
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2. గతంలో 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో కేజీఎఫ్ 2, బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల రికార్డులను తిరగరాసింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అయితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా అభిమానులను ఊర్రూతలూగించాయి. కిస్సిక్ సాంగ్‌తో పాటు గంగమ్మ జాతర పాట కూడా ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యందా గంగమ్మ జాతర సాంగ్ బన్నీ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన గణేష్ ఆచార్య తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గంగో రేణుక తల్లి పాట చిత్రీకరణ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సాంగ్ షూట్ సమయంలో అల్లు అర్జున్‌కు గాయాలైనప్పటికీ పట్టు వదలకుండా పూర్తి చేశాడని కొనియాడారు.
కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాట్లాడుతూ..'జాతర పాటను చిత్రీకరించడం మాకు చాలా సవాలుగా అనిపించింది. దాదాపు 29 రోజుల పాటు నిరంతరాయంగా చిత్రీకరించడం చాలా కష్టమైన పని. కానీ ఈ సాంగ్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్‌కే చెందుతుంది. పుష్ప రెండు చిత్రాలకు ఆయన ఐదేళ్లు అంకితమిచ్చారు. జాతర సాంగ్‌లో అతను చీర, నెక్లెస్, బ్లౌజ్ ధరించాడు. షూట్ సమయంలో ప్రతి 5 నుంచి 10 రోజులకు అతనికి గాయాలు అయ్యేవి. కొన్నిసార్లు అతని పాదాలు, మెడకు కూడా గాయాలయ్యాయి. కానీ అల్లు అర్జున్ ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వలేదు' బన్నీ అంకితభావాన్ని కొనియాడారు. కాగా..బాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గణేశ్ ఆచార్య.. గోవిందా, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పింటూ కి పప్పి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment