
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన 'క'(KA Movie) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.
ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'క' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సైకలాజికల్ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.

‘క’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.
అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.