'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా? | Thaman And Ajaneesh To Compose BGM Score For Allu Arjun Pushpa 2 The Rule Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 Latest Update: దేవీ ఉన్నాడుగా.. మళ్లీ వీళ్లిద్దరూ ఎందుకు?

Nov 7 2024 8:11 AM | Updated on Nov 7 2024 9:31 AM

Thaman And Ajaneesh Compose BGM Score Pushpa 2

'పుష్ప 2' మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. లెక్క ప్రకారం చూసుకుంటే ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. దీనికోసం సమంత, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీని చిత్రీకరణ ఉండనుందని. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది.

'పుష్ప' సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తొలి పార్ట్‌లోని పాటలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అప్పట్లో కంప్లైంట్స్ వచ్చాయి. ఓవరాల్ సక్సెస్ వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ తప్పు జరగకూడదనో ఏమో గానీ తమన్, అజనీష్ లోక్‍‌నాథ్‪‌ని బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసేందుకు తీసుకున్నారట.

(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

తమన్ గురించి తెలుగోళ్లకు తెలుసు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే రెచ్చిపోతాడు. ఇక అజనీష్ విషయానికొస్తే 'కాంతార', 'మంగళవారం' లాంటి సినిమాలతో మనోళ్లు కాస్త పరిచయమే. వీళ్లిద్దరూ తోడయితే 'పుష్ప 2'కి ప్లస్ అనే చెప్పాలి. కానీ దేవి శ్రీ ప్రసాద్ ఉండగా కొత్తగా వీళ్లిద్దరిని ఎందుకు తీసుకున్నారా అనేది అభిమానుల్ని కాస్త కంగారు పెడుతోంది. బహుశా దేవిశ్రీ ప్రసాద్‌కి వర్క్ లోడ్ ఎక్కువ కావడం ఇలా చేశారేమో?

డిసెంబరు 5న 'పుష్ప 2' మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సౌత్, నార్త్‌లో ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్ దాటేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement