auto
-
ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్ షోరూం ధర రూ.2.95 లక్షలు.ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..! మళ్లీ స్కోడా డీజిల్ కార్లువాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా సూపర్బ్ డీజిల్ కారును ప్రదర్శించింది. కొడియాక్ డీజిల్ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్ కార్లను డిమాండ్ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్ పీటర్ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు. -
సీజ్ ద ఆటో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ పంజా దుర్గారావుపై రెచ్చిపోయారు. ఆటోపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫొటోలను చూసి ఆటోను వెంబడించి మరీ రోడ్డుపై ఆపి డ్రైవర్‌పై బూతు పురాణంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోకు అడ్డంగా కారు పెట్టి, తణుకు పోలీసులను పిలిపించి స్టేషన్‌కు తీసుకెళ్లమని ఆదేశించారు. ఆటోను సీజ్ చేయించారు. ఎలాంటి కేసు లేకున్నా, రాత్రి ఎనిమిది గంటలైనా ఆటో డ్రైవర్‌ను స్టేషన్లోనే ఉంచడం తణుకులో చర్చనీయాంశమైంది. దుర్గారావు ప్రతిరోజూ కానూరు నుంచి తణుకుకు సర్వీస్ ఆటో నడుపుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అభిమానంతో ఆటోపై వైఎస్ జగన్, కారుమూరి ఫొటోలను వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండ్రాజవరం రోడ్డులోకి ఆటో ప్రవేశించింది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన వాహనంలో వస్తున్నారు. ఎమ్మెల్యే కారును గమనించి దుర్గారావు దారి ఇచ్చాడు. అయినా ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లకుండా దుర్గారావు నడుపుతున్న ఆటోను అనుసరించింది. ఈ క్రమంలో ఆటోను పూర్తిగా పక్కకు నిలిపి, దారి ఇచ్చినా ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లలేదు. ఒక కిలోమీటరు దాటిన తర్వాత తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో ఆటోను ఓవర్టేక్ చేసి, ఎదురుగా కారు నిలిపి.. ఎమ్మెల్యే కిందకు దిగారు. అసభ్య పదజాలంతో దుర్గారావుపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైనా బూతు పురాణంతో రెచ్చిపోయారు. తణుకు టౌన్ సీఐ కొండయ్యకు ఫోన్ చేసి రప్పించారు. రావాలని ఆదేశించిండంతో సీఐ ఆగమేఘాల మీద వచ్చి ఆటో డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎంఈఐ శ్రీనివాస్‌ను కూడా రప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆటో.. పశ్చిమగోదావరిలోకి వచ్చిందంటూ.. ఆటోను సీజ్ చేసి రూ.3,400 జరిమానా విధించారు. ఆ తర్వాత ఆటోకు విధించిన చలానా మొత్తాన్ని చెల్లించినా, ఎమ్మెల్యే చెబితేనే వాహనం ఇస్తామని రవాణా శాఖా«ధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలైనా దుర్గారావును విడిచి పెట్టలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించ లేదు. స్థానిక టీడీపీ నేతలతో దుర్గారావుపై ఫిర్యాదు చేయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.ఎమ్మెల్యేది నీతిమాలిన చర్య ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిని మరచి సామాన్య ఆటో డ్రైవర్‌పై ప్రతాపం చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎస్ఐని కింద కూర్బోబెట్టడం, కానిస్టేబుల్‌ను దుర్భాషలాడటం, మహిళ ఛాతీపై గుద్దుకుంటూ వెళ్లిపోవడం లాంటి దిగజారుడు పనులు చేశారని గుర్తు చేశారు. దుర్గారావును ఇబ్బంది పెడితే పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని కారుమూరి హెచ్చరించారు. -
ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ..
లంగర్‌హౌస్: ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్‌కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. వీరు ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్‌హౌస్ బాపునగర్‌లోని పీఎస్ఆర్ హాస్టల్లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్‌హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్‌గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్‌పై సెల్ఫోన్లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్‌పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఆటో డ్రైవర్ల ధర్నాకు కేటీఆర్ మద్దతు
-
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు: నలుగురి దుర్మరణం
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సొరకాయలపేటకు చెందిన హేసానుల్లా, దిల్షాద్, వల్లి, సదుం మండలం, నెల్లిమంద గ్రామానికి చెందిన బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు రాయచోటిలో వారి బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా.. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వల్లి, బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ హేసానుల్లా, దిల్షాద్, సారాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. బస్సు డ్రైవర్ పరార్ కాగా, ప్రమాదస్థలాన్ని రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. -
గూడ్స్ ఆటోలో రూ. 2.73 కోట్లు
బనశంకరి: ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదును శనివారం బెళగావి సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం నుంచి హుబ్లీకి గూడ్స్ వాహనంలో నగదును తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు మాళమారుతి ఠాణా పరిధిలో వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా నగదు లభించింది. సాంగ్లికి చెందిన సచిన్ మేనకుదుళె, మారుతి మారగుడె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నగదును తరలించడానికి వీలుగా వాహనంలో అనేక మార్పులు చేయడం గమనార్హం. ఈ నగదు ఎవరిది అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ రోషన్ జగదీశ్ తెలిపారు. -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
గచ్చిబౌలిలో దారుణం.. ప్రైవేట్ ఉద్యోగినిపై ఆటోలో లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలికి ఆటోలో యువతి వెళ్తుండగా ఆ ఘటన జరిగింది.కోడలిపై అత్త, ఆడపడుచు దాడికోడలిపై అత్త, ఆడపడుచు వేడి నీళ్లు పోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన నజియా బేగంకు సంతోష్‌నగర్ ఓవైసీ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్‌తో వివాహం జరిగింది. షేక్ షబ్బీర్ ప్రస్తుతం ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. నజియా బేగంకు నలుగురు సంతానం.అత్త మహ్మదియా బేగంతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో నజియాబేగం కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో పిల్లలతో కలిసి వేరుగా నివాసముంటోంది. ఆదివారం పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లడంతో వారిని తీసుకొచ్చేందుకు నజియా బేగం అత్తగారింటికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్త, ఆడపడుచుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అత్త మహ్మదియా బేగం, ఆమె కుమార్తె కలిసి నజియా బేగంపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు నజియా బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
‘కోల్‌కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్
దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్‌కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.దీనికిముందు ఆటో డ్రైవర్ ఆ బాలికలను వెనుక సీట్లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్ కోల్‌కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు ఆటోను ఆపాలని కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. "I will do the same to you as happened in Kolkata!" An auto driver threatened a girl. Public caught him and serviced him properly before handing him over to police. pic.twitter.com/BfNvNakZj6— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2024 -
కూలీలను కబళించిన మృత్యు శకటం
కర్నూలు (హాస్పిటల్): వారంతా కూలీలు. వానలు కురవక.. చేద్దామంటే పనులు దొరక్క పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టిన కూలీల్లో ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆటోడ్రైవర్ సహా 17 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయం పడకేసింది. పనులు కూడా దొరకని పరిస్థితుల్లో కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్నారు. రోజులాగే గురువారం స్టీరింగ్ ఆటోలో 20 మంది కూలీలు తెలంగాణలోని ఉండవెల్లి మండలం కంచుపాడు బయలుదేరారు. ఆ ఆటోను కర్నూలు –హైదరాబాద్ హైవేపై జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద వెనుక నుంచి 20 టైర్లు గల భారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పైకెగిరి కింద పడింది. ఆటోలో ఉన్న లక్ష్మీదేవి (58) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన 19 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మూడు అంబులెన్సుల్లో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి అలియాస్ తెలుగు సుజాత (40) మృతి చెందింది. ప్రియాంక (18), అనిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు (40)తోపాటు లక్ష్మీదేవి (60), రాధ (40), మద్దిలేటి (50), వరుణ్‌కుమార్ (13), కె.వరలక్ష్మి (44), పద్మ (45), రమాదేవి (40), నందు (17), భాస్కర్ (47), పావని (25), లక్ష్మీదేవి (50), లక్ష్మీదేవి (50), చిట్టెమ్మ (60), వరలక్ష్మి(47)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ కిక్కిరిసిపోయింది. క్షతగాత్రులకు ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం డిమాండ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పనిచేసిన వారికి 11 నెలలైనా బిల్లులు రాకపోవడం వల్ల పొట్టకూటి కోసం వెళ్లి వారు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జవానులు దుర్మరణం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవానులు మృతి చెందగా, ఆర్మీకి చెందిన ఆరుగురితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.నాగ్‌పూర్‌లోని కన్హాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇద్దరు జవానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు సైనికులతో పాటు ఆటో డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా తొమ్మది మంది ఉన్నారు. ఈ ఆర్మీ సిబ్బంది కమతిలోని గార్డ్ రెజిమెంట్ సెంటర్‌కు చెందినవారు. ఈ ప్రమాదంపై న్యూ కమతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
నగదు మాత్రమే ఇవ్వండి
జేబులో డబ్బులు పెట్టుకోవడం జనం మానేశారు. ఖర్మగాలి ఫోన్ పే పని చేయకపోతే తెల్లముఖాలు వేస్తున్నారు. నగదు లావాదేవీల వల్ల ఎంత ఖర్చవుతున్నదో ఎంత మిగిలి ఉన్నదో తెలిసేది. కాని ఆన్లైన్ పేమెంట్లకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆటో నడిపే ఒక పెద్దాయన తన ఆటోలో పెట్టిన నోటీస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. నగదు అవసరాన్ని గుర్తు చేసే పోస్ట్ ఇది. ‘జీ పే చేయొద్దు. డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం దగ్గర ఆపమని అడగొద్దు’ అని చెన్నైలో ఒక ఆటోబాబాయ్ పెట్టిన బోర్డు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. గతంలో అందరి దగ్గర డబ్బులుండేవి. ఆటో ఎక్కినా దిగినా డబ్బు ఇచ్చి బేరం ముగించేవారు. ఇప్పుడు అందరూ జీపే, ఫోన్‌పే చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ ‘నగదు మాత్రమే’ అనే బోర్డులు ఉన్నాయి. దానికి కారణం డిజిటల్ లావాదేవీల్లో ఏదైనా మోసం జరుగుతుందేమోనని. ఈ ఆటోబాబాయ్కి కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. లేదా ఎక్కిన వారు జీపే పని చేయకపోతే ఏటీఎం దగ్గరకు వెళదామని టైమ్ వేస్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే స్పష్టంగా ‘ఏటీఎం దగ్గర ఆటో ఆపమని అడగొద్దు’ అంటూ బోర్డ్ పెట్టాడు. చెన్నైలో ఇతని ఆటో ఎక్కిన మహిళ ఈ బోర్డును ఫొటో తీసి ‘ఎక్స్’లో పెడితే ఇంటర్నెట్లో మంచి డిబేట్ నడిచింది. ‘ఇలాగైతే ఎలా’ అని కొందరంటే ‘బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ పేమెంట్ల వల్ల ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి?’ అని కొందరు ప్రశ్నించారు. చివరకు ఆటో ఎక్కిన మహిళ తన అ΄ార్ట్‌మెంట్ దగ్గర దిగి, సెక్యూరిటీ దగ్గర అప్పు తీసుకుని ఆటో బాబాయ్‌కి చెల్లించి బతుకు జీవుడా అనుకుంది. -
ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. సుమారు 3.33 లక్షల యూనిట్ల ఈ–టూవీలర్లకు మద్దతు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే ఈ–రిక్షా, ఈ–కార్ట్ కొనుగోలుకు రూ.25,000 వరకు, పెద్ద ఈ–త్రీవీలర్‌కు రూ.50,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుంది. 41,000 యూనిట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తారు. ఈ పథకం కోసం భారీ పరిశ్రమల శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. 2024 ఏప్రిల్‌తో మొదలై జూలై వరకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు. ఫేమ్–2 సబ్సిడీ పథకం ఈ ఏడాది మార్చి 31న ముగుస్తుండడంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని పరిచయం చేసింది. ఇవి చదవండి: పేటీఎంకు మరో బిగ్ షాక్..! -
రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
మునగాల, మోతె (కోదాడ)/నంగునూరు (సిద్దిపేట): సూ ర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయా రు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతె మండ ల కేంద్రం శివారులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పది మంది, రేపాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కూ లీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లోని మిర్చి తోటలో కాయలు ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్య లో ఖమ్మం జిల్లా మధిర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(55), చెవుల నారాయణమ్మ(56), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్య (65) తీవ్ర గా యాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విజయరాఘవపురానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(75) సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల గురువయ్య (65) ను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. రేపాల గ్రామానికి చెందిన సొంపంగు లక్ష్మి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌కు తరలించారు. విజయరాఘవపురం గ్రా మానికి చెందిన కత్తి విజయమ్మ, పాలపాటి మంగమ్మ సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ టో డ్రైవర్ పవన్‌తో పాటు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో ముగ్గురు మృతి కారు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా మరో ఏడుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ వద్ద జరి గింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల అనిల్, భార్య మమత, అతని బావమరిది బాబురాజు, భార్య కీర్తన, పిల్లలు చర ణ్, భానుప్రసాద్, వైష్ణవి, హన్విక, నాన్సి, ప్రణయ్‌తో కలసి హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కారు లో వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొ ట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో బైక్, కారు పడిపోయాయి. ఈ ప్రమాదంలో బద్దిపడగకు చెందిన కట్ట రవి (55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర అయిలయ్య (58), జక్కుల మమత (28) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిలో బాబురాజు పరిస్థితి విషమంగా ఉండగా గాయాలపాలైన చిన్నారులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
పాట్నా: బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మది మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. 15 మందితో ఒక ఆటో లఖిసరాయ్ నుంచి సికంద్రా వైపు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం దానిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన వాహనం ఏదనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. మంచు వర్షాలు.. రోడ్లు మూసివేత -
కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం
బేస్తవారిపేట: నిద్రమత్తులో కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రైలు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవడంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు. మరోవైపు విజయవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు. ఈలోగా లీకైన ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
ముంబై: ఆర్బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా ఆర్బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి. ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో అసెంబ్లీకి రావడం ఆసక్తిని కలిగించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్నే ఈ ఇద్దరు ఎంచుకోవడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన బల్మూరి వెంకట్ నాంపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు. ఈ సందర్బంగా బస్‌లో మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత ప్రయాణం అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఆటోలో అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. అయితే ఆటోకు పాస్ లేకపోవడంతో పోలీసు అధికారులు ఆటోను అసెంబ్లీలోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఆటో దిగి కాలినడకన అసెంబ్లీలోకి వచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ తగ్గి ఇప్పటివరకు 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, సుమారు ఆరు లక్షల ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
AP: ఆచంటలో ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి,పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట మండలం కోడేరు రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిని కరుగోరిమిల్లి,ముత్యాలపల్లి గ్రామానికి చెందిన వాసుదేవ (13) కుక్కల నాగరాజు( 12) గా గుర్తించారు. ఆటోలో ఉన్న మరో అయిదుగురికి తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్సులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: కారు-ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండగ వేళ వారంతా దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. పిల్లల కేరింతలతో ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి. ఒకే కుటుంబంలో నలుగులు అనంతలోకాలు చేరుకున్నారు. ఒకే కుటుంబంలో తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
కల్వర్టు గుంతలో పడిన కారు
శంషాబాద్ రూరల్: రహదారిపై అదుపు తప్పిన కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. గుంతలోని నీళ్లలో మునిగి ఊపిరాడక తల్లీ, కొడుకు మృతి చెందిన దుర్ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌లోని శ్రీరాంనగర్ కాలనీ వాసి మెరువ ఆదిశేషరెడ్డి(57) బాబా ఆటోమిక్ రీసెర్స్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరైన ఏపీ నంద్యాల సమీపంలోని జిల్లెల గ్రామానికి తన తల్లి ఎం.రాములమ్మ(88)ను తీసుకుని ఈసీఐఎల్ నుంచి కారులో శనివారం బయలుదేరాడు. మార్గ మధ్యలో మండలంలోని ఘాంసిమిగూడ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్‌ను ఢీకొడుతూ.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. నీళ్లలో మునిగి మృత్యువాత.. కారు ఢీకొనడంతో బైక్‌తో పాటు ఆటో కూడా గుంత నీళ్లలో పడిపోయాయి. కారులో ఉన్న ఆదిశేషరెడ్డి, రాములమ్మ అందులోని నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురిలో డ్రైవర్ రాయన్నగూడ సిద్దయ్యకు గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు(25)కు కాలు విరగగా బాలికకు గాయాలయ్యాయి. వీరందరనీ స్థానికులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మళ్లీ రికార్డుల మోత
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు. ర్యాలీ ఎందుకంటే...? ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు). వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి. ► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్బీఐ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి. ► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది. -
జేఎస్‌డబ్ల్యూతో ఎస్ఏఐసీ జత
న్యూఢిల్లీ: చైనా ఆటో రంగ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్.. దేశీ మెటల్ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ దేశీయంగా ఎంజీ మోటార్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోపాటు.. వృద్ధికి సహకరించనుంది. లండన్‌లో జరిగిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 35 శాతం వాటాను పొందనున్నట్లు తెలుస్తోంది. దేశీ వినియోగదారునిపై దృష్టితో నవతరం టెక్నాలజీ, ప్రొడక్టుల ద్వారా మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు జేవీకి ఎస్ఏఐసీ మద్దతివ్వనుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీలో జేఎస్‌డబ్ల్యూ 35 శాతం వాటా తీసుకోనుందా లేక ఎస్ఏఐసీ మోటార్ సొంత అనుబంధ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాలో పొందనుందా అనే విషయంపై రెండు కంపెనీల నుంచీ స్పష్టతలేకపోవడం గమనార్హం. ఒకప్పటి బ్రిటిష్ బ్రాండ్ ఎంజీ మోటార్‌ను ప్రస్తుతం షాంఘై దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న ఐదేళ్ల కాలపు ప్రణాళికలో భాగంగా దేశీ కంపెనీలకు 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. తదుపరి దశ వృద్ధికి వీలుగా ఎంజీ మోటార్ నిధుల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
వైజాగ్ స్కూల్ ఆటో ఘటన.. విజయవాడ RTA అలర్ట్
-
విశాఖ: స్కూల్ ఆటో-లారీ ఢీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్‌కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది. మరో ప్రమాదంలో.. కాగా, విశాఖలో ఈ ఉదయం మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చదవండి: ప్రేమా.. ఇదినీకు న్యాయమా? VIDEO | Eight school children were injured when the auto they were travelling in collided with a lorry in Visakhapatnam earlier today. The incident was captured on CCTV. (Disturbing visuals. Viewers discretion advised) pic.twitter.com/JE7BZiBQi1 — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
హిజాబ్ ధరించి ఆటో నడుతుపుతున్న నజ్మా
ఓ యువకుడు యాచకుడి వేషంలో, కేజీల మొత్తంలో కరెన్సీ నాణేలను తీసుకుని ఐఫోన్ కొనడానికి వెళ్లిన వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.మంచి వయసు, ఓపిక ఉన్న వారే ఇలా చేస్తుంటే... ఓపిక లేకపోయినా సమాజంలో గౌరవంగా బతికేందుకు బురఖా వేసుకుని ఆటో నడుపుతోంది నజ్మా అన్సారీ. అయినా ఇతరుల ముందు చేయి చాచే కంటే.. కష్టపడడమే గౌరవం అనుకుంది. ‘గేర్లు మార్చేయండి చాలు గౌరవంగా బతకవచ్చు’ అని చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. నజ్మా అన్సారీ వయసు 45. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్ నగరంలోని కట్ఘర్లో ఆమె నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2010లో భర్త మరణించడంతో ఇంటి భారం ఆమె మీద పడింది. అప్పటిదాక గృహిణిగా ఉన్న నజ్మాకు తన కొడుకు, కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. భర్త నడిపిన టీషాపును అద్దె కట్టలేక వదిలేసింది. ఇంట్లోనే టీ తయారు చేసి విక్రయించింది. అలా పిల్లల అవసరాలు చూసుకుంటూ ఉండగానే భర్త ఇన్సురెన్స్ డబ్బులు రూ.4.35 లక్షలు వచ్చాయి. మూడు లక్షల రూపాయలతో 2015లో కూతురికి పెళ్లి చేసింది. ఆదాయం సరిపోక.. టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్న నజ్మాకు డబ్బులు సరిపోయేవి కావు. కూతురి పెళ్లి తరువాత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భర్త ఇన్సురెన్స్ డబ్బుల్లో మిగిలిన మొత్తంతో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి ఆటో తోలుతూ సంపాదిస్తోంది. అర్ధరాత్రనే భయం లేదు నజ్మా మూడు షిప్టుల్లో ఆటో నడుపుతోంది. బురఖా ధరించి ఉదయం తొమ్మిదిగంటలకు ఆటో స్టార్ట్ చేస్తుంది. ఎండ వేడికి బురఖాలో ఎక్కువ సమయం ఉండలేక మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆటో నడుపుతోంది. మళ్లీ రాత్రి తొమ్మిది నుంచి రెండుగంటల వరకు విరామం లేకుండా నడుపుతుంది. ఇలా మూడు షిప్టుల్లో మొత్తం మీద రోజుకి ఐదు నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తోంది. స్థానిక ట్రాఫిక్ పోలీసులు నజ్మా ధైర్యాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే నజ్మాను చూసిన ఓ హిందూ మహిళ కూడా ఆటో నడపడం మొదలు పెట్టింది. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడ్డాయి. ఇలా ఇతరులకు స్ఫూర్తి నిలుస్తూనే, తన కష్టార్జితంతో హజ్ యాత్రకు వెళ్తానని చెబుతోంది నజ్మ. అడుక్కునే కంటే... ‘‘పేదరికం ఉందని అక్కడా ఇక్కడా చేయి చాచకుండా కష్టపడి ఏ పనైనా చేసి గౌరవంగా బతకవచ్చు. ఆటో గేర్లు మారుస్తూ, ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాను. ఇక మహిళా డ్రైవర్‌గా నాకు రాత్రి సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి బయటకు రావడానికి కూడా భయం వేయడం లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు రక్షణ కల్పిస్తోంది. పరిస్థితులు మరింత దిగజారినప్పుడు అల్లా కాపాడతాడు’’ అని నజ్మా అన్సారీ ధైర్యంగా చెబుతోంది. -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి .. -
"ట్రావెలింగ్ పార్క్" డ్రైవర్ క్రియేటివిటీకి..నెటిజన్లు ఫిదా!
కొద్ది దూరంలోని గమ్యస్థానాలకు చేరడానికి వినియోగించే ఆటోల గురించి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో ప్రయాణీకులను అట్రాక్ట్ చేసేలా ఆటోలను డెకరేట్ చేస్తున్నారు కూడా. అయితే ఈ డ్రైవర్ మాత్రం మరింత విభిన్నంగా ఆలోచించి మరీ వైరైటీగా తీర్చిద్దిదాడు. అతడి ఆటోని చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో..ఆ ఆటో మొత్తం గ్రీన్‌గా ఓ పార్క్ మాదిరి కనిపిస్తుంది. చూడగానే ఇది ఆటోనేనా అనిపిస్తుంది. ఆటోలో మొక్కలను ఏర్పాటు చేసిన సందర్భాలు చూశాం. ఇది మాత్రం అంతకు మించి అన్నట్లు ఉంది. ఏకంగా మొత్తం గ్రీనరీనే..ఏకంగా ఆటోలోని పైనంతా పూల మొక్కలు అలిమేసి ఉన్నాయి. ఇక సైడ్స్ పూలకుండీలు ఇవేగాక తాగునీరు, మోటివేషనల్ బుక్స్, మోటివేషనల్ ప్టోసర్లతో ఎంతో అట్రాక్టివ్‌గా మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆటోలో మిని గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు ఆ డ్రైవర్. అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తూ..అది జంగిల్ ఆటో అని ఒకరు, గ్రీన్ ఆటో మరొకరూ, కాదు కాదు ట్రావెలింగ్ పార్క్ అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by thoughts♡ (@depthoughtsz._) (చదవండి: ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
రాంగ్రూట్లో వచ్చిన మృత్యువు
సాక్షి, వరంగల్/వర్ధన్నపేట: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..ఎప్పటిలా బుధవారం కూడా ఉపాధిని వెతుక్కుంటూ బయలుదేరారు. కానీ ఎప్పటిలా వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఉదయాన్నే వారు ప్రయాణిస్తున్న ఆటోను మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నా రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7.12 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొట్టిన లారీ 30 మీటర్లకు పైగా దానిని ఈడ్చుకెళ్లడంతో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రం కావడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి భీతావహంగా మారింది. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్ల క్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఉపాధి కోసం వెళుతుండగా.. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేశ్ కురేరీ కుటుంబం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి కర్మన్‌ఘాట్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అక్కడ డెయిరీ పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసే వీరు..కొంతకాలంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తేనె తుట్టెల నుంచి తేనెను తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల క్రితం వరంగల్‌లోని ఎల్బీనగర్కు వచ్చిన సురేశ్ కురేరీ కుటుంబం అక్కడ డేరాలు వేసుకొని తేనె అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం వరంగల్ నుంచి తొ ర్రూర్ వరకు వెళ్లిన వీరు ఇల్లంద గ్రామానికి కొంతదూరంలో ఉన్న తేనె తుట్టెల నుంచి తేనెను సేకరించి ఆ హైవేపైనే అమ్మారు. బుధవారం కూడా వరంగల్ బస్టాండ్ వద్ద ఉదయం 6.30 ప్రాంతంలో ఆటో కిరాయికి మాట్లాడుకొని తొర్రూర్‌కు బ యలుదేరారు. సురేశ్ కురేరి (43) వెంట అతని కుమారులు అమిత్ (23), నితిన్ (11), అమీర్లు, సురేశ్ సోదరి కుమారులు జలావత్ దామి అలియాస్ జాబీర్ (19, రూప్‌చంద్ దామి (33)లు ఉన్నారు. వరంగల్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42) ఆటో నడుపుతున్నాడు. మృత్యువులా ఎదురొచ్చి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం నమీనా జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మదన్‌లాల్ నాయక్ వైజాగ్ షిప్‌యార్డులో ఉన్న సరుకును లోడ్ చేసుకుని వరంగల్‌లో అన్లోడ్ చేయడానికి బయలుదేరాడు. ఈ లారీకి మదన్‌లాల్ సహా ఇద్దరు డ్రైవర్లు ఉండగా, కో డ్రైవర్ రాకే‹Ùమీనా ఖమ్మం వరకు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మం నుంచి మదన్‌లాల్ న డపడం ప్రారంభించాడు. లారీ ఇల్లంద సమీపిస్తుండగా అప్పటికే నిద్ర మత్తులో ఉన్న మదన్‌లాల్ లారీని అతి వేగంగా నడుపుతూ రాంగ్రూట్లో ఎదురొచ్చి ఆటోను ఢీకొట్టాడు. లారీ సు మారు 30 మీటర్ల దూరం ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వారి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. సురేశ్ కురేరి, అమిత్ కురేరి, బట్టు శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన నితిన్ కురేరి, అమీర్ కురేరి, రూప్‌చంద్, జాబీర్లను ఆస్పత్రికి తరలిస్తుండగా నితిన్ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రూప్‌చంద్, జాబీర్ వరంగల్ ఎంజీఎంలో మరణించారు. అమీర్ కురేరిని ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రికి తరలించారు. అత ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు ఇల్లందలోని కిరాణ దు కాణం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఫుటేజీలను పరిశీలించి ప్రమాదం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనాస్థలిని సందర్శించారు. సురేశ్ భా ర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
ఐఫోన్ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న యువతి వద్ద నుంచి ఐఫోన్ చోరీ చేసేందుకు ఇద్దరు కేడీలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఫోన్‌ను కాపాడుకునే క్రమంలో ఆటోలో నుంచి కొందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యోవికా చౌదరి తన ఐఫోన్ కోసం ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్‌ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైంది. అయితే, యోవికా చౌదరి ఢిల్లీలో సాకేత్ గ్యాన్ భారతీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళ్తోంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. ఇదే సమయంలో దొంగలు కూడా ఆ ఫోన్‌ను వదలక పోవటంతో ఫోన్‌తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే రోడ్డుపై పడిపోయి దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె చేయి జారవిడవడంతో ఫోన్‌ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో యోవికా తీవ్రంగా గాయపడింది. దీంతో, స్థానికులు, ఇతర వాహనదారులు ఆమెను మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. A woman teacher was left with a fractured nose and injuries to other parts of her body after she fell from an auto-rickshaw while allegedly trying to save her mobile phone from motorcycle-borne snatchers in south Delhi’s Saket on Friday.#delhipolice #friday #delhicrime pic.twitter.com/NarXHUs4DP — NewsNowNation (@NewsNowNation) August 14, 2023 ఇది కూడా చదవండి: విలువైన ప్రాణాలకై.. 'ఈ ఒక్క క్షణం మీకోసం'.. -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
సీఈఓకు చేదు అనుభవం.. ఆటోలో ప్రయాణం, బెంగళూరులో ఇంత దారుణమా!
ముంబై: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటినగరాల్లో జీవన వ్యయం చాలా ఖరీదు అనే సంగతి తెలిసిందే. ఈ నగరాల్లో సామాన్య ప్రజలు జీవించాలంటే అంత సులువు కాదు. అయితే తాజాగా ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్థ సీఈఓ.. ఈ నగరాల్లో కూడా ఖర్చుల పరంగా వ్యత్యాసం ఉందని నిరూపిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో ఇంత దారుణమా సాధారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కేటగిరిలో ఆటో డ్రైవర్ల గురించే చెప్పుకొవాలి. దూరం, ఆటోలోని మీటర్‌ను బట్టి కాకుండా ప్రాంతాన్ని బట్టి వారు ధరలను నిర్ణయిస్తుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే ఓ సీఈఓకి ఎదురైంది. బెంగళూరులో కేవలం 500 మీటర్ల ప్రయాణించగా.. అతని నుంచి ఆటో డ్రైవర్ రూ.100 వసూలు చేసినట్లు తెలిపాడు. అదే తాను ముంబైలో 500 మీటర్లకు కేవలం రూ.9 ఆటో ఫేర్ చెల్లించేవాడని చెప్పుకొచ్చాడు. బెంగళూరులో మరీ ఇంత దారుణమా అంటూ వాపోయాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని న్యూరల్ గ్యారేజ్ కో ఫౌండర్ కం సీఈఓ మందార్ నటేకర్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఏర్పాటు చేసిన మీటర్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. ‘ఇది చాలా గొప్ప ఆటో మీటర్. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అందుకే ఏమో ఆటో డ్రైవర్లు ఎప్పుడూ వాటిని వినియోగించరు. కానీ నేను 500 మీటర్ల ప్రయాణానికి రూ.100 చెల్లించా.. అదే ముంబైలో ఇదే దూరానికి రూ.9 చెల్లిస్తే సరిపోతుంది` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. బెంగళూరు మాత్రమే కాదు ముంబై నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఇంకా ఇబ్బందిగా ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ దోపిడీ చట్టబద్ధం కాదనిపిస్తోందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ..చాలా తక్కువ నగరాల్లో ఆటో-మీటర్ ఛార్జీల వ్యవస్థ ఉంది. కానీ నగరాల్లో ఇలాంటివి ఆశించకూడదని కామెంట్ పెట్టాడు. చదవండి ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు! -
13 గంటలు ఆటోలో ఊరంతా తిరిగి.. డ్రైవర్ డబ్బులు అడిగేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు. ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
ఆటో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
నల్గొండ: అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మాపురం గ్రామానికి చెందిన మంగిళిపల్లి మంగమ్మ భర్త చాలా ఏళ్ల క్రితమే మృతిచెందాడు. ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం అమావాస్య కావడంతో ఆమె నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి రాత్రి అక్కడే నిద్ర చేసి మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో కొండమల్లేపల్లికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ఆటోలో అజ్మాపురం గ్రామానికి వెళ్తోంది. కాగా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని కొట్టాలగడ్డకు చెందిన జటావత్ గాస్య పక్కనే వద్దిపట్ల గ్రామంలో కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిరాణా సామగ్రి కోసం మంగళవారం కొండమల్లేపల్లికి వచ్చిన గాస్య అదే ఆటోలో వద్దిపట్లకు బయల్దేరాడు. ఈ క్రమంలో ఆటో అజ్మాపురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంగమ్మ, గాస్యలపై ఆటో పడటంతో వారికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. -
విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా.. బజాజ్ ఆటో కీలక నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బజాజ్ ఆటో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ శిక్షణ కేంద్రాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, డిప్లమాలతో కూడిన అధునాతన నైపుణ్య శిక్షణను ఇస్తాయని వివరించింది. మెకాట్రానిక్స్, మోషన్ కంట్రోల్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి క్లిష్ట మాడ్యూల్స్‌పై శిక్షణ ఉంటుంది. తయారీ పరిశ్రమలో నైపుణ్యం అంతరాన్ని పరిష్కరించడంలో ట్రైనింగ్ సెంటర్లు సహాయం చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవసరమైన పరికరాలను ఈ శిక్షణా కేంద్రాలకు బజాజ్ ఆటో అందిస్తుంది. కార్యక్రమ ప్రారంభ దశలో నిర్వహణ ఖర్చులకు నిధులు కూడా సమకూరుస్తుంది. ‘భారత్‌లో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగులుగా చేరుతున్నారు. సాంకేతికతలో వేగవంతమైన మార్పులతో యువతను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడంలో విద్య, పరిశ్రమల మధ్య భారీ అంతరం ఉంది. సమాజానికి తిరిగి ఇచ్చే వారసత్వంతో ఈ అంతరాన్ని పూడ్చేందుకు కట్టుబడి సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నాము’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. -
నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి.. 2 నెలలకు నిందితుడు అరెస్ట్!
ముంబైలో ఒక మహిళపై ఆటోలో అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు ముంబైలో ఉంటూ, ఆటో నడుపుతుంటాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుని పేరు ఇంద్రజీత్ సింగ్. అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఆ యువతిపై దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఉదంతం ఎలా వెలుగు చూసిందంటే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం బాధితురాలికి రక్తస్రావం అయ్యింది. రెండు నెలల క్రితం బాధితురాలికి ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. బాధితురాలికి రక్తస్రావం అయిన నేపధ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెకు వైద్యపరీక్షలు చేసే సమయంలో పలు ప్రశ్నలు అడగగా, ఆమె తనపై జరిగిన ఘోరం గురించి చెప్పింది. దీంతో వైద్యులు ఈ విషయమై సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన బంధువుతో పాటు బెలాపూర్ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి నవీముంబై వచ్చేందుకు ఆటో బుక్ చేసుకుంది. అయితే ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. యూపీకి పారిపోయిన డ్రైవర్ ఆ ప్రదేశంలో డ్రైవర్ ఇంద్రజీత్ ముందుగా ఆమెపై దాడి చేశాడు. తరువాత ఆమెపై అత్యాచారం జరిపి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకున్నాడు. ఆటో యజమానిని విచారించడంతో.. బాధితురాలి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆ ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు యూపీలో దాక్కున్న నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే.. -
లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద హైవే నంబర్ 44లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వన్‌వేలో గుర్తు తెలియని భారీ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొనడంతో రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద నాలాలో ఆటో కూరుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లివస్తూ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ కుటుంబం, మరో కుటుంబంతో కలిసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లింది. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ప్రార్థనలు పూర్తి కావడంతో ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇచ్చోడ బైపాస్ దాటుకుని హైవే పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఏముల పొచ్చన్న (58) ఆయన భార్య గంగమ్మ (48), కూతురు శైలజ (28), మరో కుటుంబానికి చెందిన మడావి సోంబాయి (63) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆటోను ఢీకొన్న తర్వాత భారీ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు ఆ వాహనం ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనా స్థలి నుంచి కొద్ది దూరంలోనే కొద్ది నెలల కిందటే జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ప్రధానంగా ఈ మార్గం పల్లంగా ఉండటంతో లారీలు న్యూట్రల్లో నడుపుతారు. ఈ ప్రమాదానికి కూడా అదే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత్యువును జయించిన చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందిన శైలజ కుమార్తెలు కూడా అదే ఆటోలో ఉన్నారు. మూడేళ్ల వయసున్న ఆరాధ్య, ఎనిమిది నెలల పసిబిడ్డ అర్పిత ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినప్పటికీ వారి తల్లి మృతిచెందడం చూస్తున్నవారిని కంటతడి పెట్టించింది. -
విడ్డూరం!...ఆటోపై గడ్డి మొలిచింది
-
రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం
సాక్షి,నెహ్రూనగర్(గుంటూరు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం కేటాయించిన ఈ–ఆటోలను ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 516 ఈ–ఆటోలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీడీఎంఏ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర అధికారులను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఆదేశించారు. కాగా గుంటూరు నగరపాలక సంస్థకు గతంలో 220 ఈ–ఆటోలు కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిని ప్రభుత్వం రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. పూర్తి స్థాయిలో గురువారం నుంచి ఈ–ఆటోలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇంటింటా చెత్త సేకరణ వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శ్రమ, ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు. అంతేకాకుండా క్లీన్‌న్‌గుంటూరు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఇప్పటికే ఈ–ఆటో డ్రైవింగ్‌లో అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు. చదవండి: ఏడాదిలోనే జీతాల వ్యయం.. రూ.8,068కోట్లు పెరుగుదల -
మెటల్, ఆటో షేర్లకు డిమాండ్
ముంబై: మెటల్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్పలాభపడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 173 పాయింట్ల పెరిగి 62,602 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 18,551 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సెషన్లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసి రావడంతో తిరిగి లాభాల బాటపట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 340 పాయింట్ల పరిధిలో 62,380 వద్ద కనిష్టాన్ని, 62,720 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,478 – 18,574 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి సెన్సెక్స్ 119 పాయింట్లు బలపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీ లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, వినిమయ, ఇంధన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దేశీయంగా మే నెల ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్టీ ఆదాయ వృద్ధి, తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ 31 నెలల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. -
ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం
ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్‌చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్‌తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో గురజాల ఆసుపత్రికి తరలించారు. మృతులను దామర్లచర్ల మండలం నరసాపురం చెందిన మంజుల(25), పద్మ(27), సక్రి(35), సోని, కవిత(30)గా గుర్తించారు. చదవండి: భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
తమిళనాడు: మామల్లపురం సమీపంలోని గడుంబాడి ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు మృతి చెందారు. పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తోన్న ఆటోను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు మరణించారు. ఆటో నుజ్జునుజ్జుగా మారింది. మామల్లపురం పోలీసులు మృతదేహాలను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్‌స్టర్ హతం -
ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటోలు.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తమ వాహనాలను ప్రవేశపెట్టింది. విజయవాడ, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో ఇవి టెస్ట్ రైడ్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ కేకే పాల్ తెలిపారు. దీని ధర రూ. 3.02–3.45 లక్షల వరకు (సబ్సిడీ అనంతరం ఎక్స్ షోరూం రేటు) ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఖమ్మం, మంచిర్యాలలో కూడా వీటిని అందుబాటులోకి తెచి్చనట్లు చెప్పారు. సింగిల్ చార్జితో ప్రామాణికంగా 197 కి.మీ., సాధారణ పరిస్థితుల్లో 160 కి.మీ. ఈ సూపర్ ఆటోల రేంజి ఉంటుందని ఆయన వివరించారు. ఇవి గరి ష్టంగా గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. 3 ఏళ్లు / 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 ఏళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ మొదలైన ఆప్షన్లు ఉంటాయి. ఆసక్తి గల వారు స్వల్ప రిఫండబుల్ మొత్తాన్ని చెల్లించి ప్రీ–బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నిజామాబాద్: నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టు కోగా, మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. మృతులు, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: ప్రేమ విఫలమైందని రివాల్వర్‌తో కాల్చుకుని.. -
చేతులే నేస్తాలుగా...
కష్టమంటే ఏంటో తెలియని చిన్నతనం. ఊహ తెలియకముందే పెళ్లి పేరుతో జీవనం. ఆదుకోని అయినవారు. అయినా చేతులున్నాయి కదా! అంటూ కొత్త జీవనం వైపుగా అడుగులు వేసి నేడు అందరితో శభాషని అనిపించుకుంటోంది ఆటోడ్రైవర్ సీతాదేవి. రోడ్లు ఊడ్చే పని నుంచి ఆ ఢిల్లీ రోడ్ల మీదే ఆటో నడుపుతూ, ముగ్గురు పిల్లలను చదివిస్తున్న సీతాదేవి ‘ఎన్నో ఒడిదుడుకుల జీవితం. కానీ, సొంత చేతులనే నమ్ముకున్నాను’ అని చెబుతోంది. ‘‘నేను మా అమ్మనాన్నలకు కొడుకుల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నాను. కొన్నేళ్ల క్రితం కష్టం వచ్చిందని పుట్టింటికి వెళితే, ఆదరించలేదు. అలాగని వారి మీద కోపం తెచ్చుకోలేదు. మా అమ్మనాన్నలది బీహార్. అక్కడే ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఆ వయసులో నాకెలాంటి తెలివితేటలు లేవు. నా భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయాను. కానీ, ఆయన ఉద్యోగం గుజరాత్లో. పెళ్లయ్యాక ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదని అత్తింటిలో వేధింపులు. నన్ను వదిలేయమని నా భర్తతో బంధువులంతా చెప్పారు. ఆ యేడాదే గర్భవతిని అని తెలియడంతో నా పట్ల మా అత్తింటివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ, నా భర్త ఉద్యోగం పోవడంతో కుటుంబపరిస్థితి పూర్తిగా క్షీణించింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎనిమిది నెలల గర్భవతిని. పూట గడవని పరిస్థితి. ఉన్న వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. పుట్టింటికి వెళితే గడపతొక్కనివ్వలేదు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. తినడానికి ఏమీ లేని పరిస్థితి. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నాను. తెలిసినవారి ద్వారా రోడ్లు ఊడ్చే పని దొరికింది. దీంతో మరో చిన్న ఇంటికి మారిపోయాం. పురిటిబిడ్డను తీసుకునే పనికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మా అన్న రావడంతో కొద్దిగా వస్తువులు కొన్నాను. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లలకు పూట గడుస్తుంది కానీ, మున్ముందు రోజులెలా గడవాలా... అని ఆలోచించేదాన్ని. నాలుగు ఇళ్లలో వంటపని చేయడం ప్రారంభించాను. ఆదాయం బాగానే ఉండటంతో స్వీపర్ పని వదిలేశాను. ► పగలు వంటలు నాకు వండడం తెలుసు. కానీ, వెరైటీ వంటలు చేయడం రాదు. వంటల పుస్తకాలు కొని, చదివి వెరైటీ వంటలు నేర్చుకొని, ఇళ్లలో చేయడం మొదలుపెట్టాను. అలా నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వరకు వచ్చేవి. ఈ సంపాదనతో నా ముగ్గురు పిల్లల పోషణ బాగానే చూసుకోగలిగాను. ► రాత్రిళ్లు ప్లాస్టిక్ సంచులు ప్రయత్నం లేకుండా మన తలరాతలో ఏది రాస్తే అది జరుగుతుందనుకోవడం తప్పు. పగలు వంటలతో పాటు రాత్రి ఇంటి వద్దే ప్లాస్టిక్ బ్యాగులు కుట్టేదాన్ని. పదకొండువందల రూపాయలతో పాత మెషిన్ కొని, బ్యాగులు కుట్టేదాన్ని. మెటీరియల్ ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి, వేరేవాళ్లకు కూడా పని ఇవ్వడం మొదలుపెట్టాను. అలా పదివేల ప్టాస్టిక్ సంచులు కుట్టించి ఇస్తే, సంచికి ఇరవై ఐదు పైసలు వచ్చేవి. ఈ సంపాదనతో బీహార్‌లో ఇల్లు కట్టుకున్నాను. ► బిజీ బిజీ చేతుల నిండా పనులు. నా రోజులు డబ్బుతో నిండిపోవడం మొదలయ్యాయి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అత్తమామల రుణం తీర్చేశాం. మా అమ్మనాన్నల లక్షన్నర అప్పు కూడా తీర్చి కొడుకుల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాను. నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కాలేజీలో, ఒకరు పదోతరగతి చదువుతున్నారు. నా సంపాదనతోనే పిల్లలను చదివిస్తున్నాను. ► డ్రైవింగ్‌లో శిక్షణ దాదాపు పదేళ్ల క్రితం గృహహింసపై మా ప్రాంతంలో అవగాహనా కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఓ లాయర్ మాట్లాడుతూ ‘‘మహిళలు గృహహింసను ఎందుకు అనుభవించాలి, భర్తపై ఆధారపడకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరు అని వివరించారు. ఆ సమయంలోనే అమ్మాయిలు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆ ఫౌండేషన్ వాళ్లు ఇచ్చిన ఆరు నెలల డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నాను. అదే సంవత్సరం నేను ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్ ప్రారంభించాను. అయితే, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతకాలం తర్వాత డ్రైవింగ్ మానేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ–ఆటో నడిపే అవకాశం వచ్చింది. కల్కాజీ మెట్రోలో ఈ–ఆటో ప్రారంభించినప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు వస్తాయి. ఉదయం 10 గంటలకు ఈ–ఆటోతో మెట్రో పార్కింగ్ నుంచి బయల్దేరుతాను. సాయంత్రం 5 వరకు నడుపుతున్నాను. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అందుకు చింతిస్తూ కూర్చోకుండా, పనిని చేస్తూనే ఉండాలి. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది’అని చెబుతున్న సీతాదేవి కృషి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది. – సీతాదేవి -
ఎన్నికల వేళ కర్ణాటకలో హవాలా డబ్బు కలకలం
-
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: Cow Hug Day On Valentines Day: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..! -
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..లారీ నుంచి ఆటో పైపడ్డ గ్రానైట్ రాయి
-
మహిళా ఆటో డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె ఇప్పుడు సాధారణ హీరోయిన్ గానే కాదు. లేడీ ఓరియంటెడ్ కథా త్రాల హీరోయిన్గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటింన చిత్రం డ్రైవర్ జమున. మహిళా డ్రైవర్‌గా బలమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించారు. కింగ్స్ లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ గురువారం ఒక ప్రైవేట్ చానల్లో మహిళా ఆటోడ్రైవర్లను కలిశారు. ఇందులో చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికిపైగా మహిళ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రీల్ మహిళా డ్రైవర్ ఐశ్వర్య రాజేష్‌తో రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. నటి ఐశ్వర్య రాజేష్ వారి సాధక బాధకలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను కానుకగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు అభినందిస్తున్నారు. -
రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం...ఆటోని ఢీ కొట్టిన ట్రక్కు
లక్నో: మితిమీరిన వేగంతో దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘనట ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్ అతి వేగంతో ఆటోని ఢీకొట్టి, అక్కడే ఉన్న డివైడర్ని, కరెంట్ స్థంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఐతే ఆ ఆటోలోని ప్రయాణికులంతా విద్యాంచల్ నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటిక వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన క్షతగ్రాతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ మేరకు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: భార్య వైపు చూస్తున్నాడని తుపాకీతో వచ్చి కాల్పులు.. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా..) -
ఓలా, ఉబర్, రాపిడోలకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్‌కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్‌కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు. కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం -
Video: ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంతో రైల్వేస్టేషన్‌లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్‌ఫామ్ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. కుర్లా రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు. Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn't this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL — Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022 -
హరితవనంగా ఆటో.. ఎక్కడ ఉందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం. కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్‌కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్‌కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది. పచ్చదనంపై మమకారంతో.. చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. – ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక -
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
ఫుల్‌గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు!
తిరువొత్తియూరు(చెన్నై): కరూర్ జిల్లాలో మద్యం మత్తులో స్నేహితుడిపై ఆటో ఎక్కించడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కరూర్ జిల్లా తోగైమలై సమీపం కన్నైకలై పంచాయతీ సుక్కాంపట్టికి చెందిన శరవణన్(35) లోడు ఆటోలో దుకాణాలకు నీళ్లను సప్లై చేస్తున్నాడు. అతని స్నేహితుడు పుట్టూర్ పంచాయతీకి చెందిన వెంకటతాంపట్టికి చెందిన కుమరిముత్తు (24). ఇతను ఆ ప్రాంతంలో సెలూన్ నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సుక్కాంపట్టి, కులందైపట్టికి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు. ఈ సమయంలో శరవణన్ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు ఆటోను శరవణన్ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శరవణన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మారిముత్తుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై స్పందించిన పోలీసులు.. వీడియో పంపింది అతనికే! -
‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’
న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్ సదస్సులో నమూనా డీలర్ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది. ‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు. విదేశీ ఓఈఎంలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్ పార్టుల స్టాక్‌లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్ మోటర్స్, 2021లో ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్లపల్లి జైలు సమీపంలో స్కూల్ ఆటోను ఢీ కొన్న లారీ
-
చిన్నారుల్ని చిదిమేసిన లారీ
కుషాయిగూడ (హైదరాబాద్): సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లకు చేరతారనగా.. చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారా యణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
హైదరాబాద్‌లో ఆటో కావాలా? రెండు లక్షలు అదనం తప్పదు! బతుకులు ‘తుక్కు’
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన సాంబయ్య ఉపాధి కోసం ఆటో నడుపుకోవాలనుకున్నాడు. షోరూమ్‌లో కొత్త ఆటో ధర రూ.2.35 లక్షలే. కానీ ఆటో బయటికి వచ్చి రోడ్డుపై తిప్పుకునేందుకు రూ.4.20 లక్షలకుపైనే ఖర్చయింది. ఇదెలా అని ఆశ్చర్యపోవద్దు. హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి ఉంది. ఒక పాత ఆటో తుక్కుకు వెళ్తేగానీ.. కొత్త ఆటో రోడ్డెక్కడానికి వీల్లేదు. పెద్ద సంఖ్యలో పాత, పాడైపోయిన ఆటోల పర్మిట్లను చేజిక్కించుకున్న కొందరు.. ఆ పర్మిట్లను అడ్డుపెట్టుకుని కొత్త ఆటో కావాల్సిన వారి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ముసుగులో ‘పర్మిట్ల’ దందాకు పాల్పడుతున్నారు. వారి ప్రమేయం లేకుండా ఒక్క కొత్త ఆటో కూడా రోడ్డెక్కని పరిస్థితి. అధికారులకు ఇదంతా తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా పరిమితితో.. రోడ్ల సామర్థ్యానికి మించి ఆటోలు బయటికి వస్తే ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి విధించింది. ఎవరంటే వారు ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే తిరుగుతున్న ఆటోలు తుక్కు (స్క్రాప్) కింద మారితే ఆ స్థానంలో కొత్త ఆటోలు రోడ్డెక్కడానికి అనుమతి ఉంటుంది. అయితే ఎవరైనా పాత ఆటో ఉన్నవారు. దానిని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కు కింద మార్చేస్తే.. వారికి కొత్త ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దీనినే కొందరు దందాగా మార్చుకున్నారు. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో 30 శాతం మాత్రమే యజమానుల చేతుల్లో ఉన్నాయి. మిగతావన్నీ కొందరు వ్యక్తులు, ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తవారు ఆటో కొనాలంటే.. ముందుగా ఓ పాత, తుక్కు దశకు చేరిన ఆటోను వారి పేరిట మార్చుతున్నారు. తర్వాత దాన్ని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కుగా చేసి, ఈ పర్మిట్‌ను కొత్త ఆటోకు వచ్చేలా చేస్తున్నారు. ఇలా పాత ఆటో పర్మిట్‌ను ఇచ్చేందుకు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా పాత పర్మిట్, కొత్త ఆటో కలిసి నాలుగున్నర లక్షలదాకా చేరుతోంది. అంటే ఓ చిన్న కారు ధరతో సమానంగా మారుతోంది. కరోనా కష్టకాలంలో ‘పర్మిట్లు’ పట్టేసుకుని కరోనా మహమ్మారి, లాక్డౌన్లు, ఇతర పరిణామాలతో బడుగుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆటోలు నడుపుకొనే వారి ఉపాధికి దెబ్బతగిలింది. ఆదాయం లేకపోవడం ఓవైపు.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడటమో, ఇతర అవసరాలతోనో డబ్బులు అవసరం పడటం మరోవైపు కలిసి.. చాలా మంది ఆటోలను అమ్ముకున్నారు. కొందరు ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని పాత, తుక్కు దశకు చేరుకున్న ఆటోలను తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో కొనేసి పెట్టుకున్నారు. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మళ్లీ ఆటోలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడా పాత ఆటోల పర్మిట్లను అడ్డుపెట్టుకునిదందా కొనసాగిస్తున్నారు. డిమాండ్ పెరిగిన కొద్దీ ‘పర్మిట్ల’ రేట్లు పెంచేస్తున్నారు. ఫైనాన్స్ కట్టలేని వారి నుంచి.. హైదరాబాద్ నగరంలో ఆటోలకు ప్రైవేటుగా ఫైనాన్స్ చేసే వ్యక్తులు సుమారు 310 మందిదాకా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న మొత్తం ఆటోల్లో 70 శాతం వరకు వీరు ఆర్థిక సాయం చేసినవే. ఈ అప్పులపై విపరీతంగా వడ్డీ ఉంటుంది. ఆటో సరిగా నడవక, తగిన ఆదాయం రాక, ఇల్లు గడవడానికి సంపాదన సరిపోక చాలా మంది రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం లేదు. అలాంటి ఆటోలను ఫైనాన్షియర్లు లాగేసుకుంటున్నారు. వాటిని అద్దెకు ఇచ్చినంత కాలం ఇచ్చి.. డొక్కుగా మారాక ‘పర్మిట్ల’ దందా కోసం వాడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రవాణా శాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. వెంటనే చర్యలు చేపట్టాలి ఆటో పర్మిట్ల విక్రయం దందా తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియర్లు అక్రమ దందా చేస్తున్నారు. ఇటీవల ఇది మరింత తీవ్రమైనా చూసీచూడనట్టు ఉంటుండటం అనుమానాలకు తావిస్తోంది. బడుగుల జేబులను కొల్లగొడుతున్న ఈ దందాను అరికట్టాల్సి ఉంది – దయానంద్, తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
విద్యార్థినితో మాటలు కలిపి.. ఆపై ఆటోలో ఎక్కించుకుని..
తిరువొత్తియూరు(చెన్నై): ప్లస్ వన్ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురాంతకం సమీపంలో ఉన్న అవురిమేడు ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. ఈమె సిరునగర్ ప్రాంతంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడికి ఆటోలో వచ్చిన ఓ యువకుడు విద్యార్థినితో మాటలు కలిపి ఆటోలో ఎక్కించుకుని వెళ్లి లైంగికంగా వేధించాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు. చదవండి: Patancheruvu Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య -
జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఆటో.. ఛేజ్ చేసిన పోలీసులకు షాక్
వైరల్: ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం. అంతేనా.. మరో ఏడాదిలో మన జనాభా.. చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతోందని సర్వేలు వెల్లడించాయి కూడా. అదే సమయంలో సోషల్ మీడియాలో జనాభా పెరుగుదల మీద ఇవాళ రకరకాల చర్చలూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. రోడ్డు మీద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు.. స్పీడ్ గన్ వేగాన్ని మించి దూసుకుపోయిన ఓ ఆటో కనిపించింది. దీంతో ఆ ఆటోను ఛేజ్ చేశారు పోలీసులు. ఎట్టకేలకు దానిని ఆపి.. అందులోంచి ప్యాసింజర్లను దించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 27 మంది(డ్రైవర్‌తో పాటు) ప్రయాణికులు దిగారు ఆ ఆటో నుంచి. ఇంకేం షాక్ కావడం పోలీసుల వంతు అయ్యింది. ఇది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేకున్నా.. ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ బిండ్‌కీ కోట్వాలి రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలను పెద్దలతో కలిపి కుక్కేసి మరీ ఆ త్రీవీలర్‌లో తీసుకెళ్లే యత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అశ్విని ఉపాధ్యాయ అనే ట్విటర్ యూజర్ దానిని పోస్ట్ చేయగా.. విపరీతమైన లైకులు,షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. जनसंख्या विस्फोट का दुष्परिणाम ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp — Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022 -
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు!
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఏ సమయంలోనైనా బుక్ చేసిన కొన్ని నిమిషాల్లోనే క్యాబ్‌లు రయ్‌రయ్‌మంటూ దూసుకొచ్చేవి. కానీ కొంతకాలంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో మినహా నో క్యాబ్స్ అనో, నో ఆటోస్ అనో యాప్‌లు చేతులెత్తేస్తున్నాయి. గతేడాది భారీ వర్షాల్లో కూడా సేవలందించిన క్యాబ్స్‌కు ఇప్పుడేమైంది? కొన్నేళ్లుగా క్యాబ్‌లతో కళకళలాడిన భాగ్యనగరం ఇప్పుడు వాటి జాడ కోసం ఎందుకు వెతుక్కోవాల్సి వస్తోంది? – సాక్షి, హైదరాబాద్ వాహనాలపై కేంద్రం పిడుగు.. కరోనా లాక్‌డౌన్‌తో నగరంలో కొన్ని నెలలపాటు క్యాబ్‌లు, ఆటోలు తిరగక డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరు వాహనాలను అమ్మేయగా, ఇల్లు గడవడం కష్టమై మరికొందరు కార్లను వేరే రకంగా అద్దెలకు ఇచ్చారు. ఇలా నగరంలో కరోనా వ్యాప్తి తర్వాత క్యాబ్‌ల సంఖ్య తగ్గి కొంత సమస్య ఏర్పడింది. దీనికితోడు డీజిల్ ధరలు అమాంతం పెరగడం.. ఆ మేరకు చార్జీలు పెరగకపోవడం ఒక కారణమైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనతో క్యాబ్‌లు, ఆటోలు భారీగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే క్యాబ్‌లకు కొరత వచ్చి పడింది. ఇదీ సమస్య.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలో జరిగిన మార్పు మూడు నెలల క్రితం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో వాహనాలు కచ్చితంగా ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా లోపాలు సరిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే నిబంధనను కఠినతరం చేసింది. గడువు తీరినా ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేయించుకోని రవాణా వాహనాలపై రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేసే నిబంధనను తెరపైకి తెచ్చింది. అది ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. దీన్ని రాష్ట్ర రవాణా శాఖ సైతం అమలు చేయడం ప్రారంభించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.50 చొప్పున లెక్కగట్టి వసూలు చేస్తోంది. గత రెండు నెలలుగా ఇది తీవ్రమైంది. నగరంలో చాలా క్యాబ్‌లు, ఆటోల ఫిట్నెస్ గడువు ఎప్పుడో ముగిసింది. చాలా వాహనాలకు ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకోవాల్సిన గడువు 3–4 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఒక్కో వాహనంపై రూ.60–70 వేల పెనాల్టీ పెండింగ్‌లో ఉంది. దీంతో వాహనాలను రోడ్డుపైకి తేవడానికి యజమానులు జంకుతున్నారు. అలా ఏకంగా 35 వేలకుపైగా క్యాబ్‌లు, 25–30 వేల ఆటోలు నిలిచిపోయాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే దాదాపు 15 వేల క్యాబ్‌ల డ్రైవర్లు వేరే పనులు చూసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో క్యాబ్‌లు, ఆటోలు లేకపోయేసరికి ప్రయాణికుల బుకింగ్స్‌కు స్పందన తగ్గిపోయింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... భారీ పెనాల్టీల నుంచి విముక్తి కలిగించాలంటూ పదుల సంఖ్యలో డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించగా ఓ కేసు విషయంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి తీర్పు వచ్చే వరకు రోజుకు రూ. 10 చొప్పున పెనాల్టీ వసూలు చేసి తాత్కాలిక ఫిట్‌నెస్‌ల సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ భారాన్ని తగ్గించాలంటూ క్యాబ్‌లు, ఆటోల యూనియన్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై ఇప్పటివరకు రవాణాశాఖ సానుకూల ప్రకటనేదీ విడుదల చేయలేదు. కొత్త ఆటోలకూ కష్టమే.. ధాసాధారణంగా ప్రతినెలా నగరంలో దాదాపు ప్రతి నెలా వెయ్యి వరకు పాత ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకుంటారు. ఇప్పుడు తుక్కుగా మార్చాలంటే.. అప్పటివరకు ఉన్న ఫిట్నెస్ పెనాల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో తుక్కుగా మార్చే ప్రక్రియ కూడా బాగా తగ్గిపోయింది. కొత్త ఆటోలకు 100 పర్మిట్లు జారీ చేసే చోట 2–3 జారీ అవుతుండటం గమనార్హం. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు నగర వాసులకు క్యాబ్ కష్టాలు తీరేలా లేవు. -
త్వరలో ఆటో చార్జీలు పెంపు?
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఆటో చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు నియమించిన ప్రత్యేక కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి పెంపునకు మొగ్గుచూపాలని సిఫార్సు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పని సరి చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వమే అప్పటి నుంచి చార్జీలను నిర్ణయిస్తోంది. ఆ సమయంలో కనిష్ట చార్జీగా రూ. 25, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ.12 అదనంగా నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం మేరకు చార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత చార్జీల పెంపుపై దృష్టి సారించలేదు. ఈకాలంలో పెట్రోల్ , డీజిల్ ధరలు అమాంతం పెరగడం వెరసి మీటర్లు వేసే ఆటో డ్రైవర్లే కరువయ్యారు. వారు నిర్ణయించిన చార్జీలను.. ప్రయాణికులు చెల్లించుకోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీలపై దృష్టి పెట్టింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు సమ్మతిస్తూ.. ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింది. ఈ మేరకు కనిష్ట చార్జీ రూ.40గా నిర్ణయించాలని, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ. 18గా చార్జీ అదనంగా నిర్ణయించారు. అయితే ఆటో సంఘాలు మాత్రం కనిష్టచార్జీ రూ.50గా నిర్ణయించాలని పట్టుబడుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆమోదం తర్వాత ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆటో చార్జీలను సవరించే అవకాశం ఉంది. చదవండి: స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో -
ఐటీ, ఆటో షేర్ల హోరు: స్టాక్‌మార్కెట్ల జోరు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సూచనలతో ఆరంభంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 16,300 పైన ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు దూకుడుతో కొత్త ఎఫ్ అండ్ వో సిరీస్ శుభారంభమైంది. యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు లేకపోవడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా మారాయి. ప్రస్తుతం 434 పాయింట్ల లాభంతో 54,886 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 131 పాయింట్లు ఎగిసి 16301 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. 3 శాతం ఎగిసిన టెక్ మహీంద్రా టాప్ గెయినర్‌గా ఉంది. అలాగే ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్ టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
సోలార్ ‘ఆటో’ కూల్
నర్సాపూర్(జి): ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయట కాలుపెట్టేందుకు జనాలు జంకుతున్నారు. మరి పనిచేస్తే గానీ పూట గడవని వారి పరిస్థితి ఏంటి? అందుకే నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ సుదర్శన్ ఎండ నుంచి ఉపశమనానికి తన ఆటోలో చిన్న కూలర్ అమర్చుకున్నాడు. ఆటోపై సోలార్ పలకలను అమర్చాడు. దాని నుంచి వచ్చే విద్యుత్‌తో ఆటోలో అమర్చిన కూలర్ చల్లదనాన్ని ఇస్తోంది. అటు ప్యాసింజర్లూ చల్లగా ప్రయాణిస్తూ ఐడియా అదిరింది గురూ అంటున్నారు. -
బెక్‌ను ఢీకొన్న బస్సు: ఇద్దరికి గాయాలు
రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామం వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బూర్జ మండలం పాలవలసకు చెందిన వి.రాజేశ్వరి మండలంలోని బూరాడ గ్రామంలో తాతగారి ఇంటివద్ద ఉంటోంది. బయోమెట్రిక్ వేసేందుకు సొంత గ్రామం పాలవలస వెళ్లేందుకు బూరాడ గ్రామానికి చెందిన సీర యేసుబాబుతో ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాజాం వైపు వస్తుండగా రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ద్విచక్ర వాహనం బస్సు కిందకు వెళ్లిపోవడంతో వారు రోడ్డుపైన పడ్డారు. దీంతో రాజేశ్వరికి గాయాలు కాగా, యేసుబాబుకు తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రులను 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యేసుబాబును శ్రీకాకుళం తరలించినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: కారుకూతలు కూస్తే ఖబడ్దార్) -
వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఓ ఆటోలో మూడ్రోజుల మగ శిశువు లభ్యమైంది. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుస్తుల్లో చుట్టిన శిశువు ఏడుపులు విన్న ఆటో డ్రైవర్ నిలోఫర్ ఆస్పత్రికి, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వైకల్యంతో పుట్టిన కారణంగానే పసికందును ఆటోలో వదిలివెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శిశువిహార్ సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి..) -
అదసలు ఆటోనేనా? స్కూల్ పిల్లలను కుక్కేసి మరీ..
చెన్నై: పిల్లలను బడులకు పంపే తల్లిదండ్రులు.. వాళ్ల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?. అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్, ఫేస్బుక్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్కూల్ ఆటోలో పిల్లలను జంతువుల్లాగా కుక్కేసి మరీ తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. బయట గ్రిల్ నుంచి చూస్తే.. ఒకరిపై మరొకరు నిల్చుని, వేలాడుతూ బడికి వెళ్తున్నారు. మరోపక్క ఓపెన్ వైపు కూడా ఒకరి మీద మరొకరు ఇరుక్కుగానే కూర్చుని ఉన్నారు. ఇది చూసి ఓ వ్యక్తి.. అదంతా వీడియో తీశాడు. అంతటితోనే ఆగకుండా.. అక్కడే ఉన్న టీచరమ్మను ‘ఏంటి ఇదంతా?’ అని నిలదీశాడు. అయితే ఆమె మాత్రం ఏదో సర్దిచెబుతూ.. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. టెంకాశీలో జరిగిన ఈ వీడియో వైరల్ అయ్యి.. మీడియాకు చేరింది. తమిళనాడులో తాజాగా ఓ విషాద ఘటన జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో.. మ్యూజిక్ వింటూ స్కూల్ బండి నడిపిన ఓ డ్రైవర్, ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. ఈ నేపథ్యంలో.. తాజా వీడియో ఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మరోపక్క వైరల్ అయిన ఈ వీడియోపై దర్యాప్తు చేయిస్తామని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇంకోపక్క పిల్లలను ఇలా ప్రైవేట్ వాహనాల్లో పంపేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సన్ న్యూస్ సౌజన్యంతో..