నేను నమ్మిందే నిజమైంది : కిరణ్‌ అబ్బవరం | Kiran Abbavaram Interesting Comments On His Latest Movie KA At Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: నేను నమ్మిందే నిజమైంది

Nov 1 2024 8:46 AM | Updated on Nov 1 2024 9:43 AM

Kiran Abbavaram talk About A Movie At Success Meet

‘క’ సినిమా క్లైమాక్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, చివరి 20 నిమిషాలు చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారని నమ్మాం. ఇప్పుడు థియేటర్స్‌లో క్లైమాక్స్‌ సీన్‌ చూసి అందరు చప్పట్లు కొడుతుంటే నేను నమ్మిందే నిజమైంది అని అనిపించింది. సినిమాకు వెళ్లిన వారు క్లైమాక్స్‌ మిస్‌ కాకుండా చూడండి. చివరిలోనే కథలోని ఎస్సెన్‌ ఉంది’ అని అన్నారు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. 

ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. దీపావళి కానుకగా నిన్న(అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం  సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "క" సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్  మా మూవీకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మా మూవీకి ఎంతో సపోర్ట్ లభిస్తోంది. "క" సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారు. నేను మా టీమ్  పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని కలుస్తాం’ అన్నారు.

(చదవండి: ‘క’ మూవీ రివ్యూ)

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - "క" సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. మేము నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త కంటెంట్ ను, కొత్త నేరేటివ్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నతీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రొడ్యూసర్ గోపి గారికి, వంశీ గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేస్తామని మాటిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు "క" లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement