train
-
ట్రైన్ లో తాగుతూ.. తూగుతూ..
-
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం.. రైలు ఎక్కుతుండగా..
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్‌కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ప్లాట్ ఫారం తవ్వి కోన ఊపిరితో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
‘హైపర్ లూప్’పై పరిశోధన
సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్‌లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. చెన్నైకు ప్రత్యామ్నాయంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్ పరిశోధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధనలో ఫలితాలు సాధించినట్టు సమాచారం. అసలేంటీ ‘హైపర్ లూప్’లూప్ అనేది పైప్‌లైన్‌లాంటి మార్గం. పాట్ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్ లూప్ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్‌లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం -
Tirumala Express: తిరుమల దూరాభారం
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే కోస్తాంధ్ర జిల్లాల భక్తులందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్. ఈ రైలు ఎక్కితే.. స్వామి దర్శనానికి సరైన సమయంలో చేరుకోవచ్చు. అందుకే ఈ రైలుకు అంత డిమాండ్. కానీ.. ఇప్పుడా పరిస్థితులు కనిపించవేమో.? ఎందుకంటే తిరుమల ఎక్స్‌ప్రెస్ రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే యత్నిస్తోంది. కొత్త రూట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపింది. వాల్తేరు డివిజన్ అభిప్రాయం తీసుకోకుండానే కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: తిరుమల ఎక్స్‌ప్రెస్ ఒక రైలు కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఎంపిక చేసుకునే మొదటి ఆప్షన్ ఈ రైలే. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేళలకు అనువుగా తిరుపతి చేర్చే రైలు దాదాపు ఇదే ఉంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్ భక్తులకు సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తేనే తిరుపతి వెళ్లి.. ఏడుకొండల వాడి దర్శనం సజావుగా సాగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే ఈ రైలు ప్రతి రోజూ 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతుంటుంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయినా.. రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతుందనే ఏదో ఒక నమ్మకంతో ఈ రైలుకే రిజర్వేషన్ చేస్తుంటారు. ఒక వేళ సీటు దొరక్కపోయినా నిలబడైనా వెళ్లేందుకు సిద్ధమైపోతుంటారు.దర్శన వేళలకు అనువైన రైలుతిరుమల దర్శనానికి అన్ని ప్రాంతాల వారికీ అనువైన రైలు ఇదే. 17488 నంబర్‌తో నడిచే ఈ సర్వీస్ విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి రైల్వేస్టేషన్‌కు తర్వాత రోజు వేకువజామున 4.30కి చేరుకుంటుంది. అక్కడ దిగే భక్తులు అలిపిరి మార్గంలోనైనా, శ్రీవారి మెట్ల మార్గంలోనైనా వెళ్లేందుకు సరైన సమయం ఇది. అంటే తిరుపతిలో దిగి స్నానమాచరించి శ్రీవారి మెట్ల మార్గానికి ఉదయం 6 గంటలకు చేరుకుంటే ఉదయం 10 లేదా 11 గంటల దర్శనానికి టోకెన్ లభిస్తుంది. ఆ టోకెన్‌తో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం కూడా సులువవుతుంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌నే అందరూ నమ్ముకుంటారు.అదనంగా నాలుగైదు గంటలు వృథావాస్తవానికి ఈ రైలు ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ.. నడిచే రూట్ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంది. విశాఖలో బయలుదేరి దువ్వాడ వరకు మాత్రమే ఈస్ట్‌కోస్ట్ పరిధిలోకి వస్తుంది. మిగిలినదంతా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది. అంతే కాకుండా ట్రైన్ టెర్మినేటింగ్ కూడా ఆ జోనే చూస్తోంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్ రూట్ మార్చే ప్రతిపాదనలు చేసేందుకు ఆ జోన్‌కు అన్ని అర్హతలున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని రూట్లకు రైలు అవసరమని.. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఆ వైపుగా దారి మళ్లించేందుకు అంగీకరించాలంటూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా కాకుండా.. విజయవాడ నుంచి గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లేలా రూట్ మార్పులకు అనుమతి కోరింది. దీనికి బోర్డు ఓకే చెబితే.. మన ప్రయాణం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు ఎక్కితే 14.30 గంటల పాటు తిరుపతికి ప్రయాణం సాగుతుంది. కొత్త రూట్ అయితే మరో 5 గంటలు అదనపు సమయం పడుతుంది. అంటే విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటలకు రైలు ఎక్కితే.. తర్వాత రోజు ఉదయం 9 లేదా 10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. దీని వల్ల దర్శన వేళలకు అందే అవకాశం ఉండదు. ఈ రూట్ మార్చితే ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ వరకూ ఉన్న భక్తులు తిరుమల వెళ్లేందుకు అవస్థలు తప్పవు. దక్షిణ మధ్య రైల్వే దుర్బుద్ధిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూటు మారితే చేటే.!1970లో ప్రారంభమైన తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కొన్నేళ్ల కిందట కడప వరకూ పొడిగించారు. అయినప్పటికీ కోస్తాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కారణం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కడప వెళ్లేది. ఇప్పుడు మరోసారి రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కుయుక్తులు పన్నుతోంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కోడూరు, రాజంపేట మీదుగా కడప వెళ్తుంది. అయితే ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీసు రూటు మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు భావిస్తున్నారు. కారణాలు ఏమీ చెప్పకుండానే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఇకపై విజయవాడ నుంచి ఒంగోలు వైపుగా వెళ్లకుండా.. గుంటూరు మీదుగా నడుస్తుంది. ఇదే జరిగితే భక్తులు తిరుపతి వెళ్లే సమయం పూర్తిగా మారిపోతుంది. వేళకు స్వామి దర్శనానికి అందే పరిస్థితి ఉండదు.ఇదేం రూట్ మార్పు?తిరుమల ఎక్స్‌ప్రెస్ అంటే మాకో నమ్మకం. ఎప్పుడు తిరుపతి వెళ్లాలన్నా.. ఈ రైలునే ఎంచుకుంటాం. ఎందుకంటే వేకువ జామునే తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఎండ పెరిగే లోపు మెట్లమార్గంలోనైనా.. కాలినడకనైనా.. ఏ దర్శనానికై నా నిర్ణీత సమయానికి తిరుమలకు చేరుకుంటాం. దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం సాగిపోతుంది. అలాంటి రైలు రూట్‌ను మార్చడం సరికాదు. రైల్వే అధికారులు దీనిపై పునరాలోచించాలి.– ఎం.ఉషారాణి, సీతమ్మధారప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలితిరుపతి వెళ్లే ప్రతి భక్తుడూ దశాబ్దాలుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నమ్ముకుంటున్నారు. అలాంటి ఈ రైలును వేరే మార్గంలో తిప్పాలని ఎలా ప్రతిపాదిస్తారు? జోన్ అధికారులకు భక్తుల మనోభావాలతో సంబంధం లేదా? కొత్త రూట్లో తిప్పితే కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవాలి. సౌత్ సెంట్రల్ జోన్ పంపిన ప్రతిపాదనలు తిప్పికొట్టేలా పోరాడాలి.– కె.రామసుధ, ప్రయాణికురాలు -
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
కిలో ఉల్లి రూ. 35.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం? -
దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?
గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్‌కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్లలో ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
-
స్లీపర్ వందేభారత్ జిగేల్..!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే గతిని మార్చిన ‘వందేభారత్’సిరీస్‌లో స్లీపర్ బెర్తులతో కూడిన రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వేయి కిలోమీటర్లను మించిన దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై తొలి పరుగుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రైల్వే శాఖ మంత్రి అశ్వీనీవైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. త్వరలో దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ఇవి రాత్రి వేళ పరుగులు పెట్టబోతున్నాయి. 14 రూట్లలో వీటినే నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిస్థాయి అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. ⇒ ఈ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరో డైనమిక్ డిజైన్‌తో కనువిందు చేయనుంది. ⇒ ఇంటీరియర్‌ను జీఎఫ్ఆర్పీ ప్యానల్‌తో రూపొందించారు. ⇒ అగ్ని నిరోధ వ్యవస్థ ఈఎన్ 45545 ప్రమాణ స్థాయితో రూపొందింది (హజార్డ్ లెవెల్:3). ⇒ దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు ఇందులో పొందుపరిచారు. ⇒ ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని, మూసుకునే పద్ధతి గల డోర్లు ఏర్పాటు చేశారు. ఇవి సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. ⇒ దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇒ మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ⇒ కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. ⇒ అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ, ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్తులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. లోకో పైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. -
విజయవాడలో కలకలం.. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ మృతి
-
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు
మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు -
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర
బొటాడ్: ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా కుండ్లి గ్రామ సమీపంలోని రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రాక్‌పై పడివున్న రైలు పట్టా భాగాన్ని ఢీకొన్న పాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది.ఈ ఘటన నేపధ్యంలో ఓఖా భావ్‌నగర్ పాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని బొటాడ్‌లోని రాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రాక్‌పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్ భాగాన్ని ఉంచారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యధావిధిగా నడిచేలా చూశారు. రాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు -
పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే
సూరత్: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.గుజరాత్‌లోని సూరత్‌లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్‌లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ట్రాక్‌ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.ఎన్ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్‌ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ, శుభం శ్రీజైప్రకాష్ జైస్వాల్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్‌కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న 71 ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్ పోద్దార్‌ను మెచ్చుకున్నారు. అయితే ఎన్ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు.. -
పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు
ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్‌పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్‌పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్‌ను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాశ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. సూరత్‌గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్‌లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి -
Gujarat: రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర... తప్పిన ముప్పు
సూరత్: గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించినట్లు అమిత్‌షా తెలిపారు. రైల్వే నెట్వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo— ANI (@ANI) September 21, 2024 -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
కాసర్గోడ్: కేరళలోని కాసర్గోడ్లో హృదయ విదారక ఉదంతం చోటుచేసుకుంది. కంజనగడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు దక్షిణ కొట్టాయం జిల్లా చింగవనం వాసులుగా పోలీసులు గుర్తించారు.వీరు ఇక్కడికి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో సూపర్‌ఫాస్ట్ రైలు ఢీకొనడంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దిగువ సియాంగ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. దిమోవ్ సమీపంలోని పాలే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ హజారికా తెలిపారు. మృతుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ రిగో రిబాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని.. -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు.