attempt
-
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర
బొటాడ్: ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా కుండ్లి గ్రామ సమీపంలోని రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రాక్‌పై పడివున్న రైలు పట్టా భాగాన్ని ఢీకొన్న పాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది.ఈ ఘటన నేపధ్యంలో ఓఖా భావ్‌నగర్ పాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. ఈ ఘటన గుజరాత్‌లోని బొటాడ్‌లోని రాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రాక్‌పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్ భాగాన్ని ఉంచారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యధావిధిగా నడిచేలా చూశారు. రాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.. దుండగుడి పేరు గణేష్‌గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని,. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. నా హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్చి ఉంది నాపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలని డిమాండ్ చేశారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. డిటోనేటర్ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే శంకర్ నారాయణ చెప్పారు. ఇదీ చదవండి: ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర: మంత్రి కాకాణి -
దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!
ఏదైనా దుకాణం లేదా స్టోర్‌లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్ సెలూన్లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు. ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్ సెలూన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్ సెలూన్‌లోకి ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు. అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సెలూన్లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్ రెగ్యులర్ కస్టమర్ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
Hyderabad: బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
సాక్షి, హైదరాబాద్: హయాత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓఆర్ఆర్ పరిసరాలకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి చేరుకున్న బాలికను.. రక్షించిన హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: దూసుకొచ్చిన మృత్యువు క్షణాల్లోనే ఘోరం -
గొలుసు దొంగను ప్రతిఘటించిన చిన్నారి
క్రైమ్: సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. కానీ, సమయస్ఫూర్తితో పాటు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ప్రతిఘటించింది ఆమె పదేళ్ల మనవరాలు. తన ఇద్దరు మనవరాళ్లతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆమె పదేళ్ల మనవరాలు.. చేతిలోని బ్యాగు తీసుకుని ఆ దొంగను యెడా పెడా బాదేసింది. ఆ దెబ్బకు ఆ దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. సీసీటీవీ ఫుటేజీలోని చోరీయత్నం- ఆ చిన్నారి అడ్డుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పూణే సిటీ పోలీసులు స్పందించారు. గురువారం(మార్చి 9న) కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral. (CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU — ANI (@ANI) March 10, 2023 -
ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి..
కోడూరు(అవనిగడ్డ) కృష్ణా జిల్లా: దుకాణంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన మహిళ (35) కోడూరులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఆమె ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఉదయం దుకాణానికి వచ్చి పని ముగించుకొని తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సదరు మహిళ దుకాణంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్‌బేగ్‌పేట సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆమె చీరకొంగును పట్టుకొని లాగాడు. దీంతో మహిళ బైక్ పైనుంచి కింద పడిపోవడంతో ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. మహిళ కేకలు వేసేందుకు ప్రయత్నించగా నిందితుడు ఆమె ముఖం, చేతిపై దాడి చేసి, నోరు మూసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రహదారి వెంట వెళ్తున్నవారు మహిళ కేకలు విని అటుగా వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల మహిళ కాలుకు బలమైన గాయం, చేతికి, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్ వివరాలు సేకరించిన సీఐ శ్రీనివాస్.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అవనిగడ్డ సీఐ శ్రీనివాస్ బాధిత మహిళను అడిగి తెలుసుకున్నారు. కోడూరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ను పరిశీలించి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. కోడూరు, నాగాయలంక పీఎస్‌లకు సంబంధించిన పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. -
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
-
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రవిరంజన్‌పై మూడు కేసులు ఉన్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫ్రొఫెసర్ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. -
గన్ తలకు గురిపెట్టి కాల్చబోయాడు.. ఊహించని ట్విస్ట్
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ డె కిర్చనర్.. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ దుండగుడు గన్ ఆమెకు గురిపెట్టి తలకు కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే అతి సమీపంగా జరిగిన ఈ దాడి యత్నంతో అంతా షాక్ తిన్నారు. అయితే.. ట్రిగ్గర్ నొక్కినా గన్ మిస్‌ఫైర్ కావడంతో ఆమె సురక్షితంగా దాడి నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే దుండగుడిని పోలీసులు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి బ్యూనస్ ఎయిర్స్ ఇంటి వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా మంత్రి అనిబల్ ఫెర్నాండేజ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చాలా చానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతోంది. మిలిటరీ నియంతృత్వ పాలన నుంచి అర్జెంటీనా 1983లో స్వాతంత్రం సంపాదించుకుంది. అయితే.. అప్పటి నుంచి ఈ తరహా హత్యాయత్నాలు జరగడం మాత్రం ఇదే తొలిసారి. దాడికి యత్నించిన వ్యక్తిని బ్రెజిల్ వాసి ఫెర్నాండో ఆండ్రే సబాగ్ మోనటియల్గా గుర్తించారు. అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు ధృవీకరించారు. క్రిస్టియానా ఫెర్నాండేజ్ డె కిర్చనర్.. గతంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 2007-15 మధ్య ఆమె పని చేశారు. అయితే పబ్లిక్ కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి, అవకతవకలకు పాల్పడారన్న ఆరోపణలతో.. విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె. రుజువైతే ఆమె 12 ఏళ్లు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... -
లొంగకపోతే అంతు చూస్తా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి..
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ దేవాంగుల వీధికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన పి.చిన్నారావు ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా పని చేసుకుంటున్న యువతిని గ్రామంలోని జూట్‌మిల్‌లో పనిచేస్తున్న చిన్నారావు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్ తనకు లొంగకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో 12వ తేదీ రాత్రి శ్రీకాకుళం టౌన్‌కు పనిమీద వెళ్లిన యువతి తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల సమయంలో సింగుపురం వద్ద గల కొండమ్మ తల్లి చెరువు వద్ద బస్సు దిగింది. అక్కడే కాపుకాసిన చిన్నారావు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయతి్నంచాడు. ఇంతలో జాతీయ రహదారి మీదుగా పలాస వెళ్తున్న ఓ వ్యాన్‌లోని వ్యక్తులు గమనించి ఆమెను కాపాడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రూరల్ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా?
సాక్షి,పెద్దేముల్( వికారబాద్): ఆరు నెలల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి సర్వసం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అధికారులు కనీసం సదరం సరిఫికెట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దేముల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి యాదప్ప, గీత దంపతులకు ఏకైక కుమారుడు వెంకటయ్య. అనారోగ్యంతో కొంతకాలం క్రితం గీత మృతి చెందింది. దీంతో తండ్రీకొడుకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2021లో యాదప్ప ఇంటి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యాదప్ప కుమారుడు వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని కళ్లూ, రెండు చేతులు పోయాయి. ఒకరి సహాయం లేనిదే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి. పేలుడు పదార్థాలకు కావాల్సిన సామగ్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో లభ్యం కావడంతో అప్పట్లో ఆ శాఖ అధికారులు రూ.3 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో రూ.1,20 లక్ష నగదు అందచేశారని, మిగతా డబ్బులు, భూమి ఇవ్వటం లేదని యాదప్ప తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ఇటీవల పెద్దేముల్‌కు వచ్చిన కలెక్టర్ నిఖిల దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లారు. పూట గడవని తమకు కనీసం పింఛన్ మంజూరు చేయాలని తండ్రీకొడుకు వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. వారికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా.. గమనించిన అక్కడున్న వారు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఫయీమ్ఖాద్రీ వారిని సముదాయించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. తండ్రీకొడుకుకు తహసీల్దార్, ఎస్ఐ నాగరాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఽ సర్టిఫికెట్ ఇవ్వండి: ఎమ్మెల్యే తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి, వెంటనే సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. తండ్రీకొడుకును అక్కడే ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆటోలో వికారాబాద్‌కు తరలించారు. -
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్ బాలికపై..
సాక్షి,నల్లబెల్లి( హనుమకొండ): మండలంలోని కొండాపూర్‌లో ఓ మైనర్ బాలిక(14)పై అత్యాచారయత్నం జరిగింది. స్థానిక ఎస్సై రేగ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక నల్లబెల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆమె తన ఇంటికి వెళ్లింది. ఆదివారం రోజున కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో బాలిక ఇంటి వద్ద ఉంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విషయాన్ని గమనించి ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరవడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. వ్యవసాయపనులకు వెళ్లివచ్చిన తల్లిదండ్రులకు జరిగిన ఘటనను బాలిక తెలియజేసింది. ఈ మేరకు బాలిక తండ్రి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి.. -
TSRTC: నాలుగు రోజులుగా డ్యూటీలు వేయకుండా వేధిస్తుంది..
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): డ్రైవర్లకు, కండక్టర్లకు డ్యూటీలు వేసే అధికారిణి తనకు నాలుగురోజులుగా డ్యూటీ వేయకుండా ఇంటికి పంపిస్తోందని ఆవేదన చెందిన బల్రాం అనే ఆర్టీసీ డ్రైవర్ శనివారం మధ్యాహ్నం డిపోలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ ఇస్లాంపూర కాలనీకి చెందిన డ్రైవర్ బల్రాం మంగళవారం ఆఫ్ ఉండడంతో తన కూతురుని తీసుకుని హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌కు వెళ్లాడు. బుధవారం ఉదయం 6 గంటలకు డ్యూటీకి రావాల్సి ఉండగా 6:30 నిమిషాలకు ఆర్టీసీ డిపోకు వెళ్లాడు. అరగంట డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడని డ్యూటీలు కేటాయించే అధికారిణి(ఎస్టీఐ) బల్‌రాంకు డ్యూటీ వేయలేదు. దీంతో ఇంటికి వెళ్లిన బల్రాం మరుసటి రోజు ఉదయమే డ్యూటీకి రాగా మళ్లీ డ్యూటీ వేయకుండా తిప్పిపంపించింది. ఇలా నాలుగు రోజులుగా డ్యూటీ కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నా రని ఆవేదన చెందిన బల్రాం డిపోలో తన వెంట తీసుకొచ్చిన పురుగుల మందును సేవించాడు. విషయం గమనించి అక్కడే ఉన్న మిగితా కార్మికులు బల్రాంను వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలోబల్రాం భార్య సునీత రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.తన భర్తకు డ్యూటీ వేయకపోవడంతో రోజు ఇంటి దగ్గర ఏడ్చేవాడని, తాను ధైర్యం చెప్పినప్పటికీ ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధగా ఉందని అమె పేర్కొంది. బల్‌రాంకు కుతురు, కుమారుడు ఉన్నారు. ‘సాక్షి’లో ఇటీవల సదరు డ్యూటీలు వేసే అధికారిణి కార్మికులను తీవ్రంగా వేధిస్తోందంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ -
మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి దారుణం..
సాక్షి, చివ్వెంల(సూర్యాపేట): బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(11) బుధవారం రాత్రి ఓ ఇంట్లో టీవీ చూస్తుండగా అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో ఇరుగుపోరుగు వారు వచ్చే సరికి బాలికను వదిలి పరారయ్యాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
దరఖాస్తు చేసినా అటెంప్టే!
న్యూఢిల్లీ: ఇకపై సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తు చేసినా దానిని ఒక ప్రయత్నం (అటెంప్ట్)గానే పరిగణించాలని యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) తాజాగా ప్రతిపాదించింది. నిబంధనల ప్రకారం ఏ కులపరమైన రిజర్వేషన్లూ లేని అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు ఆరుసార్లు మాత్రమే ప్రయత్నించొచ్చు (ఆరు అటెంప్ట్‌లు). నిర్దేశిత వయసు నిబంధనలకు లోబడి ఓబీసీలు అయితే 9 సార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దరఖాస్తు చేశాక, అభ్యర్థి కనీసం ప్రాథమిక పరీక్షలోని ఒక్క పేపర్‌కైనా హాజరైతేనే దానిని ప్రయత్నం (అటెంప్ట్)గా పరిగణిస్తున్నారు. మరోవైపు పరీక్ష ఫీజు తక్కువగా ఉండటం, అందరు మహిళా అభ్యర్థులతోపాటు ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులు తదితరులకు అస్సలు ఒక్క రూపాయి కూడా ఫీజు లేకపోవడంతో లక్షల సంఖ్యలో యూపీఎస్సీకి దరఖాస్తులు వస్తున్నా పరీక్షకు మాత్రం వారిలో సగం మందే హాజరవుతున్నారు. యూపీఎస్సీ మాత్రం దరఖాస్తు చేసిన వారందరికీ ప్రశ్నపత్రాలను ముద్రించడం, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ఖర్చు భారీగా అవుతోంది.దరఖాస్తును కూడా ప్రయత్నంగానే పరిగణిస్తే అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి నిజంగా పరీక్ష రాయాలనుకునే వారే దరఖాస్తు చేస్తారనేది యూపీఎస్సీ వాదన. 2016లో 11.35 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది మాత్రమే ప్రాథమిక పరీక్షలు రాశారు. -
ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి
తల్లి, పెద్ద కుమారుడిని రక్షించిన కల్లుగీత కార్మికుడు గల్లంతైన చిన్న కుమారుడు అనపర్తి : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో తనువు చాలించాలని ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకింది. ఇటీవల కొత్తపేట సమీపంలో కాలువలో దూకి అక్కాచెల్లెళ్లు బిడ్డలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ముగ్గురు పిల్లలు, తల్లి మృతి చెందిన ఘటన మరువక ముందే అనపర్తిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, భర్తతో తగాదాతోనే తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తల్లిని, పెద్ద కుమారుడిని కల్లుగీత కార్మికుడు రక్షించగా, చిన్న కుమారుడు కాలువలో పడి గల్లంతయ్యాడు. బాధితుల బంధువులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనపర్తి గంగన్నగారి వీధికి చెందిన తంగేటి లోవకుమారి, శివగణేష్‌లు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల రోహిత్ వీరేంద్రనా«థ్, మూడేళ్ల కుష్యంతరాజు అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా ద్వారపూడిలో నివాసం ఉన్న శివగణేష్ కుటుంబం ఏడాది క్రితం అనపర్తికి వచ్చింది. శివగణేష్ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఈ కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య ఇటీవల తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నెల 10న లోవకుమారి, శివగణేష్‌ల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఈమెను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ఇద్దరు కుమారులను తీసుకుని లోవకుమారి కెనాల్ రోడ్డులోని వీర్రాజు మామిడి వద్దకు చేరుకుంది. తొలుత చిన్నారులను కాలువలోకి విసిరేసి తాను కూడా దూకింది. ఈ తతంగాన్ని సమీపంలో కల్లు అమ్ముకుంటున్న గీత కార్మికుడు గమనించాడు. పరుగున వచ్చి తొలుత లోవకుమారిని, అనంతరం పెద్ద కుమారుడు రోహిత్ వీరేంద్రనాథ్‌ను ఒడ్డుకు చేర్చాడు. చిన్న కుమారుడిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే కుష్యంత్‌రాజు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోవకుమారిని, పెద్ద కుమారుడిని స్టేషన్‌కు తీసుకు వచ్చిన అనంతరం వైద్య పరీక్షల కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న శివగణేష్ పోలీస్టేషన్‌కు చేరుకుని బోరున విలపించాడు. ఆత్మహత్య చేసుకునేంత పెద్ద పాటి తగాదాలు లేవని, ఆర్థిక సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపాడు. అనపర్తి అడిషనల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం.. కుష్యంత్‌రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారి సాయంతో బాలుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. గత నెలలో హోలీ రోజున ఇద్దరు బాలురు నల్లకాలువలో పడి మృతి చెందిన ఘటనను అనపర్తి ప్రజలు మరువక ముందే కుష్యంత్‌రాజు ఈ రూపంలో గల్లంతవ్వడం స్థానికంగా పలువురిని కలవరపరుస్తోంది. -
ఎస్సైపై దాడికి యత్నం
మంచిర్యాల: బందోబస్తుకు వెళ్లిన మంచిర్యాల ఎస్సైపై ఓ తాగుబోతు దాడికి యత్నించాడు. సిబ్బంది అతడిని పట్టుకుని, విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని జైపూర్ మండలంలో జరిగింది. మండలంలో జరుగుతున్న వేలాల జాతరలో బందోబస్తుకు మంచిర్యాల ఎస్సై వేణుగోపాల్ శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో కారులో వచ్చాడు. జాతరలో ఉన్న ఎస్సై వద్దకు చేరుకుని దుర్బాషలాడుతూ ఆయన్ను కొట్టబోయాడు. అతనిని సిబ్బంది, స్థానికులు నిలువరించారు. ఆ అగంతకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై
-
దొంగ.. పోలీస్!
► అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై ► అదే సమయంలో ఇంటి యజమాని ► రావడంతో పట్టుబడిన వైనం ► అరెస్టు చేసిన పోలీసులు.. ► అల్మాస్‌గూడలో ఘటన ► 2009లో ఎస్సైగా ఎంపికైన మహేందర్‌రెడ్డి ► ఉగ్రవాది వికారుద్దీన్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌లో సభ్యుడు కూడా.. హైదరాబాద్: అతనో పోలీస్.. దొంగలను పట్టుకోవడమేమోగానీ తానే దొంగగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని ఓ ఇంట్లో చొరబడ్డాడు. అందినకాడికి దోచుకెళదామనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఇతను ఓ ఎస్సై.. పేరు మహేందర్‌రెడ్డి. ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఈ ఎస్సై సభ్యుడు కూడా. కానీ చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లో మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అల్మాస్‌గూడలోని శ్రీశ్రీహోమ్స్‌లో నివాసం ఉంటున్న శివప్రసాద్ దసరా పండుగ కోసం తమ స్వస్థలం కరీంనగర్‌కు వెళ్లారు. తిరిగి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అల్మాస్‌గూడలోని తన ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. సందేహం వచ్చిన శివప్రసాద్.. 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే మీర్పేట్ సీఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారు ఇంట్లోకి వెళ్లి మెల్లగా పరిశీలించడం మొదలుపెట్టగా.. మహేందర్‌రెడ్డి ఇంట్లో తాపీగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత మహేందర్‌రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తాను గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినని బుకారుుంచాడు. మరి అర్ధరాత్రి ఈ ఇంట్లో ఏం పని అని నిలదీస్తే ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసి.. చోరీకి ప్రయత్నించినట్లుగా కేసు నమోదు చేసినట్లు మీర్పేట్ సీఐ రంగస్వామి తెలిపారు. పోలీసులు మహేందర్‌రెడ్డి గురించి ఆరా తీయగా .. అతను ఎస్సై అని తేలింది. గుర్రంగూడకు చెందిన మహేందర్‌రెడ్డి 2009లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఎస్సై చోరీకి దిగిన ఇల్లు ఇదే.. -
ఒకే ఇంట్లో రెండోసారి చోరీకి యత్నం
నల్లబెల్లి : మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య తన స్వగ్రామం నందిగామకు శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సోమవారం రాత్రి ఒక్కడే ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించగా, తెరిచిన బీరువా, చిందరవందరగా పడేసిన దుస్తులు కనిపించాయి. ఆభరణాలు, నగదు కోసం వెతికిన దొంగలు ఏమీ దొరకకపోవడంతో మళ్లీ తాళం వేసి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గత 20 రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో చోరీకి యత్నించడం ఇది రెండోసారి. అచ్చయ్య ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్సై మేరుగు రాజశేఖర్ సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో గాలింపు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే పోలీస్ డాగ్ స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాపు వద్దకు వెళ్లి ఆగడం గమనార్హం. -
ప్రజావాణిలో గొంతు కోసుకున్న వ్యక్తి
సమస్య పరిష్కారం కాకపోవడం వల్లేనని ఆవేదన కాకినాడ సిటీ : కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణి వద్ద సోమవారం ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం మండ లం నడిపూడి గ్రా మం మెట్లకాలనీకి చెందిన కుడిపూడి సాయిబాబా భూసమస్య పరిష్కారం కోరు తూ కలెక్టరేట్ ప్రజావాణిలో అర్జీ అందజేసి, రసీదు తీసుకున్నాడు. ఇప్పటికే రెం డుసార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాకపో గా, మరలా తహసీల్దార్‌కు సిఫారసు చేస్తూ రసీదు ఇవ్వడంతో, ఇక సమస్య పరిష్కా రం కాదని ఆందోళన చెంది ప్రజావాణి ఆవరణలోనే బ్లేడుతో గొంతు కోసుకున్నా డు. దీంతో అక్కడ అలజడి చేలరేగింది. సిబ్బంది 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. కుమార్తెకు పట్టా మంజూరు చేయాలని.. నడిపూడి మెట్లకాలనీలోని తన ఇంటికి ఆనుకుని ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన సెంటు భూమిని కుమార్తె పేరున పట్టా మంజూరు చేయాలని కోరుతూ సాయిబాబా అధికారుల చుట్టూ మూడు నెల లుగా తిరుగుతున్నాడు. మండల స్థాయిలో పట్టించుకోకపోగా, వేరొకరి వద్ద అధికారులు సొమ్ము తీసుకుని పట్టా మంజూరు చేశారని ఆయన ఆరోపించాడు. తాను ఎప్పటి నుంచో పీడబ్ల్యూడీకి చెందిన సెం టు భూమిలో అరటి, కొబ్బరి మొక్కలు పెంచుకుంటున్నానని తెలిపాడు. కలెక్టరేట్ ప్రజావాణిలో ఇప్పటికి మూడుసార్లు అర్జీ ఇచ్చినా, సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పునరావృతమవుతున్న ఘటనలు ప్రతివారం మండల, జిల్లా స్థాయిల్లో జరిగే ప్రజావాణిలో అర్జీలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించక అర్జీదారులు పదేపదే తిరుగుతూ విసిగిపోతున్నారు. జూన్ 13న పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వృద్ధురాలు.. అకారణంగా తన పింఛను నిలిపివేశారని, దానిని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. అర్జీల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యవైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వివాహిత ఆత్మహత్య
కాకినాడ సిటీ : స్థానిక వెంకట్‌నగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తుమ్మలపల్లి మేఘన (30) భర్త రమేష్ కుమార్ నుంచి విడిపోయి ఎం.విజయ్‌కుమార్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. మేఘన, రమేష్ మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం ఒకరిపై ఒకరు కేసులు వేసుకుని కోర్టుకు వెళ్లారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి వెంకట్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మేఘన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మేఘన మృతికి రాయవరపు సత్యభామ, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఎన్వీ సాయిబాబా అనే వారు కారణమని ఆమె బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేఘన పేరుపై ఉన్న భూమిని వారిద్దరూ తనఖా పెట్టించి, ఆ సొమ్మును ఆమెకు ఇవ్వలేదని ఆరోపించారు. పలుమార్లు అడిగితే వారిద్దరూ వేధిస్తేనే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు. సీఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకిన మహిళ
∙పిల్లలు మృతి ∙ తల్లిని రక్షించిన మత్స్యకారులు ధవళేశ్వరం : ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలూ మృతి చెందగా మహిళను మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ధవళేశ్వరం రామపాదాల రేవునకు ఎగువన ఇద్దరు పిల్లలను చీరకు చుట్టుకున్న విజయలక్ష్మి అనే మహిళ గోదావరిలోకి దూకేసింది. రామపాదాల రేవు వైపునకు కొట్టుకు వస్తున్న వారిని స్థానిక మత్స్యకారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఆమెను పట్టుకొని ఉన్న కుమారుడు చంద్రవాచార్యులు (4), కుమార్తె శ్రీనిధి (3) అప్పటికే మృతి చెందారని స్థానికులు తెలి పారు. ప్రాణాలతో బయటపడిన విజయలక్ష్మి వేమగిరి కోకోకోలా కంపెనీ ఉద్యోగి సుబ్రహ్మణ్యాచార్యులు భార్య. చిన్నారుల మృతదేహాలను బం ధువులు తీసుకువెళ్లినట్టు వారు చెప్పారు. వారు గోదావరిలో దూకే ముందు ఫోన్ మాట్లాడారని ఆ వెంటనే గోదావరిలో దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిన్నారులను పొట్టనపెట్టుకున్నావంటూ బంధువులు విజయలక్ష్మిని కొట్టి అక్కడ నుంచి తీసుకు Ðð ళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని ధవళేశ్వరం పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో మంగళవారం రాత్రి సంచల నం రేపిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం
-
ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధోబీఘాట్ చౌరస్తాలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంను బద్దలుకొట్టి నగదు చోరీ చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీమ్ పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. నగదు చోరీ అయిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బ్యాంకు అధికారులు పరిశీలించి చోరీ జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్థారించనున్నారు. -
రేప్ చేయబోతే..
కృష్ణా: లిఫ్ట్ అడిగి అపరిచిత కారెక్కిన ఓ మహిళపై కారు డ్రైవర్ అత్యాచారానికి యత్నించగా, అతని కళ్లలో కారం కొట్టి తప్పించుకున్న సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం సీతాపురం తండా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు గ్రామానికి చెందిన మహిళ(27) ఊరి నుంచి రెడ్డి గూడెం వెళ్లేందుకు సోమవారం రాత్రి 10గంటల సమయంలో బస్సు కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో అటువైపుగా కారులో వచ్చిన బాబూరావు అనే వ్యక్తి రెడ్డిగూడెంకు బండి వెళ్తోందని ఆమెను ఎక్కించుకున్నాడు. కారు సీతాపురం చేరిన తర్వాత కూనపరాజు పర్వకు వెళ్లే రహదారి వైపు దారి మళ్లించి మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో పడిన ఆమె అందుబాటులో ఉన్న కారాన్ని తీసుకుని మృగాడి కళ్లలో కొట్టి, కారు దిగి కేకలు వేసింది. ఎవరూ లేకపోవడంతో తల్లికి ఫోన్ చేసింది. బాధితురాలి తల్లి రెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి బాబూరావు కారు వదిలి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కారును సీజ్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
స్నేహమని నమ్మితే ....
చేయని నేరానికి.. జీవచ్ఛవంగా మారిన బాధితురాలు స్నేహమని నమ్మితే కాలయముడయ్యాడంటున్న తల్లిదండ్రులు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా, ప్రజాసంఘాలు తిరుపతిక్రైం: తిరుపతిలో ప్రేమించలేదనే కారణంతో యువతిని బైక్‌తో ఢీకొని హత్యాయత్నానికి పాల్పడ్డ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహంగా ఉంటూనే హత్యాయత్నం చేయడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ నిందితులు బాధితురాలిని బెదిరించినట్లు తెలుస్తోంది. పగతోనే ఘాతుకానికి ఒడిగట్టారు.. పగతోనే నిందితులు నవీన్‌కుమార్, యశ్వంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కనకభూషణం లేఔట్‌కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా నిందితులు అరెస్టు చేయడంలో మొదట్లో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని వాపోతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమార్తెను బెదిరిం చేందుకు కూడా నిందితులు వెనుకాడలేదని ఆరోపించారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెండో నిందితుడికి రిమాండ్ ప్రేమపేరుతో వేధించి ఓ యువతిని వాహనంతో ఢీ కొని గాయపరిచిన కేసులో రెండో నిందితుడు జి.యశ్వంత్‌ను పోలీసుల మంగళ వారం తిరుపతి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇతడికి జూలై 13వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు యశ్వంత్‌పై అలిపిరి పోలీసులు ఐపీసీ 354, 354డి, 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో మొదటి నిందితుడుగా వున్న ఎన్.నవీన్‌కుమార్ ఈనెల 21వతేదిన కోర్టులో సరెండర్ అయి మరుసటి రోజు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. రౌడీషీటు నమోదు యువతలను వాహనంతో ఢీ కొన్న నవీన్‌కుమార్, యశ్వంత్‌పై నిర్భయ చట్టం నమోదు చేశామని, అంతేగాక వీరిపై రౌడీషీటు తెరిచామని అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం వహిం చలేదన్నారు. కాగా తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కూడా దీనిపై స్పందించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. స్నేహమంటూ మాట కలిపితే.. ఆప్తుడనుకుంది. సలహాలిస్తుంటే.. స్నేహితుడిగా భావించింది. అయితే మంచిత నం ముసుగులో ముంచేస్తాడని, కా దంటే ప్రాణాలే తీసేందుకు తెగిస్తాడని ఊహించలేకపోయింది. ప్రస్తుతం వెన్నెముక దెబ్బతో జీవచ్ఛవంగా మారి దీనస్థితిలో మంచానికి పరిమితమైంది. సకాలంలో స్పందించడంలేదు మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, హత్యాయత్నాల సంఘటనలపై పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటివి అరికట్టవచ్చు. ఇప్పటికైనా బాధితురాలికి సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై వుంది. నిర్భయచట్టం కింద వచ్చే డబ్బులు వెంటనే ప్రభుత్వం మంజూరు చేసి అన్ని విధా లా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. - నిర్మల, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి -
మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఒంగోలు: ఒంగోలులోని స్థానిక రెండవ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్న జ్యోతి బుధవారం మధ్యాహ్నం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెనుక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే దేవేంద్ర అనే కానిస్టేబుల్‌కు జ్యోతి నాలుగు లక్షల రూపాయల అప్పు ఇచ్చింది. డబ్బు ఇమ్మని ఎన్నిసార్లు అడిగినా దేవేంద్ర ఇవ్వకపోవడంతో విసుగుచెందిన జ్యోతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించింది. గమనించిన పోలీసులు వెంటనే ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. -
మరోసారి ఆ పని చేయబోను: షారుక్
ముంబై: ఇటీవలి కాలంలో తమ సినిమాల కోసం కథానాయకులే గొంతు సవరించుకొని పాటలు పాడుకుంటున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్లు సైతం హీరోలతో పాటలు పాడించి అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మాత్రం అభిమానులకు షాకిచ్చే వార్త చెప్పాడు. తన 25 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో జోష్ సినిమాకు గాను 'అపున్ బోలా తు మేరి లైలా' సాంగ్ కోసం ఒకే ఒకసారి గొంతు సవరించుకున్న ఈ హీరో.. మరోసారి ఆ ప్రయత్నం చేయబోనని తేల్చి చెప్పాడు. ఓ టీవీ చానల్ నిర్వహించిన మ్యూజికల్ రియాలిటీ షోలో పాల్గొన్న షారుక్ ఖాన్.. కార్యక్రమంలో పాల్గొన్న గాయకుల గాత్రానికి ముగ్ధుడైపోయాడు. గాయకులు చక్కగా పాడుతున్నారని కితాబిచ్చిన షారుక్.. తాను మాత్రం మరోసారి పాడే సాహసం చేయబోనన్నాడు. తన సినిమాలకు మంచి పాటలు పాడిన గాయకులందరికీ ఈ సందర్భంగా షారుక్ ధన్యవాదాలు తెలిపాడు. -
పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ..
తిరుపతి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ హోంగార్డు మోసగించాడంటూ ఒక యువతి శ్రీవారి ప్రధాన ఆలయం వద్ద గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. యోగి అనే హోంగార్డు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆలయం వద్ద గాజుపెంకులు మింగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పండ్లు కొనిస్తానని తీసుకెళ్లి..
గూడురు: ఆరవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటూ 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని దగ్గరకు బుధవారం మండలంలోని దామరవంచ గ్రామానికి చెందిన దారం సాగర్ (22) వచ్చాడు. బాలికకు బంధువైన అతడు పండ్లు కొనిస్తానని చెప్పి ఆమెను బండిపై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. స్థానికంగా కొందరు రైతులు చూడడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రి లేడన్న బాధను దిగమింగి...
నగరి : తండ్రి మర ణించాడని తెలిసినా ఆ బాధను దిగమింగి చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థి సోమవారం పదోతరగతి పరీక్ష రాశాడు. నగరి మండలం అడవికొత్తూరు దళితవాడకు చెందిన రఘువరన్ (46) దినసరి కూలీ. ఆయనకు నలుగురు కుమారులు. మూడో కుమారుడు వెంకటేశ్ సత్రవాడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం రఘువరన్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణవార్త విన్న వెంకటేశ్ ఆ బాధను దిగమింగి సోమవారం చివరి పరీక్ష రాశాడు. -
బాలుడిని విక్రయించడానికి తల్లి యత్నం
ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆదివారం ఓ బాలుడిని విక్రయించడానికి వచ్చిన తల్లిని గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన శైలజకు నిజామాబాద్ పట్టణానికి చెందిన పోశెట్టితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా శైలజతో భర్త పోశెట్టి విడాకులు పొంది నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి శైలజ తన తల్లిదండ్రులు రాజేందర్-రేణుకల వద్ద నిజామాబాద్ పట్టణంలోని గాజుల్‌పేటలో ఉంటుంది. ఆదివారం శైలజ తన రెండున్నరేళ్ల కుమారుడు బాలయ్యను జానకంపేట గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయించాలని గ్రామంలో తిరుగుతోంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆమెను నిలదీయగా అసలు విషయం బయట పడింది. స్థానికులు గ్రామ సర్పంచ్ బండారి దశరథ్కు సమాచారం అందించగా.. ఆయన ఐసీడీఎస్ జిల్లా ఇన్చార్జి పీడీకి, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్లకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించకపోవడంతో.. చివరకు గ్రామంలో ఉన్న అంగన్వాడి కార్యకర్తలకు పసిబాలున్ని అప్పగించారు. కాగా, ఐసీడీఎస్ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని సర్పంచ్ తెలిపారు. -
ఆంధ్రాబ్యాంకులో చోరీకి యత్నం
హైదరాబాద్: చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. అర్థరాత్రి బ్యాంకు భవనం వెనుక గోడకు కన్నం వేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. అయితే, ఫలించక పోవటంతో వెంట తెచ్చుకున్న పరికరాలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించింది. -
కాసేపట్లో పరీక్ష..బాలికలు దూకేశారు
తిరువనంతపురం: పదో తరగతి పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందే ముగ్గురు బాలికలు ఆత్మహత్య యత్నం చేశారు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో సోమవారం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు బ్రిడ్జ్ పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వాళ్లను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ముగ్గురు బాలికలకు మధ్యహ్నం పదో తరగతి పరీక్ష ఉంది. దీనికి ముందే ముగ్గురు ఒకే సారి ఆత్మహత్య యత్నం చేశారు' అని పోలీసులు తెలిపారు. -
బీఫ్ బ్యాన్ కోసం ఎనిమిదిమంది ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్ః గోమాంసాన్ని నిషేధించాలంటూ గుజరాత్ లో మళ్ళీ ఆందోళన మొదలైంది. రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎనిమిదిమంది యువకులు ఢిల్లీలో జరుగుతున్న బీఫ్ బ్యాన్ డిమాండ్ దీక్షకు మద్దతుగా పత్తి పొలాలకు వేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆప్రమత్తమైన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గుజరాత్ లోని గోరక్ష ఏక్తా సమితికి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు మధ్యాహ్నం 12.15 నిమిషాల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వారి డిమాండ్ కు మద్దతుగా నినాదాలు ప్రారంభించారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఘటనాస్థలంలో పోలీసులు మొహరించారు. దీంతో ప్రదర్శనకు రాజ్ కోట్ వచ్చిన నిరసనకారుల్లోని సౌరాష్ట్ర గూచీ, గోండాల్, థంగాధ్, జామ్‌నగర్, లింబ్డి ప్రాంతాల్లోని ఎనిమిదిమంది యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రదర్శనకు వచ్చిన యువత ఆస్పత్రిపాలయ్యారన్నవార్తతో గో రక్షణ ప్రచార మద్దతుదారులు సౌరాష్ట్ర ప్రాంతంలో నిరసనలకు దిగారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ స్తంభింపజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాజ్ కోట్ గ్రీన్ ల్యాండ్ క్రాసింగ్ సమీపంలో ట్రాఫిక్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాజ్ కోట్ లో ప్రదర్శన నిర్వహించారు. -
నాన్నా..ఇక దొంగ రాడులే..
శ్రీకాళహస్తి గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై హత్యాయత్నం భద్రత లేదని బాలికను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు చదువుకుంటానని వేడుకున్న చిన్నారి ‘‘నాన్నా.. నేను ఇక్కడే ఉంటా. దొంగ నన్ను చంపడానికి ఇక రాడులే. నేను చచ్చిపోయానని వదిలిపెట్టి వెళ్లాడు. చెల్లిని జాగ్రత్తగా చూసుకో’’ ‘‘సార్.. నాకు చదువుకోవాలని ఉంది. ఇంటికి వెళితే బడికి శాశ్వతంగా పంపరు. దయచేసి నన్ను పంపించకండి’’ ...అంటూ లోకేశ్వరి అనే చిన్నారి ఆదివారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులను, తన తండ్రిని వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ బాలిక ప్రాణాలకు ప్రమాదమని భావించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. పేదల పిల్లలు చదివే గురుకుల పాఠశాలలో రక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. శ్రీకాళహస్తి: స్థానిక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ఆదివారం హత్యాయత్నం ఘటన తల్లిదండ్రులను కలవరపెట్టింది. తెలుగుగంగ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలోకి ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోపలికి చొరబడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన లోకేశ్వరి(11) వద్దకు చేరుకుని అమాంతం గొంతునులిమాడు. ఆ చిన్నారి సృహ కోల్పోరుుంది. దీన్ని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. గాయపడిన బాలికను ప్రిన్సిపాల్ ద్వారకానాథ్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత కోలుకున్న బాలికను పాఠశాలకు తీసుకువచ్చారు. ఇక్కడ భద్రత లేదు లోకేశ్వరిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ తమ పిల్లలకు భద్రత లేదని ఆందోళన దిగారు. తమ బిడ్డలను ఇంటికి పంపేయాలని డిమాండ్ చేశారు. వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, పాల సొసైటీ చైర్మన్ రావిళ్ల వుునిరాజానాయుుడు, టూటౌన్ సీఐ వేణుగోపాల్, తహశీల్దార్ చంద్రమోహన్, ఎంఈవో బాలయ్యు పాఠశాలకు వెళ్లి బాలికను విచారించారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటావుని సీఐ వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే లోకేశ్వరి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ సందర్భంగాలో ఆ బాలిక తాను చదువుకుంటానని తండ్రిని, ఉపాధ్యాయులను వేడుకుంది. తాను చచ్చిపోయాయని భావించి దొంగ ఇక రాడనీ, తనను ఇక్కడే ఉంచాలని కోరింది. కొద్ది రోజులు ఇంటి వద్ద ఉంచి తర్వాత పంపుతానని నచ్చజెప్పాడు. ఆ విద్యార్థిని మాత్రం చంపబోయినందుకు భయపడలేదు కానీ.. చదువుకోలేకపోతానేమోనని ఏడ్చుకుంటూ నాన్న వెంట వెళ్లింది. -
స్కెచ్ పక్కానే..!
రౌడీ షీటర్లే భయపడ్డారు హత్యాయత్నం కుట్రను బయట పెట్టిన రౌడీషీటర్లు ఏఎస్సై కోణంపై పోలీసుల ఆరా సస్పెన్షన్‌కు రంగం సిద్ధం విజయవాడ సిటీ : నాలుగు నెలలుగా పథకం అమలుకు ప్రయత్నించారు. రెండుసార్లు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రెండో ప్రయత్నం అతనిని మరణం అంచుల వరకు తీసుకెళ్లినా అదృష్టం కొద్దీ బయట పడ్డాడు. పదే పదే ప్రణాళిక మార్చినా హతమార్చే అవకాశం రాకపోవడం, పోలీసుల ట్రీట్మెంట్ భయం వెన్నాడటంతో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై ఆంబోతుల రాంబాబు నుంచి సుఫారీ తీసుకున్న రౌడీషీటర్లు హత్యాయత్నం కుట్రను లీక్ చేసి పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. పోలీసు ప్రతిష్ట దిగజారేలా రౌడీషీటర్లతో హత్యకు కుట్ర చేసిన రామారావును సస్పెండ్ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. సొంత అల్లుడినే హతమార్చేందుకు కుట్ర చేసిన కేసులో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై రామారావు, రౌడీషీటర్లు షేక్ ఖాసిం, షేక్ చాన్‌బాషా, కాంగ్రెస్ నాయకుడు గంజి శౌరిని శనివారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అల్లుడుని హతమార్చేందుకు కుట్ర వెనుకున్న నిజాలను పోలీసులు రాబట్టారు. నాలుగు నెలలుగా రెండో కుమార్తె శ్రావణి భర్త కన్నం శ్యామ్‌ను హతమార్చేందుకు నాలుగు నెలల కిందటనే ఏఎస్సై రామారావు రౌడీషీటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంతకాల కోసం పోలీసు స్టేషన్‌కి వచ్చిన సమయంలో పరిచయం అయిన ఖాసిం, చాన్బాషాతో తన అల్లుడి వ్యవహారాన్ని చర్చించాడు. ఎలాగైనా మట్టుబెడితే రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. తొలుత రూ.1.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి పని పూర్తయిన తర్వాత మిగిలిన రూ.3.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వీరికి అవసరమైన ఆయుధాలను రామారావు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చాడు. పలుమార్లు సత్యనారాయణపురంలోని పోలీసు క్వార్టర్స్‌లో తానుంటున్న ఇంట్లోనే అల్లుడి హత్యపై రామారావు చర్చలు జరిపాడు. అల్లుడికి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు వీరికి తెలియజేస్తుండేవాడు. రెండు ప్రయత్నాలు పథకం అమలులో భాగంగా శ్యామ్‌తో రౌడీషీటర్లు పరిచయం పెంచుకున్నారు. ఆపై ఏదో వంకతో తీసుకెళ్లి మద్యం ఇప్పించడం ప్రారంభించాడు. కొత్తపేటలోని ఓ బార్లో హతమార్చేందుకు జనవరిలో ప్రయత్నించారు. వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో శ్యామ్ అక్కడి నుంచి జారుకున్నాడు. పది రోజుల కిందట మరోసారి ఖుద్దూస్‌నగర్‌లోని రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించి మద్యం తాగించారు. మరో ఐదు నిమిషాల్లో రానున్న రైలు కింద తోసేసి చంపాలనేది వీరి ప్రయత్నం. అయితే భార్య శ్రావణి ఫోన్ చేయడంతో రౌడీషీటర్లు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా శ్యామ్ వెళ్లిపోయాడు. రైలు ముందొచ్చినా, ఇంటి నుంచి ఫోన్ రాకపోయినా రెండో ప్రయత్నంలోనే శ్యామ్‌ను హతం చేసేవారు. అవాక్కు రౌడీషీటర్లతో కలిసి రామారావు పన్నిన కుట్ర తెలిసి భార్యాభర్తలు అవాక్కయ్యారు. గతంలో ఓ చోరీ కేసులో శ్యామ్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగా, శ్రావణి పుట్టింట్లోనే ఉంది. ఆ సమయంలో తరుచూ రౌడీషీటర్లతో తండ్రి హత్యకు పథక రచన చేయడం గమనించింది. అయితే ఇలాంటి విషయాలు తనకెందుకులే అంటూ సరిపుచ్చుకుంది. తీరా అప్పట్లో వారు చర్చించింది తన భర్తను హతమార్చేందుకేనని తెలిసి ఆమె కంగుతిన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రత్యేక బృందాలు పరారీలోని రౌడీషీటర్ నెలటూరి రవి ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే రవికి సంబంధించి కొంత సమాచారం సేకరించామని, ఒకటి రెండు రోజుల్లోనే పట్టుకొని అరెస్టు చేస్తామని చెప్పారు. నగర బహిష్కరణలో ఉన్నప్పటికీ తరుచూ ఇక్కడికి వచ్చి వెళుతున్నట్టు ఈ కేసు ద్వారా పోలీసులు గుర్తించారు. -
ఎంపీటీసీ సభ్యురాలి ఆత్మహత్యాయత్నం
గ్రామసభలో అవమానపరిచారని ఆవేదన గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చల్ల నిర్మల శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసిన నోట్లో వివరాలిలా ఉన్నారుు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈజీఎస్ పనులపై చర్చ జరుగుతుండగా సర్పంచ్ బానోత్ సంధ్య, ఆమె భర్త నాగయ్య ఎంపీటీసీ సభ్యురాలైన నిర్మలను, ఆమె భర్త వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కూడా తమను కులం పేరుతో దూషించారంటూ ఎంపీటీసీ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వెంకటేశ్వర్రావు గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిర్మల, వెంకటరెడ్డిపై అట్రాసిటీ కేసు న మోదు చేశారు. తాము చెప్పిన విషయూలను సీఐ పట్టించుకోలేదని నిర్మల నోట్లో ఆరోపించారు. రూ. 20 వేలు డిమాండ్.. గురువారం సాయంత్రం ఏఎస్సై భావ్‌సింగ్ వెంకటరెడ్డికి ఫోన్ చేసి సీఐకి రూ. 20 వేలు ఇస్తే కేసు లేకుండా చేస్తారని చెప్పారని, ఈ విషయూన్ని వెంకటరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పట్టించుకోలేదని వాపోయూరు. తన ఆత్మహత్యాయత్నానికి సర్పంచ్, ఆమె భర్తతోపాటు స్థానిక నాయకుడు చల్ల లింగారెడ్డి కారణమని నోట్లో పేర్కొన్నారు. నిర్మల ప్రస్తుతం నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మానవ మృగాలు
-
మిట్టమధ్యాహ్నం చోరికి యత్నం
-
బాబోయ్ పోలీసు!!
-
మూగ బాలికపై అత్యాచారయత్నం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మూగ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలోని మొహిన్మహల్లా సమీపంలోని శివాజీ కాలనీలో ఉండే మూగబాలిక(10)పై స్థానికంగా ఉండే ఓ బాలుడు (14) మంగళవారం అత్యాచార యత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్వడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆటోలో అత్యాచారయత్నం
ఆత్మకూరు: కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఆటోనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్‌తోపాటు, మరో వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. భయంతో ఆమె కిందకు దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆటోను అడ్డగించి డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోని బీజేఆర్ నగర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీజేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రమేష్ (23) అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అందుకు ఆమోదం లభించలేదు. మనస్తాపం చెందిన రమేష్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఇంట్లో పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
హోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
-
నాపై హత్యాయత్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే శ్రేణులు తనపై హత్యాయత్నానికి పూనుకున్నాయని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆరోపించారు. మంత్రి సెల్లూరురాజా అండదండలతో యాసిడ్ దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.కామరాజనాడార్ ట్రస్ట్ మాజీ ఉద్యోగిని వలర్మతి పెట్టిన కేసులో ఈ నెల 24వ తేదీన మద్రాసు హైకోర్టు నుంచి ఇళంగోవన్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పొందారు. మదురై తల్లాకుళం పోలీస్‌స్టేషన్‌లో 15 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సంతకం చేయాలని బెయిల్ ఉత్తర్వులలో కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తొలిరోజైన గురువారం నాడు ఇళంగోవన్ పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించారు. ఇళంగోవన్ కారుపైనా, దాని వెనుక వస్తున్న కార్లపై కోడిగుడ్లు, పేడ, బురదతో దాడిచేశారు. మహిళా కార్యకర్తలు చీపురు చేతబట్టి నిరసన ప్రకటించారు. రెండోరోజైన శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టిన ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు. కోడిగుడ్లలో యాసిడ్: ఈనెల 27వ తేదీన మదురైలోని పోలీస్‌స్టేషన్‌కు వెళుతున్న సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు తనపై దాడికి దిగారని అన్నారు. కోడిగుడ్లలో యాసిడ్‌ను ఉంచి తన పై హత్యాయత్నానికి పూనుకున్నారని, ఈ దాడి వెనుక మంత్రి సెల్లూరురాజా హస్తం ఉందని ఆరోపించారు. యాసిడ్ గుడ్లతోపాటు పేడ, బురద కూడా తమ కార్లపై చల్లారని ఆయన తెలిపారు. పార్టీ ఊరేగింపులా తాను పోలీస్‌స్టేషన్‌కు రావడాన్ని కొందరు ఆక్షేపిస్తున్నారని, పోలీసు బందోబస్తు లేని కారణంగా కార్యకర్తల అండతో పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన 200 మంది ఆందోళనకారులు ర్యాలీలా తనవైపు దూసుకువస్తున్నా పోలీసులు ఎంతమాత్రం వారిని నివారించలేదని ఆయన ఆక్షేపించారు. ఈ దాడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్ఆర్ఐ రసీదు తనకు ఇవ్వలేదని ఆయన అన్నారు. అయితే రెండోరోజైన శుక్రవారం తనకు ఏర్పాటు చేసిన బందోబస్తు ఫరవాలేదని అన్నారు. ఇదిలా ఉండగా, మధురైలో తనపై దాడి జరిగిన నేపధ్యంలో ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని ఇళంగోవన్ తరపు న్యాయవాది మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఇళంగోవన్ కోరినట్లుగా జామీను నిబంధనలను సడలించలేమని, బందోబస్తును పెంచాల్సిందిగా పోలీసుశాఖను ఆదేశిస్తామని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు గుంపుగా వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. -
ఆత్మహత్యయత్నం బాధ్యత టీడీపీ, బీజేపీలదే
-
కామాందుడికి దేహశుద్ది చేసిన గ్రామస్థులు
-
పట్టపగలే.. నడిరోడ్డుపై హత్యాయత్నం
కాపుకాచి దాడికి పాల్పడిన ప్రత్యర్థులు మదనపల్లె రూరల్: పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిపై మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్వీఆర్ లేఅవుట్లో నివాసముంటున్న క్రిష్ణమూర్తి కుమారుడు శశికాంత్(28). బసినికొండ నుంచి ద్విచక్ర వాహనంలో నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్‌కు వస్తున్నాడు. ఇంతలో కాపుకాచిన ప్రత్యర్థులు ఎన్‌జేఆర్ కల్యాణ మండపం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చి శశికాంత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. కిందపడిన వెంటనే మారణాయుధాలతో ఒంటిపై పొడిచారు. ఆపై స్థానికుల రాకను గమనించి పరారయ్యారు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా విచారణలో గాయపడిన శశికాంత్ రెండు రోజులక్రితం బర్మావీధిలోని అరుణ్ ఐస్‌క్రీమ్ పార్లల్లో గొడవపడ్డట్టు తెలిసింది. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిలో నగేంద్ర, ఈశ్వర్, ప్రదీప్, కిషోర్ ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
హైదరాబాద్: నగరంలో గుర్తుతెలియని దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. గురువారం అర్థరాత్రి దుండగులు ఏటీఎం మిషన్ తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించక పోవడంతో దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మియాపూర్ స్వర్ణపురి కాలనీలోని బస్టాప్ వద్ద ఎస్బీహెచ్ ఏటీఎంలో జరిగింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ కెమరాల ఫూటేజి ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకోలేదని మాజీ ప్రియుడిపై హత్యాయత్నం
సికింద్రాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మాజీ ప్రియుడిపై శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన మహిళ ఉదంతమిది. చిలకలగూడ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కథనం ప్రకారం...సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఖలీమ్ (40) చికెన్ సెంటర్ వ్యాపారి. మలక్‌పేట్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ గులాబీ అలియాస్ సుల్తానా మోనా (42) అనే మహిళతో కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు ప్రేమించుకుని విడిపోయూరు. ఇటీవల ప్రవూదంలో గాయుపడి చికిత్స పొందుతున్న ఖలీమ్‌ను పరావుర్శించేందుకు వచ్చింది. ఈ క్రవుంలో వారివుధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లి చేసుకుందామని సుల్తానా, ఖలీమ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదివరకే తనకు వివాహమైనందున కుదరదని తిరస్కరించాడు. ఈ విషయుంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఫిర్యాదును తిస్కరించారు. తనను తిరస్కరించిన ఖలీమ్‌ను హతమార్చాలని సుల్తానా నిర్ణయించుకుంది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి సుల్తానా అంబర్‌నగర్‌లోని టైలర్‌షాపు ముందు నిల్చున్న ఖలీమ్‌పై కత్తితో దాడి చేసింది. పోలీసులు గాయుపడ్డ ఖలీమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. -
జన్మభూమిలో మహిళ ఆత్మహత్యాయత్నం
-
పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
-
SBIలో ప్రవేశించిన ముగ్గురు దొంగలు
-
మంత్రాలయంలో దోపిడి దొంగల బీభత్సం