
ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్‌లా తయారయ్యాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు, డైలాగ్స్‌ను అనుకరిస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. పుష్ప సినిమాలో డైలాగ్స్‌తో పాట శ్రీవల్లీ పాటకు స్టెప్పులేసిన వార్నర్ తాజాగా సామి సామి పాటను అనుకరించాడు. సామి.. సామి అని రష్మిక అంటుంటే.. అల్లు అర్జున్ ఫోటోను తన ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన డేవిడ్ వార్నర్ ఆమెను కొంటెచూపులతో కైపెక్కించాడు. ఆ తర్వాత పాటకు సంబంధించి అల్లు అర్జున్‌ను అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియో వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇక డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాక్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. పాక్ గడ్డపై ఆసీస్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ఏప్రిల్ 5 వరకు జరగనుంది.