![Nagarjuna Interesting Comments On Pushpa 2 Movie](/styles/webp/s3/article_images/2025/02/15/pushpa-2.jpg.webp?itok=KDYmSMW5)
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్‌లో నెగెటివ్ టాకే వినిపించింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత పుష్ప 2(pushpa 2: The Rule) కూడా మన దగ్గర కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 చిత్రాన్ని ఆదరించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టింది.
పుష్ప సీక్వెల్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక గల కారణాలను సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) వెల్లడించాడు. పుష్ప చిత్రం ఇంత సూపర్ హిట్‌గా నిలవడానికి కారణం కథ కాదని.. పుష్పరాజ్ పాత్రకు దక్కిన ఆదరణనే అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘పుష్ప రిలీజ్ తర్వాత పుష్పరాజ్ పాత్ర ఒక సూపర్ హీరో పాత్రగా మారాడు. సోషల్ మీడియాలో ఆ పాత్రకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. మీమ్స్, స్పూఫ్‌లోనూ పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. అందుకే పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక్కడ కథ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది’అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment