cell phone
-
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సెల్‌ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్‌డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్‌గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్‌కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్‌గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్‌కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
జైల్లో మరో సెల్‌ఫోన్ గుర్తించిన అధికారులు
-
ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ..
లంగర్‌హౌస్: ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్‌కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. వీరు ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్‌హౌస్ బాపునగర్‌లోని పీఎస్ఆర్ హాస్టల్లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్‌హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్‌గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్‌పై సెల్ఫోన్లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్‌పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్‌బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి..
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్‌ఫోన్‌తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్‌లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్‌పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్‌ను కూకట్‌పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు. దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్‌కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
గుడిలో దుర్గమ్మను ఫొటో తీసేందుకు భక్తుడి యత్నం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఓ భక్తుడు నిబంధనలను అతిక్రమించి సెల్‌ఫోన్‌తో దుర్గగుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. దీనిని గుర్తించిన ఆలయ అధికారులు ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ లాక్కుని హుండీలో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వారం క్రితం కూడా ఓ భక్తుడు అమ్మవారి మూలవిరాట్‌ను సెల్ ఫోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సంగతి విదితమే. ఆదివారం నుంచి భక్తులు ఎవరూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మైక్ ప్రచార కేంద్రం నుంచి పదే పదే సెల్ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశించవద్దని సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఓ భక్తుడు తన ఖరీదైన సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది వెంటనే గమనించి కేకలు వేయడంతో ఆ భక్తుడు సెల్‌ఫోన్ తీసుకుని రావిచెట్టు వైపు పరుగు తీశాడు. ఆ భక్తుడికి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ ఈఓ రామరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని ఆలయంలో ఉన్న హుండీలో వేశారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో సెల్‌ఫోన్‌ను బయటకు తీస్తారని, అప్పుడు దానిని ఏమి చేయాలో ఆలోచిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
సెల్‌ఫోన్‌తో నో ఎంట్రీ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్‌తో అంతరాలయంలో మూలవిరాట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటనపై దుర్గగుడి అధికారులు సోమవారం సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఉదయం నుంచి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేసిన తర్వాతే కొండపైకి అనుమతించారు. దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించే ముందే భక్తులతో పాటు వారి బ్యాగులు, లగేజీలను పూర్తిగా తనిఖీ చేశారు. క్యూలైన్లోకి ప్రవేశించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించే మార్గాల వద్ద మరోమారు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300, రూ.500 టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు సెల్‌ఫోన్‌తో ఉన్న భక్తులను బయటకు పంపేశారు. దీంతో ఒకరిద్దరు భక్తులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినా వారిని బయటకు పంపేశారు. కొంత మంది ఇదే విషయాన్ని వీడియో రికార్డు చేసి మరో మారు సోషల్‌మీడియాలో అప్లోడ్ చేశారు. సెల్ఫోన్లతో క్యూలైన్లోకి వస్తే, మళ్లీ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో గంట సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముందుగానే సెల్ఫోన్లను కౌంటర్లో పెట్టుకుని రావాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. మరో వైపున భక్తులెవరిని ఎట్టి పరిస్థితులలోనూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి పంపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అలాగే మహా మండపం రాజగోపురం వద్ద, లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద సెల్ఫోన్లతో ఫొటోలు దిగే వారిని వారించారు. కొంత మంది నుంచి సెల్ఫోన్లను తీసుకునే ప్రయత్నం చేయడంతో వాదనలు జరిగాయి. సెల్ఫోన్లను ఆలయంలోకి అనుమతించకుండా ఇదే విధంగా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
HYD: చిలుకలగూడలో కాల్పలు కలకలం
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్‌ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. -
రూ.21లక్షల విలువ చేసే 130 సెల్ఫోన్లు స్వాధీనం..!
డోన్ టౌన్: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రత్‌బాషా, పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్ఐ విజయ్‌కుమార్‌లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్‌లో దొంగలించుకొచ్చిన 130 సెల్ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్ మరియు ఎరుకలి పవన్‌లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్‌కు తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా నిజాముద్ధీన్ అలియాస్ ఖైజర్‌కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
సెల్‌ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్‌కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్‌ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
బైక్‌పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్‌ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్‌ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్‌ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్‌ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
హైటెక్ కాపీయింగ్:సెల్‌ఫోన్‌తో గ్రూప్-4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్‌కు తెరలేపాడు. సెల్‌ఫోన్‌ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్‌తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్‌స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్‌లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్‌లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్‌లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్‌కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్‌లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ మీటింగ్‌లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
సెల్‌ఫోన్ నిజామాబాద్‌లో పోయింది.. దుబాయ్‌లో దొరికింది!
మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్ ఫోన్. అటువంటి ఫోన్‌ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ దుబాయ్‌లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో సెల్‌ఫోన్ పోతే అది దుబాయ్‌లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్‌ఫోన్‌ను దుబాయ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్‌రెడ్డి.. ఆ సెల్‌ఫోన్‌ను అప్పగించారు. -
భయం.. తత్తరపాటు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో మృతుడు నవీన్ శరీర భాగాలు పోలీసులకు ఇంకా దొరకలేదు. హతుడి ఫోన్‌తో పాటు నిందితుడు హరిహరకృష్ణ సెల్ఫోన్లు సైతం ఇంకా స్వాదీనం చేసుకోలేదు. దీంతో తొలిరోజు కస్టడీలో నిందితుడు హరిని పోలీసులు ఆయా వివరాలను రాబట్టే కోణంలోనే విచారించారు. గత నెల ఫిబ్రవరి 17న ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్‌ను స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 24న నిందితుడు హరి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడిని ఈనెల 9వ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి నిందితుడిని తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎలాంటి భయం, తత్తరపాటు లేకుండా నిందితుడు సమాధానాలు ఇచ్ఛినట్లు తెలిసింది. హత్య కేసులో మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు నిందితుడు హరిని హత్య జరిగిన ప్రాంతం అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సీన్–రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సెల్‌ఫోన్‌తో ఠాణాకు.. హత్య తర్వాత హరి మరొక స్నేహితుడు హసన్ ఇంట్లో ఆ రోజు రాత్రి నిద్రించి మర్నాడు ఉదయం కోదాడ, విజయవాడ, విశాఖపట్నం మీదుగా తిరిగి.. సొంతూరైన వరంగల్‌కు చేరుకున్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని తండ్రి సూచించడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్ఛిన హరి.. ప్రేమికురాలిని కలిసి నవీన్ హత్య గురించి వివరించారు. ఆమె సూచన మేరకు ఫిబ్రవరి 24న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అప్పటికే హరి వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి.. కొత్త సెల్‌ఫోన్ తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ సెల్‌ఫోన్‌నే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇది కొత్త ఫోన్ అని గుర్తించిన పోలీసులు.. హత్యకు ముందు సెల్‌ఫోన్ గురించి కస్టడీ విచారణలో పోలీసులు ఆరా తీయగా.. తాను వాడేది ఇదే ఫోన్ అని బుకాయించినట్లు తెలిసింది. -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్‌లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్‌రెడ్డి తెలిపారు. -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్‌లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్‌లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్‌గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్‌గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్‌కి ఒక దొంగ కస్టమర్‌లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్.. స్కూల్‌కు సెల్‌ఫోన్ తీసుకొచ్చాడని..
సికింద్రాబాద్: స్కూల్‌కు సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చాడని విద్యార్థిని.. ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్గిరి ఆర్కే పురంలోని గాంధీనగర్‌కు చెందిన కొండా దినేష్ రెడ్డి (15) ఏఓసీ సెంటర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం దినేష్ రెడ్డి పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ పద్మజ వెంటనే దినేష్‌ను మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ తెచ్చినందుకు 12 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయం విద్యార్థి తండ్రి రమణారెడ్డికి కూడా చెప్పి విద్యార్థిని అతడితోపాటు పంపారు. ఇంటికి వెళ్లిన దినేష్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై.. సోమవారం సాయంత్రం అమ్ముగూడ స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల పరంపర కొనసాగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వరుసగా రియల్ ఎస్టేట్ సంస్థలపైనా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ దాడులు జరుపు తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రెండు వస్త్ర దుకాణాలతోపాటు సెల్‌ఫోన్ విక్రయ సంస్థలపైనా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. ఐటీ అధికారులు డజ నుకు పైగా బృందాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు చేశారు. ఈసారి కేంద్ర బలగాల బలగాల పహారాలో దాడులు నిర్వ హించడం గమనార్హం. అమీర్‌పేట, కూకట్ పల్లి, దిల్‌సుక్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ఇండియా షాపింగ్‌మాల్స్‌పైనా.. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న లాట్ మొబైల్స్, బిగ్ సీ దుకాణాలపైనా దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ మాల్స్‌లోకి వినియోగదారులను రానీయకుండా సోదాలు నిర్వహించారు. హానర్‌లో పెట్టుబడులు పెట్టినందుకేనా... ఆర్ఎస్ బ్రదర్స్ ఈమధ్య పెద్దఎత్తున రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హానర్ రిచ్మండ్ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ వస్త్ర దుకా ణాలు, మొబైల్ విక్రయాల సంస్థల యజ మానులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్ గ్రూపు 28.4 ఎకరాల్లో 142 ప్లాట్లలో విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్సీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానర్ గ్రూపు జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది.