
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.
ఒకేసారి మేకప్
తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్‌కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.
చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారు
డ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.
మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్‌లో..
బాలీవుడ్‌లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.
(చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)
పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానం
కానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్‌మెన్‌ను కూడా అవార్డుతో సత్కరించారు.
బాలీవుడ్‌ను తక్కువ చేయాలని కాదు!
నేను బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.
చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment