Pushpa Movie
-
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్‌ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప-2’ చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే టైంలో బెనిఫిట్ ద్వారా వచ్చే వసూళ్ల వివరాలను తమకు తదుపరి విచారణలో అందజేయాలని ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదేశించింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. బెనిఫిట్ షోపేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు. అయితే..చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమని చెబుతూ విడుదలకు హైకోర్టు క్లియరెన్స్‌చ్చింది. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. అలాగే.. టికెట్ ధరల పెంపు ప్రభుత్వ జీవోలను సైతం పరిశీలిస్తామన్న హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. అలాగే.. బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు స్పష్టం చేసింది.ఇక.. రాత్రి 10గం. షోవేస్తే.. అది అయిపోయే సరికి 1గం. అవుతుందని, తద్వారా పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని, వాళ్లకు నిద్ర ఎంతో అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలు ఇలా.. మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు: పిటిషనర్ తరఫు లాయర్భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చింది: మైత్రీమూవీ మేకర్స్ తరఫు లాయర్‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించి కదా’: హైకోర్టుటికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: పిటిషనర్ తరపు న్యాయవాదిపెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలో వెళ్లడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే లబ్ది పొందుతున్నాడు: పిటిషనర్ తరపు న్యాయవాదిటికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ.8వేలు అవుతుంది కదా: హైకోర్టు న్యాయమూర్తిబెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల సంఘాలకు మాత్రమే. అందుకే రేట్లు పెంచారు: నిర్మాత తరపు న్యాయవాది పుష్ప ది రూల్ స్క్రీనింగ్‌కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులుడిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోరాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 వర్తింపు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే.అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిడిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు.డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపు.డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం సంచలనాలు సృష్టించగా.. ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి. -
పుష్ప.. మేక్ ఇన్ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే..
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్‌ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. పుష్పరాజ్.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్ ముందే ఇస్టయిల్‌గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్ కోసం కూలీగా వెళ్లి.. క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది పుష్ప ది రైజ్ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్.. దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్ సర్‌తో నడిచే బ్రాండ్ ట్రాక్‌తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్‌లో పుట్టుకొచ్చిన ఎనిమీస్ మధ్యే పుష్పగాడి రూల్ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్ రెండో పార్ట్‌ను చూపించబోతున్నారు!. అయితే..👉పుష్ప కథ, కాస్టింగ్ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్‌గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్ ఫిల్మ్ వైపు మొగ్గు చూపాడు. 👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్‌డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.👉కాస్టింగ్‌లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్‌తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. 👉ఇక రెగ్యులర్ షెడ్యూల్‌ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్‌తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్‌లో కేరళ షెడ్యూల్‌తో షూటింగ్ మొదలుకావాల్సింది.కానీ, కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.👉2020 ఏప్రిల్ 8వ తేదీ.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రగ్డ్ లుక్‌తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి హాట్ టాపిక్‌గా మారింది.First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq— Allu Arjun (@alluarjun) April 8, 2020👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్‌తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్‌లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్‌తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్ గుర్తింపు దక్కించుకుంది. 👉కరోనా వైరస్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్ 17కి చేరింది. పుష్ప ది రైజ్ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. ::: పుష్ప ప్రమోషన్లో అల్లు అర్జున్ 👉2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది పుష్ప ది రైజ్. అయితే.. రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)#PushpaCelebrityFanatics" Now a days, all around everyone discussing about one film #Pushpa " ❤️🔥When Defence Minister of India @rajnathsingh ji mentioned about Pushpa euphoria & dialogue. This shows to what extent the reach & impact @alluarjun made 🙏💥 pic.twitter.com/Cuu1K0TXnX— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) October 23, 2024👉సుకుమార్ ‘పుష్ప ది రైజ్’.. 2022లో రష్యన్ భాషలో డబ్ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ‘‘బ్లాక్‌బస్టర్ హిట్స్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’’ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది.👉హిందీలో పుష్ప కేరక్టర్‌కు డబ్బింగ్ చెప్పింది నటుడు శ్రేయాస్ తల్పడే. తమిళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కేపీ శేఖర్ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్ మేకర్ జిస్ జాయ్ వాయిస్ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్ చెప్పారు. 👉షెకావత్ కేరక్టర్‌కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్ ఖట్టర్) మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్‌కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తా’(భీష్మ ఫేం) అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు.:: వెబ్ డెస్క్ ప్రత్యేకం -
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్‌బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్‌లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్లోనూ అదరగొట్టేయనున్నాడు.ధనంజయ్ ఎంగేజ్మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
పుష్ప-2తో పాటు.. పుష్ప-3 గ్లింప్స్
-
సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్ అన్నారు.‘పుష్ప’గురించేనా?పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. -
పుష్ప పాటకు RGV డ్యాన్స్
-
'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్‌తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్‌కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్‌బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్‌ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్‌ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై వాటికి మాత్రం 'నో'!
‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్‌గా కనిపించడంతో పాటు హాట్ స్టెప్స్‌తో, హాట్ హాట్ హావభావాలతో ఐటమ్ సాంగ్ లవర్స్‌ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్లో చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి. నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్‌లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్ నాకు సవాల్‌గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది. -
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 3 బిగ్ అప్డేట్
-
తెలుగు స్టార్ దర్శకుడికి ఇంత పెద్ద కూతురు ఉందా? గుర్తుపట్టారా మరి?
ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె తండ్రి గురించి టాలీవుడ్లో ఎవరినీ అడిగినా సరే చెప్పేస్తారు. ఎందుకంటే స్వతహాగా టీచర్ అయిన ఇతడు.. ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన మార్క్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ రెండు మూడేళ్ల క్రితం మాత్రం తన లేటెస్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ దర్శకుడి కూతురి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి పేరు సుకృతి వేణి. తండ్రి పేరు సుకుమార్. యస్.. మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి డైరెక్టర్ సుకుమార్ కూతురే. తాజాగా ఈమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య తబిత కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో సుకృతిని చూస్తే సడన్‌గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే గతంలో ఒకటి రెండు సార్లు కనిపించిన కాస్త చిన్నపిల్లలా అనిపించింది. కానీ ఇప్పుడు టీనేజీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) అయితే సడన్‌గా సుకుమార్ కూతురు ఫొటో చూసి.. అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఈ అమ్మాయి.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అంటున్నారు. అయితే సుకృతికి యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా? అనేది పక్కనబెడితే పాడే ప్రతిభ ఉంది. ఎందుకంటే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఈమెకి ఉంది. అలానే అమెరికాలోని మసాచుసెట్స్ బెర్కెలే మ్యూజిక్ కాలేజీలో కోర్స్ చేస్తున్నట్లు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సింగర్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ సింగర్ అయితే అప్పుడు తెలుగు సినిమాల్లో పాడుతుందా? లేదంటే పాప్ సింగర్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్‌ని 'బన్నీ మామ' అని పిలుస్తూ క్యూట్‌గా మాట్లాడింది ఈమెనే. కావాలంటే యూట్యూబ్‌లో వీడియో చూడండి. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన సాయిపల్లవి!) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
అల్లు అర్జున్ 'పుష్ప'గాడికి రెండేళ్లు.. ఆశ్చర్యం కలిగించే రికార్డ్స్
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం. ► అల్లు అర్జున్‌కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు. ► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్‌కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు. ► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్‌లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది. ► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది. ► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్‌స్టాగ్రామ్‌నే షేక్ చేశాడు. ► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది ► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కు దక్కాయి. ► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్‌ను దక్కించుకున్న పుష్ప. -
నిమిషం యాడ్ కోసం రూ. 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్‌తో పాటు పలు యాడ్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సుకుమార్ డైరెక్ట్ చేసి పుష్ప నుంచి పార్ట్ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కోరాయాట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్‌లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్‌ను అల్లు అర్జున్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సరోగేట్ యాడ్స్ నిషేధం మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్ యాడ్స్ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతంలో ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఎందుకు నేరం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్‌లో నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం లేదు. -
‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్
పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా నటిస్తుండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న ఈ నటుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటం షాకింగ్‌గా అనిపించింది. ఇంతకీ ఏమైంది? ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన సదరు మహిళ (జూనియర్ ఆర్టిస్టు).. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. దీనంతటికి కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని.. అరెస్ట్ చేసి, కోర్టులో బుధవారం హాజరు పరిచారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఇక జగదీష్ కెరీర్ విషయానికొస్తే.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. -
జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) ఈసారి జాతీయ అవార్డులతో తెలుగు సినిమా కళకళలాడిపోయింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోగా.. 'ఉప్పెన'కి బుచ్చిబాబు, 'పుష్ప' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. అలానే 'కొండపొలం' పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే
సినిమాలంటే అందరికీ ఆసక్తి కదా. మామూలు జనాలకు మరీ ఎక్కువ. అందుకే జనాలందరికీ సినిమా భాషలోనే తమ అర్జీలు చెప్పుకుంటే పరమ క్యాచీగా ఉంటుందనుకున్నాయి రాజకీయ పార్టీలు. బాడీ లాంగ్వేజీలోలాగా... తమనే గెలిపించాలంటూ ‘మూవీ లాంగ్వేజీ’లో పొలిటికల్ పార్టీలు విన్నవించుకోవాలని నిర్ణయించుకుంటే... ఆ వచ్చే అభ్యర్థనలకు ఊహారూపమే ఈ వాక్యాలు... ‘పుష్ప సినిమా చూశారుగా అందరూ. అందులోని పాటలో హీరో చెప్పు జారిపోలా. అచ్చం అలాగే జారింది మా అధికారం కూడా. అయితే హీరోగారి గూడ పైకి లేచి నిలబడింది చూశారా... ఈసారి అచ్చం మీరూ మమ్మల్ని పైకి లేపండి. గూడను కాదు... మా చేతిని. అదే... చేతి గుర్తును.’’ ‘ప్రజలారా... చేతిగుర్తు వారి మాటలు చెవిన పెట్టకండి. అసలు పుష్ప అంటే ఏమిటి? పువ్వు! దీని బట్టి తెలియడంల్యా.. ఎవరికి ఓటెయ్యాలో! పుష్పకు ఓటెయ్యండి. అంటే ‘పువ్వు గుర్తు’కు అని అర్థం. పువ్వు గుర్తు అంటే కమలం పార్టీ అని విజ్ఞులైన మీకు వేరే చెప్పాలా?’’ ‘ఈ పువ్వు గుర్తువారూ, ఆ చెయ్యి గుర్తు వారూ ఎలాంటివాళ్లు? ఆ సినిమాలోనే చూశారుగా. గంధం చెక్కల ఆచూకీ చెప్పేదాకా కారెక్కించి తిప్పుతారు. తీరా ఆచూకీ దొరికాక... హీరో కారెక్కబోతుంటే కార్లోంచి కాలు పక్కకు లాగేస్తారు. నాల్రూపాయలు పారేసి... షేర్ ఆటోలో రమ్మంటారు. ఓడనెక్కేదాక ఓడమల్లయ్యా... ఓడ దిగాక బోడ మల్లయ్య. ఇలాంటి పార్టీలకా మీ ఓటు? పాపం... హీరో అప్పటికప్పుడు కారు కొనాల్సి వచ్చింది. హీరో కొన్నదేమిటి? ‘కారు’! ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అసలు మా కారు గుర్తుకు ఓటేస్తే... కృతజ్ఞతకొద్దీ ఎప్పుడూ కార్లోనే తిప్పుతాం. కారు దిగకండి... మమ్మల్నీ దించకండి. కారు స్పీడు విషయంలో మీరు తగ్గేదేల్యా... మమ్మల్ని తగ్గించేదే ల్యా’’ సినిమా అభ్యర్థనలు పూర్తయ్యాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ హెచ్చరించే కేన్సర్ క్యారెక్టర్ ‘ముఖేశ్’ఈసారి ఈ సినిమా యాడ్స్ అయ్యాక వచ్చాడు. అతడు చెప్పేదేమిటంటే... ‘‘అసలా మూవీ హీరోయే ఓ ఎర్రచందనం స్మగ్లర్. అతడు చేసేదే అడవుల్ని నరకడం. మీకు అర్థమవ్వడం కోసం ఎంతటి సినిమా ఉపమాలిచ్చినా సరే... ఈ నెగెటివ్ కేరెక్టర్ల పట్ల పాజిటివ్ కోణంలో కాకుండా అసలు కేరెక్టర్లను గుర్తెరిగి ఎంచుకోండి. ఐదేళ్ల పాటు హాయిగా మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. -
‘రారా సామి’పాటకి స్కూల్ గర్ల్ స్టెప్పులు..రష్మిక ‘క్యూట్’ రియాక్షన్
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రారా సామి’పాటకు రష్మిక వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటే మోగేది. చాలా మంది రీల్స్ చేసి.. ఈ పాటను వైరల్ చేశారు. పలువురు హీరోయిన్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తున్న ‘రారా సామి’ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ పాటకు దాదాపు ఐదేళ్లు వయసు ఉన్న చిన్నారి చిందులేసి అలరించింది. మహారాష్ట్రకు చెందిన ఆ చిన్నారి.. స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రారా సామి పాటకు డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటు మిగతా విద్యార్థులు కూడా స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని రష్మిక ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.., ‘సో క్యూట్’ అంటూ అని క్యాప్షన్ ఇచ్చింది. So cute 🥰 https://t.co/bfXDGQ8dMJ — Rashmika Mandanna (@iamRashmika) October 2, 2023 -
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్‌ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్‌మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్‌లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్