గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్‌గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క' మూవీనే దీపావళి విన్నర్‌గా తేలింది.
(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)
థియేటర్లలో సక్సెస్‌ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే పోస్టులు ఎక్కువగా కనిపించాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని తెగ హడావుడి చేస్తున్నారు.
ఇప్పుడు ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు ట్వీట్ చేసింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు ఈ రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లని అడ్డుకున్నట్లే. మరి ట్వీట్ చేసినట్లు నిర్మాత మాట మీద నిలబడతారో లేదో చూడాలి?
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)
#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards
— srichakraas entertainments (@srichakraas) November 6, 2024
Comments
Please login to add a commentAdd a comment