
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది.
అంటే సుందరానికి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ తన్వీ రామ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. తాజాగా కిరణ్ అబ్బవరం క మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఏడాది పుట్టినరోజున కొత్తకారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మా కుటుంబంలో కొత్త మెంబర్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment