన బొట్టు పెట్టి!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించింది.అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
భార్యపై ఎంత ప్రేమో.. రహస్యతో హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
‘దిల్ రూబా’ మూవీ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ (ఫొటోలు)
-
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
‘క’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్‌కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్‌కి కూడా తెలుసు. అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధార్థ్‌రెడ్డి అలియాస్ సిద్దు(కిరణ్ అబ్బవరం) , మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనంతరం మ్యాగీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతుంది. బ్రేకప్‌తో బాధ పడుతున్న సిద్ధుని చూసి తట్టుకోలేకపోయిన ఆయన తల్లి..ఇక్కడే ఉంటే ఆ బాధ ఎక్కువతుందని, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్మేట్ అంజలి(రుక్సార్ థిల్లాన్) (rukshar dhillon)తో ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. ప్రేమించమని వెంటపడిన అంజలి..ప్రేమలో పడిన తర్వాత సిద్ధుని ఎందుకు దూరం పెట్టింది? వీళ్ల బ్రేకప్‌కి కారణం ఎవరు? అమెరికాలో ఉన్న మ్యాగీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చింది? విక్కీతో సిద్ధుకి ఉన్న గొడవేంటి? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు అంజలి, సిద్ధుల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. కొత్తదనంతో వస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్ని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఓ ఢిఫరెంట్ పాయింట్‌ని పట్టుకొని కథలు అల్లుకుంటున్నారు. అయితే కథ కొత్తగా ఉంటే సరిపోదు..తెరపై చూస్తున్నప్పుడు కూడా ఆ కొత్తదనం కనిపించాలి. దిల్ రూబా విషయంలో అది మిస్ అయింది. వాస్తవానికి ఈ స్టోరీలో రెండు కొత్త పాయింట్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి మాజీ ప్రేయసీ అండగా నిలవడం.. హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఈ రెండు ఎలిమెంట్స్ ఆసక్తికరమైనవే కానీ..తెరపై అంతే ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. అంజలీ పాత్రను ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే కాలేజీలో వచ్చే యాక్షన్ సీన్లు తెరపై చూడడానికి బాగున్నా..కథకి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ లవర్ రంగంలోకి దిగడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అంజలి, సిద్ధుల ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో జోకర్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. దీంతో అసలు వీళ్ల లవ్‌స్టోరీకి జోకర్ ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుందీ. దానికి దర్శకుడు సరైన జెస్టిఫికేషనే ఇచ్చాడు. కానీ ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సహజత్వం లోపిస్తుంది. కడప నేపథ్యంతో తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు. అయితే కథను ముగించిన తీరు నిరుత్సాహపరుస్తుంది.ఎవరెలా చేశారంటే.. కిరణ్ అబ్బవరం టాలెంటెడ్ నటుడు. పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాడు . డిఫరెంట్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ‘క’తో పోలిస్తే దిల్ రూబాలో కిరణ్ది డిఫరెంట్ పాత్రే.దానికి న్యాయం చేశాడు. తెరపై అందంగా కనిపించాడు. యాక్షన్స్ సీన్లలో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ థిల్లాన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర పరిధిమేర నటించింది. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ పాత్రను పోషించాడు. సత్య పండించిన కామెడీ బాగున్నప్పటికీ..అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. తులసి, 'ఆడుకాలం' నరేన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం అదిరిపోతుంది. కేసీపీడీ థీమ్‌ని ఫైట్ సీన్‌కి వాడడం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కొన్ని డైగాల్స్ పూరీ జగన్నాథ్ మాటలను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. టైటిల్: దిల్ రూబానటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులునిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్రచన, దర్శకత్వం: విశ్వ కరుణ్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్ఎడిటర్: ప్రవీణ్. కేఎల్విడుదల తేది: మార్చి 14, 2025 -
'నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేకపోయాం': కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
సినిమా చూడొద్దన్న నాని.. నేడే రిజల్ట్!
ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్ చేసేది ఆడియన్ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇక కోర్ట్ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు.(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ఎలా ఉందంటే?)ఇక నాని ‘కోర్ట్’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్ విసిరాడు. ఈయన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్రూబాకి కూడా పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి. -
తిరుపతి స్వామి సన్నిధిలో కిరణ్ అబ్బవరం 'దిల్రూబా' టీమ్ (ఫోటోలు)
-
కొత్త కిరణ్‌ని చూస్తారు
‘‘సినిమా ఇండస్ట్రీపై ఓ నమ్మకంతో ఇక్కడికి వచ్చి... కష్టాలు పడలేక ఎంతో మంది తిరిగి వెళ్లిపోవడం చూశాను. మీరు ధైర్యంగా ఉండండి... తప్పకుండా నాలా మీరు కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. సినిమా మీద ప్యాషన్‌తో పల్లెల నుంచి హైదరాబాద్‌కి వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా సాయం చేస్తాను... అది వసతి అయినా సరే లేకుంటే భోజనం కానీ, అవకాశాలు కానీ... నా చేతనైన సాయం వారికి చేస్తాను’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్తవాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాను. ఇకపైనా చాన్స్ ఇస్తాను’’ అన్నారు. విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దిల్ రుబా’లో కొత్త కిరణ్‌ని చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఎంతోమంది మా ‘దిల్ రూబా’ని రిలీజ్ చేస్తామని అడిగినా మూవీపై నమ్మకంతో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం’’ అని రవి తెలిపారు. ‘‘ఈ మూవీతో కిరణ్‌గారికి, మా టీమ్‌కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు రాకేశ్ రెడ్డి. -
కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత
ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివైనోళ్లు. ఏ సినిమాని థియేటర్లలో చూడాలి, ఏ మూవీని ఓటీటీలో చూడాలనేది వాళ్లకు తెలుసు. దీంతో తక్కువ బడ్జెట్ తో చిత్రాల్ని తీసిన దర్శకులు, నిర్మాతలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వైరల్ అవుతున్నారు. మొన్నీమధ్యే 'కోర్ట్' మూవీ కోసం నిర్మాత నాని.. ఇది నచ్చకపోతే త్వరలో రాబోయే తన 'హిట్ 3' చూడొద్దని అన్నాడు. ఇప్పుడైతే కిరణ్ అబ్బవరంతో 'దిల్ రుబా' అనే మూవీ తీసిన నిర్మాత రవి.. సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పడేయకపోతే.. మధ్యాహ్నం నేను పెట్టే ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. తర్వాత నన్ను బయటకు విసిరేయొచ్చు. సినిమాలో ఫైట్స్ చూసి మెస్మరైజ్ కాకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వడానికి, సినిమాపై కొందరి దృష్టి పడటానికి పనికొస్తాయేమో గానీ మూవీ హిట్ అవ్వాలంటే అంతిమంగా ఉండాల్సింది కంటెంట్ మాత్రమే. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే 'దిల్ రుబా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్) -
ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి విలువ తీయొద్దు : కిరణ్ అబ్బవరం
‘ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ "దిల్ రూబా"లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్‌ని చెప్పాం’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram). ‘క’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→"దిల్ రూబా"( Dilruba Movie)లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఈ సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను→ ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ "దిల్ రూబా"ను బాగా ఇష్టపడతారు. 2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. "క" కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.→ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. నేను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ మీకు కంప్లీట్ గా నచ్చుతుంది. నేను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదు. గతంలో నేను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూశారు. ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తా. ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ లో కొన్ని సీన్స్ కట్ చేయలేదు. థియేటర్ లో మూవీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.→ మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు.→ సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. దిల్ రూబా తర్వాత వెంటనే కె ర్యాంప్ మూవీ ఉంటుంది.→ గతంలో కొన్ని మూవీస్ మొహమాటానికి చేసినవి ఉన్నాయి. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. క సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం. -
హేయ్ మాగా..! 'దిల్ రూబా' కేసీపీడీ సాంగ్ వచ్చేసింది
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పారు. ఈ కథ గురించి ఆయన రెండు మాటల్లో ఇలా చెప్పారు 'ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.' అంటూ హింట్ ఇచ్చారు.అలాగే ఊరికే ఎవరికీ కోపం రాకూడదని,... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడని ఆయన అన్నారు. ఈ అంశం కూడా సినిమాలో ఉందని తెలిపారు. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే కథలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
ప్రేమకథను కొత్తగా చెప్పాను: దర్శకుడు విశ్వ కరుణ్
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, నజియా డేవిసన్ హీరోయిన్లు. విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు. -
అలా జరుగుంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని: కిరణ్ అబ్బవరం
తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతడు.. గతేడాది రిలీజైన 'క' మూవీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు 'దిల్ రుబా'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కిరణ్ అబ్బవరం ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవాడు అని యాంకర్ అడగ్గా.. 'రాజకీయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడ్ని. ప్రజలతో మమేకం కావడం నాకు నచ్చుతుంది. నాది రాయలసీమ కావడంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలని దగ్గరి నుంచి చూశాను. బహుశా అందువల్లే నాకు వాటిపై ఆసక్తి పెరిగింది అనుకుంటా.'(ఇదీ చదవండి: 'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!)'నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడి ఏడ్చేశాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని అన్నాడు.ఇకపోతే భవిష్యత్తులో వ్యాపార చేయాలనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్‌లో రాణించాలనేది నా ఇంట్రెస్ట్. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాను' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.'దిల్ రుబా' సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ప్రేమకథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ థిల్లాన్ హీరోయిన్.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
ప్రేమలో ఉన్నవాళ్లకు నచ్చేలా 'దిల్రూబా' ట్రైలర్
విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంజలి, సిద్ధు ప్రేమ చుట్టూ సాగే కథతో ‘దిల్ రూబా’ రూపొందిందని ట్రైలర్‌తో తెలుస్తోంది. ప్రేమలో ఉన్నవాళ్లు కలిసి చూడాల్సిన చిత్రమిది అంటూ ట్రైలర్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం తెలిపాడు. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. -
మొదటిసారి అరుణాచలం వెళ్లా.. చాలా పాజిటివ్‌గా అనిపించింది: కిరణ్ అబ్బవరం
గతేడాది క మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కొత్త ఏడాదిలోనూ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం దిల్ రుబా. లవర్స్ డే కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. ఇటీవల దిల్ రుబా మూవీ కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. దీంతో కిరణ్ అబ్బవరం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణాచలం ఆలయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'అరుణాచలం మొదటిసారి వెళ్లా. చాగంటి వారి మాటలు వినేవాడిని. ఇటీవల అనుకోకుండా కుదిరింది. అక్కడ నాకు చాలా పాజిటిల్ ఫీలింగ్ కలిగింది. అక్కడ గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు నడిచాం. కానీ గిరి ప్రదక్షణ ఎప్పుడు చేయాలనేది తెలియదు. మార్నింగ్ 6కు మొదలు పెడదాం అనుకున్నాం. దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు బయలుదేరాం. 14 కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది. ఎండలో వెళ్లడంతో చుక్కలు కనిపించాయి. ఎవరైనా అరుణాచలం వెళ్లకపోతే ఇప్పుడైనా వెళ్లండి. చాలా అద్భుతంగా ఉంటుంది'అని అన్నారు.అయితే కిరణ్ అబ్బవరం ఇటీవలే అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన మూవీ దిల్ రుబా కథేంటో చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని వెల్లడించారు. ఈ సినిమా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతేడాది 'క' మూవీతో అద్బుతమైన హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈసారి 'దిల్ రుబా' అనే ప్రేమకథ మార్చి 14న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు.(ఇదీ చదవండి: 'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే)సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్ నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని, వాటి ఆధారంగా 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటితరం హీరోల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. అలా ఇప్పుడు కిరణ్.. బైక్ ని బహుమతిగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లన్ హీరోహీరోయిన్లుగా నటించారు. విశ్వకరుణ్ దర్శకుడు. మార్చి 14న ఈ మూవీతో పాటు నాని నిర్మించిన 'కోర్ట్' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)
-
లవ్... ఎమోషన్
‘‘దిల్ రూబా’ టీజర్, ట్రైలర్లో ఏ కంటెంట్ చూపించామో సినిమాలోనూ అదే ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ ఉండదు. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘హే జింగిలి..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని సామ్ సీఎస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘సారెగమ వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్లోకి వస్తున్నారు. రవిగారు, విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ‘దిల్ రూబా’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా ‘దిల్ రూబా’ పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియాప్రొడక్షన్ సారెగమతో కలిసి సినిమా చేశాం’’ అని రవి చెప్పారు. ‘‘హే జింగిలి... పాటకి మంచి పేరొస్తుంది’’ అన్నారు విశ్వ కరుణ్. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. లిరిక్ రైటర్ భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడారు. -
ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్
'క' మూవీతో భారీ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం దిల్రూబా మూవీ చేస్తున్నాడు. ఇందులో రుక్సర్ ధిల్లాన్ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. మొన్నటి వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మార్చి 14వ తేదీకి వాయిదా పడింది.జింగిలి బాగుంటదిలే..ఇకపోతే దిల్రూబా సినిమా (Dilruba Movie) నుంచి హే జింగిలి పాటను ఫిబ్రవరి 18న సాయంత్రం 5.01 గంటకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై రుక్సర్ స్పందిస్తూ.. ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు, బుజ్జి, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిల్చుకునే కూకీ, వైఫుల కన్నా జింగిలి చాలా బాగుంటది లే అన్నాడు. అదంతా కాదు, ఈ జింగిలి అంటే ఏంటి? ముందు అది చెప్పు అని హీరోయిన్ ప్రశ్నించింది. రేపటిదాకా ఆగాల్సిందేఅందుకు హీరో.. జింగిలి (Jingili) అంటే J అంటే జాన్, I అంటే ఇర్రెస్టిబుల్, N అంటే నెక్స్ట్ లెవల్, G అంటే గార్జియస్, I అంటే ఇర్రీప్లేసబుల్, L అంటే లైఫ్‌లైన్.. అంటూనే చివర్లో I అంటే ఇవ్వేవీ కాదన్నాడు. రేపు రిలీజయ్యే హేయ్ జింగిలి పాట వింటే నీకే తెలుస్తుందన్నాడు. అయితే మరీ అంతగా వెయిట్ చేయించకుండా హేయ్ జింగిలి ప్రోమోను రిలీజ్ చేశాడు. ప్రోమోలో అయితే పాట మరీ స్లోగా ఉంది. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. Ee madhya janaalu pilchukunne pookie, cookie, Waifu lu kanna JINGILI chaala baguntaadhi le.#HeyJingili https://t.co/9FEXgMjd27— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Jingili ante!J - JaanI - Irresistible N - Next LevelG - Gorgeous I - Irreplaceable L - LifelineI - Ivvevi kaadhuRepu #HeyJingili song vachaka vinnu.Feb 18th 5:01 ki. https://t.co/JA25iVHaQt— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Tomorrow 5:01pm ❤️#HeyJingili #Dilruba pic.twitter.com/kNSlBWmLTv— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025 చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే! -
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్‌బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్‌ల సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్‌గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
'లవర్స్ డే రోజున దిల్ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం
'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్లో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.విశ్వక్ సేన్ లైలా రిలీజ్..అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. Koncham late ga vastunam :) #dilruba pic.twitter.com/H6UMPDLuwr— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 12, 2025 -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
కిరణ్ అబ్బవరం ఛాన్స్.. చాలా రోజుల తర్వాత వైరల్ అవుతున్న హర్యానా బ్యూటీ (ఫోటోలు)
-
కె ర్యాంప్ షురూ
‘క’వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా ‘కె–ర్యాంప్’(K Ramp) అనే మూవీ షురూ అయింది. నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యుక్తీ తరేజా హీరోయిన్ . హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.తొలి సన్నివేశానికి యోగి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్నలు మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, నటుడు వీకే నరేశ్ పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, వీకే నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ–నిర్మాతలు: బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు. -
కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ‘K ర్యాంప్’ ప్రారంభం (ఫొటోలు)
-
గతేడాదిలో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
గుడ్ న్యూస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam), నటి రహస్య(Rahasya) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈమేరకు ఆయన సోషల్‌మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశాడు. తమ ప్రేమ మరో రెండు అడుగులు ముందుకు పడింది అంటూ తన సతీమణితో దిగిన ఫోటోను పంచుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో గతేడాది ఆగష్టులో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు.ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పేజీలో రహస్యతో దిగిన ఫోటోలను కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న రహస్యకు పలు సూచనలు ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని రహస్య దగ్గరుండి చూసుకుంది. 'క' తర్వాత కిరణ్ 'దిల్రూబా'(Dil Ruba) అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత -
కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా ’మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది!
క సినిమాతో కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడి పనైపోయిందని విమర్శించినవారితోనే భలే సినిమాతో వచ్చాడని మెచ్చుకునేలా చేశాడు. ప్రస్తుతం ఇతడు దిల్రూబా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.శుక్రవాం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మ్యాగీ తన ఫస్ట్ లవ్ అని.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలయినట్లు మొదటి ప్రేమలో విఫలమయ్యానంటూ హీరో వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చిందంటూ హీరోయిన్ను చూపించారు. వీళ్ల ప్రయాణం, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపించారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉంది.ప్రేమ గురించి చెప్పడమైపోగానే కిరణ్ యాక్షన్ మోడ్‌లోకి మారాడు. తనకు అడ్డొచ్చినవారిని కోపంతో చితక్కొట్టాడు. ప్రేమ చాలా గొప్పది.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది అన్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. దవ -
కిరణ్ అబ్బవరం సతీమణి 'రహస్య' పంచుకున్న గతేడాది తీపి జ్ఞాపకాలు (ఫోటోలు)
-
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్‌గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్‌తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్‌వర్క్ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్‌గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
ఈ క్రిస్మస్ మనదే: ‘అల్లరి’ నరేశ్
‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్‌గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు. -
విజయనగరంలో ‘క’ సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి (ఫొటోలు)
-
ఆ ధైర్యాన్ని క ఇచ్చింది: కిరణ్ అబ్బవరం
‘‘క’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ ఇచ్చింది. మా మూవీ సక్సెస్‌కు కారణమైన డైరెక్టర్స్ సందీప్, సుజీత్, నిర్మాత గోపీ, డిస్ట్రిబ్యూటర్ వంశీగార్లకు కృతజ్ఞతలు’’ అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సుజీత్, సందీప్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క’. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రోడ్యూసర్ వంశీ నందిపాటి అక్టోబరు 31న విడుదల చేశారు.శనివారం నిర్వహించిన ‘క’ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా ‘క’ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘క’ సినిమాకు థియేటర్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అని సుజీత్ తెలిపారు. ‘‘మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ‘క’ సినిమా సక్సెస్‌కు కారణం’’ అన్నారు సందీప్. -
కిరణ్ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' ట్రైలర్ ఆదివారం రిలీజైంది. అలా విడుదల చేశారో లేదో ఇలా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ అదరిఇపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే క మూవీతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం సైతం వైల్డ్ఫైరూ.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూా ట్వీట్ చేశాడు.తప్పకుండా చూస్తా..దీనికి బన్నీ స్పందిస్తూ.. థాంక్యూ మై బ్రదర్.. అలాగే నువ్వు హిట్ అందుకున్నందుకు శుభాకాంక్షలు. బిజీగా ఉండటం వల్ల క సినిమా చూడలేకపోయాను. అందుకు క్షమించు. తప్పకుండా నీ సినిమా చూసి నీకు కాల్ చేస్తాను అని రిప్లై ఇచ్చాడు.బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా 'క'ఇకపోతే కిరణ్ అబ్బవరం క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలతో పోటీపడిన కిరణ్.. బ్లాక్‌బస్టర్ హిట్టు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Thank u my brotherrrr 🖤🖤🖤 . Andddd Congratulations… Sorry could not see the film in this busy time . Will def watch and call you 🖤— Allu Arjun (@alluarjun) November 18, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. కొత్తకారుతో సెలబ్రేషన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది.అంటే సుందరానికి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ తన్వీ రామ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. తాజాగా కిరణ్ అబ్బవరం క మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఏడాది పుట్టినరోజున కొత్తకారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మా కుటుంబంలో కొత్త మెంబర్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
తెలుగులో సూపర్ హిట్ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్‌ను షేర్ చేశారు. మాలీవుడ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ క మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024 -
'క' టీమ్‌ను అభినందించిన మెగాస్టార్.. కిరణ్ అబ్బవరం పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు)తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'క' మూవీ టీమ్‌ను అభినందించారు. వారితో దాదాపు గంటకుపైగా మాట్లాడారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుందని కిరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Appreciation from the BOSS 😇Thank you so much @KChiruTweets gaaru for the 1 hour long memorable conversation ❤️Always feels blessed whenever i meet you sir 😇#KA #DiwaliKAblockbuster pic.twitter.com/9TdAp5hqwT— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 10, 2024 -
కిరణ్ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్‌ను శనివారం నిరవ్హించారు.మనసుకు నచ్చితేనే..ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేదు. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ విని షాకయ్యా..సినిమా బడ్జెట్ విని షాకయ్యాను. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా సినిమా హక్కులు కొన్నాడు. ఆ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, చాలా కషపడ్డాడు. పోరాటం ఆపలేదుచాలా మంది కిరణ్ పడిపోయాడు.. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను పోరాటం ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేయడమే.. కానీ కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్‌ను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అని బన్నీ వాసు అన్నారు. -
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'దయచేసి ఎవరినీ అలా జడ్జ్ చేయకండి..' కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ' మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. ఈ సినిమా చూడటానికి ఎవరొస్తారు. ఇప్పుడు అవసరమా..? పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకన్నారు. విడుదలకు ముందు చాలా ఇబ్బంది పడ్డా. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్‌కు ఇస్తాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి ఎక్కవు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. నేను మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలని' అన్నారు.ఆ తర్వాత కిరణ్ మాట్లాడుతూ..'ఈ మాట చెప్పడం కాస్త తొందరపాటు అవుతుందేమో నాకు తెలియదు. దయచేసి ఎవరినీ కూడా మార్కెట్ పరంగా జడ్జ్ చేయకండి. వీడి మార్కెట్ ఇంత.. వాడి మార్కెట్ ఇంత.. ఇంకోడి మార్కెట్ ఇంత. ఇదంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు. ఈరోజు కింద ఉన్న వ్యక్తి వచ్చే శుక్రవారానికి టాప్‌కి వెళ్లొచ్చేమో. టాప్‌లో ఉన్న హీరో రెండు శుక్రవారాల్లో కిందకు పడొచ్చేమో. నా సినిమాను అందరూ ఆదరించారు. అందరం కలిసి మంచి సినిమా చేద్దాం' అని అన్నారు. -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్‌ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్‌కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు. -
'క' ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్‌గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క' మూవీనే దీపావళి విన్నర్‌గా తేలింది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)థియేటర్లలో సక్సెస్ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే పోస్టులు ఎక్కువగా కనిపించాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని తెగ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు ట్వీట్ చేసింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు ఈ రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లని అడ్డుకున్నట్లే. మరి ట్వీట్ చేసినట్లు నిర్మాత మాట మీద నిలబడతారో లేదో చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards— srichakraas entertainments (@srichakraas) November 6, 2024 -
ఇక్కడ అమరన్ హిట్.. తమిళ్లో మాకు పది స్క్రీన్స్ ఇవ్వండి: కిరణ్
'క' సినిమాతో భారీ విజయాన్ని కిరణ్ అబ్బవరం అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 'క' సినిమాను విడుదల చేయాలనుకుంటే ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో అమరన్ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.దీపావళి సందర్భంగా క సినిమాతో పాటు అమరన్ కూడా విడుదలైంది. అమరన్ పూర్తిగా తమిళ్ సినిమా.. ఇక్కడ తెలుగు డబ్బింగ్ వర్షన్లో మాత్రమే విడుదలైంది. తమిళనాడులో ఏ స్థాయిలో అయితే అమరన్కు థియేటర్స్ దక్కాయో తెలుగులో కూడా అంతే స్థాయిలో దక్కాయి అనేది నిజం. ఇప్పుడు ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం పరోక్షంగా ఇలా చెప్పుకొచ్చారు. 'తమిళనాడులో ఉండే మన తెలుగు వారు 'క' సినిమాను ఇక్కడ ఎందుకు విడుదల చేయలేదని కోరుతున్నారు. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. కానీ, అక్కడ తెలుగు సినిమాకు థియేటర్లు ఇవ్వలేదు. కనీసం తెలుగు వర్షన్లో విడుదలైతే చాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించిన సినిమాకు తమిళ్ కనీసం పది స్క్రీన్స్ ఇచ్చినా సంతోషమే. తమిళ్ సినిమా 'అమరన్'ను ఇక్కడ సూపర్ హిట్ చేశాం.. 'క' కోసం అక్కడ పది స్క్రీన్లు ఇస్తే చాలు అంటూ కిరణ్ అబ్బవరం కోరారు. ఇదే సమయంలో 'క' పార్ట్2 కూడా ఉంటుందని ఆయన ప్రకటించారు.కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. రెండురోజులకు గాను ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. -
సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కిరణ్ అబ్బవరం సక్సెస్
-
కిరణ్ అబ్బవరం 'క' సినిమా కలెక్షన్స్.. రెండురోజులకు ఎంతో తెలుసా..?
కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’.దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటిరోజు మంచి కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా సత్తా చాటుతుంది. ఇక నవంబర్ 2,3 తేదీలు వీకెండ్ కాబట్టి భారీగా కలెక్షన్స్ రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.'క' సినిమా మొదటిరోజు రూ. 6.18 కోట్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. కేవలం రెండురోజుల్లోనే రూ. 13.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 'క' ఫైనల్ కలెక్షన్స్ సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి 'క' చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా ఇంతటి విజయం అందుకోవడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మొదట 18 ప్రీమియర్స్‌తో సినిమా స్టార్ట్ చేస్తే ఇప్పుడు 71 షోస్‌కు చేరుకుందని ఆయన అన్నారు. ఇందులో 56 షోస్ హౌస్ ఫుల్ అయినట్లు వంశీ చెప్పుకొచ్చారు. సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని వారు తెలిపారు. -
'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు. చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నట్లుగానే 'క' సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మరో మూడు చిత్రాలు కూడా ఇదే రోజున బిగ్ స్క్రీన్‌పై విడుదలయ్యాయి. కానీ తొలిరోజే 'క' మంచి నంబర్స్ నమోదు చేసింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్‌కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'క' సినిమాకు తొలిరోజు రూ.6.18 కోట్లు గ్రాస్ వచ్చింది. కిరణ్ అబ్బవరం గత మూవీస్‌తో పోలిస్తే దీనికి వస్తున్న స్పందనే కాదు వసూళ్లు కూడా చాలా ఎక్కువని చెప్పొచ్చు. తొలిరోజే రూ6 కోట్లకు పైన వచ్చాయంటే వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల బాట పట్టడం గ్యారంటీ.మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం, నయన్ సారి, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టోరీ కాస్త పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం, క్లైమాక్స్ 20 నిమిషాలు ఎవరూ ఊహించని రీతిలో సాగడం ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంతకీ మీరు 'క' చూశారా? ఒకవేళ చూడకపోతే ఈ రివ్యూ చదవేయండి.(ఇదీ చదవండి: KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ) -
నేను నమ్మిందే నిజమైంది : కిరణ్ అబ్బవరం
‘క’ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, చివరి 20 నిమిషాలు చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారని నమ్మాం. ఇప్పుడు థియేటర్స్‌లో క్లైమాక్స్ సీన్ చూసి అందరు చప్పట్లు కొడుతుంటే నేను నమ్మిందే నిజమైంది అని అనిపించింది. సినిమాకు వెళ్లిన వారు క్లైమాక్స్ మిస్ కాకుండా చూడండి. చివరిలోనే కథలోని ఎస్సెన్ ఉంది’ అని అన్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. దీపావళి కానుకగా నిన్న(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "క" సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మా మూవీకి ఎంతో సపోర్ట్ లభిస్తోంది. "క" సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారు. నేను మా టీమ్ పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని కలుస్తాం’ అన్నారు.(చదవండి: ‘క’ మూవీ రివ్యూ)దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - "క" సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. మేము నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త కంటెంట్ ను, కొత్త నేరేటివ్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నతీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రొడ్యూసర్ గోపి గారికి, వంశీ గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేస్తామని మాటిస్తున్నా. అన్నారు.దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు "క" లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు. -
ఎంత కట్నం తీసుకున్నావ్? కిరణ్ అబ్బవరం ఆన్సరిదే!
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం. మొదట్లో హిట్లు, తర్వాత ఫ్లాప్స్ కూడా అందుకున్న ఈ హీరో తాజాగా క సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇకమీదట సినిమాలే చేయను అని శపథం చేశాడు. ఎంత బలంగా కథను నమ్మితే ఆయన ఆ మాట అని ఉంటాడు! హీరో గుండెధైర్యాన్ని జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కట్నం?ఈ రోజు (అక్టోబర్ 31) థియేటర్లలో కూడా క మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. ఎంత కట్నం తీసుకున్నావు? అన్న ప్రశ్నకు 'నేను కట్నం తీసుకోలేదు. నాకలాంటివి ఇష్టం ఉండవు. కాకపోతే వాళ్ల కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకోనీ.. అది వాళ్ల ఇష్టం' అని చెప్పుకొచ్చాడు.లవ్ జర్నీకాగా రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్, రహస్య హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రం షూటింగ్ సమయంలోనే లవ్‌లో పడ్డారు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇటీవలే పెళ్లి చేసుకుంది. అగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. -
KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ
టైటిల్: కనటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులునిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శకత్వం: సుజీత్, సందీప్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసంఎడిటర్: శ్రీ వరప్రసాద్విడుదల తేది: అక్టోబర్ 31, 2024చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకద్వయం సందీప్, సుజిత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. వినడానికి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పేపర్‌పై రాసుకున్న కథను అర్థవంతంగా ప్రేక్షకులకు చూపించడంతో పూర్తిగా సఫలం కాలేదు.కథగా చూస్తే ఇది పాతదే. కానీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే..క్లైమాక్స్ తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కిరణ్‌తో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో చెప్పినట్లు నిజంగానే ఈ మూవీ క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఓ కథను చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచిస్తూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.ముసుగు వేసుకున్న వ్యక్తి హీరోని ఓ గదిలో బంధించడం..పక్క గదిలో మరో హీరోయిన్ ఉండడం..ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోని బంధించాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటి సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి కలిగించారు. ముసుగు వ్యక్తిని కొంతమంది గుర్తించినా..చివర్లో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ పాయింట్ రివీల్ అయ్యేవరకు దర్శకులు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే ఉమెన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఈ సినిమాలో ప్రధానాంశం కాదు. ముఖమైన మరో పాయింట్ కూడా ఉంటుంది. ఆ పాయింట్ కూడా పాతదే అయినా దాని చుట్టు అల్లుకున్న కథనం కొత్తగా ఉటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఓ ఫ్లోలో వెళ్తున్న కథకి హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సంభాషణలు కూడా బలంగా ఉండకపోవడం మరో మైనస్. అయితే చివరి 20 నిమిషాలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమా పై అప్పటి వరకు ఉన్న ఒపీనియన్‌ను మారుస్తాయి. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..గత సినిమాలతో పోల్చుకుంటే నటన పరంగా కిరణ్ అబ్బవరం చాలా మెరుగుపడ్డాడు. పోస్ట్ మ్యాన్ వాసుదేవ్ పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ కూడా పర్వాలేదు. హీరోయిన్ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే అని చెప్పాలి. ఇక మరో హీరోయిన్ తన్వి రామ్‌కి మంచి పాత్రే లభించింది. స్కూల్ టీచర్ రాధగా ఆమె చక్కగా నటించింది. బలగం జయరామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 70ల కాలంనాటి పరిస్థితులను తెరపై చక్కగా చూపించారు. రాత్రివేళ వచ్చే సీన్స్ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఆ కష్టమేంటో నాకు జీవితంలో తెలియదు.. ఎందుకంటే?'.. నాగచైతన్య కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి రెడీ అయిపోయాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్లో వస్తోన్న క మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైపోయింది. ఈ నెల 31న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నేనే మొదటి అభిమానిని..నాగ చైతన్య మాట్లాడుతూ..'కిరణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాను. కానీ కిరణ్ లాంటి వాళ్ల స్టోరీస్ వినగలుతాను. కానీ ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. నేను చెప్పేది ఒక్కటే కిరణ్ జర్నీకి నేను అభిమానిని. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రావాలంటే నీలాంటి స్టోరీస్ ఆదర్శం. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీలో చాలా సత్తా ఉంది. ట్రోల్ చేసేవాళ్లు చేస్తారు. వాళ్ల చేతుల్లో కేవలం ఫోన్ మాత్రమే ఉంది. అలాంటి వారి గురించి భయపడాల్సిన పనే లేదు. నీ టాలెంట్ ఏంటో చూస్తూనే ఉన్నాం. అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ప్రతి సక్సెస్ వెనకాల ఓ మహిళ ఉంటుంది. నీకు రహస్య సపోర్ట్ ఫుల్‌గా ఉంది. క టీమ్ బృందం పడిన కష్టం నా కళ్లముందే కనిపిస్తోంది. కిరణ్‌కు నేనే మొదటి అభిమానిని. ఆల్ ది బెస్ట్' అంటూ మాట్లాడారు.ట్రోల్స్‌పై కిరణ్ కౌంటర్..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఇచ్చిపడేశాడు. నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించాడు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడిని.. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడని అన్నారు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదని కిరణ్ మాట్లాడారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. -
తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఓ రేంజ్ రెచ్చిపోయాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్)'నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడినని రాస్తాడు. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. కొవిడ్ టైంలో ఎస్ఆర్ కల్యాణ్ మండపం సినిమాతో హిట్ కొట్టాం. ఓ సినిమాలోనూ నాపై ట్రోలింగ్ చేశారు. అసలు అలా చేసేంతలా మీకు నేను ఏం చేశాను? నేను ఎదగకూడదా? నా మీద మీకు ఎందుకు అంత జెలసీ?' అని కిరణ్ అబ్బవరం ఫుల్ ఫైర్ అయ్యాడు.కిరణ్ అబ్బవరంని ఏ సినిమాలో ట్రోల్ చేశారా? అని చాలామంది అనుకుంటున్నారు. గతేడాది 'హాస్టల్ బాయ్స్' అనే కన్నడ డబ్బింగ్ చిత్రం రిలీజైంది. టైటిల్స్ పడుతున్న టైంలో కిరణ్ అబ్బవరం ప్రస్తావన ఉంటుంది. 'రేయ్ కిరణ్ అబ్బవరం కొత్త ట్రైలర్ వచ్చిందిరా! ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో?' అని రెండు పాత్రలు మాట్లాడుకుంటాయి. చిన్న హీరో కాబట్టి కిరణ్‌పై ఇలా ట్రోల్ చేశారు. అదే పెద్ద హీరోపై సదరు చిత్రబృందం ఇలాంటి డైలాగ్స్ పెట్టగలదా? అనేది ఇక్కడ ప్రశ్న.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)మీ సినిమాలో నా మీద డైలాగ్ పెట్టి ట్రోల్ చేసేంత మీకు నేనేం చేశాను..?#KiranAbbavaram fire on Someone in Industry!! pic.twitter.com/Albba9JfDl— Rajesh Manne (@rajeshmanne1) October 29, 2024 -
కిరణ్ అబ్బవరం 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా ఆయన కోసం సినిమా చూడండి: టాలీవుడ్ హీరోయిన్ క్యూట్ రిక్వెస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమైపోయాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీ ఈనెల 31న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.అయితే ఇటీవల కిరణ్‌ను పెళ్లాడిన హీరోయిన్ రహస్య గోరఖ్ సైతం తన భర్త ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రహస్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు ఏడాదిన్నర్రగా ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. మా పెళ్లి రోజు మినహాయిస్తే మిగతా రోజులన్నీ సినిమాతోనే బిజీగా ఉన్నారని తెలిపింది. మీ కోసం, మా టీమ్ కోసం.. అలాగే మా ఆయన కోసం ఈ సినిమా చూడండి అంటూ చాలా క్యూట్‌గా మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఏడాదిలోనే కిరణ్- రహస్య వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.'క' కథేంటంటే..'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.మా ఆయన కోసం ఈ సినిమా చూడండి 😍 - #RahasyaGhorak at #KA Pre-Release EventWatch Live Here: ▶️ https://t.co/Fgd2dNzC1vEvent by @shreyasgroup ✌️#KAonOctober31st in Cinemas Worldwide pic.twitter.com/KWwGYEWE4Y— Shreyas Media (@shreyasgroup) October 29, 2024 -
డబ్బు కోసం సినిమా రంగంలోకి రాలేదు : ‘క’ నిర్మాత
నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే సినిమా రంగంలోకి వచ్చాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి. ఆయన నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది.→ హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు.→ మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది."క" సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే.→ టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.→ పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.→ ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం. -
ఎవరు... ఏంటి... ఎక్కడ
‘‘క’ సినిమా క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాం. నాకు తెలిసి ఈ తరహా క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదు. అందుకే క్లైమాక్స్‌ను ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారని, వాళ్లు ఆ అనుభూతికి లోను కాకపోతే నేను సినిమాలు చేయననే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాను. మేం ఓ కొత్త ప్రయత్నం చేశామని ప్రేక్షకులు కచ్చితంగా అనుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను.అయితే ఈ కొత్త ప్రయత్నాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు.∙కృష్ణగిరి అనే ఊరికి పోస్ట్‌మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్ కథ ఇది. ఇతని ప్రేయసిగా సత్యభామ (నయన్) కనిపిస్తుంది. మరోటి రాధ (తన్వీ రామ్) పాత్ర. వాసుదేవ్, సత్యభామ పాత్రలతో రాధ కనెక్షన్ ఏంటి? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా కథను సుజీత్, సందీప్ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఫీలయ్యాను. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించలేకపోయాను. ‘ఎవరు... ఏంటి... ఎక్కడ’ అనే పాయింట్స్‌తో ‘క’ చిత్రం ఉంటుంది. 1970 నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా కంటెంట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. అందుకే పదే పదే మా మూవీ ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతున్నాం. ∙‘క’ అంటే కొంతమంది కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారు. కానీ ‘క’ ఏంటో సినిమా క్లైమాక్స్‌లో తెలుస్తుంది. సైకలాజికల్ సస్పెన్స్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఇక మా సినిమాకు ఇద్దరు దర్శకులు ఉండటం బాగానే అనిపించింది. ఈ సినిమాని మలయాళంలో దుల్కర్ సల్మాన్గారి నిర్మాణ సంస్థే రిలీజ్ చేయాల్సింది. కానీ ఆయన సినిమా ‘లక్కీ భాస్కర్’ మా సినిమా విడుదల తేదీనే వస్తుంది. తమిళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే ‘క’ రిలీజ్‌ను ప్రస్తుతానికి తెలుగుకే పరిమితం చేశాం. ∙ఈ మధ్యే పెళ్లి (‘రాజావారు రాణిగారు’ సినిమాలో తన సరసన హీరోయిన్గా నటించిన రహస్యా గోరక్‌ని కిరణ్ పెళ్లి చేసుకున్నారు) చేసుకున్నాను. నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. నా పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ‘క’ విజయం సాధిస్తే సంతోషంగా ఉంటుంది. -
శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం..
-
శ్రీవారి సేవలో టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మూవీ రిలీజ్‌కు ముందు శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. క మూవీ సూపర్‌హిట్ కావాలని స్వామివారికి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమలకు వచ్చిన భక్తులు తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం పీరియాడిక్ థ్రిల్లర్ క మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతకు ముందెన్నప్పుడు రానీ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ యూట్యూబ్‌లో అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ కానుంది.క కథేంటంటే..'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ. Hero @Kiran_Abbavaram visited Tirumala to seek blessings from Lord Venkateswara Swamy ahead of the grand release of #KA 🙏✨#KAonOctober31st #KiranAbbavaram #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/RMCKIKeWQd— Shreyas Media (@shreyasgroup) October 27, 2024 -
" క " తో కిరణ్ కంబ్యాక్ ఇస్తాడా..!
-
కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్
యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. గురువారం ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. దీంతో తాజాగా దాన్ని రిలీజ్ చేశారు. పూర్తి రిచ్‌నెస్‌తో థ్రిల్లింగ్‌గా భలే అనిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'క' సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. సుజీత్-సందీప్ దర్శకులు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
అందరికి నచ్చేలా కొత్తగా ట్రై చేసాం..
-
మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో.. చెప్పిన పని చేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. As promised we have arranged 4 free shows.- Hyderabad : GPR Multiplex 7:45PM Show (Contact No : 8549955111)- Vizag : Srirama Theatre 6:30PM Show- Tirupathi - Krishna Teja Theatre 6:30Pm- Vijaywada - Swarna Multiplex 6:30PM Please go watch and show your support for all the…— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2024 -
కథ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి: కిరణ్ అబ్బవరం
‘‘నేను, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా ‘లవ్ రెడ్డి’ సినిమా కోసం కష్టపడుతున్నారు. కథ నచ్చితే ఈ సినిమాను మనస్ఫూర్తిగా స΄ోర్ట్ చేయండి. నా వంతుగా ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షోని నేను స్పాన్సర్ చేస్తాను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. సునంద బి. రెడ్డి, హేమలతా రెడ్డి, రవీందర్ .జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. సుమ, సుష్మిత, హరీష్, బాబు, రవికిరణ్, జకారియా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘లవ్ రెడ్డి’ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. (చదవండి: ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ)ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అంజన్‌కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లి΄ోయే ఉద్దేశం లేదు.. తను మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు. ‘‘కథ పరంగా ‘లవ్ రెడ్డి’ పెద్ద సినిమానే’’ అని మదన్ గో΄ాల్ రెడ్డి, యశస్విని చె΄్పారు. ‘‘ఇటీవల హిందూపురంలో మా సినిమా ప్రివ్యూ వేస్తే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు స్మరణ్ రెడ్డి. ‘‘మీరు థియేటర్లోకి వెళ్లి కూర్చోండి చాలు... మా మూవీనే మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది’’ అని శ్రావణి తెలి΄ారు. ‘‘మా సినిమా నచ్చి తెలుగులో మైత్రీ మూవీస్, కన్నడలో హోంబలే ఫిలింస్ రిలీజ్ చేస్తున్నాయి’’ అని అంజన్ రామచంద్ర చె΄్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ మాట్లాడారు. -
తొలి రోజే తనతో ప్రేమలో పడిపోయా: టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'క' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. 70వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.ప్రస్తుతం 'క' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా పాల్గొన్న ఈవెంట్లో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. షూటింగ్ మొదటి రోజే తనతో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ఈ విషయం కేవలం తన సన్నిహితులకు మాత్రమే తెలుసన్నారు. మా రిలేషన్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గానే ఉంచినట్లు కిరణ్ వెల్లడించారు.కాగా.. ఆగస్టు 22న కర్ణాటకలో కూర్గ్‌లో వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. సాప్ట్వేర్ ఇంజినీర్స్ అయిన కిరణ్, రహస్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో యాక్టింగ్ సైడ్ వచ్చాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్తా.. ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు కిరణ్-రహస్య ప్రేమించుకున్నారు. -
అల్లు అర్జున్ అలా అనడం సంతోషంగా ఉంది: కిరణ్ అబ్బవరం
‘‘క’ సినిమా 70వ దశకం నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో సాగుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు, పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలున్నాయి. అందుకే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘క’ ని తెలుగులో నిర్మాత వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిలింస్‌పై రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘క’ సినిమా ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్‌కు అల్లు అర్జున్‌గారు వచ్చి.. ‘కిరణ్.. ఈ సినిమాతో నువ్వు పెద్ద హిట్ కొట్టాలి’ అని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ కథను తెరకెక్కించే క్రమంలో మేమంతా ఎలాంటి అనుభూతి పొందామో ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు’’ అని సందీప్ అన్నారు. ‘‘1970వ దశకంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగిన కథే ఈ సినిమా’’ అని సుజీత్ చెప్పారు. ‘‘ఈ నెల 30వ తేదీన ‘క’ ప్రీమియర్స్ వేయబోతున్నాం’’ అని వంశీ నందిపాటి తెలిపారు. తన్వీ రామ్, సహ నిర్మాత చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. -
Ka Movie: ఆకట్టుకుంటున్న ‘మాస్ జాతర’ పాట
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘క’. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘క మాస్ జాతర..’ పాట వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు.. ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు... ఆడు ఆడు ఆడు ఆడు ఊరు వాడ అదిరేలా ఆడు..’ వంటి లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. సానాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించిన ఈ పాటను చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్‌తో కలిసి దివాకర్, అభిషేక్ ఏఆర్ పాడారు. ఈ పాటకి ΄పొలాకి విజయ్ కొరియోగ్రఫీ అందించారు. -
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
మీడియా ముందుకు కొత్త జంట కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ (ఫొటోలు)
-
Kiran Abbavaram: రాజావారు.. రాణివారు.. జోడీ అదిరింది (ఫోటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆశీర్వాదం కావాలంటూ! (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లో బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.రహస్య గోరఖ్‌తో పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్ చేశారు. మా జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఇవీ చూసిన అభిమానులు తమ హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. రాజావారు రాణిగారు సినిమాతో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ "క" లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియావ్యాప్తంగా రిలీజ్ కానుంది. We Need all your blessings ❤️🙏 pic.twitter.com/3ibTFUuJp0— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024 -
ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,రహస్యల పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి ఈ వేడుక జరిగింది. తెలుగు సంప్రదాయంలోనే మూడు ముళ్లు వేసిన కిరణ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.(ఇదీ చదవండి: డీమాంటీ కాలనీ-2 సినిమా రివ్యూ)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సొంతంగా నిర్మిస్తున్నాడు. అంటే నిర్మాణ బాధ్యతల్ని రహస్య చూసుకుంటోంది. ఇక వీళ్లి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?)Congratulations to #KiranAbbavaram and #RahasyaGorak on your marriage! Wishing you both a lifetime of love, happiness, and togetherness. May your journey ahead be filled with joy and beautiful memories!#KA #KiranAbbavaramMarriage pic.twitter.com/lLx6tLr11s— ᏰᏗᏝᏗ (@balakoteswar) August 22, 2024Wedding bells for the hero @Kiran_Abbavaram and #RahasyaGorak 😍😍The adorable couple ties knot in the presence of near and dear ones ❤️ #KiranRahasya#KiranAbbavaram pic.twitter.com/RKQUy4uvdS— Aithagoni Raju off (@AithagoniRaju) August 22, 2024 -
#KiranAbbavaram : హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు (ఫొటోలు)
-
హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఆగస్టు 22న అంటే గురువారం జరగనుంది. కర్ణాటకలోని కూర్గ్‌లో ఈ వేడుకని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అక్కడికి చేరుకున్న పెళ్లి బృందం.. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహానికి ముందు జరిగే శుభకార్యాల్లో కాబోయే వధూవరులిద్దరూ కాస్తంత బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కిరణ్ కాబోయే భార్య రహస్య షేర్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)'రాజావారు రాణిగారు' సినిమాతో కిరణ్-రహస్య ఒకరికొకరు పరిచయం. ఆ తర్వాత కిరణ్.. ఒక్కో సినిమా చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. రహస్య మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయి ఉద్యోగం చేసుకుంటోంది. ఇక తొలి మూవీ చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఈ ఏడాది నిశ్చితార్థం జరిగే వరకు బయటపెట్టలేదు.ఇక కూర్గ్‌లోనే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే.. పెళ్లి కూతురు రహస్య బంధువులంతా అక్కడే ఉండటంతో ఆ ఊరిలో పెళ్లి ఏర్పాటు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఇండస్ట్రీలోని స్నేహితులకు హైదారాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారేమో?(ఇదీ చదవండి: ఐదు నిమిషాల పాటకి కోటి రూపాయలు తీసుకున్న తమన్నా) -
కిరణ్ అబ్బవరం పెళ్లి.. వీడియో షేర్ చేసిన యంగ్ హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ అబ్బవరం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 22న హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వీరిద్దరు కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారింది.టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం క చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచి పాటను అందించిన చిత్రబృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా పాటలకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. అలాగే ఈ సాంగ్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాటకు సంగీతం, లిరిక్స్ అందించిన టీమ్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Thank you all ☺️🙏#WorldofVasudev #KA pic.twitter.com/RDQauPl5PN— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 20, 2024 -
కూర్గ్‌లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి
టాలీవుడ్లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. కొన్నాళ్ల క్రితం తన ప్రేమించిన రహస్య గోరఖ్‌తో నిశ్చాతార్థం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైపోయారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఆగస్టు 22న కర్ణాటకలో కూర్గ్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. రహస్య బంధువులంతా ఆ ఊరిలోనే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు హీరో కిరణ్ స్నేహితులు, బంధువులు హాజరవుతారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.సాప్ట్వేర్ ఇంజినీర్స్ అయిన కిరణ్, రహస్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో యాక్టింగ్ సైడ్ వచ్చాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్త.. ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్-రహస్య ప్రేమించుకుంటున్నారు. కాకపోతే ఈ ఏడాది ఆ విషయాన్ని బయటపెట్టారు. (ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!) -
Kiran Abbavaram: గ్రాండ్‌గా హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ ఫోటోలు వైరల్
-
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్‌ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతా: కిరణ్ అబ్బవరం
‘‘ఇండస్ట్రీలో నా పని అయి΄ోయిందంటూ ఎవరైనా అంటే నమ్మకండి. నా పని అయి΄ోయిందనిపించినప్పుడు నేనే సినిమాలు చేయను. నన్ను ప్రేమించిన అభిమానుల కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్‌కానుంది. కాగా సోమవారం (జూలై 15) కిరణ్ అబ్బవరం పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన ‘క’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ మాట్లాడుతూ– ‘‘క’ చూశాక తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని ప్రేక్షకులంతా చెప్పుకుంటారు’’ అన్నారు. ‘‘క’ మూవీతో నా కల నెరవేరుతోంది’’ అన్నారు చింతా గోపాలకృష్ణా రెడ్డి. ‘‘మాలాంటి కొత్త డైరెక్టర్స్‌కు ‘క’ లాంటి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు సుజీత్. ‘‘క’ అంటే కిరణ్ అబ్బవరం అని అనుకుంటున్నారు. కానీ ‘క’ అంటే సినిమాలో ఒక ఇం΄ార్టెంట్ రోల్ ఉంటుంది’’ అన్నారు సందీప్. ఈ వేడుకలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సతీష్ వేగేశ్న, చిత్ర సహ నిర్మాత వినీషా రెడ్డితో పాటు చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడారు. -
కిరణ్ అబ్బవరం 'క' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ కరెక్టేనా?.. యంగ్ హీరో స్ట్రాంగ్ రియాక్షన్!
‘రాజావారు రాణిగారు’మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. 2019లో విడుదలైన ఈ రొమాంటిక్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో రహస్య గోరఖ్ హీరోయిన్గా నటించారు. గతేడాది మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలతో అలరించిన కిరణ్ ప్రస్తుతం క అనే మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సుజీత్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా క మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న వేశాడు. తెలుగులో మీకు పెద్ద సక్సెస్ రాలేదు.. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మూవీని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.దీనికి కిరణ్ స్పందిస్తూ.. 'నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్ మాత్రమే.. మొన్న వచ్చిన మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ను మనం పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? అంతే కాదు కాంతార సినిమాకు ముందు రిషబ్ శెట్టి గురించి మనకు తెలుసా? ఇక్కడ ఫైనల్‌గా స్థాయి అంటే కంటెంట్ మాత్రమే సార్. నా స్థాయి పెద్దదా? చిన్నదా? అనేది నెక్ట్స్? మనం సినిమాలో కంటెంట్‌కు స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్. క అనే సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నా. కంటెంట్ ఉంటే సినిమాను మీరందరూ ఎక్కడికో తీసుకెళ్తారు. అందుకే ఇతర భాషల్లోనూ తీసుకొస్తున్నాం' అని అన్నారు. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ అతనికి గట్టిగానే ఇచ్చిపడేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.#KiranAbbavaram About PAN INDIA Release✅ STRONG Counter From #KiranAbbavaram 🔥🔥🔥🔥#KA pic.twitter.com/GYyeyhFJQq— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
కొంచెం అదృష్టం కాస్త దురదృష్టం.. హీరో కిరణ్ అబ్బవరం బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్!
కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో కాస్త మెరిట్ ఉన్న నటుడు. కాకపోతే దగ్గరకొచ్చిన సినిమాలన్నీ చేసేసి వరస ఫ్లాఫులు ఎదుర్కొన్నాడు. లెక్కకు మించిన విమర్శలు వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు చేసే ఇతడు.. చాలా నెలల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దీని టీజరే ఇప్పుడు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ చూడలేకపోయాడు. దీంతో కాస్త టైమ్ తీసుకుని చేసిన పీరియాడికల్ మూవీ 'క'. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తుంటే.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.'నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..' అనే డైలాగ్‌తోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. టీజర్ కాబట్టి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రామిసింగ్‌గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్
హీరో కిరణ్ అబ్బవరం పెళ్లికి రెడీ అయిపోయాడు. తన మొదటి సినిమా హీరోయిన్నే ప్రేమించిన ఇతడు.. చాన్నాళ్ల పాటు సీక్రెట్‌గా తన బంధాన్ని మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ ఏడాది మార్చిలో తన రిలేషన్ గురించి బయటపెట్టడంతో పాటు మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లెప్పుడా అనేది ఇంకా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కిరణ్‌కి పుట్టినరోజు శుభాకాంంక్షలు చెప్పిన కాబోయే భార్య.. పెళ్లి ఎప్పుడు జరగబోతుందో బయటపెట్టేసింది.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో!)షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి 'రాజావారు రాణిగారు' మూవీతో కిరణ్ అబ్బవరం హీరోగా మారాడు. ఇందులో రహస్య గోరఖ్ అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఈ సినిమా తర్వాత కిరణ్ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోగా, రహస్య మాత్రం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోంది.కిరణ్-రహస్య గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ దాన్ని బయటపెట్టలేదు. ఈ ఏడాది మార్చి 13న ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా జూలై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా రహస్య ఓ క్యూట్ రొమాంటిక్ వీడియోని పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పింది. అలానే భర్త అనే పిలిచేందుకు తెగ వెయిట్ చేస్తున్నానని, దీనికి మరో 38 రోజులే ఉందని రాసుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే ఆగస్టు 22న కిరణ్-రహస్య పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.(ఇదీ చదవండి: మీరు లేకపోతే నేను లేను : ప్రభాస్ స్వీట్ వీడియో) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) -
మారాల్సింది దుర్మార్గమైన ట్రోలర్స్ మాత్రమే
-
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఒక్క అక్షరంతో టైటిల్
టాలీవుడ్ యువహీరో కిరణ్ అబ్బవరం చాలారోజుల తర్వాత కొత్త మూవీని ప్రకటించారు. 'క' అనే ఒక్క అక్షరం మాత్రమే టైటిల్ పెట్టినట్లు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశాడు. పీరియాడికల్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)దర్శక ద్వయం సుజీత్, సందీప్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్. ఇకపోతే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణ మండపం'తో పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాతే వరస సినిమాలు చేశాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త టైమ్ తీసుకుని ఇప్పుడు 'క' చిత్రాన్ని ప్రకటించాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్) -
రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా!
మొన్నటి వరకు వరస సినిమాలతో అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట.ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. -
జాతరలో మాస్ స్టెప్పులేసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
కిరణ్ అబ్బవరం.. మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారడమే కాకుండా.. అతి తక్కువ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్లలో కూడా సినిమాలు చేశాయి. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కిరణ్ కాస్త వెనకడుగు వేశాడు. సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో కిరణ్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాలేదు. ఖాలీ సమయం దొరకడంతో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు. తొలి సినిమా రాజావారు..రాణిగారు హీరోయిన్ రహస్యనే తాను పెళ్లాడబోతున్నాడు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది మార్చి 13న నిశ్చితార్థం చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేశారు. ఇదిలా ఉండగా.. కిరణ్ ప్రస్తుతం తన సొంతూరు రాయచోట్లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నాడు. గుడికి వెళ్లడమే కాకుండా.. స్నేహితులతో కలిసి మాస్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. హీరో అయినప్పటికీ..తనకున్న ఇమేజ్‌ని పక్కకు పెట్టి గ్రామీణ యువకుడిలా వీధుల్లో చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by ꧁•⊹٭𝚂𝚞𝚛𝚎𝚜𝚑٭⊹•꧂ (@suresh__rayachoti_143) -
Kiran Abbavaram Photos: 'బాబాయ్ హోటల్'ని ప్రారంభించిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకున్నాడు. తనతో పాటు తొలి సినిమాలో హీరోయిన్గా చేసిన రహస్య గోరఖ్‌నే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కిరణ్-రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో రహస్య.. కిరణ్‌తో ఆరేళ్ల ప్రేమ గురించి బయటపెట్టింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్.. 'రాజావారు రాణిగారు' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ తర్వాత రహస్య.. నటనని పక్కన పెట్టేసింది. కిరణ్ అబ్బవరం మాత్రం పలు చిత్రాల్లో నటించి హీరోగా కాస్తంత పేరు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇద్దరిలో వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిశ్చితార్థంతో వీళ్ల ప్రేమ నిజమేనని అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) ఈ క్రమంలోనే తాజాగా కిరణ్-రహస్య నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో మార్చి 13న జరిగింది. ఇది అయిన ఓ రోజు తర్వాత అంటే మార్చి 14న కిరణ్‌తో తన ప్రయాణం గురించి ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. 'ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ప్రేమలో పడ్డాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్‌కి వెళ్లాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఏదైతేనేం మనది అద్భుతమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర్వస్వం కిరణ్ అబ్బవరం' అని రహస్య గోరఖ్ రాసుకొచ్చింది. అయితే వీళ్ల పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
Kiran Abbavaram Engagement Photos: గ్రాండ్ కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం!
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లేవారు. తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న మన యంగ్ హీరోకు ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. #TFNReels: Visuals from the engagement ceremony of @Kiran_Abbavaram & @rahasya_gorak!💍💕#KiranAbbavaram #RahasyaGorak #TeluguFilmNagar pic.twitter.com/HdVJmyV9mC — Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2024 -
హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి.. ఎల్లుండే నిశ్చితార్థం?
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లేవారు. ప్రేమకు రెడీ దీన్ని గుట్టుచప్పుగా ఉంచేందుకే ప్రయత్నించేవారు. కానీ ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల బ్యాగ్రౌండ్లో లొకేషన్ ఒకటే ఉండటంతో ఈ ప్రేమపక్షులు కలిసే వెళ్లారని అభిమానులు ఇట్టే పసిగట్టేవారు. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకుంటున్న వీరు తమ ప్రేమను అఫీషియల్‌గా ప్రకటించనున్నారట. అది కూడా పెళ్లి బంధంతో! ఐదేళ్లుగా లవ్.. రహస్యను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడట కిరణ్ అబ్బవరం! బుధవారం (మార్చి 13) నాడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: నా షోలోకి ఉపాసన, సురేఖలను తీసుకొస్తా.. వారితో వంట చేయిస్తా.. -
ఏడాది పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో హిట్ మూవీ!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించాడు. వినరో భాగ్యము విష్ణుకథ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వచ్చిన రూల్స్ రంజన్, మీటర్ చిత్రాలతో ఫర్వాలేదనిపించాడు. గతేడాది ఫిబ్రవరి 18న విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అద్భుతమైన నటనతో మెప్పించారు. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన దిల్ రూబా అనే సినిమాతో పాటు సొంత ప్రొడక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో సినిమా రిలీజ్ కావడం లేట్.. డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ఎప్పుడొచ్చేస్తుందా? అని ప్రేక్షకుల వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చి చాలా వారాలపోయింది. అందరూ దీని గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలో తీసుకొస్తున్నారనే న్యూస్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఇంతకీ ఏ సినిమా? తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఓ యంగ్ హీరో. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' పర్లేదులే బాగానే చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత పలు అగ్ర నిర్మాణ సంస్థలతో పనిచేశాడు. కానీ నో యూజ్. అన్ని సినిమాలు బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి ఫెయిలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 6న 'రూల్స్ రంజన్' చిత్రంతో కిరణ్.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఏ విషయంలో ఈ సినిమా అలరించలేకపోయింది. ఓటీటీలోకి ఎప్పుడు? 'సమ్మోహనుడా' పాటతో పాటు ఒకటో రెండో కామెడీ సీన్స్ మాత్రమే బాగా తీసిన ఈ సినిమాని.. రిలీజ్ అయిన కొన్నిరోజులకే ఓటీటీలోకి తెచ్చేసి ఉంటే బాగుండేది. కానీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ తేదీ కంటే ముందు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఓ ఫ్లాప్ సినిమాని ఇన్నిరోజులు దాచిపెట్టడం విచిత్రంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!) -
హీరోయిన్ తో రహస్యంగా లవ్ !
-
హీరోయిన్‌తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇదే మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్. ఈ చిత్రం హీరోహీరోయిన్లుగా వీరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే రాజావారు రాణిగారు షూటింగ్ సమయంలో కిరణ్, రహస్యల మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారిందని టాక్ నడిచింది. సోషల్ మీడియాలో వీరిని లవ్ బర్డ్స్‌గా పేర్కొంటూ ఎన్ని వార్తలు వచ్చినా వీరిద్దరు మాత్రం పట్టించుకోలేదు. కలిసి వెకేషన్‌కు? ఆ మధ్య కిరణ్ వెకేషన్‌కు వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అటు రహస్య కూడా అదే లొకేషన్లో దిగిన ఫోటో షేర్ చేయడంతో వీరిద్దరూ కలిసే షికారుకు వెళ్లారని తేలిపోయింది. ఆ తర్వాత కిరణ్ గృహప్రవేశ వేడుకలోనూ సందడి చేయడంతో వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని అభిమానులు ఫిక్సయిపోయారు. తాజాగా మరోసారి దొరికిపోయాడు కిరణ్ అబ్బవరం. తెగ సిగ్గుపడిపోయిన హీరో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దావత్ అనే కొత్త షోను మొదలుపెట్టింది. ఈ షోలోకి కిరణ్ మొదటి గెస్టుగా విచ్చేశాడు. ఇక వచ్చీరావడంతోనే తన లవ్ లైఫ్ గురించి అడిగేసింది హోస్ట్ అషూ రెడ్డి. రహస్య గోరఖ్, మీరు రిలేషన్లో ఉన్నారా? అని అడగడంతో అలాంటిదేమీ లేదని, అలాంటిదేదైనా ఉంటే చెప్తామని బదులిచ్చాడు. చెప్తాము అంటున్నారంటే ఇద్దరూ కలిసి ఒకేసారి పెళ్లి డేట్ ఎప్పుడో చెప్తారా? అని ఆటపట్టించింది అషూ. దీంతో సిగ్గుపడిపోయిన కిరణ్.. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడూ ఇంతలా దొరికిపోలేదు అని చెప్పుకొచ్చాడు. దొరికిపోయాను అంటున్నాడంటే నిజంగానే వీరిద్దరూ లవ్‌లో ఉన్నట్లేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: గడగడలాడిస్తోన్న శోభా శెట్టి, గయ్యాలి గంపలా నోరేసుకుని సాధిస్తోంది! ఆఖరికి అర్జున్ కూడా.. -
కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా 'నరకాసుర' సాంగ్ రిలీజ్
'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) తాజాగా 'నరకాసుర' నుంచి 'గ్రీవము యందున' అనే లిరికల్ పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్స్‌లో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాట, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) -
‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ
టైటిల్: రూల్స్ రంజన్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు నిర్మాణ సంస్థ : స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి దర్శకత్వం: రత్నం కృష్ణ సమర్పణ : ఏఎం రత్నం సంగీతం: అమ్రీష్ విడుదల తేది: అక్టోబర్ 06, 2023 ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ, సరైన హిట్ పడడం లేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘రూల్స్ రంజన్’ చేశాడు. నేహా శెట్టి హీరోయిన్. ‘సమ్మోహణుడా’ అనే ఒకే ఒక పాట..ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 06) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన సహోద్యోగులంతా అతనితో ఆడుకుంటారు. దీంతో మనో రంజన్ అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకుంటారు. ఓ సారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్‌తో సహా అంతా మనో రంజన్‌పై ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్‌తో సహా మిగతా ఉద్యోగులంతా చేస్తారు. తను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా నాలుగేళ్లు గడిచిన తర్వాత.. తనకు సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? సన కోసం విలేజ్‌కి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు సన, రంజన్ ఎలా కలిశారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీని కంటే ముందు హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక మనో రంజన్ కాస్త రూల్స్ రంజన్‌గా ఎలా మారాడు అనేదే కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాల్టీకీ చాలా దూరంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ముంబైలో సాగితే.. సెకండాఫ్ విలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హైపర్ ఆది, సుదర్శన్, హర్షలతో వచ్చే కామెడీ సీన్స్ కాస్త వినోదాన్ని పంచుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలా నిట్టూర్పుగా ఉన్న ప్రేక్షకులకు ‘సమ్మోహనుడా’ సాంగ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాకు ఈ పాట చాలా ప్లస్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథలను మరింత బలంగా రాసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. మనోరంజన్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు అతనికి కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే అమాయకపు మాటలతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కిరణ్ పాత్ర తీరు.. డైలాగ్స్.. అన్నీ గత సినిమాలను గుర్తు చేస్తాయి. సనగా నటించిన నేహాశెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ కాలేదు. హీరో చిన్ననాటి స్నేహితులుగా హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. అమ్రీష్ సమకూర్చిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఒక్కటే బాగుంది. మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువసు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.25/5 -
రూల్స్ రంజన్ ట్విటర్ రివ్యూ.. కిరణ్ సినిమాకు అలాంటి టాక్!
హీరో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఏఎం రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలోని సమ్మోహనుడా పాట రూల్స్ రంజన్‌కు బాగా హైప్ తీసుకువచ్చింది. మరి రూల్స్ రంజన్ బాక్సాఫీస్‌ను రూల్ చేసేలా ఉందా? సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందనేది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల ప్రివ్యూలు పడిపోవడంతో జనాలు సినిమా ఎలా ఉందనేది ఎక్స్ (ట్విటర్) వేదికగా చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్ అస్సలు బాగోలేదని, కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాదని అంటున్నారు. పర్లేదు, ఒకసారి చూడవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ఫ్యాన్స్ మాత్రం హిట్టు కొట్టేశామని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రూల్స్ రంజన్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది. పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఎలా ఉందో చెప్పలేం.. oreyyyy apaaandroiiiiiii, entha sepu ra babu avvatle ee movie #RulesRanjann pic.twitter.com/Szuz8JLjCn — Jayyyyy (@movieloverrrr_) October 6, 2023 #RulesRanjann hilarious first half 😅 #KiranAbbavaram Vennela Kishore episodes bestttt confirm hit 😎 — Shiva Shankar (@Shivananda08) October 6, 2023 1st Half Report : Alaa amayakudi laa start ayyi.. 👨💼 mumbai.. 😁 Alexaaaa 😛 Cringee comedy.. 👎👎 Ruless... 🤷♂️Songs 👎🏃🏻Kishore kaka.. 👍Ala.. ala.. Okayish interval 🚶🏻♂️Overall a below par first half 🤷♂️ @tollymasti #tollymasti#RulesRanjann #KiranAbbavaram #RulesRanjan — Tollymasti (@tollymasti) October 6, 2023 Asalu baley movie cringe comedy #RulesRanjann — MB Ka HUKKUM 🦁 (@Radobom9) October 6, 2023 Done with my show...Entertaining comedy with family drama episodes. Simple storyline with ample fun lines by Kiran Abbavaram and Vennela Kishore goes well. Stimulating looks by Kiran and Neha Shetty in Sammohanuda song is one of the strength. 2.5/5 #RulesRanjann — Peter Reviews (@urstrulyPeter) October 6, 2023 Utter flop #RulesRanjann 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/rQOnzMbTvg — rajesh! (@rajeshs0905) October 6, 2023 -
మాకు మంచి సింక్ కుదిరింది
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘రూల్స్ రంజన్’. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ– ‘‘రూల్స్ రంజన్’ కథను నవీన్ ΄÷లిశెట్టికి చె΄్పాలనుకున్నాను. కుదరక΄ోవడంతో కిరణ్ అబ్బవరంకు వినిపించాను. కిరణ్‌కు కథ నచ్చడంతో ఈ సినిమాను ఆరంభించాం. కథా చర్చల్లో భాగంగా కిరణ్ మంచి క్రియేటర్ అని అర్థం అయ్యింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. ఈ చిత్రం ఫస్టాఫ్ క్లాస్‌గా, సెకండాఫ్ మాస్‌గా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా మొదలై, సెకండాఫ్‌లో ఫ్యామిలీ టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమా రషెస్‌ను నాన్నగారి (ప్రముఖ నిర్మాత ఏయం రత్నం)తో ΄ాటు, నా శ్రేయోభిలాషులు, కిరణ్ సన్నిహితులు చూసి, హాయిగా నవ్వుకున్నారు. ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. అయితే నాన్నగారి ్ర΄÷డక్షన్ వ్యవహారాలు చూస్తుంటాను కాబట్టి డైరెక్షన్‌కి గ్యాప్ వచ్చింది. ఇక నా తమ్ముడు రవికృష్ణ నటించిన ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా రీ రిలీజ్‌కు మంచి స్పందన వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా సెకండ్ ΄ార్ట్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని అన్నారు. -
Kiran Abbavaram: తిరుమల శ్రీవారి సేవలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం
-
ఆ రోజులు గుర్తొచ్చాయి
‘‘రూల్స్ రంజన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు. ► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్ రంజన్’ కథ మంచి విజువల్ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు, వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి. ► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్ కల్చర్, ఆఫీస్ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్ సాంగ్. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను. -
రతికలాంటి భార్య రావాలి.. హీరోను ఆడేసుకున్నారుగా!
బిగ్‌బాస్ హౌస్.. ఒక పాఠశాల. ఇందులో వయసు, వృత్తితో సంబంధం లేకుండా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కొందరు పాఠాలు నేర్చుకుంటారు, మరికొందరు గుణపాఠంగా మిగులుతుంటారు. ఈ సీజన్లోనూ అదే జరిగింది. మొదట్లో మెరుగ్గా రాణిస్తుందనుకున్న రతిక రోజ్.. ఊహించని ప్రవర్తనతో, కుటిల బుద్ధి చూపించడంతో సడన్‌గా ఎలిమినేట్ అయిపోయింది. అది ఆమెకు పాఠమైతే.. వెన్నుపోట్లు ఎంత ప్రమాదకరమో, ఎలా ప్రవర్తిస్తే జనాలు తీవ్రంగా ఖండిస్తారో, అసలు ఒక అమ్మాయి ఎలా ఉండకూడదో ఆమెను చూసి నేర్చుకోవచ్చని.. తన జర్నీ ఒక గుణపాఠమని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక గంట ఎపిసోడ్ చూసి ఆమె తప్పు చేసిందని, ముమ్మాటికీ ఆమెది తప్పేనని ముద్ర వేస్తున్నారు. అక్కడివరకు ఆగిపోతే సరి, కానీ నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే హీరో కిరణ్ అబ్బవరం వరకు! కిరణ్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎక్స్(ట్విటర్)లో అభిమానులతో ముచ్చటించాడు. కొందరు సరదా ప్రశ్నలు వేస్తే మరికొందరు దొరికిందే ఛాన్సని సెటైర్లు కూడా వేస్తున్నారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలు, కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు. దీనికి కిరణ్ స్పందిస్తూ.. ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం.. కానీ, ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం.. అని రిప్లై ఇచ్చాడు. 'హీరోలా ఉన్నావ్ అన్నా' అన్న కామెంట్‌కు హీరోలా లేకపోయినా పర్లేదు, మీలో ఒకడిలా ఉంటే చాలు అని కౌంటర్ ఇచ్చాడు. #AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV — Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023 #Askkiranabbavaram #RulesRanjann https://t.co/JfFvmxmPrR pic.twitter.com/AOiaLfM8pJ — Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023 చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక.. -
ఆ పాట నాకో సవాల్
‘‘రూల్స్ రంజన్’ రొటీన్ అబ్బాయి–అమ్మాయిల కథ కాదు. విభిన్నమైన చిత్రం’’ అని నేహా శెట్టి అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘మెహబూబా’ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాను. తిరిగొచ్చాక ‘డీజే టిల్లు’కి చాన్స్ వచ్చింది.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ చేశాను. రెండూ విజయం సాధించాయి. ‘రూల్స్ రంజన్’లో సన పాత్ర ΄ోషించాను. ఇందులో ‘సమ్మోహనుడా..’ పాటకి డ్యాన్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ పాట వాన బ్యాక్‌డ్రాప్‌లోనూ సాగుతుంది. వాన పాటల విషయానికొస్తే.. నాకు శ్రీదేవిగారు గుర్తుకు వస్తారు. చిన్న వయసులో సినీ జీవితాన్ని ్రపారంభించి ఉన్నత స్థాయికి చేరారామె. నటిగా ఆమెలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
ట్రోల్స్ పట్టించుకోను.. సంవత్సరం టైమ్ ఇవ్వండి: కిరణ్ అబ్బవరం
ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. అలా ఆయన ఎస్. ఆర్. కల్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మినిమమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా తర్వాత ఆయనకు అనుకున్నంత హిట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కిరణ్‌పై పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా కిరణ్ నటించిన ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో తన కెరీర్, ఆన్లైన్ ట్రోలింగ్‌పై మాట్లాడారు. 'చాలా మంది నాపై ట్రోల్స్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో నా ఫ్యాన్స్ ఎంతో అండగా నిలబడ్డారు. గొప్ప సినిమాలు తీయాలని నాకు ఉంది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ మధ్య కాలంలో అంత మంచి సినిమాలను అందించలేకపోయాను. ఒక సంవత్సరం సమయం ఇవ్వండి మిమ్మల్ని (ఫ్యాన్స్) గొప్ప స్థానంలో నిలబెడుతాను. సరైన విజయం సాధించి అందరినీ గర్వపడేలా చేస్తాను. సినిమాపై ట్రోల్స్,రివ్యూలు రావడం సహజం. (ఇదీ చదవండి: శివాజీ తిక్క కుదిర్చిన బిగ్‌బాస్.. ఇచ్చింది లాగేసుకున్నాడు!) ఒక్కోసారి అది సినిమాపై ప్రభావం కూడా చూపుతుంది. వ్యక్తిగతంగా పట్టించుకోకపోయినా సినిమాపై ప్రభావండ పడకూడదని నేనే కోరుకుంటాను. ఇకపై ట్రోల్స్ గురించి పట్టించుకోను. ప్రశంసలు, విమర్శలు అనేది చలనచిత్ర సెలబ్రిటీ జీవితంలో ఒక భాగం.' అని ఆయన అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. -
సొంతింటి కల నిజం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
ఇప్పుడున్న టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఈ పరిచయం అక్కర్లేని పేరు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు చిత్రంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నారు. అనంతరం సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ అంటూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!) ఇకపోతే సొంతింటి కల అనేది సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మైల్స్టోన్. అయితే తాజాగా మన హీరో కిరణ అబ్బవరం సొంతింటి కలను నిజం చేసుకున్నారు. కానీ కిరణ్ తన సొంత ఊర్లోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఇదే..!
-
కాస్త ఆలస్యంగా రూల్స్ రంజన్
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. కాగా ఈ సినిమాను ఇటీవల ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అక్టోబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. మెహర్ చాహల్, ‘వెన్నెల’ కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది,‘వైవా’ హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్ -
మనోరంజన్ కాదు.. పబ్ రంజన్..ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు
‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ (గోపరాజు రమణ). ‘బీర్ ఓకే’ (కిరణ్ అబ్బవరం) అనే సంభాషణలతో మొదలవుతుంది ‘రూల్స్ రంజన్’ ట్రైలర్. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా ఆఫీస్‌లో వీకెండ్స్ వస్తే నన్ను ఏమంటారో తెలుసా.. మనోరంజన్ కాదు.. పబ్ రంజన్ అంటారు (కిరణ్ అబ్బవరం), ‘ఈ రూల్స్ రంజన్ పంబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్, సహనిర్మాత: రింకు కుక్రెజ. -
‘రూల్స్ రంజన్’గా వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం
‘‘రూల్స్ రంజన్’ కథ వింటున్నప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు ఏఎం రత్నం వెల్లడించి, మాట్లాడుతూ– ‘‘నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. మా ‘రూల్స్ రంజన్’కి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘ఏఎం రత్నంగారి ఆశీస్సులతో ముందడుగు వేశాం’’ అన్నారు దివ్యాంగ్, మురళీ కృష్ణ. -
'రూల్స్ రంజన్' కొత్త పాట
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్ ’. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని ‘ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఆలపించగా, శిరీష్ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Rules Ranjann: ఆకట్టుకుంటున్న ‘'ఎందుకురా బాబు' పాట
హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రూల్స్ రంజన్'. నేహా శెట్టి హీరోయిన్. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. 'ఎందుకురా బాబు' అంటూ సాగే ఈ పాటకి కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ అద్భుతంగా ఆలపించారు. 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటల మాదిరిగానే అమ్రిష్ గణేష్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. వినోదనమే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. -
సమ్మోహనుడా... అంటూ సాగే పాటను విడుదల చేశారు
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏయమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా...’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. రాంబాబు గోసాలతో కలిసి రత్నం కృష్ణ ఈ పాటకి సాహిత్యం అందించగా, శ్రేయా ఘోషల్ పాడగా, శిరీష్ కొరియోగ్రఫీ అందించారు. -
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు మాంచి హైప్ క్రియేట్ చేసినా బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ మాత్రం తారుమారు అయ్యింది. చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. మే 5 నుంచి మీరట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ లెక్కన సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. కిరణ్ అబ్బవరంకు జోడీగా కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి నటించింది. కాగా కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఓ మల్టీస్టారర్ మూవీలో ఆయన నటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరో మూడు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నారు కిరణ్. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? -
స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం మల్టీస్టారర్!
వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు తన చిత్రాల్లో కొన్నింటికి కథలు కూడా రాసుకుంటున్నారాయన. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలకు కథ అందించిన కిరణ్ తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది) ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రంలో కిరణ్ కూడా ఓ హీరోగా నటించనున్నారు. నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఓ పెద్ద సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించ నున్నారు కిరణ్. కాగా రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ విడుదలకు సిద్ధం అవుతోంది. -
‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
యంగ్ టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్. రివేంజ్ డ్రామాతో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమా శుక్రవారం(ఏప్రిల్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేష్ కదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడిగా అతుల్యా రవి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంటోంది. రొటీన్ రివెంజ్ ఫార్ములా ఉందంటూ ఓ వర్గం ప్రేక్షకులు సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలల తర్వాతే ఏ చిత్రమైన ఓటీటీలోకి వస్తుంది. ఈ లెక్కన మే మొదటి వారంలో మీటర్ ఓటీటీకు రానుంది. కానీ ఈ మధ్య సినిమా ఫలితాన్ని బట్టి డిజిటల్లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే విడుదలైన నెల రోజులకే ఓటీటీ బాటపడుతున్నాయి. మరి మీటర్ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. మీటర్ కథేమిటంటే... ఇష్టం లేకపోయినా తండ్రి కోరిక మేరకు పోలీస్ జాబ్‌లో(ఎస్ఐగా) జాయిన్ అవుతాడు అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). అయితే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఎలక్షన్స్‌లో గెలిచి తిరిగి అధికారం చేపట్టేందుకు హోమ్ మినిస్టర్ బైరెడ్డి వేసిన ఓ ప్లాన్ కారణంగా అర్జున్ కళ్యాణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్‌తో రమేష్ కదూరి మీటర్ సినిమాను రూపొందించారు. -
Meter Movie Review: 'మీటర్' మూవీ రివ్యూ
టైటిల్: మీటర్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు దర్శకుడు : రమేష్ కడూరి సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: ఏప్రిల్ 07, 2023 టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ అంటూ అలరించిన ఈ యంగ్ హీరో మరోసారి 'మీటర్'తో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన 'మీటర్' ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు రమేశ్ కడూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అర్జున్ కల్యాణ్( కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ కానిస్టేబుల్. వెంకటరత్నం కానిస్టేబుల్‌గా ఎంతో నిజాయితీగా పనిచేస్తుంటాడు. అందువల్ల డిపార్ట్మెంట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. తన కుమారున్ని ఎప్పటికైనా ఎస్సైగా చూడాలనేదే ఆయన కోరిక. కానీ హీరోకు పోలీస్ జాబ్ చేయడం ఇష్టముండదు. కానీ అనూహ్యంగా ఎస్సై జాబ్‌కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరుతాడు. ఎప్పుడెప్పుడు జాబ్ మానేయాలా? అని ఎదురుచూసే అర్జున్‌కు ఊహించని విధంగా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో అబ్బాయిలంటేనే ఇష్టం లేని అతుల్య రవితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. అబ్బాయిలంటేనే గిట్టని అమ్మాయిని మన హీరో ఎలా పడగొట్టాడు?ఇష్టంలేని పోలీస్ జాబ్‌లో కొనసాగాడా? హోం మినిస్టర్ కంఠం బైరెడ్డి (ధనుశ్ పవన్)తో హీరోకు వివాదం ఎందుకు మొదలైంది? హోం మినిస్టర్‌తో ఉన్న వివాదం నుంచి అర్జున్ కల్యాణ్ ఎలా బయటపడ్డాడు? మరి చివరికి తండ్రి ఆశయాన్ని హీరో నెరవేర్చాడా? లేదా? అన్నదే అసలు కథ. కథనం ఎలా సాగిందంటే.. కథ విషయానికొస్తే హీరో బాల్యంతో కథ మొదలవుతుంది. చిన్నతనంలోనే ఎస్సై కావాలన్న తండ్రి కోరికను కాదనలేడు.. అలా అని ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఈ రెండింటి మధ్యలో హీరో నలిగిపోతుంటాడు. ఇష్టం లేకపోయినా ఎస్సై కావడం, ఆ మధ్యలో హీరోయిన్ అతుల్య రవితో పరిచయం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ కమిషనర్‌గా పోసాని కృష్ణమురళి, హీరోకు మామగా సప్తగిరి కామెడీ ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో అర్జున్ కల్యాణ్‌కు వివాదం రొడ్డకొట్టుడులా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో కథను అదే కోణంలో తీసుకెళ్లాడు డైరెక్టర్ రమేశ్. కథలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. హీరోకు, విలన్‌కు మధ్య సీన్స్ సాదాసీదాగా ఉంటాయి. క్లాస్‌కు భిన్నంగా కిరణ్ అబ్బవరాన్ని మాస్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే తండ్రి, కుమారుల మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్ కాస్త పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలన్న హోంమినిస్టర్ కంఠం బైరెడ్డితో.. హీరో మధ్య జరిగే సన్నివేశాల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. కథలో చాలా సన్నివేశాలు లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీతో పర్వాలేదనిపించాడు. కామెడీ సన్నివేశాల పరంగా డైరెక్టర్ ఓకే అనిపించాడు. పక్కా కమర్షియల్ మూవీ అయినా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు విఫలమైనట్లు కనిపిస్తోంది. ఎవరెలా చేశారంటే.. హీరో కిరణ్ అబ్బవరం క్లాస్‌కు భిన్నంగా ప్రయత్నించాడు. మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతుల్య రవి తన గ్లామర్, పాటలతో అదరగొట్టింది. సప్తగిరి తన కామెడీతో మరోసారి అలరించాడు. పోసాని కృష్ణమురళి పోలీస్ కమిషనర్ పాత్రలో కామెడీ చేస్తూ అదరగొట్టాడె. విలన్‌గా ధనుశ్ పవన్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేశారు. దర్శకుడు రమేశ్ కథపై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా ఉన్నాయి. సాయి కార్తీక్ సంగీతం పర్వాలేదు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. -
నాని దసరా ..కిరణ్ అబ్బవరం మీటర్ ..పబ్లిక్ టాక్ మాములుగా లేదు
-
సిల్వర్ స్క్రీన్ మీదకు మరో షార్ట్ ఫిల్మ్ హీరో
మీటర్ సినిమాతో తన కల నెరవేరిందంటున్నాడు నటుడు కుమార్ కాసారం. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమాలో కుమార్ కాసారంకు మంచి పాత్ర లభించింది. యూట్యూబ్‌లో కుమార్ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అవ్వడంతో దర్శకుడు రమేశ్ ‘మీటర్’లో నటించే అవకాశం ఇచ్చారట. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కిరణ్ మాట్లాడుతూ.. కుమార్ కాసారంపై ప్రశంసలు కురించాడు. అతనితో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ జర్నీని గుర్తు చేసుకుంటూ.. కుమార్ చాలా ప్రతిభావంతుడని కితాబిచ్చాడు. ‘మీటర్’ ప్రిరిలీజ్ తర్వాత తనకు వరుస ఆఫర్లు వస్తున్నాయని కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఓ చిత్రాన్ని పూర్తి చేశానని.. త్వరలోనే ఓ కొత్త బ్యానర్లో మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ‘కుమార్ కాసారం’కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, సినిమాలపై అతని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. సినిమా పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. మజిలీ, ఓ బేబీ, సర్ & కొండ వంటి సినిమాల్లో యాక్టర్ గా నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు. మరి షార్ట్ ఫిల్మ్ హీరో సిల్వర్ స్క్రీన్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. -
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
రవితేజ, నానీగార్ల తర్వాత కిరణ్ అబ్బవరమే: గోపిచంద్ మలినేని
‘రవితేజ, నానీగార్ల తర్వాత ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్. అతని ప్రధాన బలం సహజమైన నటన, డైలాగ్ డెలివరీ. ‘మీటర్’తో తనకి మాస్ హిట్ రావాలి’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మీటర్’. రమేష్‌గారు ఈ సినిమాలో నన్ను వైవిధ్యంగా చూపించారు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి.. నన్ను నమ్మండి’’ అన్నారు. ‘‘మీటర్’ ప్రీమియర్ చూశాను.. చాలా బావుంది. ఈ వేసవిలో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు రమేష్ కడూరి. -
రవితేజ, నాని లా కిరణ్ అబ్బవరం దూసుకుపోతున్నాడు
-
రామ్ చరణ్ షూటింగ్ ఉన్నప్పుడు కిరణ్ ని పోలీసులు పట్టుకొని బయటకు తీసుకొచ్చారు
-
బుచ్చిబాబు,రామ్ చరణ్ సినిమా పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
-
కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక బడ్జెట్ మూవీ ‘మీటర్’: చెర్రీ
‘‘కథ పరంగా ‘మీటర్’ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు.. కమర్షియల్‌గా కూడా చూపించొచ్చు. డైరెక్టర్లు బాబీ, గోపీచంద్ మలినేని వద్ద పని చేసిన అనుభవంతో దర్శకుడు రమేష్ ‘మీటర్’ని కమర్షియల్ ఎంటర్టైనర్గా చక్కగా తీశాడు’’ అని నిర్మాత చిరంజీవి (చెర్రీ) అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘మా క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ‘ఒక్కడున్నాడు, మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీశాం. తొలిసారి కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందని ‘మీటర్’ చేశాం. చాలా బలమైన కథతో రమేష్ ఈ సినిమాని తీశాడు. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చూసి కిరణ్‌ని ‘మీటర్’కి తీసుకున్నాం. ఏ పాత్ర అయినా చేయగల సత్తా ఉన్న నటుడు కిరణ్. తన కెరీర్లో అత్యధిక బడ్జెట్ మూవీ ఇది. ప్రయోగాత్మక చిత్రాలకు మంచి పేరు రావచ్చు కానీ డబ్బులు రావు. ‘మీటర్’ లాంటి మూవీస్‌కి సినిమా బావుందంటే మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఓటీటీల ప్రభావం థియేటర్స్పై పెద్దగా ఉండదు. సినిమా బావుంది అంటే తప్పకుండా థియేటర్లకి వెళతారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల రిలీజైన ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’. చిన్న సినిమాలకు స్కోప్ లేదని నేనెప్పుడూ అనుకోలేదు. మంచి కథ కుదిరితే మళ్లీ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం రితేష్ రానా దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. -
'అడ్డేలేదు.. అడ్డాలేదు'.. ఆసక్తిగా పెంచుతోన్న టైటిల్ సాంగ్
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ హీరోయిన్ అతుల్య రవి జోడీగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'అడ్డేలేదు.. అడ్డాలేదు.. పడిలేచాడో ఉప్పెనలా ఒడ్డేలేదు' అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సాంగ్‌ను జనగామ డీసీపీ సీతారాం చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, అతల్యరవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. -
'మీటర్'కు అనుకున్నదానికంటే ఎక్కువే బడ్జెట్ అయ్యింది : డైరెక్టర్
‘మీటర్’ మంచి ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా అంతా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది’’ అని డైరెక్టర్ రమేష్ కడూరి అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రూపొందిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా రమేష్ కడూరి మాట్లాడుతూ– ‘‘నాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేనిగార్ల వద్ద సహాయ దర్శకుడిగా చేశాను. ‘మీటర్’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కరోనా లాక్ డౌన్ తర్వాత ‘మీటర్’ ఓకే అయ్యింది. ఈ మూవీలో కిరణ్ వైవిధ్యమైన పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సెకండాఫ్‌లో ఓ పది నిమిషాలు ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఆ పది నిముషాలు థియేటర్లో రఫ్ఫాడిస్తాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్ నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైనా వెనకడుగు వేయని చెర్రీ, రవిశంకర్, నవీన్‌గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. – రమేష్ కడూరి -
ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌తో మీటర్ ట్రైలర్.. దుమ్ములేపిన కిరణ్ అబ్బవరం
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ ఆసక్తిగా మలిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈసారి లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందులోనిపవర్ ఫుల్ డైలాగ్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్‌గా నిలిచింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది. -
ఇంత అభిమానం ఊహించలేదు: అతుల్యా రవి
‘‘మీటర్’ పక్కా కమర్షియల్ మూవీ. పాటలు, డ్యాన్సులు, మాస్ ఫైట్స్, రొమాన్స్, లవ్.. ఇలా అన్ని అంశాలుంటాయి. తండ్రి సెంటిమెంట్ కీలకంగా ఉంటుంది’’ అని హీరోయిన్ అతుల్యా రవి అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా అతుల్యా రవి మాట్లాడుతూ– ‘‘తమిళంలో చాలా సినిమాల్లో నటించాను. తెలుగు పరిశ్రమలోకి రావాలని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి ప్రముఖ సంస్థలు నిర్మించిన ‘మీటర్’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అబ్బాయిలంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాను. అయితే నా పాత్ర ఫస్ట్ హాఫ్‌లో కామెడీగా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి హ్యాపీగా ఉంది.. ఇంత అభిమానం ఊహించలేదు. ప్రస్తుతం తమిళ్లో ‘డీజిల్’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
కిరణ్ అబ్బవరం 'మీటర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు. ఏప్రిల్ 17న మీటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈనెల 29న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. #Meter is all set to hit its maximum levels with MASS and ENTERTAINMENT 🔥🔥#MeterTrailer Blasting on 29th March 💥💥#MeterOnApril7th @Kiran_Abbavaram @AthulyaOfficial #RameshKaduri #SaiKartheek @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/zE9WwGX2Mw — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2023 -
సెంటిమెంట్.. యాక్షన్
శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని అన్నారు. -
'చమక్ చమక్ పోరి’అంటున్న కిరణ్ అబ్బవరం.. లిరికల్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన చిత్రం ‘మీటర్’.ఈ చిత్రాన్ని రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చమక్ చమక్ పోరి అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్య ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగానే తాజాగా ‘చమక్ చమక్ పోరి..’అంటూ సాగే మాస్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్ంచినట్లు తెలుస్తోంది. ఈ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్ డాన్స్‌తో అదరగొట్టారు. ఈ సాంగ్ లిరిక్స్ బాలాజీ అందించగా.. అరుణ్ కౌండిన్య, ఎంఎల్ గాయత్రి ఆలపించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!) -
‘చమక్ చమక్ పోరి..’అంటున్న కిరణ్ అబ్బవరం.. మాస్ సాంగ్‌తో ప్రమోషన్స్
కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘మీటర్’. నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంలి సమర్పణలో రంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని ‘చమక్ చమక్ పోరి..’అంటూ సాగే మాస్ లిరికల్‌ని తొలి పాటగాఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ‘‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మీటర్’. ‘చమక్ చమక్ పోరి..’ పాటలో కిరణ్, అతుల్య రవి మాస్ డాన్స్‌ను చూస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా విశ్వ కరుణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శివం సెల్యులాయిడ్స్‌పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాతలు డి. సురేష్‌బాబు, ఏఎమ్ రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. ‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. సురేష్ రెడ్డి, సంతోష్, సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: విశ్వాస్ డానియేల్. -
Kiran Abbavaram Photos: కొత్త సినిమా స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
ఓటీటీలో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ'
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రంలో కాశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 18న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చేనెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్‌గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
నన్ను కిందకు లాగుతున్నారు, ఇలాగైతే ఎలా?.. ట్రోలింగ్‌పై హీరో ఫైర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సినిమాకు ప్రతిఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. కానీ కొన్ని బ్యాచులు తయారవుతున్నాయి. ట్విటర్లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారు. ఇంతకుముందు చేసిన ఒకటీరెండు సినిమాలు బాలేవు, నన్ను విమర్శించారు. ఈ సారి ఎలాంటి విమర్శ రాకూడదని పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి మంచి సీన్లు పెట్టాం. అయినా కూడా కొంతమంది సినిమా బాలేదంటున్నారు బ్రో అని మావాళ్లు కొన్ని మెసేజ్‌లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు? ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీస్తే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదు. ఎవరో కొందరు ఎవడికో రూ.50,000 ఇస్తే బాలేదని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతారు? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటా. రూ.70,000 ఉద్యోగం వదిలేసి ఇక్కడిదాకా వచ్చా. నన్ను కిందకు లాగినా నాకేం పోదు. ట్విటర్ ఉంది కదా అని పొద్దున లేచినప్పటి నుంచి బూతు పురాణం ఎందుకు మొదలుపెడుతున్నారు? పక్కవాళ్ల మీద పడి ఏడవడం మానేయండి' అని ఓరకంగా వార్నింగ్ ఇచ్చాడు కిరణ్. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం -
వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశా : బన్ని వాసు
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. ‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కశ్మీర పరదేశీ అన్నారు. 'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్ అన్నారు.