
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam), నటి రహస్య(Rahasya) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈమేరకు ఆయన సోషల్‌మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశాడు. తమ ప్రేమ మరో రెండు అడుగులు ముందుకు పడింది అంటూ తన సతీమణితో దిగిన ఫోటోను పంచుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో గతేడాది ఆగష్టులో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పేజీలో రహస్యతో దిగిన ఫోటోలను కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న రహస్యకు పలు సూచనలు ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి)
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతల‍్ని రహస్య దగ్గరుండి చూసుకుంది. 'క' తర్వాత కిరణ్ 'దిల్‌రూబా'(Dil Ruba) అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నారు.