ఆ ఏడాదే పుష్ప 3 రిలీజ్‌.. ప్రకటించిన నిర్మాత | Producer Ravi Shankar Reveals Pushpa 3 Release Date | Sakshi
Sakshi News home page

Pushpa 3 Movie: పుష్ప 3 రిలీజ్‌ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత.. ఫ్యాన్స్‌ ఖుషీ

Published Sun, Mar 16 2025 2:27 PM | Last Updated on Sun, Mar 16 2025 2:43 PM

Producer Ravi Shankar Reveals Pushpa 3 Release Date

పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా ఫైరు.. కాదుకాదు, వైల్డ్‌ ఫైరు.. అని నిరూపించాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun). పుష్ప ఫ్రాంచైజీ (Pushpa Movie)తో బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాశాడు. పుష్ప 1.. 2021లో విడుదల కాగా దాని సీక్వెల్‌ 2024లో రిలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వారి ఎదురుచూపులకు నిర్మాత రవిశంకర్‌ తెర దించాడు. 2028లో పుష్ప 3 (Pushpa 3 Movie) విడుదల చేస్తామని వెల్లడించాడు. విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్‌హుడ్‌ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే బన్నీ.. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.

పుష్పరాజ్‌ ప్రయాణం ఎలా మొదలైందంటే?
అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప (Pushpa: The Rise). ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, డాలి ధనంజయ, అజయ్‌ ఘోష్‌, జగదీశ్‌ ప్రతాప్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీకాంత్‌ విస్స డైలాగ్స్‌ రాశాడు. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా పుష్ప: ద రూల్‌ తెరకెక్కింది. 2024 డిసెంబర్‌ 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1650 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల ఊచకోత సృష్టించిన పుష్ప 2కి సీక్వెల్‌ ఉంటుందని చిత్రయూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేయడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement