
ఆస్ట్రేలియన్ విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తనదైన స్టైల్లో మెరిశాడు. ఇప్పటికే పుష్ప సినిమా డైలాగ్‌తో పాటు ''ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా'' పాటకు స్టెప్పులేసిన వార్నర్.. తాజాగా శ్రీవల్లీ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. అచ్చం అల్లు అర్జున్‌ను గుర్తుచేస్తూ అతనిలానే పాదాలను కదిలించిన వార్నర్ తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఈ వీడియోనూ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. అంతకముందు పుష్ప సినిమాలోని యవ్వా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను వార్నర్ తన మేనరిజంతో చెప్పగా.. అల్లు అర్జున్ వెంటనే రియాక్టయ్యాడు. యవ్వ తగ్గేదేలే వార్నర్.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. వార్నర్ స్టెప్పులపై మీరు ఒక లుక్కేయండి..
చదవండి: David Warner: 'వార్నర్ సార్.. భారత పౌరసత్వం తీసుకోండి'..
Comments
Please login to add a commentAdd a comment