స్టీరింగ్‌పై ఫోన్ ఉంచి వీక్షించిన ఆటో డ్రైవర్
ఆగి ఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం
ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో డ్రైవర్ సహా ముగ్గురి పరిస్థితి విషమం
లంగర్‌హౌస్: ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్‌కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు.
వీరు ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్‌హౌస్ బాపునగర్‌లోని పీఎస్‌ఆర్ హాస్టల్‌లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్‌హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్‌గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్‌పై సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్‌పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment