‘లోకల్‌’లో యువతి ‘బెల్లీ’ డాన్స్‌.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు! | Watch: Woman Doing Belly Dance In Mumbai Local Train, Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Girl Doing Belly Dance: ‘లోకల్‌’లో యువతి ‘బెల్లీ’ డాన్స్‌..

Published Wed, Sep 20 2023 9:11 AM | Last Updated on Wed, Sep 20 2023 10:25 AM

Woman Doing Belly dance in Mumbai Local Train - Sakshi

ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ముంబైలోని సాండ్‌హర్స్ట్ రోడ్- మస్జిద్ స్టేషన్‌ల మధ్య సాగుతున్న రైలు ప్రయాణం మధ్యలో ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఫుటేజీ చూసిన నెటిజన్లు పలు విధాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ముంబై పోలీసుల దృష్టిలో పడింది. ఆ యువతి లోకల్ ట్రైన్‌లో అసభ్యకర రీతిలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్నదని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ముంబై పోలీసులు ఆ యువతిపై చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంఘటన ముంబైలోని లోకల్ రైళ్లలో దిగజారుతున్న పరిస్థితికి దర్పణం పడుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: 5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, ర​‍క్తపాతాన్ని సృష్టించి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement