బొటాడ్: ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా కుండ్లి గ్రామ సమీపంలోని రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రాక్‌పై పడివున్న రైలు పట్టా భాగాన్ని ఢీకొన్న పాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది.
ఈ ఘటన నేపధ్యంలో ఓఖా భావ్‌నగర్ పాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని బొటాడ్‌లోని రాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రాక్‌పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్ భాగాన్ని ఉంచారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యధావిధిగా నడిచేలా చూశారు. రాన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
Comments
Please login to add a commentAdd a comment