Pushpa 2: The Rule
-
పుష్ప 2: సంధ్య థియేటర్లో తొక్కిసలాట.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే రేవతి మృతిచెందినట్లు తేల్చిన పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యజమాని, సెక్యూరిటీ మేనేజర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.అసలేం జరిగిందంటే?హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు జనం భారీ ఎత్తున వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ కూడా థియేటర్‌కు రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగ్గా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అటు సంధ్య థియేటర్ యాజమన్యంతో పాటు అల్లు అర్జున్ టీమ్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ విషాదంపై అల్లు అర్జున్ స్పందిస్తూ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు రూ.294 కోట్లు రాబట్టి అందరితో ఔరా అనిపించింది. ఓవరాల్‌గా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూలు చేసింది. పుష్ప దూకుడు చూస్తుంటే వెయ్యి కోట్లు అవలీలగా వచ్చేట్లు కనిపిస్తోంది. చదవండి: పుష్ప రాజ్ హవా.. మూడు రోజుల్లోనే హిందీలో మరో రికార్డ్! -
ఊహించని కలెక్షన్స్‌తో భారతీయ సినిమాని ఏలుతున్న అల్లు అర్జున్
-
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్ప-2 సినిమాపై సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు లేని రికార్డులు సృష్టిస్తోందని పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ క్రియేట్ చేస్తోన్న రికార్డులపై ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రావడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ.. 'హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అత్యధిక వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది.. అలాగే బాలీవుడ్ యాక్టర్ కాకుండా మన అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు.. పుష్ప-2 పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మీరు స్టైలే వేరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సత్తా అంటే ఇది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలిరోజే రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టిన పుష్పరాజ్.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు సాధించింది. దీంతో హిందీలో బన్నీ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. The BIGGEST HINDI FILM ever in HISTORY of BOLLYWOOD is a DUBBED TELUGU FILM #Pushpa2 The BIGGEST HINDI FILM ACTOR in HISTORY of BOLLYWOOD is a TELUGU ACTOR @alluarjun who CAN’T SPEAK HINDI So it’s not PAN INDIA anymore , but it is TELUGU INDIA 💪💪💪— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2024 -
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
అల్లు అర్జున్ కి ఎలాన్ మస్క్ స్పెషల్ గిఫ్ట్.. పుష్ప-2కు స్పెషల్ లైక్ బటన్..!
-
పుష్ప రాజ్ హవా.. మూడు రోజుల్లోనే హిందీలో మరో రికార్డ్!
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది.అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీలో మూడు రోజుల్లోనే రూ.205 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤🔥Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/AMLH5EXu2Z— Pushpa (@PushpaMovie) December 8, 2024 -
సుకుమార్ సంస్కారానికి ఫిదా అవ్వాల్సిందే!
సొమ్ము ఒకడిది సోకు మరొకనిది అనే సామెత తెలుసు కదా.. ఇది చిత్ర పరిశ్రమకు బాగా సూట్ అవుతుంది. కష్టపడి పని చేసేది ఒకరు అయితే క్రెడిట్ కొట్టేసిది మరొకరు. కనీసం స్క్రీన్‌పై వాళ్ల పేర్లను కూడా వేయడానికి ఇష్టపడని వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ ఇందుకు విరుద్దం. తనతో పని చేసిన టీమ్ మొత్తానికి క్రెడిట్ ఇస్తాడు. అది కూడా ఏదో ఇవ్వాలి కదా అన్నట్లు కాకుండా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తుంటాడు. తనదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన వారి టాలెంట్‌ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆరాటపడతుంటాడు. సమయం దొరికినప్పుడల్లా వారి ప్రతిభ గురించి మాట్లాడుతుంటాడు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్లో కూడా సుకుమార్ తన టీమ్ గురించి గొప్పగా మాట్లాడాడు.పుష్ప 2 విజయం వెనుక తన టీమ్ కష్టం చాలా ఉందని గర్వంగా చెప్పాడు. టీమ్ మొత్తాన్ని స్టేజ్‌పైకి పిలిచి ఒక్కొక్కరు చేసిన వర్క్, వారి ప్రతిభ గురించి చెబుతూ.. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ వారికే ఇచ్చాడు. అంతేకాదు ‘పుష్ప 2 సినిమాకు నేను దర్శకుడిని కాదు.. వీళ్లంతా దర్శకులే. పొరపాటున నా పేరు వేసుకున్నా..’అని సుకుమార్ చెప్పడం నిజంగా ఆయనకు ఉన్న సంస్కారానికి నిదర్శనం.‘మూడు గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ’అని సుకుమార్ చెబుతుంటే.. వెనుక ఉన్న టీమ్‌తో పాటు ముందున్న బన్నీ కళ్లు కూడా చెమ్మగిల్లాయి.ఓ సినిమా మాములుగా హిట్ అయితేనే ఆ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకుంటారు కొంతమంది దర్శకులు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో సహాయం చేసిన వారి పేర్లను కూడా స్క్రీన్‌పై పడకుండా జాగ్రత్తపడతారు. మరికొంతమంది బడా దర్శకులు అయితే.. తన అసిస్టెంట్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా తన పేరే వేయించుకుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందించి, ఆ క్రెడిట్ తన టీమ్‌కి ఇవ్వడం సుకుమార్ మంచితనం. మాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా.. వాళ్ల కెరీర్ గ్రోత్‌కి సహాయం అందిస్తుంటాడు. తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే అవకాశం కల్పిస్తాడు. ఇప్పటికే సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. త్వరలోనే మరికొంత మంది కూడా మెగా ఫోన్ పట్టడానికి రెడీగా ఉన్నారు. -
రికార్డులన్నీ రప్ప...రప్ప...
-
ఇతడు విలన్‌గా చేస్తే పాన్ ఇండియా హిట్ కన్ఫర్మ్!? (ఫొటోలు)
-
సుకుమార్‌కి రుణపడి ఉంటాను: అల్లు అర్జున్
‘‘దేశం నలుమూలల నుంచి మా ‘పుష్ప 2’ యూనిట్‌కి స΄ోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి, భారతీయులకు థ్యాంక్స్. ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్‌గారికి «థ్యాంక్స్. నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది.శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతోంది. చిత్రబృందం తరఫున, తెలుగువారందరి తరఫున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి థ్యాంక్స్. దేశంలో మా సినిమాకు స΄ోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఆ సంఘటన చాలా బాధ కలిగించింది ‘‘నేను ‘పుష్ప 2’ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే. అనుకోకుండా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతిగారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత ఇరవయ్యేళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను. అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు. డిసెంబరు 4న వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్లి΄ోయాను. ఇంటికి వచ్చిన తర్వాత రేవతిగారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చె΄్పాలి. ఈ సినిమాను ఇంతగా ్ర΄ోత్సహించింది, పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే. 3 గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ. మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. ఎందుకంటే జరిగిన ఘటన (రేవతి మృతి) అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్. వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘పుష్ప 2’ రెండు రోజులకు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినందుకు ఆనందంగా ఉంది. టికెట్ ధర 800 ప్రీమియర్ షోకి మాత్రమే.. ఆ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులో ఉన్నాయి. అందరూ కచ్చితంగా సినిమాని చూడాలి’’ అని యలమంచిలి రవిశంకర్ కోరారు. -
అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సంతోషంగా లేనన్న సుకుమార్.. బన్నీ ఏమన్నారంటే?
పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు అల్లు అర్జున్. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లు రాబట్టి దేశంలోనే మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో రోజు రూ.155 కోట్లు వచ్చాయి. అంటే రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు రాబట్టి రికార్డులను రఫ్ఫాడిస్తోంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు: బన్నీఈ క్రమంలో పుష్ప 2 యూనిట్ హైదరాబాద్‌లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డిగారికి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్ . అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.మూడేళ్ల తర్వాత వెళ్లానేను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లాను. థియేటర్ బయట అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సినిమా చూడకుండానే వెళ్లిపోయాను. అక్కడ రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టింది. ఇలా జరిగినందుకు నిజంగా సారీ. ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని హామీ ఇచ్చాడు.నా మనసు కకావికలమైపోయిందిఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన విషాద ఘటనపై డైరెక్టర్ సుకుమార్ స్పందించాడు. మూడు రోజులుగా నేనసలు సంతోషంగా లేను. మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా, ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను. థియేటర్ వద్ద రేవతి మరణించిన ఘటనతో నా మనసు కకావికలమైపోయింది. ఆమె కుటుంబానికి మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ బాధ నుంచి బయటపడ్డాకే సినిమా కలెక్షన్స్ ప్రకటించాం అని చెప్పాడు.గర్వంగా ఉంది నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ఎంతో వేగంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమా.. పుష్ప. ఇలాంటి సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది అని తెలిపాడు. ఈ సమావేశానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని హాజరయ్యారు.చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..? -
'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు
'పుష్ప 2' తొలిరోజు వసూళ్లలో బీభత్సం సృష్టించింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులని పక్కనబెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు వచ్చాయి. దీంతో రెండో రోజుకే రూ.400 కోట్ల మార్క్ దాటేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)అయితే దక్షిణాదిలో 'పుష్ప 2' మేనియా ఓ మాదిరిగా ఉండగా.. నార్త్‌లో మాత్రం రప్పా రప్పా అనేలా ఉంది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఊపు ఇలానే కొనసాగితే వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.'పుష్ప 2'లో స్టోరీ పెద్దగా లేనప్పటికీ.. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దీంతో మూడున్నర గంటల నిడివి కూడా తక్కువే అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ దేనికవే రచ్చ రచ్చ అనేలా ఉండటంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్) -
Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్
ఇండియన్ బాక్సాఫీస్‌ని పుష్ప 2 షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో నాలుగో చిత్రంగా తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిమియర్ షో నుంచి ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజే ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. (చదవండి: పుష్ప చూశాక.. బన్నీ కూడా చిన్నగా కనిపించాడు, ఆర్జీవీ ట్వీట్)ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు జాతర సీన్, క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్ చూస్తే గూస్బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. చెప్పడం కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే.. సినిమా చూడని వారికి కూడా పూనకాలు వస్తున్నాయి.(చదవండి: పుష్ప 2 మూవీ రివ్యూ)థియేటర్లో సినిమా చూస్తున్న ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అలాగే మరో మహిళ కూడా జాతర సీన్ చూసి.. పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించింది. పక్కన ఉన్నవారి వచ్చి వారిని శాంతింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులను మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ’చిత్రానికి సీక్వెల్ ఇది. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. Neekanna Peddha Dhikku... Lokaana YekkadundhiNaivedhyam Ettanga... Maa Kaada YemitundhiMoralanni Aaalakinchi... Varameeyyave Thalli 🙏🙏🙏GANGO RENUKA THALLI 🙏🙏🙏 https://t.co/shS1a4rYvH— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024 -
Pushpa 2 : ‘పుష్ప’ పాత్రపై ఆర్జీవీ రివ్యూ
అంతా అనుకున్నట్లే పుష్ప 2 మూవీ రికార్డులను బద్దలు కొడుతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా .. పుష్ప 2 మూవీ గురించే చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ముందు నుంచి కూడా పుష్ప 2 చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. ‘పుష్ప 2 చిత్రంలోని పుష్ప పాత్రపై నా రివ్యూ’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఎక్స్(ట్విటర్) షేర్ చేస్తూ.. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్రను చూడడం చాలా అరుదని అన్నారు. ఓ స్టార్ హీరో ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్ర కోసం సినిమా చూడడం పుష్ప 2 చిత్రానికి సాధ్యమైందని ప్రశంసించాడు.‘పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదు. ఒక వీక్షకుడిగా నేను సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప లాంటి పాత్ర బయట ఉందని నమ్మాను. ఇలా ఓ కమర్షియల్ ఫార్మాట్లో క్రియేట్ చేసిన పాత్రను వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చూపించడం అంత సులభతరమైన పని కాదు.పుష్పరాజు పాత్రలో గమనిస్తే..అమాయకత్వం, చాకచక్యంతో మిళితమై ఉంటాయి. అలాగే దుర్బలత్వంతో కూడిన సూపర్ అహం వంటి అత్యంత విరుద్ధమైన లక్షణాలన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరో అనేవాడు ఫర్ఫెక్ట్గా ఉంటాడని మాత్రమే మనం చూశాం. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని శక్తిగా మార్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్,హావభావాలు ఆ పాత్రకు మరింత బలమైన బలాన్ని అందించాయి. ఈ పాత్రని దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకుల గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా మందికి రిఫరెన్స్ పాయింట్‌గా పుష్ప పాత్ర ఉంటుంది. ఏ నటుడైనా తనకు సంబంధించిన సన్నివేశాల్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమైనవిగా అనిపించేంత పరిపూర్ణతను ప్రదర్శించారు. కేవడం బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కాకుండా ఎమోషన్స్ సీన్లని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించాడు. సీఎం సెల్ఫీకి నిరాకరించినప్పుడుకానీ, బాగా తాగి తన అహంకారాని పక్కన పెట్టి సారీ చెప్పే సీన్ కానీ.. అన్నింట్లిలోనూ అద్భుతంగా నటించాడు.ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాకా.. ఆ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చిన్నగా కనిపిస్తాడు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2—Ram Gopal Varma It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character Seeing…— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024 -
'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?
పుష్ప2 సినిమా అభిమానులకు శుభవార్త.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో జాతర మొదలైంది. అయితే, టికెట్ల ధరల విషయంలో ప్రేక్షకుల నుంచి కాస్త అసహనం వ్యక్తం కావడంతో పుష్ప సినిమా నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. దీంతో టికెట్ల ధరలను తగ్గించే పనిలో థియేటర్స్ ఉన్నాయి. మొదటిరోజు పుష్ప రికార్డ్ కలెక్షన్స్‌తో దుమ్మురేపాడు. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను పుష్ప2 సెట్ చేసింది. ఆదివారంతో వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ సుమారు రూ. 600 కోట్లకు చేరువలో ఉంటుందని తెలుస్తోంది.పుష్ప2 సినిమా బాగున్నప్పటికీ మధ్యతరగతి ప్రేక్షకులకు అందేలా టికెట్ల ధరలు లేవని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో ఒక టికెట్ ధర రూ. 530 ఉంది. సింగిల్ స్క్రీన్ అయితే రూ. 350 ఉంది. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా వైపు వెళ్లడం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సినిమా బాగుంది.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ, టికెట్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజులకు సంబంధించి కొన్ని చోట్ల 50 శాతం కూడా బుకింగ్స్ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సోమవారం నుంచి టికెట్ల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 నుంచి 200 వరకు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఇలాతెలంగాణలో సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్ఫిట్ షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ.800, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 1000 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రీమియర్స్ షోల టికెట్ల ధరలు తెలంగాణలో మాదిరే ఉన్నాయి. డిసెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. అయితే, డిసెంబరు 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. -
పుష్ప 2 దెబ్బకి అన్ని రికార్డ్స్ బ్రేక్
-
పుష్ప 2 రికార్డుల విధ్వంసం..
-
పుష్ప టు జాతర సంబురాల్లో రాజేష్
-
'పుష్ప2'కు సపోర్ట్‌గా జాన్వీకపూర్.. అభిమానుల నుంచి ప్రశంసలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో పుష్ప2తో మరో హిట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానల నుంచి పుష్పరాజ్‌కు ఫిదా అవుతున్నారు. సుమారు 12500కు పైగా థియేటర్స్‌లలో విడుదలైన ఈ చిత్రం పట్ల బాలీవుడ్లో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎక్కువ థియేటర్స్ పుష్ప2 చిత్రానికి కేటాయించడంతో వారు అభ్యంతరం తెలుపుతున్నారు. పుష్ప2 వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందని పుష్పను విమర్శిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యారు.2014లో విడుదలైన'ఇంటర్ స్టెల్లార్' సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్బంగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, బాలీవుడ్‌లోని ఐమాక్స్‌లలో ఎక్కువ చోట్ల పుష్ప2 ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో కొందరు నెట్టింట అభ్యంతరం పెడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై జాన్వీ స్పందించింది.పుష్ప2 చిత్రాన్ని సమర్థిస్తూ జాన్వి ఇలా చెప్పుకొచ్చింది. 'పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారు. మన సినిమాలను గుర్తించకుండా ఇతర దేశ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు సపోర్ట్ చేస్తున్న హాలీవుడ్ వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇక్కడ విచారకరం ఏమిటంటే.. మనం మాత్రమే మన సినిమాలపై చిన్న చూపు చూపిస్తున్నాం.' అంటూ పుష్ప2 చిత్రానికి సపోర్ట్‌గా ఆమె కామెంట్ చేశారు. ఈ విషయంలో జాన్వీపై ప్రశంసలు అందుతున్నాయి.బాలీవుడ్లో శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తెలుగులో 'దేవర'తో పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టడంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు దక్కింది. రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఒక చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. -
ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప-2
-
రికార్డులు రప్పా రప్పా...
‘‘ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...’’ అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన బోలెడన్ని పవర్ఫుల్ డైలాగ్స్‌లో ఇదొకటి. ఇక ఇక్కడ పేర్కొన్న డైలాగ్‌లానే రప్పా రప్పా అంటూ ఇప్పటివరకూ ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది ‘పుష్ప2: ది రూల్’ సినిమా.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం (డిసెంబరు 5)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్‌కి అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ (2022) రూ. 233 కోట్ల గ్రాస్‌తో ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ‘పుష్ప 2: ది రూల్’.అదే విధంగా నైజాంలోనూ రికార్డులను తిరగ రాసింది ‘పుష్ప 2’. ఇప్పటివరకూ మొదటి రోజు వసూళ్లలో రూ. 23కోట్ల గ్రాస్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డుని సృష్టించి, మొదటి స్థానంలో నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’. హిందీలోనూ తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్లో ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, తాజాగా ‘పుష్ప 2’ రూ. 72 కోట్ల వసూళ్లతో ‘జవాన్’ని రెండో స్థానానికి పరిమితం చేసింది. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) చిత్రంలో తన అద్భుతమైన నటనకుగానూ జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, ఆయనకి జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్‌కి స్టార్డమ్, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ కారణంగానే హిందీలో ‘పుష్ప 2’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి... రానున్న రోజుల్లో రప్పా రప్పా అంటూ ‘పుష్ప 2’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. -
Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల సాయం
పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించాడు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియో షేర్ చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 'మొన్న నేను పుష్ప ప్రీమియర్స్ చూసేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు వెళ్లాను. అక్కడ జనం రద్దీ ఎక్కువ కావడంతో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదురేవతి అనే మహిళకు దురదృష్టవశాత్తూ దెబ్బలు తగిలి మరణించింది. ఈ విషయం నాకు సినిమా చూసొచ్చిన తర్వాతి రోజు ఉదయం తెలిసింది. నేను, సుకుమార్, పుష్ప టీమ్ మొత్తం ఈ వార్త చదివి ఎంతగానో బాధపడ్డాం. 20 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక ప్రధాన థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సడన్‌గా ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయాం.తట్టుకోలేకపోయాం..అందుకే పుష్ప సెలబ్రేషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే జనాలు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేయడానికి.. అలాంటిది థియేటర్లోనే ఇలాంటి విషాదం జరిగేసరికి తట్టుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము ఏం చేసినా మీరు లేని లోటును పూడ్చలేం.మీ కోసం నేనున్నా: అల్లు అర్జున్ కానీ మీ కుటుంబం కోసం మేమున్నామ. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తాం. నా తరపున రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నాను. మీకోసం నేనున్నాను అని చెప్పడానికే ఈ డబ్బు ఇస్తున్నాను. ఇప్పటివరకు అయిన హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని అల్లు అర్జున్ మాట్లాడాడు.Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz— Allu Arjun (@alluarjun) December 6, 2024చదవండి: సమంత మా ఇంటిమనిషి, రూ. 25 లక్షలిచ్చా: బెల్లంకొండ సురేశ్ -
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్‌పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్‌తో పాటు ఫోన్ నంబర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024