‘‘క’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ ఇచ్చింది. మా మూవీ సక్సెస్‌కు కారణమైన డైరెక్టర్స్ సందీప్, సుజీత్, నిర్మాత గోపీ, డిస్ట్రిబ్యూటర్ వంశీగార్లకు కృతజ్ఞతలు’’ అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సుజీత్, సందీప్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క’. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో ప్రోడ్యూసర్ వంశీ నందిపాటి అక్టోబరు 31న విడుదల చేశారు.
శనివారం నిర్వహించిన ‘క’ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా ‘క’ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘క’ సినిమాకు థియేటర్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అని సుజీత్ తెలిపారు. ‘‘మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ‘క’ సినిమా సక్సెస్‌కు కారణం’’ అన్నారు సందీప్.
Comments
Please login to add a commentAdd a comment