
వైరల్
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది.
స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment