అల్లు అర్జున్- సుకుమార్‌ల పుష్ప2(Pushpa 2 Movie) సినిమా ఓటీటీలో కూడా సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. గ్లోబల్ రేంజ్‌లో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన పుష్పరాజ్.. ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ పేరుతో జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix ) స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా పలు రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తూ.. ప్రపంచ సినీ అభిమానుల చేత అల్లు అర్జున్ ప్రశంసలు అందుకుంటున్నారు.
పుష్ప2 ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యూస్ పరంగా ట్రెండింగ్‌లో ఉంది. ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 21 దేశాల్లో టాప్-10లో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా,జపాన్, అమెరికా,దుబాయ్ వంటి దేశాల్లో ఈ చిత్రాన్ని ఎక్కువగా చూస్తున్నారు. 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే సినిమా డైలాగ్ నిజం అయ్యేలా బన్నీ చేశాడని అభిమానులు చెబుతున్నారు. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం దుమ్మురేపుతుండటంతో టాలీవుడ్ పేరు వైరల్ అవుతుంది. ఓటీటీ వెర్షన్‌లో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు ఉంది.
హాలీవుడ్ నుంచి ప్రశంసలు
పుష్ప2 ఓటీటీలో చాలా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో విస్తృతంగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో మన సినిమా గురించి హాలీవుడ్(Hollywood ) సినీ అభిమానులను మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సీన్.. అల్లు అర్జున్(Allu Arjun) చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న 'జాతర' సీక్వెన్స్‌కు వారు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా బన్నీ అలాగే కనిపిస్తాడు. దీన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.. చూస్తున్నంత సేపు గూస్‌బంప్స్ వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. అవెంజర్స్ వంటి సినిమాలకు మించి యాక్షన్ సీన్స్‌లో అల్లు అర్జున్ దుమ్మురేపాడని వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇలాంటి సీన్స్ తీయడం హాలీవుడ్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని వారు అంటున్నారు.
ప్రస్తుతం వస్తున్న అమెరికన్ సినిమాలకంటే పుష్ప2 చాలా బెటర్ అంటూ వారు చెప్పడంతో పుష్ప2 రేంజ్ ఏంటో తెలుపుతుంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న మార్వెల్ వంటి సినిమాల్లో కూడా ఇంతటి సృజనాత్మకత లేదని అక్కడి రివ్యూవర్లు చెబుతున్నారు. జాతర ఎపిసోడ్‌లో బన్నీ చేసిన సీన్‌తో పాటు ఫైనల్‌లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూసిన వారు.. అదంతా గ్రాఫిక్స్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా ఎంట్రీలో జపాన్‌కు వెళ్లిన బన్నీ చేతులకు రెక్కలు లేకుండా అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నాడు..? అంటూ కొందరు విమర్శలు చేశారు. కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్‌లో ఎప్పుడో ఆపేసిని కుంగ్‌ఫూ సినిమాలు గుర్తుకొచ్చాయిని కొందరు చెప్పారు. ఇలా పుష్ప2 గ్లోబల్ స్థాయిలో ఎక్కువగా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp
— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment