dance steps
-
రామ్ చరణ్ స్టెప్స్ కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
-
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
చిపి చిపీ చాపా... డుబిడుబిడు
వైరల్ ట్రెండ్ క్రియేట్ కావడానికి కొలతలు, ప్రమాణాలు అంటూ ఏవీ ఉండవు. తాజా వీడియో ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు తెస్తోంది. అర్థం తెలియని ఒక పదబంధం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దృష్టిని ఆకర్షించి వైరల్ ట్రెండ్‌గా మారింది. ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు’ అనే పదబంధాలను లయాత్మకంగా పలుకుతూ, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో వెల్తువెత్తుతున్నాయి. అసలు ఈ ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు అనే వింత సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయానికి వస్తే... జనవరిలో విడుదలైన ఒక ఫిలిప్పినో పాటలోని సౌండ్స్ ఇవి. ట్రెండ్‌ను ఉన్నది ఉన్నట్లు ఫాలో కాకుండా వివిధ రూపాల్లో తమదైన సృజనాత్మకతను జోడిస్తున్నారు క్రియేటర్స్. పవర్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ నుంచి నవ్వు తెప్పించే లిప్‌సింక్ వరకు... వారి సృజనాత్మకతకు హద్దులు లేవు. టిక్‌టాక్‌లో పుట్టిన ఈ ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించింది. -
ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విండీస్ బ్యాటర్లు విలవిల్లాలాడిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా ఆడింది. అశ్విన్ ధాటికి కేవలం 130 పరుగులకే చాపచుట్టేసింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. ఈ విషయం పక్కనబెడితే.. కోహ్లి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాటింగ్ సమయంలో 81 బంతులకు బౌండరీ బాదిన సమయంలో సెంచరీ మార్క్ సాధించినంత సెలబ్రేషన్ చేసుకొని అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా విండీస్ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ను తలపిస్తూ మంచి రిథమ్‌తో మూన్‌వాక్ చేయడంతో బాంగ్రా స్టెప్స్తోనూ అలరించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న జైశ్వాల్ ఇదంతా గమనిస్తూ తనలో తాను నవ్వుకోవడం విశేషం. కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్‌ను ఫ్యాన్‌కోడ్ తన ట్విటర్లో షేర్ చేసింది. Kohli reminding us all that it's Friday night, after all!@imVkohli . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/mPLidCSKW2 — FanCode (@FanCode) July 14, 2023 చదవండి: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్ విజయం Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్‌కు చోటు -
'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్.. డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో, సురేశ్ రైనాల సరసన చేరాడు. అయితే క్రికెట్ రికార్డులు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే షకీబ్ జాయిన్ అయింది.. పుష్ప సినిమా క్లబ్లో. ఏ ముహుర్తానా పుష్ప సినిమా మొదలైందో గాని..థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోయినప్పటికి.. దాని ప్రభావం మాత్రం జనాలను విడవడం లేదు. పాటలు, డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలా విశేషాలున్నాయి. ఇప్పటికే డేవిడ్ వార్నర్ నుంచి డ్వేన్ బ్రావో దాకా.. రవీంద్ర జడేజా నుంచి సురేశ్ రైనా వరకు పుష్ప సినిమాలో నుంచి ఏదో ఒక దానిపై వీడియోలు చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో మరోసారి పుష్ప స్టెప్పులతో మెరిశాడు. అయితే చివర్లో షకీబ్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరింది. చదవండి: Dwayne Bravo: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జరిగింది. కొమిల్లా విక్టోరియన్స్ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్‌ను ఔట్ చేసిన తర్వాత.. షకీబ్ అల్లు అర్జున్ ''తగ్గేదే లే'' మేనరిజమ్‌కు శ్రీవల్లీ పాటను జత చేసి డ్యాన్స్ చేశాడు. శ్రీవల్లీ పాటలో లెగ్ మూమెంట్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే షకీబ్ మాత్రం లెగ్ మూమెంట్ కాకుండా.. తన చేతులతోనే.. ఒకవైపు తగ్గేదే లే అంటూనే.. మరోవైపు శ్రీవల్లీ పాట డ్యాన్స్ చూపించాడు. షకీబ్ చేసిన కొత్త స్టెప్‌ను ట్విటర్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. ఇక మ్యాచ్‌లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారీషల్ 63 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బారిషల్ 95 పరుగులకే కుప్పకూలింది. చదవండి: తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు After Nazmul Islam, then @DJBravo47, and now the Bangladeshi 🐐 @Sah75official displaying the #Pushpa move! 🥳 The @alluarjun movie has really taken over the #BBPL2022. 🔥 📺 Catch these antics for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/lr5xUr0sLW#BPLonFanCode #alluarjun pic.twitter.com/9TAn8xqksr — FanCode (@FanCode) January 26, 2022 -
డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లికి ఇది 450వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. వన్డేల్లో 14వ సారి డకౌట్ అయిన కోహ్లి.. తన చర్యతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్‌లో 85 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పంత్‌ను అభినందిస్తూ కోహ్లి డ్రెస్సింగ్ రూమ్ నుంచి అతన్ని అభినందిస్తూ డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. భయం అనేది లేకుండా సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన పంత్ ఆటతీరుకు ముగ్దుడైన విరాట్.. తన చేతులతో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కోహ్లి పక్కనే కూర్చున్న శిఖర్ ధావన్.. అతని డ్యాన్స్ చూస్తూ నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: లడ్డూలాంటి అవకాశం.. బతికిపోయిన కేఎల్ రాహుల్ ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్ రాహుల్(55), పంత్(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్, రాహుల్ ఔట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ తడబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 40 నాటౌట్ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: 450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు Virat kohli is such a mood 🤣✨ pic.twitter.com/yjC6XTlJIw — Siddhi :) (@_sectumsempra18) January 21, 2022 -
పుష్ప 'శ్రీవల్లీ' పాటకు వార్నర్ అదిరిపోయే స్టెప్పులు
ఆస్ట్రేలియన్ విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తనదైన స్టైల్లో మెరిశాడు. ఇప్పటికే పుష్ప సినిమా డైలాగ్‌తో పాటు ''ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా'' పాటకు స్టెప్పులేసిన వార్నర్.. తాజాగా శ్రీవల్లీ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. అచ్చం అల్లు అర్జున్ను గుర్తుచేస్తూ అతనిలానే పాదాలను కదిలించిన వార్నర్ తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఈ వీడియోనూ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. అంతకముందు పుష్ప సినిమాలోని యవ్వా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను వార్నర్ తన మేనరిజంతో చెప్పగా.. అల్లు అర్జున్ వెంటనే రియాక్టయ్యాడు. యవ్వ తగ్గేదేలే వార్నర్.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. వార్నర్ స్టెప్పులపై మీరు ఒక లుక్కేయండి.. చదవండి: David Warner: 'వార్నర్ సార్.. భారత పౌరసత్వం తీసుకోండి'.. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
సాయి పల్లవి స్పెషల్ టాలెంట్ : అభిమానులు ఫిదా
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి అంటేనే డ్యాన్స్‌కు పెట్టింది పేరు. తనదైన శైలిలో సెలెక్ట్‌డ్ మూవీస్ చేస్తూ, సౌత్ ఇండియాలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి తన డిఫరెంట్ స్టయిల్‌తో అంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్గా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా తన అప్ కమింగ్ మూవీ లవ్ స్టోరీ టీజర్‌లోని ఒక స్పెషల్ పిక్ వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్లో సాయి పల్లవి డాన్స్‌తో అదరగొట్టింది. దీంతో ప్రేమమ్ సినిమాలో ఆమె అద్భుతమైన డ్యాన్స్ గుర్తు చేసుకుంటున్న అభిమానులు ఆమెకు మరోసారి ఫిదా అవుతున్నారు. (యూత్‌కు కనెక్ట్ అయ్యే ‘లవ్‌స్టోరీ’) ముఖ్యంగా సాయి పల్లవి వర్షంలో జంపింగ్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి స్టెప్ లు సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నారు. కాగా టాలీవుడ్ హీరో నాగచైతన్య జంటగా సాయి పల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. -
సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా
విలక్షణమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు హీరో సుధీర్ బాబు. ఫిట్నెస్, డ్యాన్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడని విషయం తెలిసిందే. తన ఫిట్‌నెస్‌కు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్ అయిన సందర్భాలు అనేకం. తాజాగా సుధీర్ డ్యాన్స్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిదా అయ్యాడు. అంతేకాకుండా సుధీర్ డ్యాన్స్ మూమెంట్స్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తన డ్యాన్స్‌కు కాంప్లిమెంట్ ఇచ్చిన టైగర్‌కు సుధీర్ ధన్యవాదాలు తెలిపాడు. ఇంతకీ విషయం ఏంటంటే? సుధీర్ సినిమాలలోని బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్‌కు సంబంధించి ఓ వీడియోను సుధీర్ బాబు ప్రొడక్షన్స్ రూపొందించింది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన సుధీర్ బాబు మీకు నచ్చిన బెస్ట్ డ్యాన్స్ మూమెంట్ ఏంటో చెప్పండి అంటూ ఫ్యాన్స్‌ను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Thank you Tiger man ❤️ We had a fight against each other and hopefully, we can dance together someday 😬😄 https://t.co/atnymZmyL6 — Sudheer Babu (@isudheerbabu) April 18, 2020 I know I haven't danced my heart out in a while ... But here are some of my favourite moves from my films ... Let me know which one or ones do you like the most 😬??? https://t.co/1Ex8Gl7zKw — Sudheer Babu (@isudheerbabu) April 17, 2020 చదవండి: 10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్ పుష్ప కోసం హోమ్‌వర్క్ -
బన్నీ డాన్స్ స్టెప్స్‌కు పాన్ ఇండియా క్రేజ్
సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం బ్లాక్బాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, పాటలు అంతకన్నా పెద్ద హిట్టయ్యాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సినిమాలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే... జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. దీంతో అల్లూ అర్జున్ డాన్స్స్టెప్స్కు పాన్ ఇండియాలో యమా క్రేజ్ వచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన అలవైకుంఠపురంలో సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుషాంత్, పూజాహెగ్డే, నివేదా పేతురాజ్, టబూ, మరళీ శర్మ, సముద్రఖని తదితరులు నటించారు. -
యువ హీరోను గడగడలాడించిన మాజీ సీఎం
ఫొటో చూస్తూనే అర్థమై ఉంటుంది.. తన అద్భుతమైన స్టెప్పులతో 30 ఏళ్ల యువహీరో రణ్ వీర్ సింగ్ ను గడగడలాడించింది 78 ఏళ్ల మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా అని! ఎన్డీటీవీ నిర్వహించిన 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కాసేపు షేక్ చేసిన ఈ పొలిటికల్- సినీ హీరోల డ్యాన్స్.. సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. రణ్ వీర్ సింగ్ కు 'బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేసేందుకు స్టేజ్ పైకి వచ్చిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫారూఖ్.. 'బాజీరావు మస్తానీ' సినిమా పాటకు యువ హీరోతో కలిసి స్టెప్పులేశారు. రణ్ వీర్ కంటే అబ్దుల్లాయే అద్భుతంగా డాన్స్ చేయడంతో సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. చూడబోతే ఆ కార్యక్రమం నాన్ స్టాప్ డ్యాన్స్ షోగా మారిపోతుందనుకున్నారో ఏమోగానీ చానెల్ ప్రతినిధి బర్ఖా దత్.. ఆ ఇద్దరినీ వారించారు. 'సార్.. మీరుగానీ సినిమాల్లోకి వచ్చేదుంటే మా ముందు తరమంతా మటాష్ అయ్యిండేది' అన్న రణ్ వీర్ పొగడ్తకు బదులిస్తూ 'నాక్కూడా సినిమాలన్నా, నటనన్నా చచ్చేంత ఇష్టం. ఇప్పటికిలా కాలం గడిచిపోయింది. అయితే వచ్చే జన్మలో మాత్రం తప్పక నటుణ్నవుతా' అని చమత్కరించారు ఫారూఖ్ అబ్దుల్లా.