ఆత్మకూరు: కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఆటోనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్‌తోపాటు, మరో వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. భయంతో ఆమె కిందకు దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆటోను అడ్డగించి డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.